ఇంతకుముందు పోస్ట్ లో ... కొంతకాలం క్రితం మాకు కొన్ని సమస్యలు వచ్చాయని వ్రాయటం జరిగింది కదండి.
ఆ సమస్యలు రాకముందు నా ఆలోచనా విధానం ఎలా ఉండేదంటేనండి, ఎవరైనా నన్ను దేవుడిని ఏమి కోరుకున్నావు ? అని అడిగారనుకోండి ....... నేను ఏదో గొప్ప వేదాంతిలా ..... ఇలా చెప్పటం జరిగేదండి...మనము కోరుకునేదేమిటి, భగవంతునికి తెలియదా ఏమిటి, మనకి ఏమి కావాలో........ అని........
ఇంకా, నా మనసులో కూడా ....... చాలామంది జనం కోరికలకోసమే గుడికి వస్తారు కానీ భక్తితో కాదు, నేను అలా కాదు, నేను అంతలా కోరికలు కోరను ........ ఈ విధంగా ఆలోచిస్తూ నేను కొంచెం గొప్ప అన్న అహంకారం ( చాలా కొద్దిగా ) నాలో ఉండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుందండి.
పెద్ద గా సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరూ గొప్పవారే . సమస్యలు వచ్చినప్పుడే కదా ! ఎవరు ఏమిటో తెలిసేది.
తీరా సమస్య నాకే వచ్చేసరికి మాత్రం నేను ... దేవునికి తెలియదా ఏమిటి....... నాకుఏమి కావాలో అని అనుకోలేకపోయాను . ఆ సమస్య నుంచి రక్షించమని భగవంతుని కోరుతూ గుడుల చుట్టూ తిరిగిన తర్వాత నాకు తత్వం తెలిసివచ్చింది.
మనం ఇతరులను , వాళ్ళు కోరికలకోసం మాత్రమే గుడికి వెళ్తున్నారు .......... ఈ విధముగా అనుకుంటూ ఎవరి భక్తినీ తక్కువగా చూడకూడదని తెలిసివచ్చింది. ..
ఎవరి శక్తికొలదీ వారు భగవంతుని సేవిస్తారు. మనం ఎవరి భక్తినీ తక్కువగా భావించకూడదు. ఏమో ఇప్పుడు కోరికలతో దైవాన్ని ప్రార్దించేవారే కొంతకాలానికి అలా పూజిస్తూ క్రమముగా.... మహాభక్తులు, గొప్ప వేదాంతులు కావచ్చు కూడా..........
కానీ కొంతమంది ఉంటారు, చాలా పాపాలూ చేసేసి తీరా కష్టాలు వచ్చేటప్పటికి పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా .......... దేవుడా రక్షించు అని భగవంతుని సతాయించేవాళ్ళని....... సమర్ధించటం న్యాయం కాదు కదా........... ఇలాంటి వాళ్ళవల్లే ఆస్తికులకు చెడ్డపేరు వస్తోంది అని.........ఇంతకుముందు అనుకోటం జరిగేది.
ఇప్పుడు ఏమనిపిస్తుందంటేనండి ........... అసలు చెడ్డపనులు చేసే వారికి భగవంతుని అవసరం మరింతగా ఉంది. పూజలు లాంటి మంచి కార్యక్రమములు చేస్తూ ఉంటే, అలా క్రమంగా వాళ్ళూ మంచిగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని.
ఇంకా ఇలా అనిపిస్తుందండి, పూజలు చేస్తూ కూడా ఇన్ని పాపాలు చేస్తున్నారంటే, అసలు పాప భయం, దైవభక్తి కొంచెం కూడా లేకపోతే వాళ్ళు మరెన్ని పాపాలు చేస్తారో గదా అనిపిస్తుంది..
అందుకే ఎవరు పూజలు చేసినా మనం సంతోషించాలి...........
ఇంకా, నేను ఇప్పుడు కూడా కోరికలకోసం మాత్రమే భగవంతుని పూజించకూడదు ఇలాంటి మాటలు చెప్పినా, ఇంతకుముందు అన్నదానికి, ఇప్పుడు అన్నదానికి భావములో తేడా ఉన్నదిలెండి.
chaalaa baagaa cheppaaru
ReplyDeletedhanyavaadamulu
మీ అభిప్రాయములు తెలిపినందుకు , మరియు మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదములండి.
ReplyDelete