ఈ మధ్య ఒక దగ్గర విన్న విషయం గురించి నాకు కొన్ని సందేహాలు కలిగాయి. శ్రీరాముల వారు మాంసాహారాన్ని తీసుకున్నారో? లేదో? అనే విషయాల గురించి గొడవలు జరుగుతున్నాయి.
అయితే, ఈ మధ్యన ఒకరు ఏమన్నారంటే, శ్రీ ఆంజనేయుల వారు లంకకు వెళ్లినప్పుడు సీతాదేవితో ..శ్రీ రాముల వారు సీతాదేవి మీద బెంగతో మధుమాంసాదులను కూడా తీసుకోవటం లేదని అన్నట్లు.. ఆ శ్లోకాన్ని చెప్పి, అంటే శ్రీరాముల వారు ఇంతకుముందు తింటేనే కదా.. ఇప్పుడు తినటం లేదని హనుమంతుల వారు చెపుతారు..అన్నారు.
ఈ విషయాలను గమనించిన తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి.
నారదుస్తులను ధరించి కొన్ని నియమాలతో వనవాసానికి వెళ్ళిన శ్రీరాముల వారు నియమాలను పాటించారని నేను ఒకదగ్గర విన్నట్లు గుర్తుంది.
ఆ విషయాలను గమనించిన తరువాత, వనవాస సమయంలో రాముల వారు ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించారన్నట్లు నాకు అర్ధమయింది.
మరి, సీతాదేవి పట్ల బెంగతో శ్రీరాములవారు మధుమాంసాలను తీసుకోవటం లేదని హనుమంతుల వారు సీతాదేవికి చెప్పారంటున్నారు..
మరి ఇంతకుముందు నేను విన్నది సరైనదా? కాదా? నారవస్త్రాలు ధరించి వనవాస నియమాలను పాటించినప్పుడు, మధుమాంసాదుల గురించి నియమాలు ఉన్నాయా? లేవా? అని సందేహాలు కలిగాయి.
కొందరేమో వనవాస సమయంలో వారు ఆహార విషయంలో కొన్ని నియమాలతో ఉన్నారంటారు. కొందరేమో మాంసాహారాన్ని తిన్నారంటారు..ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
ఏమిటో? అప్పుడు ఏం జరిగిందో? గ్రంధాలలో ఏవి నిజాలో ? ఏవి ప్రక్షిప్తాలో?
..........
నాకు ఏమనిపిస్తోందంటే, సంస్కృతంలో ఒక్క అక్షరాన్ని కలిపి లేక విడదీసి చదివినా అర్ధాలు మారిపోయే అవకాశముంది. అందువల్ల ఆ శ్లోకాన్ని సరిగ్గా ఎలా అర్ధం చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు.
మధు(మధువు) అంటే అనేక అర్ధాలుంటాయి. మాంసం.. అన్నా కూడా అనేక అర్ధాలుంటాయి.
మాంసం అనే పదానికి బలాన్ని కలిగించే ఆహారం అని కూడా అర్ధం ఉండవచ్చు...పండ్ల రసాలను కూడా మధువు అని అంటారు కావచ్చు..
వనాల్లో సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు సీతాపహరణానికి ముందు, బలమైన ఆహారం కొరకు కొన్ని పంటలను కూడా వారు పండించుకుని ఉండవచ్చు.
ఉదా..కొన్ని పప్పుధాన్యాలు పండించుకున్నారేమో? మినుములు(మాష) కూడా మాంసాహారంతో సమానమైన బలమైన ఆహారమని అంటారు. వారు మినుములు కూడా భుజించారేమో?
నాకు ఏమనిపిస్తోందంటే... అపహరణ తరువాత సీతాదేవి పట్ల బెంగతో రాముల వారు తన ఆహారం పట్ల శ్రద్ధ వహించలేదని ...
పువ్వులు, పండ్ల నుంచి లభించే తీపి పదార్ధాన్ని.. పండ్ల రసాలను(మధువును), బలాన్ని కలిగించే మినుముల(మాష) వంటి పప్పుధాన్యాలను భుజించటం పట్ల.. శ్రద్ధ వహించలేదని అర్ధం చేసుకోవచ్చని.. నాకు అనిపిస్తుంది.
నాకు సంస్కృతం తెలియదు. నేర్చుకోవాలనే కోరిక కూడా ప్రస్తుతం లేదు. నాకు తోచింది రాయాలనిపించి వ్రాసాను.
..........
అయినా, రాములవారు మాంసాహారాన్ని భుజించారని చెప్పటానికి కొందరు ఎందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారో? అర్ధం కావటం లేదు. వారు తిన్నారు కాబట్టి, మనం కూడా తినొచ్చని ప్రజలు ఎవరైనా భావిస్తే?
మధు అంటే మత్తెక్కించే సారా వంటిదని కొందరు భావించే ప్రమాదం కూడా ఉంది.
అప్పుడు ఏం జరిగిందో? గ్రంధాలలో ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో?
..............
నేను ఈ పోస్టును కొంతసమయం తరువాత డిలిట్ చేస్తానేమో?
వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.