ఇప్పుడు వ్రాయబోయే కధ నేను చాలా కాలం క్రిందట చదివినదండి. సంభాషణలు ఉన్నవున్నట్లు గుర్తులేవు గానీ, కధ సారాంశం చాలా వరకు గుర్తుందండి.
నారదుల వారు ఎప్పుడూ నారాయణ నామ స్మరణ చేస్తూంటారు గదా !
ఒకప్పుడు నారదుల వారి మనస్సులో తాను చాలా గొప్ప భక్తుడిని అనే భావం ప్రవేశించిందట.
అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇంకొక గొప్ప భక్తుని గురించి చెప్పదలిచారట. అప్పుడు నారదులవారు ఆ భక్తుడెవరో తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతను ప్రదర్శించారట.
అప్పుడు , శ్రీ మహావిష్ణువు ఒక సామాన్య రైతును చూపించారట. ఆ రైతు తన స్వధర్మమును చక్కగా ఆచరిస్తూ సామాన్యముగా జీవిస్తున్నాడు.
నారదునిలా చాలాసార్లు దైవనామాన్ని స్మరించటం లేదు. అతనెలా గొప్ప భక్తుడు అవుతాడని నారదునికి సందేహం కలిగింది.
అప్పుడు విష్ణుమూర్తి నారదునికి ఒక పోటీ పెట్టటం జరిగింది. అదేమిటంటే అంచుల నిండుగా ద్రవపదార్దమున్న ఒక పాత్రను తలపైన పెట్టుకుని ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా ప్రదక్షిణలు చేయాలి.
ఈ విధముగా నారదుడు పాత్రను తలపైన పెట్టుకుని ప్రదక్షిణలు ప్రారంభించారట. చాలా సమయం గడిచింది.
అప్పుడు విష్ణుమూర్తి నారదునితో, ఇప్పటికి ఎన్నిసార్లు నారాయణ నామస్మరణం జరిగిందని అడిగారట.
అప్పుడు నారదుడు ఆ పాత్రలోని పదార్ధం ఎక్కడ క్రింద చిందుతుందో అన్న ఆలోచనలో ఉన్న తాను నామస్మరణం అంతగా చేయలేదని చెప్పటం జరుగుతుంది.
అప్పుడు విష్ణుమూర్తి ఆ రైతు సంసారనిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉండి ఎక్కువగా నామస్మరణం చెయ్యలేకపోయినా కొద్దిసార్లు మాత్రమే చేస్తున్నా అతని ధర్మబధ్ధజీవనం, బలమైన భక్తిభావం ఇలాంటి కారణములవల్ల అతనూ గొప్ప భక్తుడే అని చెప్పటం జరిగిందట.
ఈ కధను నాకు గుర్తున్నంతవరకు వ్రాయటం జరిగిందండి.
నాకు ఈ కధ ఏ పుస్తకములో చెప్పబడిందో తెలియదండి.
ఇందులో తప్పులు ఉన్నయెడల దయచేసి క్షమించవలెనని భగవంతుని ప్రార్దిస్తున్నాను.
This tale is from a collection of stories by Ramakrishna Paramahamsa (Atleast I read this from that book)
ReplyDeleteమీరు ఈ కధ గురించిన వివరములు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలండి. రామకృష్ణపరమహంస గారి కధలు చాలా ఫేమస్ కాబట్టి చాలా మంది చదువుతుంటారు . నాకు ఈ కధ ఎక్కడ చదివానో ఎంతకీ గుర్తు రాలేదండి. వివరములు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలండి. నేను ఊరు వెళ్ళి ఈ రోజే రావటం వల్ల మీ కామెంట్ ఇప్పుడే చూశానండి. రిప్లై వ్రాయటం ఆలస్యమయినందుకు సారీ అండి......
ReplyDelete