koodali

Wednesday, June 13, 2012

పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు........



పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు వచ్చారని భావించటం తప్పేమో అనిపిస్తుంది.

రామాయణ కాలంలో ఎంతో పరిణతి చెందిన వానరుల గురించి పెద్దలు చెప్పారు. 


 ఆంజనేయస్వామి  ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని పెద్దలు చెప్పటం జరిగింది.

రామాయణంలో చెప్పబడ్డ వానరులు దగ్గరదగ్గర మానవుల లాగే ఎంతో పరిణతి చెందినవారు. 

బహుశా ఇలాంటి వానరుల గుర్తులు చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు,   మానవులు ........వానరుల నుండి పరిణామం చెందారని అనుకుంటున్నారేమో ?


మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే ......అలా పరిణామం చెందలేదని చెప్పే శాస్త్రవేత్తలు కూడా బాగానే ఉన్నారు.

 1..... "AGAINST EVOLUTION "

2.......17 EVIDENCES AGAINST EVOLUTION.......అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వివరాలు ఉన్నాయి.

. ఇతర గ్రహాలలో జీవులు ఉన్నారని, ఆ జీవుల ద్వారా కూడా భూమిపై జీవం ఏర్పడి ఉండవచ్చని ఈనాటి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.



 ( ఇతర గ్రహములలో  ఉన్నవారు  పురాణేతిహాసములలో  చెప్పబడ్డ  దేవతలు,  రాక్షసులు    .......కావచ్చునని  కొందరు  భావిస్తారు.)


జీవులలో పరిణామక్రమం గురించి డార్విన్ చెప్పినది కొంత వరకు   నిజమే కావచ్చు.  

  ఏదైనా  జీవి  తను  ఉన్న  పరిసరాల  నుంచి  కొత్త  ప్రదేశానికి  వెళ్ళినప్పుడు  ఆ  కొత్త  వాతావరణానికి  తగ్గట్లు  తనను  తాను  కొద్దిగా  మార్చుకుని జీవించినప్పుడు  ఆ  జాతి  అంతరించకుండా  ఉంటుంది.


 అలా   జీవించటానికి  అనుగుణంగా   కొద్దిపాటి  మార్పులు చేర్పులు    చెందటానికి  తగ్గ  శక్తిని ,  అవకాశాన్ని   దైవం  కల్పించి  ఉండవచ్చు.


 అంతే కానీ,  మనిషి కోతినుంచి పరిణామం చెందాడని  భావించటం తప్పేమో అనిపిస్తుంది.  మనిషి  అలా పరిణామం చెందినట్లయితే ఆ పరిణామం అతి నెమ్మదిగా  శాస్త్రవేత్తలు  చెప్పే  దాని  ప్రకారం  కొన్ని  లక్షల  సంవత్సరాలు   జరిగింది కాబట్టి ,....... ఆ పరిణామక్రమాన్ని అనుసరించి వివిధ ఆకారాల్లో శిలాజాలు పెద్దమొత్తంలో లభించాలికదా ! ( అలా లభించలేదట )....అతి తక్కువ శిలాజాల.. భాగాలు మాత్రం దొరికాయట.ఇది ఆశ్చర్యం కదా ! ( ఆ శిలాజాలు మనిషివో ? చింపాంజీలవో  ? లేక  అలాంటి  వేరే  జీవులవో ? ఎవరికీ తెలుసు? ) ... మిస్సింగ్   లింక్   అంటారట.


నేను నెట్లో కొన్ని వ్యాసాలు చదివితే నాకు అర్ధమయినంతలో ఏమనిపించిందంటే ,  కోతినుంచి మనిషి పరిణామం చెందిన విషయంలో కూడా శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. కొందరు శాస్త్రవేత్తలు కూడా మనిషి కోతినుండి పరిణామం చెందలేదు అని గట్టిగా అంటున్నారట.


శాస్త్రవేత్తలు  ప్రతిపాదించిన  చాలా  సిద్ధాంతాల  విషయంలో  వాళ్ళలో  వాళ్ళకే  భిన్నాభిప్రాయాలుంటాయి. 
ఏది నిజమో ? ఏది కాదో ?


 వీటన్నిటి బట్టి చూస్తే మనిషి కోతి నుండి పరిణామం చెందలేదని  అనుకోవచ్చు.

.....................................

ఈ  పరిణామక్రమం  గురించి  నేను  పాత  టపాలలో  రాసాను....
.................................

 Monday, November 21, 2011
పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... ఒకటవ భాగం.....


డార్విన్ పరిణామవాదం గురించి చిన్నప్పుడు చదువుకున్నాను కానీ, ఇప్పుడు అంత గుర్తు లేదండి. .


నాకు శాస్త్రవేత్తలలా విషయపరిజ్ఞానం లేదు కానీ, కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూసి తప్పుగా భావించవద్దండి.


పరిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,


ఉదా...మనిషి కోతి నుంచీ పరిణామాన్ని చెందిఉండవచ్చని   అన్నారు కదా..  పరిణామసిద్దాంతం   కొంతవరకూ   నిజమే కావచ్చు.


అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.


ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,

ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.
 

(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )

అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.


ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?


1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.


కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )


2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.


మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి కొద్దిగా  పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’


౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.


.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?
( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)


కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?

ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,


మానవులలో   జంతువుల శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

ఉదా.. మానవుల్లో వ్యర్ధ భాగంగా భావిస్తున్న
coccyx ( tail bone ) గతకాలపు అవశేషం కాదేమో ?  జంతువుగా పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.


టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.... ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు , ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.


౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.

దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........
సీతాకోకచిలుక.

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.


దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.


* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".. ...



No comments:

Post a Comment