ఈమధ్య యువత చెడు అలవాట్లకు బానిసలవటం గురించి తరచుగా వింటున్నాము. నా ఉద్దేశంలో ఈ విషయంలో తప్పు సమాజంలోని పెద్దవాళ్ళదే ..... అనిపిస్తుంది.
పిల్లలకు నైతిక విలువలను నేర్పవలసిన పెద్దవాళ్ళే నైతికవిలువలను పాటించటం తగ్గిపోయింది.
మద్యపానం చేయటం మంచినీళ్ళు తాగినట్లు మామూలైపోయింది.
డబ్బు సంపాదించటం కోసం ఎన్ని చెడ్డపనులైనా చేస్తున్నారు.
ఒక ప్రక్క నీతులు చెబుతూ ఇంకో ప్రక్క చేతలలో అధర్మంగా ప్రవర్తిస్తున్నారు.
నీతులు చెబుతూనే .... సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా చిత్రాలను, కధలను తీసి సమాజమ్మీదికి వదిలేవారి సంఖ్య ఎక్కువయ్యింది.
వర్తకులు విపరీతమైన లాభాల కోసం ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.
ఉదా... కొందరు దళారుల అత్యాశ వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులూ నష్టపోతున్నారు. రేట్లు విపరీతంగా పెరిగి వినియోగదారులూ నష్టపోతున్నారు.
ధర్మబద్ధం కాని సంపాదన వల్ల కష్టాలు కలుగుతాయని పెద్దలు తెలియజేశారు.
ఒక ప్రక్క దైవానికి ఇష్టం లేని పనులు చేస్తూనే ....మరొక ప్రక్క పాప పరిహారం కొరకు పూజలు చేయటం వల్ల సత్ఫలితాలు రావని గ్రహించాలి.
ఇప్పటి సమాజంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి.
చుట్టూ ఉన్న ఎన్నో ఆకర్షణల మధ్య కూడా దృఢంగా నిలబడి నైతికవిలువలకు విలువనిస్తున్న యువత కూడా ఉన్నారు.
ఇలాంటి ఉన్నతమైన , దృఢమైన....వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న యువత ఎంతో అభినందనీయులు.
*************
marikonni vishayamulu...
ఈ
రోజుల్లో చాలామంది స్త్రీలు కెరీర్ అంటూ ఉద్యోగానికి ఎక్కువ ప్రాముఖ్యత
ఇస్తున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కొన్ని రచనలు, కొన్ని సినిమాలు
వీటి ప్రభావం వల్ల కూడా స్త్రీస్వాతంత్ర్యం అని సమాజంలో మారిన భావజాలం కూడా
కారణం. స్త్రీలకు స్వాతంత్ర్యం ఉండవలసిందే. అలాగని ఉద్యోగాలు చేస్తున్న
స్త్రీలందరూ స్వాతంత్ర్యంతో సుఖంగా ఉన్నారా..అంటే ఉన్నారని చెప్పలేము.
ఇంటిపట్టున ఉండేవారిలో కూడా సుఖంగా ఉండేవారుంటారు.
ఇంటిపని,
ఉద్యోగబాధ్యతలు రెండూ నెత్తిన వేసుకోవటం వల్ల స్త్రీలకు అలసి పోయి
అనారోగ్యాలు వస్తున్నాయి. మేము ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, పురుషులూ
ఇంట్లో పనిచేయాలంటూ కొందరు భార్యాభర్తలు గొడవలు పడుతూ విడాకుల వరకూ
వెళ్తున్నారు. కొందరు సర్దుకుపోతున్నారు.
ఇద్దరూ
ఇంటిపని, బయటపని చేయాలంటే, కొన్నిసార్లు ఉద్యోగపనిగంటలు కుదరక గొడవలు
అవుతున్నాయి. వీటన్నింటివల్ల పిల్లలకు కూడా కష్టాలు వచ్చాయి. చంటి
పిల్లలను క్రెచ్లలో వేస్తున్నారు. అక్కడ వారిని సరిగ్గా చూస్తారో
లేదో..తెలియదు. హడావిడిగా వంట చేయటం వల్ల , చాలాసార్లు బయట తినటం వల్ల
సరైన పోషకాహారం లభించక పిల్లలకు, ఇంట్లో అందరికీ జబ్బులు వచ్చే అవకాశం
ఉంది.
ఇవన్నీ ఇలా మారటానికి అనేక కారణాలున్నాయి. స్త్రీలు ఇంటి
పని ఎంత బాగా చేసినా కూడా వారికి కనీసమర్యాద ఇవ్వని కుటుంబసభ్యులెందరో
ఉన్నారు. కనీస మర్యాద ఉండదు, చేసిన పనికి గుర్తింపు ఉండదు. బయట పనిచేస్తే
డబ్బు వస్తుంది. ఇంటిపనికి డబ్బు ఇవ్వటం ఉండదు. ఇంటిపనులు చేయక ఏం చేస్తారు
? అది వారి బాధ్యత అంటారు. పాతకాలంలో మగవారు బయటనుంచి కూరలు తేవటం
చేసేవారు. ఇప్పుడు స్త్రీలే బయటకెళ్లి సరుకులు, కూరలు తెచ్చి వండే
పరిస్థితి కూడా ఉంది.
ఇంటిపట్టున ఉంటూ కుటుంబబాధ్యతలు
నిర్వహించే స్త్రీలకు కూడా చాలా పని ఉంటుంది. సరిగ్గా చేస్తే ఇంటి పనులతోనే
సమయం చాలదు. ఇంటిపట్టున ఉండే స్త్రీలను ఇంట్లో అందరూ గౌరవించాలి. బయట
పనిచేసే పురుషులకు కూడా చాలా పని ఉంటుంది. పురుషులూ మనుషులే. వారికీ
పనివత్తిడి వల్ల అలసట ఉంటుంది. అందువల్ల స్త్రీలు, పురుషులు ఇద్దరూ
ఒకరిపట్ల ఒకరు గౌరవంగా ఉండాలి.
బయట ఆహారం తినాలనుకుంటే, ఆర్గానిక్ పంటలతో చేసిన ఆహారం తినటం మంచిది. ఉదా. .హైదరాబాద్లో లోయర్ టాంక్ బండు సమీపంలో విజయరాం గారు ఆర్గానిక్ వంటలతో భోజనాన్ని అందిస్తున్నారు.అలాంటి ఆహారాన్ని తినవచ్చు.
*************
కొందరు
ఏమంటారంటే.. పెరిగినధరలు, స్కూల్స్ ఫీజులు..ఇలాంటివాటికొరకు ఇద్దరూ
పనిచేయకపోతే డబ్బు చాలదంటారు. ధరలు, ఫీజులు..వంటివి పెరగకుండా చర్యలు
తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలను గట్టిగా అడగాలి. ధరలు బాగా పెరగకుండా ప్రభుత్వాలు కూడా కఠినచర్యలు తీసుకోవాలి. ప్రజలకు కొత్తకొత్త సామాను కొనాలనే
కోరికలు, గొప్ప ఇల్లు ..ఇలా కోరికలు ఎక్కువగా పెరగటం వల్ల కూడా ఆదాయం
సరిపోదు.
పాతకాలంలో పురుషుడు సంపాదించి తెచ్చిన దానితోనే
ఆదాయంతోనే సరిపెట్టుకునేవారు.. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా వస్తువులు
వచ్చాయి. అవన్నీ కొనాలంటే చాలా డబ్బు కావాలి. కోరికలు పెంచుకుంటూపోతే,
ఇంట్లో ఎంతమంది సంపాదించినా డబ్బు చాలదు.
కొందరి
విషయంలో డబ్బు, గౌరవం ఉన్నా కూడా, బయటకెళ్లి ఏదో చేయాలని అనుకుంటారు.
అయితే, కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కుటుంబాలను సరిగ్గా
చూసుకోవటానికి సమయం లేనప్పుడు కుటుంబాలలోనూ..సమాజంలో కూడా సమస్యలు వస్తాయి.
ఇక సమాజం ఏం బాగుంటుంది. స్త్రీలు ఇంటిపని చూసుకుని పిల్లలు స్కూలుకు
వెళ్ళాక.. పగలు 3 లేక 4 గంటలు సమాజ బాగుకు ఉపయోగించవచ్చు.
కొందరు
స్త్రీలైతే స్త్రీ స్వేచ్చ పేరుతో వారి ఇష్టం వచ్చినట్లు
ప్రవర్తిస్తున్నారు.కుటుంబంలోని వారి వల్ల ఇబ్బందులు పడుతున్న స్త్రీలు
కొందరయితే, కుటుంబంలోని వారిని ఇబ్బంది పెడుతున్న స్త్రీలు కూడా
కొందరున్నారు.
మరి
కొందరు స్త్రీలు, పురుషులు ఎలా ఉంటారంటే, మంచి జీవితభాగస్వామి ఉన్నాకూడా,
పరాయి వారి కొరకు ప్రాకులాడి తమ కుటుంబాన్ని ఇతరుల కుటుబాన్ని కూడా
పాడుచేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి కేసులు బాగా ఎక్కువయ్యాయి. ఎవరికీ ఏమీ
చెప్పే పరిస్థితి లేనట్లు ఉంది. కాలమే పరిష్కారం చూపించాలి.
ttt
ReplyDelete