koodali

Monday, April 6, 2015

ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తే...

 
కొన్ని నెలల క్రిందట, దేవాలయ దర్శనం కొరకు (అమరేశ్వరాలయం)  మేము అమరావతి వెళ్లి వచ్చాము.  

అమరేశ్వర లింగం చాలా ఎత్తుగా ఉంటుంది.  అమరారామము  పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.
.......................

రాజధానికి అమరావతి పేరు బాగుంది.

.....................

దేవతల నగరం అమరావతి అంటే .. చక్కటి ప్రకృతి శోభతో కూడిన ఉద్యాన వనాలు, ఆహ్లాదకరమైన పరిసరాలతో కూడిన ప్రాంతంగా .. కవులు వర్ణించిన వర్ణనలు గుర్తుకొస్తాయి.


 అయితే ఇది భూలోకంలోని అమరావతి కాబట్టి, స్వర్గలోకపు అమరావతి అంత కాకపోయినా,  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  రాజధాని అమరావతి కూడా చక్కటి ఉద్యానవనాలతో ప్రకృతి శోభతో పచ్చగా ఉండాలని ఆశ పడటంలో తప్పులేదు మరి .

..................
ఇక్కడ మరికొన్ని విషయాలను గమనిస్తే...

దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులను గమనిస్తే..  ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే వారితో  కిటకిటలాడుతూ  రద్దీగా  ఉంటున్నాయి. 


విపరీతమైన జనాభా వల్ల  ట్రాఫిక్ జాంలు, చెత్తతో గబ్బు కొట్టే వీధులు, నేరాలు-ఘోరాలు ..అన్నట్లుగా ఉంటున్నాయి. 

................................... 

 ఉపాధి కోసం అందరూ రాజధానిపై  మాత్రమే  ఆధారపడవలసిన  పరిస్థితి కాకుండా, రాష్ట్రం లో ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు ఉండేలా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి  చేయటం  ఎంతో అవసరం .  


రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు  కాబట్టి, అలా జరుగుతుందని ఆశిద్దాము.

.................

దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. దగ్గరకు వెళ్తేనే  కొండల  గరుకుదనం , ఎత్తుపల్లాలు  తెలుస్తాయి. 


దూరంగా ఉన్న విదేశాలు ఎంతో బాగున్నట్లుగా అనిపిస్తాయి. అక్కడ  ఎంతో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, నీటైన  రహదారులూ  ఉంటాయి.  అయితే, అక్కడ ఎన్నో నేరాలు కూడా జరుగుతున్నాయి. 


అందుకే, ప్రజలు తమ రక్షణార్ధం తుపాకులను దగ్గరుంచుకోవటం అనేది చాలా విదేశాల్లో సాధారణమైన  విషయం. ఇంకా మన దేశంలో పరిస్థితి అంత  తీవ్రస్థాయిలో లేదు.


అయితే , ఇప్పుడిప్పుడే అలాంటి నేరపరిస్థితి  మన దేశంలో కూడా పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇది  అత్యంత  బాధాకరం.

.................................. 

నగరాలలో పెరుగుతున్న నేరసంస్కృతి,  డ్రగ్స్ వినియోగం..వంటి ఆందోళనకరమైన విషయాలను  గమనిస్తే , విస్తృతమైన రాజధాని కట్టుకుంటే   సమస్యలు కొని తెచ్చుకోవటం అవుతుందేమో ? అని సందేహం అనిపిస్తోంది . ( సమస్యలు  రాకపోతే మంచిదే .)


ఇలాంటి పరిస్థితులలో, మనకు  తగ్గట్లుగా రాజధానిని ఏర్పాటు చేసుకుని , మొత్తం రాష్ట్రం  అభివృద్ధి అయ్యేటట్లు చర్యలు తీసుకుంటే ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అందరూ సంతృప్తి చెందుతారు .  

 ..............

 సామాన్య ప్రజానీకానికి తమ కనీస అవసరాలు తీరి కష్టాలు తొలగటం ఎంతో ముఖ్యం. 


 ఉదా..హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  తనకు సాధ్యమైనంతలో ప్రజలకు చక్కటి సహకారాన్ని అందించింది. 


కొన్ని లోటుపాట్లున్నా, ప్రభుత్వం అందించిన తక్షణ సహకారం పట్ల ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు.


 తమ కష్టాలు తీర్చేవిధంగా  ప్రభుత్వాలు  ఉండాలని ప్రజలు ఆశిస్తారు. 


ప్రజల కష్టాలు తీరటం ముఖ్యం .  ఇప్పటికిప్పుడు  పెద్ద స్థాయిలో రాజధాని  నిర్మించుకోకున్నా  ఫరవాలేదు . 

.........................

 ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  మరియు  రాష్ట్ర  రాజధాని అమరావతి  అభివృద్ధి  పధంలో  పయనించాలని  ఆకాంక్షిస్తూ  ఆచరణలో అమలుచేయటానికి   అందరమూ ప్రయత్నిద్దాము.



2 comments: