koodali

Friday, November 29, 2013

సరిదిద్దే ప్రయత్నం చేసేవాళ్ళు గొప్పవారు.


పూర్వం  రోజుల్లో  చెరువులలో  నీరు  తగ్గితే    చేపలు  ఒడ్డుకు  కొట్టుకు  వచ్చేవి.

 ఈ  రోజుల్లో  అయితే  చెరువుల్లో  నీరు  తగ్గుముఖం  పడితే  చేపలకు  బదులు  ప్లాస్టిక్  కవర్లు    ఒడ్డుకు  తేలి  వచ్చి  కుప్పలుగా  పడి  ఉంటున్నాయి. 

ఈ  ప్లాస్టిక్  త్వరగా   భూమిలో  కలిసిపోదన్న  విషయం  చాలామందికి  తెలుసు.  అయితే  నీటిలో  పడినా  ఆ  నీరు  కలుషితం  అవుతుందంటున్నారు. 


 ఇక  ఎలెక్ట్రానిక్  చెత్త   మరియు  పరిశ్రమలు  వదిలే  వ్యర్ధాలు  వంటి  వాటివల్ల   వల్ల  కూడా  నేల,  నీరు  కలుషితం  అవుతున్నాయట. 

 వీటన్నింటి  ఫలితంగా  విషవాయువులు  వెలువడి  ,  భూమిపై  ఉష్ణోగ్రతలు  పెరిగి  ధ్రువ  ప్రాంతాలలో  మంచు  కరగటం  మొదలయ్యిందట.....ఇలా   ఎన్నో  నష్టాలు  జరుగుతున్నాయని  ఎందరో   శాస్త్రవేత్తలు  కూడా  బాధపడుతున్నారు.  


ప్లాస్టిక్  కనుగొని  ప్రపంచానికి  పరిచయం  చేసేటప్పుడు  ప్లాస్టిక్  గురించిన  లాభాలే  తప్ప  నష్టాల  గురించి   శాస్త్రవేత్తలకు  తెలిసి  ఉండకపోవచ్చు. 


ఎంత  శాస్త్రవేత్తలు   అయినా   ముందే  అన్నీ   ఊహించలేరు   కదా  !

ఆధునిక  ఆవిష్కరణలలో  కొన్ని  ప్రపంచానికి  హానికరంగా  పరిణమించాయి. ఈ  మాట అంటే  కొందరికి   కోపం  వస్తుంది. ( అయితే  అందరికి  కోపం  రాదు  లెండి.) 
 
 
కొన్ని  ఆవిష్కరణల  వల్ల   జరుగుతున్న   హాని  గురించి   కనిపెట్టి    ప్రపంచానికి   తెలియజేస్తూన్న  శాస్త్రవేత్తలు  ఎంతో  గొప్పవారు.

భేషజాలకు   పోకుండా, పొరపాట్లను   సరిదిద్దే  ప్రయత్నం  చేస్తున్న  ఇలాంటి  గొప్ప
శాస్త్రవేత్తలకు  చేతులెత్తి  నమస్కరించాలి .
 


4 comments:

  1. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. ప్రతి కొత్త ఆవిష్కరణకీ మంచి చెడ్డ ఉంటాయి. మనం దురుపయోగం చేసుకోడమే నేర్చుకుంటున్నాం. మన నెత్తిన మనమే దుమ్ము పోసుకుంటున్నాం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, ఈ రోజుల్లో దురుపయోగం ఎక్కువగా జరుగుతోంది.

      Delete