Wednesday, December 25, 2013
Monday, December 23, 2013
గ్రంధాలలోని విషయాలు నిజమని ....
ప్రియవ్రతుడి కాలంలో భూమిపై సప్తసముద్రాలు ఏర్పడ్డాయని, భూభాగం సప్త ద్వీపాలుగా విభజింపబడిందని శ్రీ దేవీ భాగవతము గ్రంధము ద్వారా తెలుస్తోంది.
ఒకప్పుడు భూమిపై ఖండాలు కలిసి ఉండేవని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. దానికి గోండ్వానాలేండ్ అని పేరు పెట్టారు.
కాలక్రమంలో భూమి క్రింది పలకలు కదలటం వంటి పరిణామాల వల్ల గోండ్వానాలేండ్ మార్పులు చెందటం మరియు మరికొన్ని చిన్న చిన్న ద్వీపాలు ఏర్పడటం జరిగిందేమో ?
అయితే, ఇప్పుడు కూడా మనము భూమిపై ఏడు ఖండాలు, ఏడు సముద్రాలు ఉన్నాయని అంటున్నాము .మరి, గ్రంధాలలోని విషయాలు నిజమని నిరూపితమయ్యాయి కదా !
పూర్వీకులు తెలియజేసిన మరికొన్ని వివరములను గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్స్ వద్ద చూడవచ్చు.
* Yuga - Wikipedia, the free encyclopedia
Friday, December 20, 2013
సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి ..
పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు.. కానీ, ఇలాంటివి సమాజంలో వ్యాపించటానికి కారణం ప్రజలే.....
ఒకరిని చూసి ఒకరు అనుకరించే ప్రజల ప్రవృత్తే.
పూర్వం రాజుల కాలంలో శత్రురాజుల దండయాత్రల వల్ల, రాజు, రాజ్యం శత్రురాజుల అధీనంలోకి వెళ్ళినప్పుడు రాణి మొదలైన స్త్రీలు , శత్రు రాజుల చేతికి చిక్కకుండా తామే ఆత్మార్పణం చేసుకునేవారు.
భర్త చనిపోతే తట్టుకోలేని కొందరు స్త్రీలు తమకు తామే సహగమనం చేసేవారు.
భర్త పోయిన స్త్రీల జీవితం కష్టంగా ఉంటుందని భావించిన కొందరు స్త్రీలు కూడా తమకు తామే సహగమనం చేసేవారు.
ఇలా కొందరు తమ ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం వల్ల, ఇక కాలక్రమేణా అది ఒక ఆచారంగా మొదలయి ఉంటుంది. అంతేకానీ , పెద్దలు సతీసహగమనం వంటి ఆచారాలను ప్రోత్సహించలేదు .
* ఉదా ......రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !
* భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చేయలేదు.
* తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం చేయలేదు కదా!
* అంటే , ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.
* పాండురాజు చనిపోవటానికి తానూ కారణమని భావించిన మాద్రి తన ఇష్టంతోనే సహగమనం చేసింది. ...(..తన సంతానమైన నకుల, సహదేవుల సంరక్షణను కుంతీదేవికి అప్పగించి ..... )
ఇలా ....మరి కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ,........
.....ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.
అంతేకాని, భర్త మరణించిన స్త్రీలందరూ సహగమనం చేయాలి ..అనేది పెద్దల అభిప్రాయం కాదని గ్రంధాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.........
....................................
ఇతరులను గుడ్డిగా అనుకరించటం గురించి పెద్దలు ఒక కధ చెబుతారు..
ఒక సాధువు నదిలో స్నానం చేయటానికి వచ్చి , నది ఒడ్డున ఒక చిన్న గొయ్యి తవ్వి తన కమండలాన్ని అందులో దాచి పెడతాడు. ( భద్రత కోసం. ) దాచిపెట్టిన ప్రదేశానికి గుర్తుగా దాని పైన ఇసుకను గోపురం ఆకారంలో కుప్పగా పోసి స్నానానికి నదిలోకి వెళ్తాడు.
ఇదంతా దూరం నుంచి చూసిన భక్తులు కొందరు , సాధువు చేసినట్లు ఇసుకను గోపురం ఆకారంలో తయారుచేస్తే పుణ్యం వస్తుందని భావించి, తామూ అలా చేయటం మొదలుపెడతారు,
( సాధువు అలా ఎందుకు చేసారో అసలు విషయం వాళ్ళకు తెలియదు. )
ఇలా ఒకరిని చూసి ఒకరు చేయటం వల్ల , నది ఒడ్డున చాలా ఇసుక గోపురాలు తయారవుతాయి. సాధువు స్నానం చేసి ఒడ్డుకు తిరిగి వచ్చి తన కమండలం కోసం చూసేసరికి ,
ఇంకేముంది.... ఎన్నో గోపురాలు కనిపిస్తాయి. ఆలోచించగా..... ఆయనకు విషయం అర్ధమయి , ఇక చేసేదేమీ లేక కమండలం లేకుండానే ఉత్తచేతులతో తిరిగి వెళతారు.
సాధువు తన కమండలం యొక్క భద్రత కొరకు గోపురం చేస్తే , ఆ విషయం తెలియని మిగతావారు అనుసరించినట్లుగా......
కొన్ని విపరీత ఆచారాలు కూడా పెద్దలు ఏర్పరిచినవి కాదు. వాటికవే సమాజంలో మొదలయ్యి మూఢాచారాలుగా పాతుకుపోయి ఉండవచ్చు..
వారి అభిప్రాయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకుంటారు.
Wednesday, December 18, 2013
ఆడపిల్లలే పుట్టారని బాధపడవద్దు.
మనలో చాలా మంది మగపిల్లలు పుడితే చాలా సంతోషిస్తారు. అదే ఆడ పిల్లలు పుడితే చాలా బాధపడతారు.
దీనివల్ల ఎన్నో కుటుంబాలలో సమస్యలు వస్తున్నాయి.
నాకు ఏమని అనిపిస్తుందంటేనండి,సీతాదేవికి తండ్రి అయిన జనకమహారాజు వారికి స్త్రీ సంతానము కదా!
జనకమహారాజు ఎంతో గొప్పవారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే వారికి కుమార్తెగా అవతరించటం జరిగింది. ఈ విషయాన్ని గమనిస్తే జనకులవారు భగవంతుని కృపను ఎంతగా పొందారో తెలుస్తోంది.
జనకులవారు నిష్కామ కర్మ యోగిగా జీవించిన మహాత్ములని , అలా వారు భగవంతుని కృపకు ఎంతగానో పాత్రులయ్యారని, పెద్దలు చెబుతారు.
కొంతమంది.. పుత్రులవల్లనే పున్నామ నరకం తప్పుతుందని అనుకుంటూ, తమ కుటుంబములలో కలతలు సృష్టించుకుంటున్నారు.
అసలు ఎవరైనా, సంతానము లేనివారుకూడా భగవంతుని పుత్రునిగా, పుత్రికగా కూడా భావించవచ్చు. భావనలోనే ఎంతో ఉందని పెద్దలు చెబుతున్నారు.
ధర్మమును, భక్తిని కలిగినంతలోనే భగవంతుడు ఎందరినో అనుగ్రహించిన కధలు ఎన్నో మనకు తెలుసు. పుత్రులు లేనివారిని, అసలు సంతానమే లేనివారిని కూడా దైవం తప్పక అనుగ్రహిస్తారు.
వివాహం చేసుకున్నాకూడా సంతానాన్ని పొందని భక్తులు కూడా ఉన్నారు.వీరికి సంతానం లేకపోయినా దైవకృపను అపారంగా పొందారని వీరి జీవితకధల ద్వారా తెలుస్తుంది.
పై విషయాలను గమనించితే ఏమని తెలుస్తుందంటే..ఎవరికైనా వారి ప్రవర్తన ఆధారంగానే భగవంతుని దయ ఉంటుంది కానీ, వారికి సంతానమున్నదా ? లేదా? సంతానము ఉంటే ఆడపిల్లలా ? మగపిల్లలా ? ఇలాంటి వాటి పైన ఆధారపడి మాత్రమే భగవంతుని దయ, స్వర్గం, నరకం ఇత్యాదులు ఉండవు...అని తెలుసుకోవచ్చు.
Monday, December 16, 2013
ఓం.....అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .
శ్రీ అనఘాదేవీ శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.
శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారికి నమస్కారములు.
దిగంబర ! దిగంబర !! శ్రీ పాదవల్లభ దిగంబర !!!
శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే .
శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి దివ్య సిద్ధమంగళ స్తోత్రము ఎంతో శక్తివంతమైనది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి గురించిన ఎన్నో వివరములు మరియు ఎంతో శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .....
ఈ లింకులో ఉన్నాయి....1.Sripada Charitamrutam - Sripada Sri Vallabha - 1 - Webs
Siddhamangala Stotram - Sripada Sri Vallabha - 1 - Webs
Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube
Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube.
ధనుర్మాసం ప్రారంభమైనది. తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి.
Friday, December 13, 2013
లోక కళ్యాణం కోసమే.....
పురాణేతిహాసాలు ఎంతో గొప్పవి. ఆ కధల ద్వారా లోకానికి ఎన్నో విషయాలను నేర్పించటం అన్నది పెద్దల అభిప్రాయం.
సామాన్యంగా లోకంలో ఎవరైనా తాము పొరపాట్లు చేసినప్పుడు ఆ విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు. ఆ పొరపాట్లను దాచేసి తాము చేసిన గొప్ప పనులనే లోకానికి తెలియజేస్తారు.
కానీ పురాణేతిహాసాలలోని గొప్పవారు చేసిన పొరపాట్లు దాచకుండా కధల ద్వారా లోకానికి చెప్పబడ్డాయి. ఆ కధలను తెలుసుకుంటే పుణ్యం వస్తుందని , వాటిని తప్పనిసరిగా తెలుసుకోవాలని కూడా పెద్దలు చెప్పటం జరిగింది.
దీన్ని బట్టి చూస్తే మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ....దేవతలు చేసే పొరపాట్లు, పొందే శాపాలూ లోకకళ్యాణం కోసమేనని. . వారి కధల ద్వారా ప్రజలకు ధర్మాధర్మాల గురించి తెలియచెప్పటానికి వారలా జీవితమనే కధలలో పాత్రధారులయ్యారు . అనిపిస్తుంది.
ఉదా. ...ఇంద్రుడు పొరపాటు చేయటం వల్ల స్వర్గాధిపత్యాన్ని వదిలి కష్టాల పాలవటం గురించి గ్రంధాలలో ఉంది కదా ! ఇవన్నీ చూస్తే ...
ఎంత గొప్పవారైనా సరే పొరపాటు చేసినప్పుడు వాటికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అని తెలుస్తుంది.
పురాణేతిహాసాల ద్వారా .... జీవితంలోని ఎన్నో కోణాలను , భిన్న మనస్తత్వాలనూ తెలుసుకోవటానికి వీలవుతుంది.
ద్రౌపది విషయానికి వస్తే ఆమె తనకు తాను కావాలని అయిదుగురిని వివాహం చేసుకోలేదు కదా ! అలా జరిగిందంతే.
ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఎన్నోసమస్యలు ఎదురవుతాయి.
ద్రౌపది పంచపాండవుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర..... కొంత కొంతకాలం చొప్పున ఉండటం జరిగిందట. ఆమె ఒక భర్త వద్ద ఉన్నప్పుడు మిగతా భర్తల ఇంటి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు ? ఇవన్నీ చాలా చిత్రమైన సున్నితమైన విషయాలు. ఇలాంటి ఒక సందర్భంలో అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళవలసి వచ్చింది కూడా.
ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఉండే సున్నితమైన కష్టాలు , ఎన్నో ఇబ్బందులను ద్రౌపది పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు .
రామాయణంలో కూడా కైకేయి వరాలు అడగటం వల్ల సీతారామ లక్ష్మణులు వనవాసం చేయవలసి వచ్చింది. అలాంటి వరాలు అడకకుండా ఉంటే కధ మరోలా ఉండేదేమో ?
ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల .....అలా చేసుకున్న వారి సంతానం కష్టాలు అనుభవించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
సీతారాములు కష్టాలను అనుభవించినా వారి సంతానం చక్కగా ఉన్నారు..
భారతంలో శంతనుడు తన పెద్ద కుమారుడైన భీష్మునికి వివాహం చేసి రాజ్యాన్ని అప్పగించినట్లయితే కధ వేరేగా ఉండేదేమో ? అనిపిస్తుంది.
ఆదిమ కాలమైనా, ఆధునిక కాలమైనా మనుషుల్లో కొన్ని లక్షణాలు మారవు. ఉదాహరణకు ....తన భార్య ఇంకో వివాహం చేసుకుంటే ఏ భర్తా సహించలేడు. అలాగే తన భర్త ఇంకో వివాహం చేసుకుంటే ఏ భార్యా సహించలేదు.
ఇలా ఎక్కువ వివాహాలు చేసుకున్నప్పుడు పెద్దల మధ్య అసూయల వల్ల వారి పిల్లలకు కష్టకాలం దాపురిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కేసులు వింటూనే ఉన్నాము.
పిల్లల సంతోషం గురించి ఆలోచించి అయినా పెద్దవాళ్ళు తాము ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు.. కష్టమో సుఖమో ఒక్క వివాహం చాలు. ( ఒక్క వివాహం వల్ల బాధ్యతలు పెరగకుండా ఉంటాయి.( కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ,)
పనిలో పనిగా రామాయణ, భారత ఇతివృత్తాలలోని పాత్రల ద్వారా లోకానికి ఎన్నో విషయాలనూ నేర్పించటమూ జరుగుతుంది అనిపిస్తుంది.
దైవం తలచుకుంటే రావణాసురుని వంటి రాక్షసులను చంపటం పెద్ద పనేమీ కాదు. అందుకోసం సీతారాముల వనవాసం, సీతాపహరణం, ఇవన్నీ జరగనవసరం లేదు.
అయితే కధలను ఇలా నడిపించటం వల్ల ( రామాయణ, భారత ) కధలలో వచ్చే ఎన్నో పాత్రలు , ఎన్నో సంఘటనలు ..వాటినుంచి లోకానికి ఎన్నో విషయాలు తెలియజెప్పటం జరుగుతుంది అనిపిస్తుంది.
ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి.
Wednesday, December 11, 2013
పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కటి దిశానిర్దేశం.....శకుంతల,కుంతీదేవి ..
పురాణేతిహాసాలలోని పాత్రలను కొందరు అపార్ధం చేసుకుంటారు. అంత గొప్ప వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసారు కదా ! అంటారు. నిజమే , గొప్పవారు అయినా కొన్నిసార్లు పొరపాట్లు చేసే అవకాశం ఉంది.
ఇతరులు చేసిన గొప్పపనులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇతరులు చేసిన పొరపాట్ల నుంచి మనం పాఠాన్ని నేర్చుకోవాలి.
( మనం అలాంటి పొరపాట్లు చేయకూడదనే పాఠాన్ని నేర్చుకోవాలి. )
..........................................
సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు.
ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.
ఇప్పుడు సమాజంలో చూడండి ........ ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.మంచివారూ ఉన్నారు ........ చెడ్డవారూ ఉన్నారు.
మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా ,
దైవం, పెద్దలు ... పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా.....ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , .......ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో .......మనకు చక్కటి దిశానిర్దేశం చేశారు అనిపిస్తుంది.
అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.
...........................................
పురాణేతిహాసాలలోని పాత్రల నుంచి మనం ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవచ్చు.
ఉదా...వివాహం కాని అమ్మాయిలు ఉన్న తల్లితండ్రులకు కొంత భయం ఉంటుంది. అమ్మాయికి జాగ్రత్తలు చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియక మొహమాటంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు శకుంతలదుష్యంతుల కధను అమ్మాయికి తెలియజేస్తే ,
తల్లితండ్రులకు తెలియకుండా రహస్య వివాహాలు చేసుకుంటే కలిగే ఇబ్బందులు వంటి వాటిని శకుంతల పాత్ర ద్వారా తెలుసుకుని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.
........................................
కుంతీదేవి కధను తెలుసుకోవటం ద్వారా పిల్లలు, పెద్దలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కుంతీదేవి సహనంతో, దృఢత్వంతో జీవించటం జరిగింది.
కుంతీదేవి వ్యక్తిత్వంలోని సహనం, దృఢత్వం వంటి ఎన్నో గొప్ప విషయాలను మనము నేర్చుకోవచ్చు.
అయితే తెలిసితెలియని చిన్నతనంలో , మహర్షి ప్రసాదించిన వరాన్ని పరీక్షించకోరిన సందర్భములో సంభవించిన కర్ణజననం , లోకోపవాదానికి భయపడి కర్ణుని వదిలిపెట్టడం వంటి సంఘటనల వల్ల కుంతీదేవి జీవితాంతం వరకు మానసిక క్షోభను అనుభవించింది. కర్ణునికి తాను అన్యాయం చేశానని కుమిలిపోయింది.
కుంతీదేవి జీవితంలోని ఈ సంఘటన ద్వారా వివాహానికి పూర్వమే బిడ్డలను కంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అమ్మాయిలకు వివరంగా తెలుస్తుంది.
Monday, December 9, 2013
యయాతి..దేవయాని...శర్మిష్ఠ....కొన్ని విషయాలు..
యయాతికి శర్మిష్ట భార్య ఎలా అవుతుందన్న సందేహానికి ...బహుశా యయాతి శర్మిష్ఠను గాంధర్వ వివాహం చేసుకుని ఉండవచ్చుననిపిస్తోందండి.
శుక్రుని శాపం యయాతికి మాత్రమే కాదు శర్మిష్ఠకూ శాపమే. శర్మిష్ఠ కుమారుడు పురు తండ్రి యొక్క వృద్దాప్యాన్ని స్వీకరించాడు.
కుమారుడు వృద్దాప్యంతో బాధపడుతుంటే అతని యవ్వనాన్ని స్వీకరించినా సరే ....తల్లితండ్రి ఏ విధంగా సుఖంగా ఉండగలరు ?
ఆ విధంగా శుక్రుని శాపం వల్ల శర్మిష్ఠ యయాతి ఇద్దరూ మనశ్శాంతిని కోల్పోవటమే జరిగింది.
.........................................
పూర్వం ఎక్కువమంది సంతానం ఉన్న తల్లితండ్రులను అదృష్టవంతులుగా భావించేవారు. అందువల్ల ఎక్కువమంది సంతానాన్ని పొంది వంశాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ....... ఋతుకాల విఫలత్వం భ్రూణహత్యా పాపాన్ని చుట్టబెడుతుందన్న విశ్వాసాన్ని ప్రచారం చేసి ఉండవచ్చు.
అలాగని స్త్రీ పరపురుషునితో సంతానాన్ని పొందవచ్చు అనేది పెద్దలు అభిప్రాయం కానేకాదు.
ఈ విషయంలో ఋతుమతి అయిన భార్య, పుత్రుని ఇవ్వమని భర్తను కోరినప్పుడు ..అనే విషయం స్పష్టంగా ఉంది.
వివాహసమయంలో ధర్మార్ధకామములో .... నాతిచరామి అని వరునితో ప్రమాణం చేయిస్తారు. వివాహం అయిన స్త్రీ భర్తనే దైవంగా భావించాలి. పరపురుషుని సోదరునిలా భావించాలి వంటి ధర్మాలను బోధించారు.
పై విషయాలను గమనించితే, స్త్రీలు పురుషులు కట్టుబాట్లు లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లు పరాయి వారితో సంతానాన్ని పొందవచ్చని పెద్దల అభిప్రాయం కాదని చక్కగా తెలుసుకోవచ్చు.
అయితే భర్త వల్ల సంతానాన్ని పొందలేని కొన్ని ప్రత్యేక పరిస్థితిలో కొందరు స్త్రీలు ఇతరుల వల్ల సంతానాన్ని పొందినట్లు పురాణాలలో ఉంది. ఉదా...కుంతీదేవి, మాద్రి దేవి భర్త అనుమతితోనే పాండవులను పొందారు.
ఈ రోజుల్లో కూడా కొందరు తల్లితండ్రులు స్పెర్మ్ బ్యాంకుల సాయంతో సంతానాన్ని పొందుతున్నారు కదా !
...............................................
.ఋతుకాలంలో ధర్మం తప్పకుండా అన్నదానికి ఋతుకాలధర్మం తప్పకుండా అన్నదానికి చాలా తేడా ఉందండి. గ్రంధాలలో ఋతుకాలంలో ధర్మం తప్పకుండా అని ఉండిఉంటుంది.
ఉదా...వ్యాస జననం సందర్భములో సత్యవతి దేవి మరియు కర్ణుని జననం అప్పుడు కుంతీదేవి తమ కన్యాత్వాన్ని కోల్పోలేదని చెప్పబడింది.
అంటే ఇప్పటి టెస్ట్ ట్యూబ్ పద్ధతిని మించిన విజ్ఞానం ఆ రోజుల్లోనే ఉండిఉండవచ్చు.
ఆ రోజుల్లో మంత్రశక్తితో స్త్రీలకు సంతానాన్ని ప్రసాదించే శక్తి గల మహర్షులు కూడా ఉండేవారన్న విషయం కూడా గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
............................................
సంతానం పొందాలంటే భార్యాభర్త శారీరిక సంబంధముతో సంబంధం లేని పద్ధతులు ఆ రోజుల్లో ఉండేవన్న విషయానికి ఒక ఉదాహరణ..
ఉపరిచరవసువు అనే రాజు కధలో ......అత్యవసరమైన పని మీద బయటకు వెళ్ళిన రాజు తన వీర్యాన్ని దొన్నెలో భధ్రపరిచి పెంపుడు డేగకు ఇచ్చి తన భార్య అయిన గిరికకు అందజేయమని పంపిస్తాడు.
ఆ డేగ ఆకాశం లో వెళ్తుండగా వేరొక డేగ ఆ దొన్నెను మాంసపు ముక్కగా భ్రమిస్తుంది. రెండు పక్షులకు జరిగిన గొడవలో దొన్నె నదిలో పడిపోగా , దొన్నెలోని పదార్ధాన్ని మ్రింగిన ఒక చేప గర్భాన్ని ధరిస్తుంది. ( ఒక అప్సరస శాపవశాత్తు చేపగా మారింది.)
కొంతకాలానికి వలలో పడిన చేపను చేపలవాళ్ళు కోయగా ఇద్దరు బిడ్డలు బయటపడతారు. ఆ అమ్మాయే వ్యాసుని తల్లి అయిన సత్యవతీదేవి .
పై సంఘటనలను గమనిస్తే, సంతానాన్ని పొందాలంటే భార్యాభర్త శారీరిక సంబంధముతో సంబంధం లేని పద్ధతులు కూడా ఆ రోజుల్లో ఉండేవన్న విషయం తెలుస్తుంది.
......................................
సమాజంలో పెద్దలు చెప్పిన ఎన్నో విషయాలను ప్రజలు సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం లేక తమ ఆశలకు, అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు చెప్పిన విషయాలను మార్చేయటం పూర్వమూ జరిగి ఉంటుంది ఇప్పుడూ జరుగుతోంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు.
ఋతుకాలోచితం విషయంలో కూడా పెద్దలు చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోని పూర్వీకులు తమ భార్యను అతిధికి సమర్పించే ఆచారాన్ని కొంతకాలం పాటించి ఉండవచ్చు.
ఉదా....శ్వేతకేతుని కాలంలో ఇలాంటి మూఢాచారాలు కొంతకాలం ఉండి ఉంటాయి. అది అధర్మమని గ్రహించిన ప్రజలు క్రమంగా ఆ ఆనవాయితీలను విడిచిపెట్టి ఉంటారు.
మన పెద్దలు వివాహాన్ని పవిత్రంగా భావించారు. ఒక స్త్రీ ఒక పురుషుడు లెక్కనే జంట అని అంటారు . అర్ధనారీశ్వర తత్వాన్ని భార్యాభర్తగా భావిస్తారు. ఈ విషయాలను గమనించితే భార్య లేక భర్త బోలెడు వివాహాలు చేసుకోవాలన్నది పెద్దల అభిప్రాయం కాదని స్పష్టంగా తెలుస్తోంది.
పాతకాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ స్త్రీలు పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలను చేసుకున్నారంటే వారి అవసరాల కోసం మాత్రమే. పెద్దలు దీనికి బాధ్యులు కాదు.
..................................................
భర్త వల్ల సంతానాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్న స్త్రీలకు మాత్రమే భర్త అనుమతితో ఇతరులతో సంతానాన్ని పొందే అవకాశం ఉండి ఉంటుంది. ఇంకా భర్త లేని స్త్రీలకు కూడా ఇతరులతో సంతానాన్ని పొందే అవకాశం ఉండి ఉంటుంది.
ఇక్కడ శర్మిష్ఠకు వివాహం కాలేదని, భర్త లేడని దేవయాని అభిప్రాయం కాబట్టి శర్మిష్ఠ ఎవరైనా ముని వల్ల సంతానాన్ని పొందినదా ? లేక యయాతి వల్లనా ? అనే సందేహంతో దేవయాని శర్మిష్ఠను ప్రశ్నించించి ఉండవచ్చు.
యయాతి శర్మిష్టను గాంధర్వ వివాహం చేసుకుని ఉంటాడు. ఇక విషయమంతా దేవయానికి తెలిసిపోయాక దాయడానికేముంది. అందువల్లనే యయాతి తాను శర్మిష్టను వివాహం చేసుకున్న విషయాన్ని తెలియజేస్తూ భార్య అనే పదాన్ని ఉపయోగించి ఉంటాడు.
.................................................
ఇక్కడ భర్త అంటే ఒక స్త్రీకే పరిమితుడైన మొగుడు కాదు. తన పోషణలో ఉన్న దాసీలపై కూడా లైంగిక హక్కు ఉన్న యజమాని, నాథుడు, మాస్టర్...అనటం సరైనది కాదు.
ధర్మాన్ని సరిగ్గా పాటించని కొందరు యజమానులు దాసీలను వాడుకునే అవకాశం ఉందేమో కానీ యజమానులకు దాసీల పట్ల భర్తగా వ్యవహరించే హక్కు లేదన్నది నిజం.
మన వివాహమంత్రాలు ఒక స్త్రీకి ఒకే పురుషుడు ఒక పురుషునికి ఒకే స్త్రీ అన్నది.....ఉత్తమమైన వివాహ ధర్మము.... అని గట్టిగా చెబుతున్నప్పుడు యజమానులకు దాసీలపై అన్ని హక్కులూ ఉంటాయని భావించటం సరైనది కాదు.
అలా ఎవరైనా భావిస్తున్నారంటే పెద్దలు తెలియజేసిన వివాహమంత్రాలను పాటించనట్లే.
...............................
శ్వేతకేతుని కాలంలో మూఢాచారాలు కొంతకాలం ఉండి ఉంటాయి. అది అధర్మమని గ్రహించిన ప్రజలు క్రమంగా ఆ ఆనవాయితీలను విడిచిపెట్టి ఉంటారు.
వివాహిత స్త్రీలను పరపురుషులకు అప్పగిస్తే ఆ స్త్రీ యొక్క భర్త గతి ఏమిటి ? భార్యకు కలిగే సంతానం తనకు సంభవించిన సంతానమో ? లేక పరపురుషుని వల్ల కలిగిన సంతానమో ? భర్తకు ఎలా తెలుస్తుంది? పూర్వీకులు ఇవన్నీ తెలియని అమాయకులు కాదు కదా !
భర్త వల్ల సంతానం కలగని పరిస్థితిలో మాత్రమే ( భర్త అనుమతితో ) పరపురుషుని వల్ల సంతానాన్ని పొందే హక్కు స్త్రీకి ఉండేది అనుకోవచ్చు.
.............................................
గ్రంధాలలో ఉన్న కొన్ని విషయాలను ప్రక్షిప్తాలుగా అనుకోవచ్చనిపిస్తుంది.
చాలామంది ఏమంటారంటే మహా భారతం నాటికి ఇంకా మాతృస్వామ్యం మిగిలే ఉంది అంటారు. అయితే, మహాభారతం కాలం కన్నా ముందే రామాయణం కాలం నాటికే పితృ స్వామ్యం బలంగా ఉంది కదా !
........................................
"నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ భర్తవే"
అనే శర్మిష్ఠ మాటలను గమనిస్తే శర్మిష్ఠ యయాతిని వివాహం చేసుకోగోరి చాకచక్యంగా మాట్లాడుతోందని తెలుస్తుంది.
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, కొందరు పురుషులు పెద్దలు చెప్పిన ధర్మాలను తమ అవసరాలకు అనుగుణంగా మలచుకుని అర్ధాలను చెప్పుకుంటున్నారు.
ఆ నాటి శర్మిష్ఠ కూడా యయాతిని వివాహం చేసుకోవాలని భావించి ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అన్నదేమో అనిపిస్తుంది.
యయాతి మొదట సందేహించగా..............
‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని కూడా శర్మిష్ట అంది.
‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారంటే మునుల అభిప్రాయాలు వేరు.
ఈ రోజుల్లో కూడా స్త్రీపురుషులు వివాహం సమయంలో అనేక అబద్ధాలతో ఇతరులను మోసం చేసి వివాహాలు చేసుకుని వివాహ సందర్భంలో అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారని తమను తాము సమర్ధించుకుంటున్నారు.
......................................
ఇక శుక్రునికి కూతురుపట్ల గల మమకారం వల్ల ఆమెను గట్టిగా మందలించలేకపోయి ఉండవచ్చు. అయితే శర్మిష్ఠ పట్ల కూడా శుక్రునికి వాత్సల్యం ఉండిఉండవచ్చు. శర్మిష్ఠ రాజు కూతురు . సుకుమారంగా పెరిగిన అమ్మాయి కాబట్టి ఆమెకు చక్కటి సౌకర్యాలను ఏర్పరచాలని యయాతిని కోరి ఉంటాడు. అయితే ఆమెతో సానిహిత్యం వద్దని స్పష్ఠంగా చెప్పినదానిలో శుక్రుని అభిప్రాయం సూటిగానే తెలుస్తోంది.
తన కూతురికి సవతి పోరు ఉండాలని ఏ తండ్రీ కోరుకోడు. కూతురంటే ఎంతో ప్రేమ ఉన్న శుక్రుని వంటి తండ్రి అసలే కోరుకోడు. శర్మిష్ఠ యయాతికి భార్య కావాలని శుక్రుని ఉద్దేశం కాకపోవచ్చు.
దేవయాని గడుసుదే కావచ్చు. అంతమాత్రం చేత తోటి ఆడుపిల్లను వివస్త్రగా చేసి ఊరికి దూరంగా ఉన్న నూతిలో తోసి వెళ్ళిపోయిన శర్మిష్ఠ మైనపుబొమ్మ కాదనే అనిపిస్తుంది.
ఈ కధలో దేవయాని, శర్మిష్ఠ, యయాతి అందరికందరే. ఎవరూ తక్కువగా లేరు. ఆఖరికి అందరూ తాము చేసిన దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించారు. వీరి సంతానం కూడా కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది.
దేవయాని తనకు నచ్చని శర్మిష్ఠ ను సవతిగా పొంది బాధపడింది.
శుక్రుని శాపం వల్ల తన కళ్ళముందే కుమారుడు ముసలితనంతో బాధపడటాన్ని చూసి శర్మిష్ఠ బాధపడింది.
యయాతి శుక్రుని శాపానికి గురయ్యి తన కళ్ళముందే కుమారుడు ముసలితనంతో బాధపడటాన్ని చూసి బాధపడిఉంటారు.
........................................
పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవచ్చు.
శర్మిష్ఠ రాక్షసరాజు కూతురు కాబట్టి దేవయాని ఆమెను దానవి అని సంబోధించి ఉండవచ్చు. లేక తన భర్తను రహస్యంగా వివాహం చేసుకుని సంతానాన్ని పొందినదన్న కోపంతో కూడా దేవయాని ఆమెను దానవి అని సంబోధించి ఉండవచ్చు.
అయితే శర్మిష్ఠ దేవయానిని వివస్త్రగా చేసి నూతిలోకి తోసి ఒంటరిగా వదిలి వెళ్ళిపోవటం మాత్రం తప్పే.
మీరన్నట్లు, శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఒప్పుకునే విషయంలో తన తండ్రి మరియు తమ రాజ్య ప్రజలు ఇబ్బందులు పడటం ఇష్టం లేకపోవటం ఒక కారణం కావచ్చు. లేక తండ్రి యొక్క ఆజ్ఞను జవదాటలేక పోవటం కూడా కారణం కావచ్చు. లేక దేవయానిని నూతిలోకి తోయటం ద్వారా చేసిన తప్పును సరిద్దుకోవాలని భావించి ఉండవచ్చు.
తరువాత .....దేవయాని భర్తను తాను వివాహం చేసుకోవటం ద్వారా తనను దాసిగా చేసినందుకు ప్రతిగా శర్మిష్ట దేవయానిపై ప్రతీకారాన్ని తీర్చుకుందని కూడా అనుకోవచ్చు.
మీరన్నట్లు, శర్మిష్టకు తండ్రి రాజకీయ అవసరాలమీదా, ఇబ్బందుల మీదా ఖాతరుఉంది. దేవయానిని నిందించి నూతిలో తోసే సమయంలో ఆ ఖాతరు లేకపోయినా, ఆ తర్వాత తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆమెకు అర్థమయ్యుంటుంది. వృషపర్వుని రాజకీయ అస్తిత్వంలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగం. వృషపర్వుని అస్తిత్వం, మొత్తం రాక్షసుల అస్తిత్వం. తను దూరం ఆలోచించకుండా క్షణికోద్రేకంతో తప్పు చేసింది. ఆ తప్పుకు తండ్రి విధించే శిక్షను కిమ్మనకుండా అనుభవించవలసిందే!
అయితే, శర్మిష్ఠ పాత్ర కూడా మరీ సౌమ్యురాలుగా అనిపించదు. శర్మిష్ఠ మరీ సౌమ్యురాలైతే దేవయానిని నూతిలోకి తోసేదే కాదు. దేవయాని భర్తను తాను వివాహం చేసుకుని దేవయాని మనస్సును బాధపెట్టేదీ కాదు.
ఇక, దేవయాని పాత్ర కూడా మరీ సౌమ్యురాలుగా కాకుండా గడుసుదనం ఉన్న పాత్రలానే కనిపిస్తుంది. దేవయాని మరీ సౌమ్యురాలైతే పొరపాటున దుస్తులు మారటం బాధను కలిగించినా పైకి ప్రదర్శించకుండా సర్దుకుపోయేది.
శర్మిష్టపై ఆమెకు ఆక్షణంలో ఆగ్రహమే కాదు, అసూయ కూడా ఉంది. దానికి తోడు కచుడు తనను నిరాకరించి వెళ్ళిన నేపథ్యం ఉంది. నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడన్న కచుని శాపం కూడా ఆమె ఆలోచనల్ని వెంటాడుతూ ఉండచ్చు. నూతిలో పడున్న ఆ క్షణాలలోనే శర్మిష్ట చేసిన అవమానమూ, కచుని శాపమూ కలసి రాజును పెళ్లాడాలన్న సంకల్పాన్ని ఆమె బుద్ధిలో బలంగా నాటి ఉండచ్చు.
ఇక యయాతి విషయానికొస్తే , నూతిలో పడిన దేవయానిని రక్షించే ఉద్దేశంతో కుడిచేయి అందించి ఆమెను రక్షించాడు తప్పితే , దేవయానిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించదు. యయాతికి శర్మిష్ఠ అంటే నచ్చినట్లు అనిపిస్తుంది. అయితే , శుక్రునికి భయపడో లేక ఆ వివాహం ద్వారా శర్మిష్ఠను పొందవచ్చు అనో దేవయానితో వివాహానికి ఒప్పుకుని ఉండవచ్చు.
శర్మిష్ఠను వివాహం చేసుకోకూడదనే షరతుతో దేవయానిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి మాట తప్పకుండా ఉండవలసింది. శుక్రునకు ఇచ్చిన మాటను తప్పటం వల్ల శాపానికి గురయ్యాడు.
యయాతికి దేవయానిని చేసుకోవటం ఇష్టం లేకపోతే ధైర్యంగా ఆ మాటను శుక్రునితో చెప్పేసి ఉంటే బాగుండేది.
యయాతి తన పట్ల అనురక్తులవటాన్ని గ్రహించిన శర్మిష్ఠ ఆ అవకాశాన్ని వదులుకోకుండా యయాతితో చాకచక్యంగా సంభాషించి వివాహానికి ఒప్పుకునేలా చేసింది.
ఇక్కడ యయాతి శుక్రునికి ఇచ్చిన మాటను ప్రక్కన పెట్టేయటం జరిగింది. తద్వారా శాపాన్ని పొందటం జరిగింది.
తన కుమారులలో ఒకరు తన వృద్ధాప్యాన్ని స్వీకరించితే కొంతకాలం వారి యవ్వనాన్ని తాను పొందవచ్చు...అని యయాతి శాపవిమోచనాన్ని పొందారు.
తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించిన కుమారునికి రాజ్యాధికారం లభిస్తుందని చెప్పటం జరిగింది. ఈ విషయంలో శుక్రుడు శర్మిష్ఠకు అనుకూలంగా ప్రవర్తించారనుకోకూడదు.
వృద్ధాప్యాన్ని అనుభవించి కష్టపడినవారికి ప్రతిఫలంగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలనటంలో శుక్రుడు శర్మిష్ఠకు అనుకూలంగా మాట్లాడటం ఏమీ లేదు.
............................................
పై విషయాలను గమనిస్తే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి. శర్మిష్ఠ దేవయాని మధ్య దుస్తుల విషయంలో జరిగిన చిన్న పొరపాటు వారి జీవితాలనే మార్చేసింది. ప్రతి విషయానికి అతిగా పట్టుదలకు పోకూడదు అని తెలిసివస్తుంది.
ఈ విషయాలను గమనిస్తే ఏకపత్నీ లేక ఏక పతి యొక్క ప్రాధాన్యత కూడా అర్ధమవుతుంది.
ఒకరికంటే ఎక్కువమంది భార్యలుంటే వారి మధ్య అసూయలు, పోటీల వల్ల జీవితమంతా గందరగోళంగా తయారవుతుందని అర్ధమవుతుంది.
యయాతి పొరపాటునో లేక గ్రహపాటునో దేవయానిని వివాహం చేసుకోవలసి వచ్చింది. అంతటితో ఆగి ఉంటే బాగుండేది.
శర్మిష్ట కూడా యయాతిని వివాహం చేసుకోకుండా ఉండవలసింది.
దేవయాని కూడా శర్మిష్ఠను దాసిగా చేయకుండా క్షమించి ఉండవలసింది. తద్వారా దేవయానికి సవతి బాధ ఉండేది కాదు.
మొత్తానికి యయాతి, దేవయాని, శర్మిష్ఠలో ముగ్గురితో పాటు వారి సంతానం కూడా ఇబ్బందులను అనుభవించారు.
కుమారుడు వృద్ధాప్యంతో బాధపడుతుంటే అతని యవ్వనాన్ని తీసుకుని తల్లితండ్రులు సుఖంగా ఉండగలరా? ఉండలేరు. అందుకని యయాతి గాని శర్మిష్ఠ గాని సుఖవంతమైన జీవితాన్ని అనుభవించలేదనే అనుకోవచ్చు.
దేవయాని కన్నా శర్మిష్టకే ఎక్కువ బాధ ఉంటుంది. కుమారుడు వృద్ధాప్యాన్ని అనుభవిస్తుంటే తల్లికి బాధగానే ఉంటుంది కదా !
.........................................................
ఇక శర్మిష్ఠ యొక్క సంతానం తండ్రి యొక్క ముసలితనాన్ని స్వీకరించే సమయంలో బాల్యానికి టీనేజికి మధ్య వయస్సు వారయి ఉండవచ్చు.
బహుశా 10 సంవత్సరాలు అలా వయస్సు ఉంటే బహుశా అతని యవ్వనంలోని మధ్య వయస్సు భాగాన్ని యయాతి స్వీకరించి ఉండవచ్చు. కొంతకాలం గడిచిన తరువాత పురు తన యవ్వనాన్ని తాను స్వీకరించగా యయాతి తన వృద్దాప్యాన్ని తను స్వీకరించి ఉండవచ్చు.
దయచేసి ఈ లింక్ కూడా చదవగలరు. ......
సుకన్య........శర్మిష్ఠ..
Wednesday, December 4, 2013
విలువలను నేర్పవలసిన పెద్దవాళ్ళే....
ఈమధ్య యువత చెడు అలవాట్లకు బానిసలవటం గురించి తరచుగా వింటున్నాము. నా ఉద్దేశంలో ఈ విషయంలో తప్పు సమాజంలోని పెద్దవాళ్ళదే ..... అనిపిస్తుంది.
పిల్లలకు నైతిక విలువలను నేర్పవలసిన పెద్దవాళ్ళే నైతికవిలువలను పాటించటం తగ్గిపోయింది.
మద్యపానం చేయటం మంచినీళ్ళు తాగినట్లు మామూలైపోయింది.
డబ్బు సంపాదించటం కోసం ఎన్ని చెడ్డపనులైనా చేస్తున్నారు.
ఒక ప్రక్క నీతులు చెబుతూ ఇంకో ప్రక్క చేతలలో అధర్మంగా ప్రవర్తిస్తున్నారు.
నీతులు చెబుతూనే .... సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా చిత్రాలను, కధలను తీసి సమాజమ్మీదికి వదిలేవారి సంఖ్య ఎక్కువయ్యింది.
వర్తకులు విపరీతమైన లాభాల కోసం ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.
ఉదా... కొందరు దళారుల అత్యాశ వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులూ నష్టపోతున్నారు. రేట్లు విపరీతంగా పెరిగి వినియోగదారులూ నష్టపోతున్నారు.
ధర్మబద్ధం కాని సంపాదన వల్ల కష్టాలు కలుగుతాయని పెద్దలు తెలియజేశారు.
ఒక ప్రక్క దైవానికి ఇష్టం లేని పనులు చేస్తూనే ....మరొక ప్రక్క పాప పరిహారం కొరకు పూజలు చేయటం వల్ల సత్ఫలితాలు రావని గ్రహించాలి.
ఇప్పటి సమాజంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి.
చుట్టూ ఉన్న ఎన్నో ఆకర్షణల మధ్య కూడా దృఢంగా నిలబడి నైతికవిలువలకు విలువనిస్తున్న యువత కూడా ఉన్నారు.
ఇలాంటి ఉన్నతమైన , దృఢమైన....వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న యువత ఎంతో అభినందనీయులు.
*************
marikonni vishayamulu...
ఈ
రోజుల్లో చాలామంది స్త్రీలు కెరీర్ అంటూ ఉద్యోగానికి ఎక్కువ ప్రాముఖ్యత
ఇస్తున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కొన్ని రచనలు, కొన్ని సినిమాలు
వీటి ప్రభావం వల్ల కూడా స్త్రీస్వాతంత్ర్యం అని సమాజంలో మారిన భావజాలం కూడా
కారణం. స్త్రీలకు స్వాతంత్ర్యం ఉండవలసిందే. అలాగని ఉద్యోగాలు చేస్తున్న
స్త్రీలందరూ స్వాతంత్ర్యంతో సుఖంగా ఉన్నారా..అంటే ఉన్నారని చెప్పలేము.
ఇంటిపట్టున ఉండేవారిలో కూడా సుఖంగా ఉండేవారుంటారు.
ఇంటిపని,
ఉద్యోగబాధ్యతలు రెండూ నెత్తిన వేసుకోవటం వల్ల స్త్రీలకు అలసి పోయి
అనారోగ్యాలు వస్తున్నాయి. మేము ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, పురుషులూ
ఇంట్లో పనిచేయాలంటూ కొందరు భార్యాభర్తలు గొడవలు పడుతూ విడాకుల వరకూ
వెళ్తున్నారు. కొందరు సర్దుకుపోతున్నారు.
ఇద్దరూ
ఇంటిపని, బయటపని చేయాలంటే, కొన్నిసార్లు ఉద్యోగపనిగంటలు కుదరక గొడవలు
అవుతున్నాయి. వీటన్నింటివల్ల పిల్లలకు కూడా కష్టాలు వచ్చాయి. చంటి
పిల్లలను క్రెచ్లలో వేస్తున్నారు. అక్కడ వారిని సరిగ్గా చూస్తారో
లేదో..తెలియదు. హడావిడిగా వంట చేయటం వల్ల , చాలాసార్లు బయట తినటం వల్ల
సరైన పోషకాహారం లభించక పిల్లలకు, ఇంట్లో అందరికీ జబ్బులు వచ్చే అవకాశం
ఉంది.
ఇవన్నీ ఇలా మారటానికి అనేక కారణాలున్నాయి. స్త్రీలు ఇంటి
పని ఎంత బాగా చేసినా కూడా వారికి కనీసమర్యాద ఇవ్వని కుటుంబసభ్యులెందరో
ఉన్నారు. కనీస మర్యాద ఉండదు, చేసిన పనికి గుర్తింపు ఉండదు. బయట పనిచేస్తే
డబ్బు వస్తుంది. ఇంటిపనికి డబ్బు ఇవ్వటం ఉండదు. ఇంటిపనులు చేయక ఏం చేస్తారు
? అది వారి బాధ్యత అంటారు. పాతకాలంలో మగవారు బయటనుంచి కూరలు తేవటం
చేసేవారు. ఇప్పుడు స్త్రీలే బయటకెళ్లి సరుకులు, కూరలు తెచ్చి వండే
పరిస్థితి కూడా ఉంది.
ఇంటిపట్టున ఉంటూ కుటుంబబాధ్యతలు
నిర్వహించే స్త్రీలకు కూడా చాలా పని ఉంటుంది. సరిగ్గా చేస్తే ఇంటి పనులతోనే
సమయం చాలదు. ఇంటిపట్టున ఉండే స్త్రీలను ఇంట్లో అందరూ గౌరవించాలి. బయట
పనిచేసే పురుషులకు కూడా చాలా పని ఉంటుంది. పురుషులూ మనుషులే. వారికీ
పనివత్తిడి వల్ల అలసట ఉంటుంది. అందువల్ల స్త్రీలు, పురుషులు ఇద్దరూ
ఒకరిపట్ల ఒకరు గౌరవంగా ఉండాలి.
బయట ఆహారం తినాలనుకుంటే, ఆర్గానిక్ పంటలతో చేసిన ఆహారం తినటం మంచిది. ఉదా. .హైదరాబాద్లో లోయర్ టాంక్ బండు సమీపంలో విజయరాం గారు ఆర్గానిక్ వంటలతో భోజనాన్ని అందిస్తున్నారు.అలాంటి ఆహారాన్ని తినవచ్చు.
*************
కొందరు
ఏమంటారంటే.. పెరిగినధరలు, స్కూల్స్ ఫీజులు..ఇలాంటివాటికొరకు ఇద్దరూ
పనిచేయకపోతే డబ్బు చాలదంటారు. ధరలు, ఫీజులు..వంటివి పెరగకుండా చర్యలు
తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలను గట్టిగా అడగాలి. ధరలు బాగా పెరగకుండా ప్రభుత్వాలు కూడా కఠినచర్యలు తీసుకోవాలి. ప్రజలకు కొత్తకొత్త సామాను కొనాలనే
కోరికలు, గొప్ప ఇల్లు ..ఇలా కోరికలు ఎక్కువగా పెరగటం వల్ల కూడా ఆదాయం
సరిపోదు.
పాతకాలంలో పురుషుడు సంపాదించి తెచ్చిన దానితోనే
ఆదాయంతోనే సరిపెట్టుకునేవారు.. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా వస్తువులు
వచ్చాయి. అవన్నీ కొనాలంటే చాలా డబ్బు కావాలి. కోరికలు పెంచుకుంటూపోతే,
ఇంట్లో ఎంతమంది సంపాదించినా డబ్బు చాలదు.
కొందరి
విషయంలో డబ్బు, గౌరవం ఉన్నా కూడా, బయటకెళ్లి ఏదో చేయాలని అనుకుంటారు.
అయితే, కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కుటుంబాలను సరిగ్గా
చూసుకోవటానికి సమయం లేనప్పుడు కుటుంబాలలోనూ..సమాజంలో కూడా సమస్యలు వస్తాయి.
ఇక సమాజం ఏం బాగుంటుంది. స్త్రీలు ఇంటిపని చూసుకుని పిల్లలు స్కూలుకు
వెళ్ళాక.. పగలు 3 లేక 4 గంటలు సమాజ బాగుకు ఉపయోగించవచ్చు.
కొందరు
స్త్రీలైతే స్త్రీ స్వేచ్చ పేరుతో వారి ఇష్టం వచ్చినట్లు
ప్రవర్తిస్తున్నారు.కుటుంబంలోని వారి వల్ల ఇబ్బందులు పడుతున్న స్త్రీలు
కొందరయితే, కుటుంబంలోని వారిని ఇబ్బంది పెడుతున్న స్త్రీలు కూడా
కొందరున్నారు.
మరి
కొందరు స్త్రీలు, పురుషులు ఎలా ఉంటారంటే, మంచి జీవితభాగస్వామి ఉన్నాకూడా,
పరాయి వారి కొరకు ప్రాకులాడి తమ కుటుంబాన్ని ఇతరుల కుటుబాన్ని కూడా
పాడుచేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి కేసులు బాగా ఎక్కువయ్యాయి. ఎవరికీ ఏమీ
చెప్పే పరిస్థితి లేనట్లు ఉంది. కాలమే పరిష్కారం చూపించాలి.
Monday, December 2, 2013
ఓం నమఃశ్శివాయ.....
ఓం
శ్రీ విశ్వనాధాష్టకం...
గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగం
నారాయణప్రియ మనంగమదాపహారం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.
వాచామగోచర మనేక గుణస్వరూపం
వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.
భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.
శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం
పంచాననం దురిత మత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం
దావానలం మరణశోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం
తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయం
నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం
ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం
రాగాది దోషరహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజవిశ్వనాధం
వారాణసీ పురపతేః స్తవం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం
విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..
ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.
శ్రీ అన్నపూర్ణాష్ఠకము...
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ
కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..
ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..
ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ
నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..
ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.
శ్రీ గణేశ స్తుతి...
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి
దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి
మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్
ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.
శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..
హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసమేత మమదేహి కరావలంబం..
దేవాదిదేవనుత దేవగణాధినాధ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాధ మమదేహి కరావలంబం..
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీసనాధ మమదేహి కరావలంబం..
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాధ మమదేహి కరావలంబం..
దేవాదిదేవ రధమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..
హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..
పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం
సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా
వల్లీసనాధ మమ దేహి కరావలంబం..
సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..
ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...
సంతాన ఫల మంత్రం..
సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.
ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.
చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.
ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.
జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా !
జరత్కారుప్రియాఽఽస్తీకమాతా విషహారేతి చ
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!
ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్!
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!
శ్రీ కాల భైరవాష్టకం..
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే..
భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే..
శూలటంక పాశ దండమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం
కాశికాపురాధినాధ కాలభైరవంభజే..
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం
నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే..
ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం
కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాధ కాలభైరవం భజే..
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే.
అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం
దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే..
భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాధ కాల భైరవం భజే..
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..
ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..
శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మ్యై నకారాయ నమశ్శివాయ.
మందాకినీసలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మ్యై మకారాయ నమశ్శివాయ.
శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మ్యై శికారాయ నమశ్శివాయ.
వశిష్ట కుంభోధ్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మ్యై నకారాయ నమశ్శివాయ.
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
సుదివ్య దేహాయ దిగంబరాయ
తస్మ్యై యకారాయ నమశ్శివాయ.
పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
Friday, November 29, 2013
సరిదిద్దే ప్రయత్నం చేసేవాళ్ళు గొప్పవారు.
పూర్వం రోజుల్లో చెరువులలో నీరు తగ్గితే చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చేవి.
ఈ రోజుల్లో అయితే చెరువుల్లో నీరు తగ్గుముఖం పడితే చేపలకు బదులు ప్లాస్టిక్ కవర్లు ఒడ్డుకు తేలి వచ్చి కుప్పలుగా పడి ఉంటున్నాయి.
ఈ ప్లాస్టిక్ త్వరగా భూమిలో కలిసిపోదన్న విషయం చాలామందికి తెలుసు. అయితే నీటిలో పడినా ఆ నీరు కలుషితం అవుతుందంటున్నారు.
ఇక ఎలెక్ట్రానిక్ చెత్త మరియు పరిశ్రమలు వదిలే వ్యర్ధాలు వంటి వాటివల్ల వల్ల కూడా నేల, నీరు కలుషితం అవుతున్నాయట.
వీటన్నింటి ఫలితంగా విషవాయువులు వెలువడి , భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి ధ్రువ ప్రాంతాలలో మంచు కరగటం మొదలయ్యిందట.....ఇలా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని ఎందరో శాస్త్రవేత్తలు కూడా బాధపడుతున్నారు.
ప్లాస్టిక్ కనుగొని ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు ప్లాస్టిక్ గురించిన లాభాలే తప్ప నష్టాల గురించి శాస్త్రవేత్తలకు తెలిసి ఉండకపోవచ్చు.
ఎంత శాస్త్రవేత్తలు అయినా ముందే అన్నీ ఊహించలేరు కదా !
ఆధునిక ఆవిష్కరణలలో కొన్ని ప్రపంచానికి హానికరంగా పరిణమించాయి. ఈ మాట అంటే కొందరికి కోపం వస్తుంది. ( అయితే అందరికి కోపం రాదు లెండి.)
కొన్ని ఆవిష్కరణల వల్ల జరుగుతున్న హాని గురించి కనిపెట్టి ప్రపంచానికి తెలియజేస్తూన్న శాస్త్రవేత్తలు ఎంతో గొప్పవారు.
భేషజాలకు పోకుండా, పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలకు చేతులెత్తి నమస్కరించాలి .
Wednesday, November 27, 2013
ఇతర గ్రహాలపై ఇంధనాలు, ఖనిజాలు....
ఇతర గ్రహాలపై ఇంధనాలు, ఖనిజాలు ఉన్నాయంటున్నారు. అక్కడ ఏమి ఉన్నా మనకేమిటి లాభం ? ఇతర గ్రహాల నుంచి ఇంధనాన్ని తెచ్చి వాడుకోవాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది.
ఇతర గ్రహాల నుంచి ఖనిజాలను భూమి పైకి తెచ్చి వస్తువుల తయారీలో వాడితే అలా తయారైన వస్తువు ఖరీదు ఎంతో ఎక్కువగా ఉంటుంది . అంత ఖరీదైన వాటిని ఎవరు కొనగలరు ?
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇతర గ్రహాల పైకి వెళ్ళి అక్కడ కృత్రిమ వాతావరణం సృష్టించి ప్రజలు నివాసం ఉండాలనే ఆలోచనలు ఎందుకు ? అంత డబ్బే ఉంటే భూమి మీదే ఎన్నో సౌకర్యాలు ఏర్పరుచుకోవచ్చు కదా !
దైవం మనకు ప్రసాదించిన చక్కని గాలి, నీరు, చక్కటి వాతావరణం, పచ్చని చెట్లు, పువ్వులు, పండ్లు .......అన్నీ ఉన్న భూమిమీదే హాయిగా జీవించటం చేతకాక ఎన్నో సమస్యలను సృష్టించుకుంటున్నాము.
ఇక గాలి, నీరు, ఇవన్నీ లేని గ్రహాల మీద కెళ్ళి ఎంతో డబ్బును ఖర్చుపెట్టి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించటం అవసరమా ?
భూమిపై ఆకలితో అల్లాడే ప్రజలున్న దేశాలకు ఇదంతా అవసరమా ? అనిపిస్తుంది. కడుపు నిండిన తరువాతే విజ్ఞానమైనా, వినోదమైనా.
అభివృద్ధి చెందిన దేశాలు అని మనం భావిస్తున్న చాలా దేశాలు కూడా ఇప్పుడు ఆర్ధిక , నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతున్నాయి.
దేశాల మధ్య ఈ పోటీ లేకపోతే ఆ డబ్బుతో ప్రజల ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దవచ్చు.
తోటి వాళ్ళు తొడకోసుకుంటే మనం మెడ కోసుకోవాలనే ఆరాటం ఎందుకు ?
విజ్ఞానం అనేది ప్రజల కనీస అవసరాలన్నా తీరటానికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది.