koodali

Saturday, April 11, 2015

ఎన్నికల వాగ్ధానాలు ...

  
 పార్టీలు ఎన్నికల ముందు  ఎన్నో హామీలను ఇస్తాయి . 

 ఉదా..కేంద్రంలో గెలిచిన  వాళ్ళు.. నల్లడబ్బును తిరిగి తెస్తామని, అవినీతిని అరికడతామని, నదులను మురుగు నుండి ప్రక్షాళన చేస్తామని, ధరలను తగ్గిస్తామని ....ఎన్నో వాగ్ధానాలతో ఎన్నికలలో గెలుపొందారు. 


అయితే, ఇచ్చిన  హామీలు  నత్తనడక  నడుస్తున్నాయి.

.................................. 

గంగానది నుండి మురుగును తొలగించాలంటే , ఎన్నో పరిశ్రమల నుండి గంగలోకి వదులుతున్న వ్యర్ధాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేయాలి.
.....................

ఇక, బుల్లెట్ ట్రైన్లు.. .అంటూ చెబుతున్నారు. బుల్లెట్ ట్రైన్ల సంగతి అలా ఉంచితే,  దేశంలోని రైళ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే.

 చాలా  లెవెల్ క్రాసింగుల వద్ద గేట్లు  లేక యాక్సిడెంట్స్  జరిగాయి . అలా జరగకుండా చూడాలి . 


ఇక రైల్వేస్టేషన్ల వద్ద  ట్రాక్ ల వద్ద చూస్తే మలమూత్రాలతో అసహ్యంగా ఉంటాయి. మలమూత్రాలు   ట్రాక్స్ పైన పడకుండా  రైళ్ళలో  సరికొత్త   టాయ్ లెట్స్ ఏర్పాటు చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. 



అవన్నీ ఆచరణలోకి వచ్చేటప్పటికి  ఎంతకాలం పడుతుందో  ?  సాధారణ  రైళ్ళ విషయంలో  పరిస్థితి  బాగుపడితే,  అప్పుడు  బుల్లెట్ ట్రైన్లు   వచ్చినా   బాగుంటుంది . 

..................

ఇక స్వచ్చభారత్ అంటూన్నారు  కానీ,  స్వచ్చభారత్ కు అవసరమైన ఏర్పాట్లేవీ ? 

ప్రతివీధికి రెండు, మూడురకాల చెత్తడబ్బాలను ఏర్పాటు చేయాలి. వంటింటి చెత్త,  ప్లాస్టిక్ వేస్ట్, ఎలెక్ట్రానిక్ వేస్ట్..ఇలా దేనికది విడిగా పారవేయటానికి చెత్తబుట్టలను ఏర్పాటుచేయాలి. 

 తగినంతమంది  పారిశుధ్య కార్మికులను  నియమించి  వారికి జబ్బులు రాకుండా  మాస్కులను,  గ్లవుసులను  ఇచ్చి  నియమించాలి. ఇవేమీ ఏర్పాటు చేయకుండా  స్వచ్చభారత్ ఎలా సాధ్యం ?


స్వచ్చభారత్ అనే పిలుపు వల్ల మాత్రం ప్రజలలో ఎంతోకొంత మార్పు వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ప్రకటించే చక్కటి పధకాలు ఆచరణలో సరిగ్గా అమలుజరిగేలా అధికారులూ,  ప్రజలూ కూడా సహకరిస్తేనే    చక్కటి ఫలితాలు వస్తాయి.
....................

ఇక,   భారీ పరిశ్రమల వల్ల ఎక్కువమందికి ఉపాధి లభించదని... చిన్నతరహా పరిశ్రమల వల్లే ఎక్కువమందికి ఉపాధి లభిస్తుందనీ  లెక్కలతో సహా  సాక్షాత్తూ ప్రధానమంత్రి గారే తెలియజేసారు.  


మరి, భారీ పెట్టుబడులు కావాలి, భారీ పరిశ్రమలు రావాలి .. .అంటూ  ఇతర దేశాలను అంతగా అడగటం ఏమిటో  అర్ధం కాదు. 


అయితే ప్రధానమంత్రి గారికి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే బలమైన పట్టుదల ఉందన్నది  కాదనలేని విషయం. 


 ముద్రా బ్యాంక్ అనేదాన్ని ప్రారంభించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తామనీ చెప్పారు. ఇది చాలా ఆశాజనకంగా ఉంది.


 అయితే ఆచరణలో వేగం ఉంటుందా ? లేక ఇది కూడా నత్తనడక నడుస్తుందా ? అనేది ఇప్పుడే తెలియదు. 

............................ 

ఈ దేశంలో ఎంతో ప్రతిభ కల యువత ఉన్నారు. మనదేశంలోనూ చక్కటి వ్యాపారం తెలిసిన వాళ్ళున్నారు. అద్భుతమైన తెలివితేటలున్నవాళ్ళున్నారు.


 ఇక్కడ వారికి సరైన ఆదరణ లభించక విదేశాలకు  తరలిపోతున్నారు.  సరైన ఆదరణ లభిస్తే  టెక్నాలజీతో  సహా  అన్ని రంగాల లోను   ఎన్నో అద్భుతాలను సాధిస్తారు. 


మనవాళ్ళను  సరిగ్గా  పట్టించుకోకుండా ,  అన్ని విషయాల లోనూ   విదేశాల  సాయం  కోసం  తిరగటం వల్ల  దేశానికి  కలిగే  గొప్పలాభమేమీ ఉండదు.

.........................

ఇక ,రైతులకు భరోసాను కల్పిస్తామని  అంటూనే  భూసేకరణ చట్టాన్ని తెచ్చింది కేంద్రప్రభుత్వం. ఇది మాత్రం  దేశంపై చాలా ప్రభావాన్ని చూపే అంశం. 


 ప్రభుత్వభూములను  సెజ్ ల కోసం కేటాయిస్తారు. ఇంకా  భూములు కావాలంటూ రైతులను బలవంతం చేస్తారు. 


అసలే రైతులు గిట్టుబాటుధరలు లేక బాధపడుతుంటే  దెబ్బమీద దెబ్బ అన్నట్లు దిగజారింది దేశంలోని రైతుల  పరిస్థితి.


 ప్రభుత్వాలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రజలు  అన్నీ గమనిస్తూనే ఉంటారు. అన్నీ గుర్తుపెట్టుకుని సమయం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారు. 

.......................

ధనవంతులు పల్లెలను దత్తత తీసుకోవటం బాగుంది . అయితే, ఆచరణలో చక్కటి ఫలితాలు వచ్చి పల్లెలు అభివద్ధి చెందుతాయని ఆశిద్దాము . 


స్కాములతో కూడిన  గత ప్రభుత్వాలపై విసుగుచెంది ప్రజలు కొత్తప్రభుత్వాన్ని అత్యధికమెజార్టీతో గెలిపించారు. కొత్త ప్రభుత్వాలు  ప్రజల ఆశలను వమ్ముచేయవని ఆశిద్దాము. 

......................... 

దేశంలోని చాలా మంది  ప్రజలు  ఎక్కువ డబ్బున్నవారు కాదు.  ధరల తగ్గుదల, సరైన వైద్య సౌకర్యాలు, నీటికొరత లేకుండా ఉండటం... వంటి నిత్యావసరాలకు సంబంధించిన కోరికలు ముందు తీరటం వారికి ముఖ్యం.


ఎన్నికల తరువాత  కేంద్రంలోని సర్కారు తీరు  కొంచెం  నిరాశను కలిగించగా, 


సామాన్య ప్రజల కనీసావసరాలను తీరుస్తామని వాగ్ధానం చేసి డిల్లీ ఎన్నికలలో నిలబడ్ద  ఆప్ పార్టీని గెలిపించారు ఢిల్లీ  ప్రజలు. అయితే, ఎంతో నమ్మి రెండోసారి గెలిపించినా అంతర్గత కుమ్ములాటలో కూరుకుని ఉంది ఆప్ పార్టీ. 

.... 
అయితే మనుషులకు  ఆశావాదం అవసరం కాబట్టి, పార్టీలు  ప్రజలకు చేసిన వాగ్ధానాలను  నెరవేర్చటానికి ప్రయత్నిస్తాయని  ఆశిద్దాము.


40 comments:

  1. మీరు ఇటీవల ఉద్యోగ కల్పనా గురించి టపా రాసారు కనుక గుర్తు చేస్తున్నాను.

    టీడీపీ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తామని ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని గత ఎన్నికలలో వాగ్దానం చేసింది. వారి ఎన్నికల ప్రచారంలో "జాబు కావాలంటే బాబు రావాలి" స్లోగన్ విరివిగా వాడారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఉన్నత విద్యాసంస్థలు , ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు ఎక్కువగా హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటయ్యాయి.

    ఆర్ధికంగా మిగులుతో ఉన్న తెలంగాణా లోనే నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు విభజన తరువాత ఆర్ధికంగా లోటు తో ఉన్న ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగసమస్య ఉండటంలో ఆశ్చర్యం ఏముంది ?

    క్రమంగా నూతన ఆంధ్రప్రదేశ్లో సమస్యలు పరిష్కరించబడుతాయి.

    ReplyDelete
    Replies
    1. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవీ గత మూడు దశాబ్దాలుగా రాలేదు. అప్పట్లో హైదరాబాదు దరిదాపుల్లో కూడా ఇతర నగరాలు లేవు. ఇప్పుడంటే విశాఖ కొంత డెవలప్ అయింది. ఇక విద్యా సంస్థలు అంటారా పుట్టగొడుగుల్లా వేలల్లో దేశమంతా ఉన్నాయి.

      అయినా చర్చఎన్నికల వాగ్దానాలు, ఉద్యోగాల గురించి కాదు. చంద్రబాబు మీరు చెప్పే విషయాలు తెలిసే వాగ్దానం చేసారా? అవి నిజం కాదని తెలిసే వోటర్లు గెలిపించారా?

      Delete
  3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి.

    మన హైదరాబాదే కదా ! అనుకున్నారు కాబట్టి, అన్ని సంస్థలనూ హైదెరాబాద్లోనే పెడుతుంటే .. మా ప్రాంతంలో కూడా ఏర్పాటుచేయండి అని మిగతా ప్రాంతాల వాళ్ళు అడిగిఉండకపోవచ్చు.

    విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా వేలల్లో దేశమంతా ఉన్నాయో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేవు.

    నిరుద్యోగసమస్య, ఉద్యోగాల గురించి మీరు ప్రస్తావించి కూడా ప్రస్తావించలేదు అంటున్నారు.

    తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వాగ్ధానాలలో నిరుద్యోగ సమస్య గురించి మీరు గత వ్యాఖ్యలో ప్రస్తావించారు. నేను దానికి సమాధానమూ చెప్పాను.

    ఆర్ధికంగా మిగులు ఉన్న తెలంగాణాలో నిరుద్యోగ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయా ?

    ReplyDelete
    Replies
    1. కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశ ప్రయోజనం కోసం ఏర్పరుస్తారు. ఏవి ఎక్కడ నెలకొల్పారో అన్న నిర్ణయం కూడా దేశప్రయోజనం దృష్ట్యా తీసుకుంటారు. ఆంధ్రులు అడిగినా మానినా, రాష్ట్రాలు కలిసినా విడిపోయినా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ఈ నిర్ణయాలు మానవు. (ఆంధ్రులు "ఉద్యమం" చేసి తెచ్చుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం లాంటి కొన్ని రాజకీయ నిర్ణయాలు ఇందుకు మినహాయింపు).

      హైదరాబాదులో వందలాది ప్రభుత్వ సంస్థలు ఉన్నాయనుకోవడం ఒక అపోహ. 1956 విలీనం తరువాత కేవలం 19 సంస్థలు వచ్చాయి. విశాఖలో 8 సంస్థలు వచ్చాయి: వీటి ఉద్యోగాల సంఖ్య హైదరాబాదు సంస్థల కంటే ఎంతో ఎక్కువ.

      కేంద్రప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలకు దేశమంతా అర్జీ పెట్టవచ్చు. హైదరాబాదులో ఉన్న సంస్థలలో కూడా ఆంధ్రవారే గణనీయమయిన సంఖ్యలో ఉన్నారు.

      ఇక విద్యాసంస్థల విషయానికి వస్తే ఎంసెట్ పాస్ అయితే చాలు సరిపడ్డా కాలేజీలు ఉన్నాయి. విద్యార్తులు లేక మూతపడే పరిస్తితిలో కొన్ని సంస్థలు చేరాయి. ఇంకా మీకు లోటు కనిపించడం ఆశ్చర్యమే.

      తెలంగాణలో మిగులు బడ్జెట్ ఇన్నేళ్ళు ఆంద్ర ప్రయోజనానికి వాడారు. మున్ముందు మన కోసం వాడుతారు కనుక అభివృద్ధి తద్వారా ఉపాధి ఖాయం. చెరువుల పునర్జీవన లాంటి కార్యక్రమాలు రానున్న రోజులలో గణనీయమయిన ఫలితాలు చూపిస్తాయి.

      Delete
    2. 1956 లో కూడా తెలంగాణా మిగులు & ఆంద్ర లోటు రాష్ట్రాలు. మిగులు వేల కోట్లు కాదు కానీ బడ్జెట్ నిష్పత్తి ఈనాటి కంటే ఎక్కువే. ఈనాడు జీతాలు కట్టలేని పరిస్తితి 1953-56 మధ్య కూడా ఉండింది. తెలంగాణా మిగులు బడ్జెట్ వాడడం వల్లే ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ బతికింది. విలీనానికి ఇదే ముఖ్య కారణం.

      కేంద్ర ప్రభుత్వం తమ సంస్థలను ఎక్కడ స్తాపించాలా అన్న నిర్ణయం ఆంధ్రుల అనుమతి అడగాల్సినంత దౌర్భాగ్యం లేదు. కొన్ని సంస్థలు ఉత్తరాదిలో ఉన్నాయి కాబట్టి వాటికి రాజకీయాలు ఆపాదించడం దారుణం.

      హైదరాబాదులో 1956 తరువాత వచ్చిన కేంద్ర సంస్థలన్నీ రక్షణ & అనుబంధ రంగాలకు చెందినవే. సరిహద్దుకు & తీరానికి దూరంగా ఉండడం యుద్ధ విమానాల & మిసైల్ల దాడి నుండి సురక్ష, చక్కటి వాతావరణం, హిందీ బహుళ ప్రాచుర్యం లాంటి అనుకూల అంశాలు మరవకండి.

      విశాఖ ఉక్కు ఫాక్టరీ ఉద్యోగుల సంఖ్య హైదరాబాదు లోని సంస్థల అన్నిటినీ కలిపినా ఎక్కువే. చీటికి మాటికి హైదరాబాద్ మీద పది ఏడ్చే వాళ్లకు ఈ సంగతి తెలీదా నటిస్తున్నారా?

      కోస్తాలో పరిశ్రమలు & కోచింగ్ సెంటర్లు ఎందుకు పెట్టలేదో ఆంద్ర పెట్టుబడిదారులు జవాబు చెప్పాలి. దానికి తెలంగాణా వారు ఎందుకు బాధ్యత వహించాలి?

      ఆంద్ర అభివృద్ధి చెందాలని నేనూ ఆశిస్తాను. అదేదో తమ సొంత వనరులపై ఆధారపడాలి ఇతరులను నష్టపెట్టి కాదు.

      Delete
    3. కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశ ప్రయోజనం కోసం ఏర్పరుస్తారు. ఏవి ఎక్కడ నెలకొల్పారో అన్న నిర్ణయం కూడా దేశప్రయోజనం దృష్ట్యా తీసుకుంటారు.అన్నది నిజమే కావచ్చు.

      అయితే, ఎన్నో కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటున్నది అందరికీ తెలిసిన విషయమే.దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు..
      ...........................
      ఇక ఉమ్మడి అంధ్రప్రదేశ్కు కేటాయించిన కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా హైదరాబాదులోనే ఉండటానికి అనేక కారణాలున్నాయి. ఆంధ్రప్రాంతం వాళ్లు మన హైదరాబాదే కదా ! అనుకోవటం ఒక ముఖ్య కారణం.

      ఆంధ్రప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందక పోవటానికి అక్కడి నేతల, ప్రజల నిర్లక్ష్యం కూడా ముఖ్యకారణాలే.
      ...............

      హైదరాబాదులో వందలాది ప్రభుత్వ సంస్థలు ఉన్నాయనుకోవడం అపోహ ఎంతమాత్రం కాదు.

      హైదరాబాదులో ఉన్న వందలాది ప్రభుత్వ సంస్థల పేర్లతో సహా ఒక దగ్గర చదివాను.( సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు..)
      ఇప్పుడు ఆ పేర్లు అన్నీ నాకు గుర్తులేవు.
      ...............

      హైదరాబాదులో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థలలోనే కాదు.. విశాఖలో ఉన్న సంస్థలలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు గణనీయమయిన సంఖ్యలో ఉన్నారు.
      ..........
      1956 విలీనం తరువాత హైదరాబాద్లో ఎన్నో ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలూ వచ్చాయి. ఐటీ రంగంలో ఎందరో ఉద్యోగాలు చేస్తున్నారు.

      ఇప్పుడు హైదరాబాద్ నుంచి వేలకోట్ల రెవెన్యూ వస్తుందంటున్నారు. 1956 విలీనం ముందు హైదరాబాదులో పెద్ద ఎత్తున సంస్థలు లేవు. వేలకోట్ల రెవెన్యూ కూడా లేదు.
      .............
      ఐఐఎం ఐ ఐ టీ , సివిల్స్, ..వంటి ఉన్నత విధ్యకు అవసరమైన కోచింగ్ సెంటర్లు కూడా ఆంధ్రాలో లేవు. ప్రతి కోచింగ్ కూడా అందరూ హైదరాబాదే వస్తారంటే ఇక ఆంధ్రా పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సంస్థలకు విజయవాడ, వైజాగ్లలో చిన్న బ్రాంచ్ లు ఉన్నాయి అంతే.

      కోచింగులకే ఆంధ్రాలో సరైన సెంటర్లు లేవంటే ఇక ప్రముఖ విద్యాసంస్థలు ఎక్కడివి ? ఉన్నత విద్యా సంస్థలు లేవు కాబట్టే... ఇప్పుడు విభజన తరువాత ఉన్నతవిద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయటానికి కేంద్రం ముందుకొస్తోంది.
      ..................

      తెలంగాణలో మిగులు బడ్జెట్ ఇన్నేళ్ళు ఆంద్ర ప్రయోజనానికి వాడారు అన్నది అత్యంత హాస్యాస్పదమైన విషయం.

      తెలంగాణలో మిగులు బడ్జెట్ ఆంధ్రాకు వాడితే రాయలసీమ ఎందుకు అత్యంత వెనుకబడి ఉంది ? ఉత్తరాంధ్రా ఎందుకు అత్యంత వెనుకబడి ఉంది ?

      కోస్తాలో వ్యవసాయం ఉన్నమాట నిజమే కానీ .. తుఫాన్లు, వరదలు వచ్చి ఎప్పుడు పంట నష్టం వస్తుందో ? అని రైతులు భయపడే పరిస్థితి ఉంటుంది. తీరా పంట చేతికి వచ్చిన తరువాత గిట్టుబాటు ధర రైతుల చేతిలో ఉండదు.

      కోస్తాలో కనీసం వ్యవసాయాధారిత పరిశ్రమలను కూడా ఏర్పాటుచేయలేదు.
      .............
      ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం అంతా హైదరాబాద్లోనే వచ్చేటట్లు అభివృద్ధి జరిగింది కాబట్టే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లేక, ఉన్నత విద్యాసంస్థలు, ఉపాధి కల్పించే సంస్థలూ లేక దయనీయమైన పరిస్థితి ఉంది.

      అయితే నూతన ఆంధ్రప్రదేశ్ త్వరలోనే అభివృద్ధిని సాధిస్తుంది. సమస్యలు పరిష్కరించబడి రానున్న రోజులలో గణనీయమయిన చక్కటి ఫలితాలు వస్తాయి.

      Delete
    4. ఒక వేళ మీరన్నట్లు 1956కు ముందు ఆంధ్రలో లోటుబడ్జెట్ ఉన్నా కూడా ఆంధ్ర తనకుతానే అభివృధి చెంది ఉండేది. కేవలం లోటు బడ్జెట్ పూడ్చుకోవటం కోసం పక్కరాష్ట్రాలను కలుపుకోవలసిన అవసరం లేదు..ఎందుకంటే ఆంధ్రలో చక్కటి సముద్రతీరం, చక్కటి వర్షపాతమున్న డెల్టా భూములు... వంటి ఎన్నో వనరులున్నాయి.

      అయినా, ఆంధ్రతో కలవటం ఇష్టం లేని తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆనాటి ఆంధ్రనేతలు ఆంధ్రాప్రాంతానికి అన్యాయం చేసారు. పెద్దమనుషుల ఒప్పందం కూడా ఆంధ్రాప్రాంతానికి అన్యాయం జరిగే విధంగానే ఉంది.

      .. తమ సంస్థలను ఎక్కడ స్తాపించాలా అన్న నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ కారణాలూ ఉంటాయన్నది కూడా నిజమే. ఎన్నికలు సమీపిస్తే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, ఆర్ధిక సాయాన్ని ఎక్కువగా ఇవ్వటం అందరికీ తెలిసిన విషయాలే.
      .........
      యుద్ధ విమానాల & మిసైల్ల దాడి నుండి రక్షణ..ఉండాలి అనుకుంటే, రాయలసీమ వంటి ప్రాంతంలో కూడా సంస్థలను ఏర్పాటుచేయవచ్చు. ఉగ్రవాదులు రావాలనుకుంటే ఏ ఊరు అయినా వచ్చే అవకాశముంది. హైదరాబాదులో కూడా ఉగ్రవాదులు పట్టుబడుతూనే ఉన్నారు కదా !

      హైదరాబాదులో రక్షణ & అనుబంధ రంగాలకు చెందని సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉదా.National Fisheries Development Board (NFDB)రక్షణ రంగానికి చెందినదా?

      ఇలాంటి సంస్థలను కూడా హైదరాబాదులోనే పెట్టటం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ల పరిస్థితి ఎంత హీనంగా ఉండేదో తెలుస్తోంది.

      ఇక చక్కటి వాతావరణం అంటే , కర్నూల్ వంటి ప్రాంత వాతావరణం కూడా హైదరాబాద్లా చెమట ఎక్కువ పట్టని వాతావరణమే. ఇక,హిందీ భాష పెద్ద సమస్యే కాదు. కేంద్రసంస్థలలో పనిచేసేవారు ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడతారు కదా !
      .............

      సంస్థలలో ఉద్యోగస్తులు ఎందరు ఉన్నారన్నది ముఖ్యం కాదండి. హైదరాబాద్ వేలకోట్ల రెవెన్యూ వచ్చేంతగా అభివృద్ధి చెందింది ....వైజాగ్ మరియు ఆంధ్రలో ఏ ప్రాంతమూ కూడా అంతటి రెవెన్యూ వచ్చేంతగా అభివృద్ధి చెందలేదు .. అన్నది.. ఇక్కడ గమనించవలసిన విషయం.

      హైదరాబాద్ మీద పడి ఏడ్చే అవసరం ఆంధ్ర వాళ్ళకు లేదు.

      హైదరాబాద్ అభివృధి చెందాలని కోరుకున్నారు కాబట్టే ...వేలకోట్ల రెవెన్యూ వచ్చేంతగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నా ఆంధ్ర వాళ్లు నోరు మెదపలేదు. తమ పెట్టుబడులను కూడా తమ ప్రాంతంలో పెట్టకుండా హైదరాబాద్లో పెట్టి అక్కడి రెవెన్యూ పెరగటానికి కారణమయ్యారు.
      ............

      నిజమే. కోస్తాలో పరిశ్రమలు & కోచింగ్ సెంటర్లు పెట్టకపోవటానికి ఆంద్ర వాళ్ళ నిర్లక్ష్యం చాలా ఉంది.

      అయితే, తెలంగాణాలో సమస్యలు పరిష్కరించబడకపోవటానికి ఆంధ్రాప్రాంతం వాళ్ళు ఏ విధంగా కారణం ?

      తెలంగాణాలో ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందరో ఉన్నారు కదా !
      ...........
      ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రావాళ్ళు ఎంతో అవమానకరంగా వెళ్ళగొట్టబడ్డారు.

      విభజన తరువాత ఆంధ్రా వాళ్లు తమపాట్లేవో తాము పడుతుంటే, ఇప్పటికీ కొందరు తెలంగాణా వాళ్ళు ఆంధ్రా వాళ్ళను తిడుతూనే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళంటే అంత కోపం ఉంటే.. ఆంధ్ర గ్యాసులో వాటా కోసం తాపత్రయం దేనికి ?

      Delete
  4. nice madam,you touched so many issues,try to write one particular issue in next post

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీ సూచన ప్రకారం తప్పక ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  6. మీరు ఎక్కడో చదివారు లేదా ఎవరో చెబితే విన్నారు & వాటి పేర్లు గుర్తు లేవు. నేను సొంతంగా పరిశోదించాను & అన్ని వివరాలతో సహా చర్చించగలను. ఇక్కడే అసలు తేడా వస్తుంది!

    అందరికీ (ఆంధ్రులు అందరికా?) "తెలిసిన" విషయమంటూ బుకాయించడం కాదు, రాజకీయ కారణాలతో పెట్టిన సంస్థలు ఒక ఆరు (విశాఖ ఉక్కు కర్మాగారం మినహా) చెప్పండి చూద్దాం.

    కేంద్రం ఆంధ్రుల అనుమతి తీసుకొనే సంస్థలను స్తాపించాలిన అడగడం విడ్డూరమే కాదు, అహంకారం కూడా. దేశంలో 29 రాష్ట్రాలలో ఇదీ ఒక్కటే అని తెలుసుకోవడం మంచిది.

    1956లొ ఆంద్ర లోటు ఆదాయంలో 11%, తెలంగాణా మిగులు 40%. విలీనం జరగకపొతే పరిస్తితి దారుణమని అన్నది టంగుటూరి నీలం వంటి ఆంద్ర నాయకులే. పెద్దమనుషుల ఒప్పందం ఆంధ్రకు నష్టమో కాదో కానీ సదరు "పెద్ద మనుషులు" దాన్ని పాటించలేదు. 1969 వరకు అక్రమంగా తరలించిన తెలంగాణా మిగులు 80 కోట్లని భార్ఘవ కమిషన్ నిర్ధారించింది: 10% శాతం వడ్డీ వేసుకుంటే ఈ మొత్తం ఇప్పటికి 25 వేల కోట్లు. మీరన్నట్టే లోటు మెల్లగా పూడ్చేవారేమే కానీ ఆ ధైర్యం వాళ్ళు ఎందుకో చేయలేదు.

    కర్నూలులో పెద్ద సంస్థలు రాలేదు నిజమే కోలారులో వచ్చాయా? చంద్రాపూరులో ఎన్ని సంస్థలు ఉన్నాయి? వాటికి లేని కర్నూలుకు ఉన్న కొమ్ములు ఏమిటి? అసలు కర్నూలుకు హైదరాబాదుకు పోలిక ఉందా?

    కేంద్రం ఒక సంస్థను ఫలానా రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయిస్తుందని స్థలం ఎంపిక రాష్ట్రం చేస్తుందని అనుకోవడం (లేదా ఎక్కడో గుర్తు లేని చోట చదవడం) శుద్ధ పొరపాటు. నేను నమ్మిందే కరెక్టని అనుకుంటే మీ ఇష్టం.

    విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల సంఖ్యలోనే కాదు, టర్నోవర్ & పెట్టుబడి లాంటి అన్ని గణాంకాలలో హైదరాబాదులో ఉన్న సంస్థలు అన్ని కలిపినా హెచ్చే. మీకు వివరాలు కావాలంటే ఇవ్వగలను.

    సహజ వనరులు దేశం ఆస్తి, రాష్ట్రానికి చెందవు. పైగా వాటిని డబ్బిచ్చి కొనుక్కుంటారు. రాజశేఖర్ రెడ్డి "ఆంద్ర గాస్" అని గగ్గోలు పెట్టినంత మాత్రాన సరిపోదు. ఇదే రకంగా బంగారం అంతా మాదని కర్నాటక అంటే జరిగేనా?

    ఆంధ్రా వారంటే నాకు ఎటువంటి కోపం లేదు. మా కుటుంబంలో ఆంధ్రతో సహా అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. నిజాలు చెబితే నిష్టూరం ఎందుకండీ?

    ReplyDelete
  7. కేంద్రం హైదరాబాదులో ఎన్ని సంస్థలను ఏర్పరిచింది? వాటిలో ఎందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు ? అనే విషయాల కంటే హైదరాబాదుకు మాత్రమే ఎక్కువ రెవెన్యూ రావటం కాకుండా రాష్ట్రం అంతటా సమానంగా రెవెన్యూ వచ్చేటట్లు అభివృద్ధి జరిగి ఉంటే బాగుండేది అన్నది ఇక్కడ గమనించవలసిన ప్రధానమైన విషయం.
    హైదరాబాదులో ఉన్న కొన్ని సంస్థల వివరాలను ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
    Central Government Organizations in Hyderabad
    ............

    1956కు ముందు హైదరాబాద్ గురించిన ఎన్నో విషయాలున్నాయి.ఈ విషయాలు చదండి.
    All the people of Andhra and Rayalaseema and Bellary were paying taxes to Qutub shahis , which were used to built the city from 1591- 1687.

    ‪ ‪‎Fact1‬ Hyderabad has been Historically and Financially linked to People of Andhra and Rayalseema for the first 200 years of it's inception. Not just the 60 years after independence.

    ఈ క్రింది లింక్ చదివితే మరిన్ని విషయాలు తెలుస్తాయి.

    Aruna Kumari - Please Save Andra pradesh. Hyderabad has...
    .................
    యుద్ధ విమానాల & మిసైల్ల దాడి నుండి రక్షణ..ఉండాలి కాబట్టే హైదరాబాద్లో పెట్టారు ..అని మీరు వ్రాసారు కాబట్టే ..
    అయితే, రాయలసీమ వంటి ప్రాంతంలో కూడా సంస్థలను ఏర్పాటుచేయవచ్చు కదా ! ఉగ్రవాదులు ఏ ఊరు అయినా వచ్చే అవకాశముంది. హైదరాబాదులో కూడా ఉగ్రవాదులు పట్టుబడుతూనే ఉన్నారు కదా ! అని నేను వ్రాసాను.
    .................
    ఆంధ్రా, రాయలసీమలు పేదవి కాదు. ఆ ప్రాంతాలలో ఎంతో విలువైన వజ్రాలు దొరికాయి. ఆ సంపద వెలకట్టలేనిది. అయితే, ఆ సంపద ఇప్పుడు ఇక్కడ లేదు. వాటి వివరాలు ఈ క్రింద లింక్ ద్వారా చూడవచ్చు.

    Andhra Rayalaseema Daimond Mines
    ............

    సహజ వనరులు దేశం ఆస్తి, రాష్ట్రానికి చెందవు. అనేది ఇప్పటి విధానం కావచ్చు. (ఈ త్రవ్వకాల వల్ల అక్కడి స్థానికులు ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నారు. సరే, ఇక్కడ చర్చ అది కాదు కాబట్టి స్థానికుల ఇబ్బంది సంగతి ప్రక్కన పెడదాము.)

    ఇక్కడ విషయమేమిటంటే, వేరే వాళ్ళ సంగతి అలా ఉంచండి. అస్తమానమూ ఆంధ్రా వాళ్ళను తిట్టే వాళ్ళు కూడా ఆంధ్రా వాళ్ళ గ్యాస్ కోసం ఆరాటపడటం వింతగా ఉంది.
    ................

    నాకు కూడా తెలంగాణా ప్రజలంటే ఎటువంటి కోపమూ లేదు. మా బంధువులలో తెలంగాణా వాళ్లు కూడా ఉన్నారు.

    నా అభిప్రాయం ఏమిటంటే, ఆంధ్రా అయినా తెలంగాణా అయినా వెనుకబడి ఉండటానికి సామాన్య ప్రజలు కారణం కాదు.. సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి కొందరు స్వార్ధపరులు తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అన్నది అందరూ గ్రహించవలసిన విషయం.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణాను అడ్డుకోవడానికి ఎందరో వ్యక్తులు అనేక కట్టుకథలు రాసారు. పైకి బాగానే ఉంటాయి కానీ లోతుకు వెళ్ళితే వీటిలో లొసుగులు బయటపడతాయి. చాలామంది ఆంధ్రులు వీటిని గుడ్డిగా (సొంతంగా పరిశోదన చేయకుండా) నమ్మి భ్రమలో పడ్డారు.

      మీరు ఇచ్చినట్టు చెప్తున్న లింకులు లేవు. కేంద్ర ప్రభుత్వ సమస్థల (మరియు అనేక విషయాలపై) గురించి నా బ్లాగులో రాసిన నాకు అక్కడ కొత్త వాస్తవాలు దొరుకుతాయని నాకు నమ్మకం లేదు. ఒకవేళ కావాలంటే లింకులు ఇవ్వండి చూడగలను.

      పన్నులు రెండు రకాలు, రాష్ట్ర పన్నులు మాత్రమె నేరుగా వస్తాయి. కేంద్ర పన్నులు కేంద్రానికి వెళ్తాయి వాటి మీద రాష్ట్రానికి కొద్ది శాతం (గాడ్గిల్ ఫార్ములా ప్రకారం) రెవెన్యూ మాత్రమె వస్తుంది. మీరు ఊహించినట్టు చూసినా హైదరాబాదు సంస్థలు కలిపినా వాటన్నిటికన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్నవిశాఖ ఉక్కు కర్మాగారం తాలూకా రెవెన్యూ ఆంధ్రకే వస్తుంది మరెందుకు గొడవ?

      రాయలసీమలో సంస్థలు పెట్టలేదు మరి మరాథ్వాదలొ పెట్టారా? అసలు హైదరాబాదుకు కర్నూల్ పోటీయా కాదె?

      సహజ వనరులు దేశానికే చెందడం అనేది కౌటిల్యుడి అర్ధశాస్త్రం కాలం నుండే వస్తుంది. అది తెలియని ఒకానొక మేతావి "మా దైమండులో" అన్నా మనం పట్టించుకోనక్కరలేదు.

      పన్నులు ఎందుకు కడతారో తెలుసా? మనం ఈ ఏడాది కట్టిన పన్నులతో వచ్చే సంవత్సరం మనకు సదుపాయాలు కూడుతాయి. అంటే "పన్నుల వల్ల సంక్రమించే హక్కు" ఒక్క ఏడాది మాత్రమె. వందలాది సంవత్సరాల కింద (ఎంత ఎవరు కట్టారో తెలియని) పన్నులను సాకుగా ఇంకా హక్కులు ఉంటాయా? ఆయన ఎవరో చెప్పడం మనం నమ్మడం! పోనీ వారు చెప్పిందే వేదవాక్కు అంటే లండన్ నగరం కూడా మన పన్నులతో కట్టిందే, అడిగితె వాళ్ళు ఊరుకుంటారా?

      నేను ఆంధ్రులను అస్తమానం కాదు సరికదా ఒక్కసారి కూడా తిట్టలేదు. నన్ను ఆంధ్రకు చెందిన కొందరు అనని మాట & తిట్టని తిట్టు లేదు. ఇకపోతే ఆంధ్రలో దొరికే గాస్ ("ఆంధ్రావారి గాస్" కాదు) కోసం తెలంగాణా ఆరాట పడుతుందని మీరు ఎక్కడ చదివారో?

      మాకు ఎవరితో వైరం లేదు. దేశంలో మిగిలిన 28 రాష్ట్రాలు అన్నిటితోనూ సత్సంబంధాలు ఉండాలి అయితే ఇవి సమానస్థాయిలో ఉండాలి. ఎవరికీ పెద్దపీట వేయడం కుదరదు.

      Let us prosper as equals with our own resources!

      Delete
  8. మీరు చెప్పేవి మాత్రమే నిజాలు.ఇతరులు చెప్పేవి కట్టుకధలు అనుకుంటే అది మీ ఇష్టం.

    నేను ఇచ్చిన లింకులు చక్కగానే ఉన్నాయండి.

    అందరూ కలిసి అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది.. హైదరాబాదు గొప్ప ఏమిటి ? కర్నూల్ గొప్ప ఎందుకు కాదు ? కర్నూల్ కావచ్చు, మహారాష్ట్రలోని చంద్రపూర్ కావచ్చు.. అవకాశాలు కల్పిస్తే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

    విశాఖ ఉక్కుకర్మాగారమా ? లేక మరొకటా అన్నది కాదండి. హైదరాబాదు నుంచి వేలకోట్ల రెవెన్యూ వచ్చేటట్లు అభివృద్ధి జరిగింది. మిగతా ప్రాంతాలు అలా అభివృద్ధి చెందలేదు. అన్నది ఇక్కడ ముఖ్యం.

    ఇప్పుడు ఉన్న హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు జరగలేదు. వందలాది సంవత్సరాల క్రిందటే జరిగింది. అని చెబుతుంటే , వందలాది సంవత్సరాలక్రితం జరిగిన అభివృద్ధి ఉమ్మడిపన్నులతో జరిగినదే అని చెప్పటం సరైనదే.

    మీరు ఆంధ్రులను తిట్టారని నేనూ అనలేదండి..విభజన తరువాత కూడా ఇప్పటికీ ఇంకా తిడుతున్నవారిని ఉద్దేశించే నేను అన్నాను.

    ఎవరి పొలంలో( భూమిలో) దొరికిన సంపద వాళ్లకే చెందటం అన్నట్లుగా కూడా ( ఒకప్పుడు) ఉండేదట. నీళ్లు కూడా సహజవనరులే కదా ! భవిష్యత్తులో నదీజలాలు కూడా దేశ ఉమ్మడి ఆస్తిగా ఉండేలా చట్టం వస్తుందేమో ?

    ఆంధ్రలో దొరికే గాస్ కోసం తెలంగాణా ఆరాట పడుతుందని వార్తాపత్రికలలో చదివాను. ఇవన్నీ కట్టుకధలని మీ అభిప్రాయం కాబోలు. ఎవరి ఆధీనంలో ఉన్నా కూడా.. ఆంధ్రా ప్రాంతంలో లభించే గాస్ ఆంధ్రా వాళ్లది కాకుండా పోదు.

    నిజమేనండి, ఒకరితో ఒకరు వైరం లేకుండా ఉంటే అందరికీ మంచిది.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. లింకులు లేవండీ నేను IE & Chrome రెంటిలో చూసాను. మీరు ఎ browser లో చూసారు?

      నేను ఎవరో చెబితే గుడ్డిగా నమ్మను. అయినంతవరకు ఒరిజినల్ ఆధారాలు చదివే నిర్దారిస్తాను. ఉ. విశాఖ ఉక్కు ఫాక్టరీ టర్నోవర్ ఎంతో వారి వెబ్ సైటునుండే తీసుకుంటాను తప్ప ఎక్కడో బ్లాగు టపా/వ్యాఖ్య నుండి కాదు.

      హైదరాబాదు అభివృద్ధి ఎవరు చేసారు/పాల్గొన్నారు అన్నది మన చర్చ కాదు. ఆంద్ర ప్రాంత పన్నులతో హైదరాబాదును అభివృద్ధి చేసారన్న మీ మాటకు ఆధారాలు ఉన్నాయా?

      హైదరాబాదు చంద్రాపూర్ రెండూ ఒకటేనా? సరే మీ ఇష్టం!

      పొలాలలో దొరికిన సంపద వారికే చెందుతుందనే సూత్రం కౌటిల్యుడి అర్ధశాస్త్రం చెప్పలేదు, చందమామ కథలలో ఉందేమో తెలీదు. నదీజలాలు ఎప్పుడూ దేశ సంపదే, కొత్తగా చట్టం అవసరం లేదు.

      ఆంధ్రా గాస్ అంటూ ఏమీ లేదు, గాస్ మొత్తం దేశానిదే. ఆ విషయం మీరు చదివిన పత్రిక వారికి తెలీదు (లేదా అక్కరలేదు). పత్రికలలో (లేదా బ్లాగులలో) వచ్చేవన్నీ నమ్మేటట్టు అయితే నేను వేలాది లింకులు ఇవ్వగలను.

      ఇకపోతే (గాస్ కేటాయింపులలో విద్యుత్ కంటే ఫెర్తిలైసర్లకు ప్రయారిటీ కాబట్టి) మనకు గాస్ దొరికే అవకాశం తక్కువని దాని మీద ఆధారపడకుండానే ప్రణాలికలు వేసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఉన్నత అధికారుల ద్వారా నా భోగట్టా. నిర్ణయాలు తీసుకునే వారిని నమ్మనా ఏదో పత్రికలో వచ్చిన దాన్నా?

      మీరు ఏమి అనుకోకపోతే ఒక ప్రశ్న. సింగాపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ గురించి మీరు రాసిన టపాలో ఈనాడు కథనం కాక ఇంకా ఏమేమి చదివారు? తప్పు పెట్టడానికి కాదు తెలుసుకుందామనే అడుగుతున్నాను.

      Delete
    3. మీరు ఇంకా జవాబు చెప్పని ప్రశ్నలు ఇవిగో: 1. ఒక్కసారి పన్నులు కడితే తద్వారా హక్కులు తరతరాలుగా ఉంటాయా? 2. ఇదే నిజమయితే లండన్ నగరంలో మన వాటా ఎంత?

      Delete
    4. Andhra Rayalaseema Daimond Mines

      Central Government Organizations in Hyderabad

      Aruna Kumari - Please Save Andra pradesh. Hyderabad has...

      ఈ లింకులు నేను చూస్తే బాగానే వస్తున్నాయండి. మళ్లీ ప్రయత్నించి చూడండి.
      ...........
      ఎవరి పొలాలలో దొరికిన సంపద వారికే చెందుతుందనే సూత్రం కౌటిల్యుడి అర్ధశాస్త్రం చెప్పకపోవచ్చు. అయితే, ఒకప్పుడు అలాంటి పద్ధతి ఉండటం మాత్రం నిజమే.

      నదీజలాలు దేశ సంపదే అయినా, ఆ నదీ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు ఆ నీటిపై హక్కులుండటం జరుగుతోంది కదా !

      మీరు ఒక వ్యాఖ్యలో..(ఆంద్ర అభివృద్ధి చెందాలని నేనూ ఆశిస్తాను. అదేదో తమ సొంత వనరులపై ఆధారపడాలి ఇతరులను నష్టపెట్టి కాదు...)అని వ్రాసారు కాబట్టి ..

      కొందరు తెలంగాణా వాళ్ళు ఆంధ్రవాళ్ళను తిడుతూ కూడా అక్కడి గాస్ కోసం( అంటే, అక్కడి సహజవనరుల కోసం..) తాపత్రయపడుతున్నారని నేను వ్రాసాను.
      ..............
      లీ క్వాన్ యూ గురించి నేను ఈనాడులోనే చదివాను. ఇంకా ఎక్కడా చదవలేదు.

      Delete
    5. ప్రాచీన కాలం నుండి తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలు ఒకే ప్రాంతముగా ఉండేవి. ( కొద్ది కాలం తప్ప.)
      శాతవాహనుల కాలం, కాకతీయుల కాలంలోనూ ఆంధ్ర, తెలంగాణా భేదాలు లేవు. కాకతీయుల రాణి రుద్రమదేవి తల్లి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జాయపనాయకుని సోదరియే.

      (చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని కాపు / కమ్మ కులానికి చెందిన జయప నాయుడి(జాయప్ప సేనాని) సోదరిలైన నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ..)
      ..........
      కాకతీయులు ఎన్నో గొప్ప పనులు చేసారు. అయితే కొన్ని పొరపాట్లూ చేసారనిపిస్తుంది.
      ఉదా..కొన్ని కారణాల వల్ల సమ్మక్క,సారక్కలకు .. ప్రతారుద్రునికి యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది.( ఇలా జరగకుండా ఉంటే బాగుండేది.)
      ...............

      ఒకప్పటి కుతుబ్ షాహి రాజ్యంలో కూడా ఆంధ్ర ప్రాంతం తెలంగాణా ప్రాంతం కలిసే ఉండేవి. అందరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అందువల్ల, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందటంలో ఆంధ్రా వాళ్ల రెవెన్యూ కూడా ఉందని తెలుస్తుంది.

      The city of Hyderabad was founded in 1591 AD by Quli Qutub Shah of Qutub Shahi Dynasty commonly known as Golconda Dynasty. This dynasty have had Hyderabad as their capital till 1687. This dynasty built buildings like Chaarminar, Golconda Fort, Tombs, Hussain Sagar lake, Gosh Mahal palace etc.

      THIS DYNASTY COVERED ALMOST ENTIRE ANDHRAPRADESH as we see today.(http://www.mapsofindia.com/history/qutb-sahi-dynasty.html) Which implicates that, All the people of Andhra and Rayalaseema and Bellary were paying taxes to Qutub shahis , which were used to built the city from 1591- 1687.

      పై విషయాలను గమనించితే, పన్నులు కట్టడం మాత్రమే కాదు. పూర్వం నుంచి ఆంధ్ర తెలంగాణా ప్రాంతం ఉమ్మడి ప్రాంతంగా ఉండేదని తెలుస్తుంది.
      .............
      ఒక ఉదాహరణ చెపుతాను.ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణాకు రాజధాని. భవిష్యత్తులో ఎన్నో మార్పులు రావచ్చు.

      ఇప్పటి తెలంగాణా భవిష్యత్తులో ఉత్తరతెలంగాణా, దక్షిణ తెలంగాణాగా విభజింపబడి ఒక భాగానికి రాజధానిగా హైదరాబాద్ వెళ్లిపోయిందనుకోండి. హైదరాబాద్ లేని భాగం వాళ్ళు బాధపడరా?

      ఇలాంటి పరిస్థితి వస్తే మీ మానసిక వేదన ఎలా ఉంటుందో ..ఇప్పటి ఆంధ్రా వాళ్ల పరిస్థితి అలాంటిదే.

      పై ఉదాహరణను వివరంగా అర్ధం కావటం కోసం చెప్పాను. తెలంగాణా విడిపోవాలన్నది నా అభిప్రాయం కాదు.
      ...............
      సమైక్యాంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది ఎందరో ఆంధ్రా వాళ్లకు బాధను కలిగించింది. అందులోనూ ఆంధ్రులు దొంగలు, దోపిడీదారులు అంటూ కొందరు తిట్టడం మరింత బాధను కలిగించే విషయం.

      ఆంధ్రులు తమ అభివృద్ధే ముఖ్యం అనుకునేవాళ్ళయితే , వాళ్ల పెట్టుబడులను తమ ప్రాంతాలలోనే పెట్టుకుని అభివృద్ధి చేసుకునే వారు కదా ! హైదరాబాద్లో ఎందుకు పెడతారు ? తెలంగాణా,ఆంధ్రా అనే భేదాలు వాళ్ళకు లేవు.

      కలిసిఉన్న అన్నదమ్ములు తమపొలాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, అందులో ఒక సోదరుడు తనకు కలిసి ఉండటం ఇష్టం లేదు అంటే ,అన్నదమ్ములు కలిసి అభివృద్ధి చేసుకున్న ఆస్తిని ఇద్దరికీ పంచుతారు కదా ! ఇక్కడ అలాంటిదేమీ జరగకపోగా, ఉమ్మడి అంటూ ఏమీ లేదు అంతా మాదే అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.

      ఈ రోజుల్లో అనుబంధాలతో పాటు ఆర్ధికపరిస్థితీ ముఖ్యమే . ఈ సంఘటన ఆంధ్ర ప్రజలకు గుణపాఠం కావాలి.

      Delete
    6. ఇంతక ముందు వ్యాఖ్య రాసి సబ్మిట్ నొక్కితే సైటు హాంగ్ అయింది. మళ్ళీ ప్రయత్నిస్తాను.

      ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ సరిహద్దులలోని మొత్తం ప్రాంతం తెలుగు భాష ఆవిర్భావం తరువాత 1956 కంటే పూర్వం ఎప్పుడూ ఒక రాష్ట్రంలో లేదు.

      ఫలానా రాజు లేదా రాజకుటుంబం మంచా కాదా & ఎవరు ఎవరిని పెళ్ళాడారు అనే చర్చ అనవసరం. రాచరిక వ్యవస్థ ఖచ్చితంగా ప్రజాహితం కాదు.

      లింకులు నిజంగానే లేవండీ. వ్యాఖ్యలో హైపర్లింక్ రాదనుకుంటా.

      గూగుల్ సెర్చ్ ద్వారా అరుణ కుమారి గారి ఫేస్బుక్ వ్యాఖ్య పట్టుకున్నాను.
      https://www.facebook.com/rayalandhra/posts/610941505603923

      ఆవిడ ఎవరో, ఎంత పరిశోధన చేసారో & ఆధారాలు ఏమిటో తెలీవు కనుక కోట్లాది ఫేస్బుక్ వ్యాఖ్యలలో ఇదీ ఒకటే అనుకోవాలి. (లీ గురించి ఈనాడు మాత్రమె చూసినట్టు) ఆమె రాసిన వాటికి పూర్తిగా భిన్నంగా ఉన్న ఎన్నో ఫేస్బుక్ వ్యాఖ్యలు మీరు చదివి ఉండకపోవొచ్చు.

      ఆవిడ రాసిన వ్యాఖలో తప్పులు & రాయని (దాచిన?) నిజాల సూచీ చెప్తే చాంతాడు అవుతుంది. మీకు నిజంగా ఆసక్తి ఉంటె చెప్పండి, రాస్తాను.

      హిందూ న్యాయసూత్రాలలో మనుస్మ్రితి & కౌటిల్య అర్ధశాస్త్రం మించినదేదీ లేదు. తద్విరుధంగా ఉన్న సూత్రాలకు ఎటువంటి విలువ లేదు.

      కట్టిన పన్నులకు ప్రభుత్వ సదుపాయాల రూపంలో ప్రతిఫలం లభిస్తుంది తప్ప తరతరాలుగా శాశ్వత హక్కులు ఏర్పడవు. ఇలాంటి కాకమ్మ ఖబుర్లు చెప్పే రాజకీయ నాయకులు సగటు ఆంధ్రులను రెచ్చగొట్టారు. వారి బుట్టలో చదువుకున్న వారు పడడం దురదృష్టం.

      ఆంద్ర పెట్టుబడి పెట్టదు కొందరు ఆంధ్రులు పెడతారు. వారు లాభాన్ని ఆశిస్తారు (ఇందులో తప్పేమీ లేదు) కాని "తమ" ప్రాంత ప్రయోజనం కాదు (ఇదీ తప్పు కాదు). ఉ. రామోజీరావు పెట్టిన పెట్టుబడి ఫలితం ఆయనకు ముట్టింది. ఒకవేళ దీనివల్ల హక్కులు సంక్రమించినా అవి ఆయనవే కానీ ఆయన ఊరు/తాలూకా/జిల్లా/ప్రాంతం చెందినా ఇతరులకు కాదు.

      నాకు అనుబంధం ఉన్న ఊళ్ళన్నీ నా రాష్ట్రంలోనే ఉండాలనే మంకు సబబా? ఉ. నాకు బెంగుళూరు, విశాఖ, అనంతపురం, లండన్ & మ్యూనిక్ నగరాలంటే వల్లమాలిన అనుబంధం. ఇవేవీ తెలంగాణాలో లేనందుకు నాకు బెంగ ఎందుకు? నన్ను విశాఖ నుండి ఎవరూ విడదీయలేరు!

      దక్షిణ తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం కావాలని ఆ ప్రాంతం ప్రజలు కోరుకుంటే నేను తప్పకుండా సమర్తిస్తాను. చట్టబద్ధంగా ఉన్న ప్రజాస్వామ్య వెల్లువను అడ్డుకోవడానికి నేనెవరిని? నేను నా వ్యక్తిగత అజెండాలతో ప్రజాభీష్టాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించేంత దుర్మార్గుడిని కాను.

      వ్యక్తుల కృషి & పెట్టుబడికి ప్రతిఫలం ఇప్పటికే (ఎన్నోరెట్లు) ముట్టింది. ఆస్తులు & అప్పులు చట్టం ప్రకారం విభజించారు. ఇంకా ఏమి కావాలో ఏమో?

      ఆంధ్రులను దొంగలు అని ఎవరయినా అని ఉంటె అది తప్పే. అట్లాగే తెలంగాణా వాళ్ళు సోమరులని, తాగుబోతులని ఇంకా ఎన్నెన్నో అన్నవారిని మీరు సమర్తిస్తారా? కరుణశ్రీ అనే పేరుతొ కవిత్వం రాసే ఒక పెద్దమనిషి "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అంటూ గేలి చేసాడు. మా రాష్ట్రం మాకు కావాలన్న పాపానికి వేర్పాటువాదులు, తాలిబాన్లు అంటూ బిరుదులు ఇచ్చిన వారిని మీరు ఖండించరేం?

      మీకు ఆసక్తి ఉంటె నేను నదీ జలాల గురించి వేరే వ్యాఖ్యలో రాస్తాను. అందులో ఫేస్బుక్/బ్లాగు వ్యాఖ్యలు, ఏదో పత్రికలో వచ్చిన కథనాలు ఉండవని హామీ ఇస్తాను. పక్షపాత రహితులయిన నిష్ణాతులు/నిపుణులు చెప్పిన విషయాలు & ట్రిబ్యూనల్/కోర్టు తీర్పులు మాత్రమె ఉంటాయి.

      Delete
  9. లండన్ సంగతి అంటారా..మీరన్నట్లు భారతీయుల పన్నులతోనే లండన్ అభివృద్ధి చెంది ఉంటే ఆ విషయాన్ని చెప్పుకోవటంలో తప్పేముంది ?

    అయినా లండన్ ఎక్కడో విదేశాల్లో ఉంది. దానితో మనకు అనుబంధం ఏముంది?
    హైదరాబాద్ అంటే ఎప్పటినుంచో ఆంధ్రులకు సంబంధం ఉన్న ప్రాంతం...ఆధునిక కాలంలో కూడా ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి చేసుకున్న మన నగరం అనే మానసిక అనుబంధం.

    మన ప్రాంతం నుంచి మనం వేరుపడటం అనేది బాధను కలిగిస్తుంది కదా !
    ..........
    ఇక,భారతదేశానికి చెందిన సంపద విదేశాల్లో ఉండటం అనే విషయాన్ని గమనించితే..
    విదేశీయులు ఎంతో సంపదను తమ దేశాలకు తరలించుకుపోయారు. న్యాయంగా చెప్పాలంటే ఆ సంపదలో మనకు హక్కులు ఉంటాయి. అలా అంటే వాళ్లు ఒప్పుకోరు.

    బలవంతులు ఏం చెప్తే అదే న్యాయం అన్నట్లుగా ఎక్కువగా అమలు జరుగుతున్న ఈ రోజుల్లో బలహీనులకు అన్యాయం జరుగుతూనే ఉంది.

    అయితే, ఎప్పటికయినా న్యాయమే గెలుస్తుంది. దౌర్జన్యం చేసిన వాళ్లు ఎంత డబ్బున్నా మనశ్సాంతిని మాత్రం పొందలేరు.

    ReplyDelete
    Replies
    1. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. దీనికి సిసలైన ఉదాహరణ తెలంగాణా రాష్ట్ర అవ్విర్భావం!

      Delete

    2. 1956 కంటే పూర్వం ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ గురించి చూడాలంటే శాతవాహన, కాకతీయ పాలన గురించి చూడండి.
      నేను ఇచ్చిన లింక్ అడ్రస్ కాపీ , పేస్ట్ చేసి క్లిక్ చేస్తే చాలు ఆ లింకుకు వెళ్ళవచ్చు.

      మీరు చెప్పే విషయాలకు భిన్నంగా ఉన్న ఆర్టికల్స్ నేను కూడా చదివానండి. వాటి గురించి వ్రాయాలని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు వాటిని నమ్మరు కాబట్టి.

      పెట్టుబడిదారులు ఎక్కడివారైనా కావచ్చు. లాభం పెట్టుబడిదారులకే చెందినా కూడా..వాళ్లు పెట్టుబడులు పెట్ట్న ప్రాంతానికి రెవెన్యూ పెరుగుతుందన్నది కదా !

      నాకు అనుబంధం ఉన్న ఊళ్ళన్నీ నా రాష్ట్రంలోనే ఉండాలనే మంకు నాకు కూడా లేదు. మీరు ఎంత కాదన్నా తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలు వేరువేరు కాదు అన్నీ ఒకటే ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వేరు చేసారన్నది ఆంధ్రా వాళ్ళకు బాధను కలిగించే విషయమే.

      దక్షిణ తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం కావాలని ఆ ప్రాంతం ప్రజలు కోరుకుంటే మీరు తప్పకుండా సమర్ధిస్తారేమో. మరి అలా వేరుపడటానికి ఉత్తర తెలంగాణా వాళ్ళు ఒప్పుకోకుంటే మీరు ఎవరిని సమర్ధిస్తారు ?

      దక్షిణ తెలంగాణా వాళ్ళను సమర్ధిస్తే ఉత్తర తెలంగాణా ప్రజల అభీష్టాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. ఉత్తర తెలంగాణా ప్రజల కోరికను సమర్ధిస్తే దక్షిణ తెలంగాణా ప్రజల కోరికను వ్యతిరేకించినట్లు అవుతుంది కదా !

      నాకు తెలంగాణా వాళ్ళు...ఆంధ్రవాళ్ళు అనే పక్షపాతం లేదు.

      తెలంగాణా వాళ్ళు సోమరులని, తాగుబోతులని అన్నవారిని నేనూ సమర్ధించను. ఆంధ్ర వెనుకబడి ఉండటానికి ఆంధ్రాకు చెందిన నేతలు, పెట్తుబడిదారులు, ప్రజల నిర్లక్ష్యం కూడా కారణమని నేను రాసాను.

      తెలంగాణాలో సమస్యలు ఉండటానికి ఆంధ్రా వాళ్లు ఏ విధంగా కారణం ? తెలంగాణాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు ? అన్నది మీరూ అలోచించుకోవాలి.

      మీకు ఫేస్బుక్/బ్లాగు వ్యాఖ్యలు, ఏదో పత్రికలో వచ్చిన కథనాలు అంటే నమ్మకం లేనట్లుంది. గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకున వాళ్లలో కూడా కొందరు పక్షపాతంగా వ్యవహరించే వాళ్లు ఉంటారు.

      నా అభిప్రాయాల ప్రకారం మాట్లాడేవారు నాకు పక్షపాత రహితంగా అనిపించవచ్చు. మీ అభిప్రాయాల ప్రకారం మాట్లాడేవారు మీకు పక్షపాత రహితంగా అనిపించవచ్చు. ఎవరు పక్షపాత రహితులు ? అనే విషయాన్ని మీరు ఎలా నిర్ధారిస్తారు ?

      Delete
    3. శాతవాహనులు తెలుగు వారు కారు. మాజీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలు కాకతీయ, కుతుబ్షాహీ, విజయనగర & ఆసఫ్జాహీ పాలనలో లేవు.

      మీరు నేను చెప్పే విషయాలకు భిన్నంగా ఉన్న వ్యాసాలు చదివారన్నది నాకూ తెలుసు. మీరు *మీరు చెప్పే విషయాలకు* భిన్నంగా వ్యాసాలు కూడా చదివారా అన్నదే నా ప్రశ్న. ఒకవేళ చదివి ఉంటె వాటిని ఎందుకు ఒప్పుకోలేదు అన్నది రెండో ప్రశ్న. మన మనోభావాలకు దగ్గరగా ఉన్నవాటిని ఒప్పుకోవడం, కాని వాటిని తిరస్కరించడం ఆత్మదగా, కాదంటారా?

      పెట్టుబడిదారుడికి తన లాభం ముఖ్యం. ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం హెచ్చొ అక్కడే పెడతాడు. ఇది ప్రాధమిక ఆర్ధిక సూత్రం. ఇందులో సదరు వ్యక్తి ప్రాంతానికి ప్రమేయం లేదు.

      నేను నాకు నచ్చని వాటిని నమ్మనని కొట్టిపారేయకండి. వ్యాసంలో సత్తు ఉంటె తప్పక నమ్ముతాను.

      నేను తెలంగాణావాదులు రాసే ప్రతి మాటను గుడ్డిగా ఒప్పుకుంటానని మీరు అనుకుంటే అది వాస్తవం కాదు. విషయజ్ఞానం ఉన్న వారు సొంత పరిశోధన చేసి రాసినవి మాత్రమె స్వీకరణయోగ్యం అనేది నా అభిమతం. ఇకపోతే పక్షపాతం అనేది వివాదంతో సంబంధం లేని జాతీయ/అంతర్జాతీయ నిపుణులకు ఉండే అవకాశం తక్కువ.

      నేను నా బ్లాగులో రాసిన టపాలలో ఒక్కసారి కూడా తెలంగాణావాదుల వాదనలు వాడలేదని మనవి. ప్రతిచోటా నిపుణులు/న్యాయస్థానాల తీర్పులు ప్రస్తావించాను తప్ప ఫేస్బుక్/పత్రికలు/బ్లాగులు నుండి ఒక్క విషయాన్ని రాయలేదు.

      మీరు ఎంత కావాలన్నా ఆంద్ర తెలంగాణాలు వేర్వేరు. అవి ఒక్కటని ఆంధ్రులు అనుకుంటే సరిపోదు. తెలంగాణా వారు ఒప్పుకోకుండా ఉండడం "బలవంతపు ఐక్యత" అవుతుందే తప్ప సమైక్యం కాదు.

      ఒకవేళ దక్షిణ తెలంగాణా ఉద్యమం జరిగితే దక్షిణ తెలంగాణా అభీష్టానికి ఉత్తర తెలంగాణా కలిసి ఉండాల్సిందే అన్న మంకుకు పోటీ లేదు. అవతలి వారు మాతోనో ఉండాలనే హక్కు ఉత్తర తెలంగాణాకు లేదు. ఉత్తర తెలంగాణా వారి ఒప్పుకోలు/అనుమతి అనవసరం, అసంబద్దం & అహంకారానికి ప్రతీక.

      తెలంగాణా సమస్యలకు మా నాయకుల (అందరూ కాదు) చేతికానితనం తప్పక ముఖ్య కారణం. నీళ్ళలో, నిధులలో, ఉద్యోగాలలో అన్నింటా (ఒప్పందాలకు విరుద్దంగా) ఆంధ్రకు పెద్దపీట వేసినా దద్దమ్మల్లా ఊరుకున్నారు. చివరికి మా భాష & సంస్కృతి అపహాస్యం అయినా తిరగబడలేదు.

      Delete
    4. ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.

      మాజీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా భాగం కాకతీయ, కుతుబ్షాహీ, విజయనగర & ఆసఫ్జాహీ పాలనలో ఉంది.శాతవాహనుల పాలనలో అయితే పూర్తి ఆంధ్రప్రదేశే కాక, భారతదేశంలోనే చాలా భాగం ఉంది.

      నేను అన్నిరకాల వ్యాసాలూ చదువుతాను. నా మనోభావాలకు దగ్గరా? దూరమా ? అన్నది ముఖ్యం కాదు. ఏది న్యాయమో అదే నాకు ముఖ్యం. అయితే చరిత్రలో చాలాసార్లు వక్రీకరణలు కూడా ఉంటాయి.ఎవరు వ్రాసింది సరైనదో మనం చెప్పలేం.

      నేను నాకు నచ్చని వాటిని నమ్మనని కొట్టిపారేయకండి. వ్యాసంలో సత్తు ఉంటె తప్పక నమ్ముతాను. (నేను కూడా అంతే.)
      నిపుణతకు పక్షపాతానికి సంబంధంలేదన్నది నా అభిప్రాయం.

      ఫేస్బుక్/పత్రికలు/బ్లాగులు నుండి ఒక్క విషయాన్ని మీరు నమ్మలేనప్పుడు.. మీరూ బ్లాగు వ్రాస్తున్నారు .మీ బ్లాగులో రాసే విషయాలను ఇతరులు ఎలా నమ్మాలి?

      ఉత్తర తెలంగాణా వారి ఒప్పుకోలు/అనుమతి అనవసరం, అసంబద్దం & అహంకారానికి ప్రతీక...అనటం సరైనది కాదు. ఉత్తర తెలంగాణా వాళ్ళూ ఈ దేశపు ప్రజలే. ప్రజాభీష్టాన్ని మన్నించాలని మీరే అన్నారు కదా! వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకూ ఉంటాయి. మీ అభిప్రాయం ప్రకారమే వాళ్ళ అభిప్రాయాలూ ఉండాలా? కలసి ఉంటామనటం నేరమేమీ కాదుకదా !

      ఆంధ్రా సమస్యలకు మా నాయకుల (అందరూ కాదు) చేతికానితనం తప్పక ముఖ్య కారణం. అభివృద్ధిలో ఆంధ్రాను విస్మరించి కేవలం హైదరాబాద్కే పెద్దపీట వేసినా దద్దమ్మల్లా ఊరుకున్నారు. ఆంధ్ర వాళ్లను తిడుతున్నా సహించారు.

      Delete
  10. అయిపోయారు! జన్మకి మీరు మరో టపా రాయలేరు.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారూ ....పైన రాసిన విషయాలను నిదానంగా గమనించండి. మీరు అనుకున్నట్లు , పైన రాసిన టపా తెలంగాణాకు సంబంధించినది కాదు.

      ఎన్నికల సమయంలో కేంద్రంలో పార్టీలు చేసిన వాగ్ధానాల గురించి నేను టపా వ్రాస్తే Jai Gottimukkala గారే టపాకు సంబంధం లేకుండా చంద్రబాబు గారు ఎన్నికలలో చేసిన వాగ్ధానాల ప్రస్తావన తెచ్చారు. అలాఅలా చర్చ ఇంతవరకూ వచ్చింది.

      ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాగ్ధానాల సంగతి గురించి ఆంధ్రావాళ్లు ఆలోచించుకుంటారు, తెలంగాణాలో ఎన్నికల సమయంలో నిరుద్యోగసమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీల సంగతి ఏమయ్యిందో ? తెలంగాణా వాళ్లు చూసుకుంటే బాగుంటుంది.

      Delete
    2. తెలంగాణా అధికార పార్టీ తన మానిఫెస్టోలో నిరుద్యోగ సమస్య గురించి ఏమి చెప్పిందండీ?

      Delete
    3. కొత్త విద్యుత్ సంస్థల స్థాపన ద్వారా లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు మీకు తెలిసే ఉంటుంది.

      Delete
    4. ఈ చర్చను ఇప్పటికి ఆపివేస్తే బాగుంటుందనుకుంటున్నాను.

      Delete
  11. తెరాస మానిఫెస్టోలో 34 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో ఉపాధి కల్పన అనే చాప్టర్ లేదు.

    విద్యుత్ రంగానికి సంబందించిన చాప్టర్ 8-9 పేజీలలో ఉంది. ఇందులో మీరు చెప్పిన లక్ష ఉద్యోగాల ప్రస్తావన నాకయితే అగుపించలేదు.

    మీరు మానిఫెస్టోలో ఎక్కడ ఈ విషయం ఉందొ చెబితే నేనూ చూస్తాను.

    చర్చ ఆపడానికి నాకు ఒకే కానీ ఒకే ఒక్క ప్రశ్నకు జవాబ్ ఇస్తే బాగుంటుంది: మీరు సదరు మానిఫెస్టో చదివారా?


    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాలు మీవి..నా అభిప్రాయాలు నావి.

      ఇలాంటి పరిస్థితిలో చర్చ ఎంత కాలం జరిగినా అంతులేని కధలా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు చర్చ ఆపటమే మంచిది.

      రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది.ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి.
      ...........
      మీరు అడిగిన విషయం విద్యుత్ రంగానికి సంబందించిన చాప్టర్ లో ఉంది.

      Delete
  12. శభాష్ anrd గారు ధీటైన సమాధానం. చెప్పారు. విద్యుత్ రంగం అనే ఛాప్టర్ హెడింగ్ కిందనే ఉన్న బులెట్ పాయింట్స్ లోనే లక్ష ఉద్యోగాల హామీ వున్నా కూడా ఈయనకి కనిపించినట్లులేదు సరి కదా మానిఫెస్టో చదివారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. వాహ్! అయినా, ఏ చర్చనయినా తెలంగాణా ఆంధ్రా వివాదం గా మళ్ళించగల ప్రజ్ఞావంతులతో ఎందుకండీ వృధా ప్రయాస? టైము దండగ కదా.

    ReplyDelete
    Replies
    1. వ్రాసిన విషయం బాగుందన్నందుకు మీకు కృతజ్ఞతలండి.

      నేను ఈ మాత్రం వ్రాయగలిగానంటే.. అంతా దైవం దయ.

      Delete
    2. ఇక్కడ ఒకరు వ్రాసిన వ్యాఖ్య ఉండేది. అది పొరపాటున డిలీట్ అయింది.
      అలా జరిగినందుకు వారు దయచేసి నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను.

      Delete
  13. కొన్నిసార్లు హడావిడిగా ఏదైనా వెతుకుతుంటే మన కళ్లముందే ఆ వాక్యాలు ఉన్నాకూడా వాటిని గమనించకపోవటం కూడా జరుగుతుంటుంది.
    బహుశా Jai Gottimukkala గారు హడావిడిగా మానిఫెస్టో చదవటం వల్ల కూడా, విద్యుత్ రంగం ఛాప్టర్లో ఉన్న విషయాలను సరిగ్గా గమనించి ఉండకపోవచ్చు ?
    ..................................................

    ReplyDelete
    Replies
    1. నా దగ్గర ఉన్న (మెయిల్ ద్వారా అందిన) మానిఫెస్టోలో ఈ విషయం లేదండీ. ఇప్పుడే వారి సైటులో చూసాను. సమాచారానికి థాంక్సండీ.

      కొత్తగా భారీ విద్యుత్ కేంద్రాలు పెడితే పారిశ్రామిక రంగానికి పురోగతి & తద్వారా ఉపాధి జరుగుతుంది. అయితే వీటికి 3-4 ఏళ్ళు పట్టొచ్చు. పైగా వారు ఈ లక్ష అనే సంఖ్య ఎలా వచ్చిందో ఆధారాలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి నాకు పెద్దగా నమ్మకం లేదు.

      Delete
  14. Very gracious of you to say so (your 10.31 pm comment / response above).

    ReplyDelete
  15. Here is the comment,don't delete it
    బ్లాగు : aanamdam
    Anonymous
    Well done గొప్పగా సమాధానమిచ్చారు, ఇక ఈయనతో మాటడటం వేస్ట్ అని తేలిపోయింది కదా! ఇంకెప్పుడూ ఈయనకి సమాధానం ఇవ్వకండి.

    ReplyDelete
  16. ఏం జరిగిందంటేనండి, మీ వ్యాఖ్యకు రిప్లై వ్రాసిన తరువాత..కొద్దిగా సవరణ చేయాలనిపించి రిప్లై ని డిలీట్ చేస్తుంటే..రిప్లై తో పాటు మీరు వ్రాసిన వ్యాఖ్య కూడా డిలీట్ అయిపోయింది.
    ..........
    వ్రాసిన విషయం బాగుందన్నందుకు మీకు కృతజ్ఞతలండి.

    నేను ఈ మాత్రం వ్రాయగలిగానంటే.. అంతా దైవం దయ.

    ReplyDelete