ఊరు వెళ్ళి ఈ మధ్యే వచ్చాము.
.................................
ఈ రోజుల్లో పిల్లలకు ఎన్నో వత్తిడులు ఉన్నాయి. కాలేజీలలో, హాస్టల్స్లో ర్యాగింగులు, చదువుల వత్తిడి, మరెన్నో సమస్యలు తట్టుకోలేని కొందరు పిల్లలు డిప్రెషన్ కు గురవుతున్నారు.
కొందరు పిల్లలు తమకు డిప్రెషన్ గా అనిపించినా ఆ సమస్యలు చెప్పుకుంటే పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదని, అందువల్ల తమ బాధలను తల్లితండ్రితో చెప్పడం మానేసామని అనడం జరిగింది.
ఇలాంటి పరిస్థితి తట్టుకోలేని కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్ని చదువుపేరుతో ఎన్నోగంటలు శ్రమపెడుతున్నారు.
అదేమిటంటే, ఈ రోజుల్లో అలా కష్టపడక తప్పదని సమర్ధించుకుంటున్నారు.
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగినప్పుడు కొంతకాలం చానల్స్లో చర్చలు జరగటం, నిట్టూర్చటం తప్ప విధానాలలో మార్పులు జరగటం లేదు. ఇదంతా చాలా దారుణం.
పెద్దవాళ్లు పిల్లల సమస్యలను, వారి అభిప్రాయాలనూ అర్ధం చేసుకోవాలి. అంతేకానీ, మేము చెప్పినట్లే పిల్లలు వినితీరాలని అనుకోవటం సరైనది కాదు.
పెద్దరికం పేరుతో పెద్దవాళ్ళు తమ అభిప్రాయాలను పిల్లల నెత్తిన రుద్దటం మనదేశంలో కొంచెం ఎక్కువే.
ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళకు పిల్లల్ని కనటమే కానీ, పిల్లలను పెంచడానికి , వారి కష్టసుఖాలను పంచుకోవటానికి సమయం ఉండటం లేదంటున్నారు.
నాకు తెలిసి ఉన్నత చదువులు చదువుతున్న కొందరు పిల్లలు మద్యం త్రాగటం ఈ మధ్యే జరిగిన సంఘటన. అలా మద్యం తీసుకున్న వారిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు.
పోటీ చదువులు చదవలేక, తమ బాధలు వినేవారు లేక డిప్రెషన్ తో జీవితం అంటే విరక్తిగా ఉందని చెప్పిన పిల్లల గురించి పైన నేను వ్రాసిన విషయాలు కల్పితం కాదు, నిజంగా జరిగిన విషయాలే.
ఇలాంటి పరిస్థితిలో సమాజం ఎటుపోతుందో?
నాకు తెలిసిన విషయాలు తక్కువ. తెలిసినంతలో వ్రాస్తున్నానండి. అంతా దైవం దయ.
ReplyDelete