koodali

Monday, April 20, 2015

రేపు అక్షయ తృతీయ...

 
అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు. 
.....................

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

 అక్షయ తృతీయ సందర్భంగా.. మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే మంచిదని పెద్దలు  తెలియజేసారు. 

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి  జరుగుతుందని,   ఆహారం,   గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు. 
................

 అయితే  ఈ రోజుల్లో, దానం చేసే ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 
..........

 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర    వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.
..............

ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.
 ............. 

 అంతా బాగుండాలి. అంతా దైవం దయ.


3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. తప్పు దొర్లినందుకు మళ్ళీ రాస్తున్నాను, మన్నించండి

      అక్షయ త్రితియ నాడు మీకు మీ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను.

      ఇదే రోజు బసవజయంతి కావడం అదృష్టం. ఈ మహాసంస్కర్త & పండితుడి బోధనలు ప్రజలలో ప్రాచుర్యం చెందాలని తద్వారా దేశ ప్రజలలో సామరస్యం & సద్భావన పెరగాలని ఆశిస్తాను.

      Delete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మన్నించటం..అనే పెద్దమాటలు ఎందుకులెండి.

    అక్షయ త్రితియ నాడు మీకు మీ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను.

    మహాసంస్కర్త & పండితుడు అయిన బసవన్న బోధనలు ప్రజలలో ప్రాచుర్యం చెందాలని తద్వారా దేశ ప్రజలలో సామరస్యం & సద్భావన పెరగాలని ఆశిస్తాను.

    అక్షయ త్రితియ నాడు అందరికి మేలు జరగాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete