koodali

Wednesday, November 27, 2013

ఇతర గ్రహాలపై ఇంధనాలు, ఖనిజాలు....


ఇతర  గ్రహాలపై   ఇంధనాలు,  ఖనిజాలు  ఉన్నాయంటున్నారు.  అక్కడ    ఏమి   ఉన్నా  మనకేమిటి  లాభం  ? ఇతర  గ్రహాల  నుంచి  ఇంధనాన్ని  తెచ్చి  వాడుకోవాలంటే  చాలా  డబ్బు  ఖర్చవుతుంది.   

ఇతర  గ్రహాల  నుంచి  ఖనిజాలను  భూమి  పైకి  తెచ్చి   వస్తువుల  తయారీలో  వాడితే  అలా  తయారైన   వస్తువు   ఖరీదు  ఎంతో    ఎక్కువగా  ఉంటుంది  .  అంత  ఖరీదైన   వాటిని  ఎవరు  కొనగలరు  ?  


ఎంతో  డబ్బు  ఖర్చు  పెట్టి  ఇతర  గ్రహాల  పైకి  వెళ్ళి  అక్కడ  కృత్రిమ  వాతావరణం  సృష్టించి  ప్రజలు  నివాసం  ఉండాలనే  ఆలోచనలు   ఎందుకు  ?  అంత  డబ్బే  ఉంటే  భూమి  మీదే  ఎన్నో  సౌకర్యాలు  ఏర్పరుచుకోవచ్చు  కదా  !


దైవం   మనకు   ప్రసాదించిన  చక్కని  గాలి,  నీరు,  చక్కటి  వాతావరణం,  పచ్చని  చెట్లు,  పువ్వులు,  పండ్లు  .......అన్నీ  ఉన్న  భూమిమీదే  హాయిగా  జీవించటం    చేతకాక   ఎన్నో  సమస్యలను  సృష్టించుకుంటున్నాము.


ఇక  గాలి,  నీరు,  ఇవన్నీ  లేని  గ్రహాల  మీద  కెళ్ళి  ఎంతో  డబ్బును  ఖర్చుపెట్టి   కృత్రిమ  వాతావరణాన్ని  సృష్టించటం   అవసరమా ?


భూమిపై  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  దేశాలకు   ఇదంతా  అవసరమా ?   అనిపిస్తుంది.  కడుపు  నిండిన  తరువాతే  విజ్ఞానమైనా,  వినోదమైనా.


అభివృద్ధి  చెందిన  దేశాలు   అని  మనం  భావిస్తున్న   చాలా   దేశాలు   కూడా    ఇప్పుడు  ఆర్ధిక ,  నిరుద్యోగ   సమస్యలతో  సతమతమవుతున్నాయి.  


 దేశాల  మధ్య   ఈ  పోటీ  లేకపోతే  ఆ  డబ్బుతో  ప్రజల   ఆర్ధిక  పరిస్థితిని   చక్కదిద్దవచ్చు.  


తోటి  వాళ్ళు  తొడకోసుకుంటే  మనం  మెడ  కోసుకోవాలనే  ఆరాటం  ఎందుకు  ?


 విజ్ఞానం  అనేది  ప్రజల  కనీస అవసరాలన్నా    తీరటానికి  ఉపయోగపడితే  చాలా  బాగుంటుంది.


 

No comments:

Post a Comment