koodali

Monday, June 11, 2012

1..నీటిపై తేలియాడుతూ రామాయణ ప్రవచనం..2... ఒక ప్రయాణం.

 
 
ఓం.జగన్మాతాపితరులకు  నమస్కారములు.

శ్రీశైల  మహాక్షేత్రంలోని  శివాజీ  స్ఫూర్తి  కేంద్రం  వద్దనున్న  సూర్యబలిజ  నిత్యాన్నదాన  సత్రంలో  విజయనగరం  జిల్లాకు  చెందిన  సత్యజ్ఞానానంద  దశాశ్రమ  పీఠాధిపతి  శ్రీ  యోగానంద  మహాభారతి  స్వామి  జలస్థంభన  విద్యను  ప్రదర్శించారట.....


మత్శ్యాసనంలో  నీటిపై  తేలియాడుతూ  రామాయణ  మహాకావ్యాన్ని  సుమారు  గంటకు  పైగా  ఉపన్యసించారట....ఇది  ఎంతో  గొప్ప  విషయం.  
 ఇలాంటివి    చూస్తుంటే    భారతీయ  విద్యలు  ఎంత  గొప్పవో  కదా  !  అని  ఆశ్చర్యంగా  అనిపిస్తుంది.  ఇంతటి  గొప్ప  విద్యలను  మనం  ఎంత  నిర్లక్ష్యం  చేస్తున్నామో  అని  బాధా  కలుగుతుంది.
 
**********

* పై  విషయానికి  ఈ  క్రింద  రాసిన  విషయానికి  సంబంధం  లేదులెండి.

కొంతకాలం  క్రిందట   మేము  ఒక   అడవి  మార్గంలో  కారులో   ప్రయాణిస్తున్నాము. (  మాది  కొంచెం  పాత  కారు.  ) అలా     క్రమంగా    చీకటి  క్రమ్ముకుంది..  అడవి  ఇంకా  ఘాట్  రోడ్  కూడా ఉంది . 



 అలా  వెళ్తూ  ఉండగా    కొంచెం  సేపు  గడిచాక   నా  భర్త , మా  అబ్బాయి  నెమ్మదిగా   ఏదో   మాట్లాడుకుంటున్నారు.  విషయమేమిటో    చెప్పమని  నేను  అడగగా  ,    ప్రయాణానికి  ముందు  బండిని  చెక్  చేసే  తీసుకువచ్చాము. మెకానిక్   అంతా  బాగానే  ఉందన్నాడు .  కానీ ,  ఇప్పుడు  చూస్తే     కారు  ప్రాబ్లం  ఇస్తుందేమో  అని   అనుమానంగా  ఉంది  . అన్నారు..
 

   అలాగే  వెళ్తుండగా   కొద్దిదూరం  వెళ్ళాక  కారు  ఆగీఅగి..  వెళ్ళటం  మొదలయ్యింది.  అసలే  అడవిలో  రాత్రి  ప్రయాణం.  ఇక  కారు  ఆగిపోతే  ఏమిటి  మా  గతి  ? దేవుడే  దిక్కు.  అలాగే  నెమ్మదిగా    వెళ్తే  అడవి   దాటి  ఏదైనా    చిన్న  ఊరు  చేరుకోగలమన్న  మా  ఆశలను  భగ్నం  చేస్తూ  కారు  ఆగిపోయింది.  ఆ  పరిస్థితి  తలుచుకుంటే  ఇప్పటికీ  ఒళ్ళు  జలదరిస్తుంది. 


 
 కారు  తోయటానికి    మా  అబ్బాయి  క్రిందికి  దిగాడు.    నా  భర్త  డ్రైవింగ్  చేస్తున్నారు.  అమ్మాయి  లోపల  కూర్చుంది.   చుట్టూ  అడవి  కదా  !  రాత్రి  పూట   క్రిందికి  దిగాలన్నా  భయమే,.  రాత్రి  సమయంలో  అడవి  జంతువులు  తిరుగుతాయంటారు.   నేను  కూడా  క్రిందికి  దిగి  కారును   తోయటానికి  ప్రయత్నించాను.  

 

   ఘాట్  రోడ్    అని  ముందే  తెలుసు  కాబట్టి , నేను  ఇంటినుంచి " శ్రీపాద  శ్రీవల్లభ  సంపూర్ణ చరితామృతము " గ్రంధాన్ని  తీసుకువెళ్ళాను.  ఆ  గ్రంధాన్నీ  ఒక  చేత్తో  పట్టుకుని  కారు  దిగి  తోయటం  మొదలుపెట్టాను.   చుట్టూ  చీకటి,  నిశ్శబ్దం.   కారు  స్టార్ట్  కావటం  లేదు.

 ఇక  ఏం  చేయాలో  తెలియక  కారును  తోయటం  ఆపి  కారులో  కూర్చోబోతుండగా  .....మా  ఆశలకు  ఊపిరి   పోస్తూ  ....దైవం  దయవల్ల  కారు  స్టార్ట్  అయ్యింది.



  అలా   వెళ్తుండగా  మా  వెనుక  ఒక  R.T.C. బస్  వచ్చి  వెళ్ళింది.   కారును  వదిలి  అందులో  వెళ్దామనుకున్నాము.  కానీ  ,  మళ్ళీ  మా  కారులోనే    వెళ్ళాము.

  కానీ    ఆ  బస్సును  చూడగానే  మాకు  ధైర్యం  వచ్చింది.   దైవమే  మాకు  తోడుగా ఆ  బస్సును  పంపారేమో  అని  నాకు   అనిపించింది.     అలా   నెమ్మదిగా  అడవి  దాటి  ఒక  ఊరు  చేరాము.



  ఊరు  చేరే  వరకూ  కారు  ఆగకూడదని     దైవాన్ని  ఎంతలా  కోరుకున్నానంటే....ఆర్తితో  కూడిన  భక్తి  అంటే  అలాగుంటుంది  అనిపించింది.  . మనకి  కష్టసమయాల్లోనే  కదా  భక్తి  విపరీతంగా    కలుగుతుంది.
 
 
   ఊరులోకి  వచ్చాక  షాప్స్  మూసేసి  ఉన్నాయి.  మెకానిక్  లు  కనిపించలేదు.  ఒక  మెకానిక్  షాప్  బయట    ఫోన్  నంబర్   వ్రాసి  ఉంది.  అతనికి  ఫోన్  చేస్తే  అతను  వేరే  ఊళ్ళో  ఉన్నాడట.     మేము    ఫోన్  చేస్తే  విసుక్కోకుండా    తనకి  తెలిసిన  ఇంకొక  మెకానిక్
అడ్రస్   చెప్పి  అక్కడకు  వెళ్ళమన్నాడు. 
 

 అతను  చెప్పిన  అడ్రస్ కు  వెళ్ళి    కార్  చూపించాము.   కారు   పరిస్థితి  బాగుంటే  కారులో  వెళ్దాము.  లేకపోతే  కారును  అక్కడ  ఉంచి,  బస్  స్టాండ్ కు  వెళ్ళి   బస్సులో  వెళ్దాము  అనుకున్నాము.  

 

 ఆ  మెకానిక్    కారును   పరీక్ష  చేసి    ఇలాంటి  పరిస్థితిలో    ఘాట్  రోడ్     నుండి  ఎలా  రాగలిగారో  ఆశ్చర్యంగా  ఉంది   ,    ఇక   ప్లెయిన్   రోడ్      కదా   !  నెమ్మదిగా  వెళ్ళండి  ఏం  కాదు . అనగా,  మేము    బయల్దేరాము.



   మొత్తానికి  దైవం  దయ  వల్ల  క్షేమంగా  ఇంటికి  చేరాము.    అలాంటి  సమయాల్లో  మాకు  ధైర్యం  చెప్పిన   ఆ  మెకానిక్  లు   భగవంతుడు  పంపినట్లే  అనిపించారు   మాకు.  
 
 
ఇంతకు  ముందు  కూడా  ఒకసారి  ఇలాగే  రాత్రి  సమయంలో  వెళ్తుంటే  జోరున  వాన  పట్టుకుంది.  ఆ  వానలో  కొండల  మధ్యన  కారు  ఆగిపోయింది. ఇక    సాయిసాయి .. అని  దైవ  ప్రార్ధన  చేయగా     దైవం  దయ  వల్ల     కారు  స్టార్ట్    అయ్యి  ఇంటికి  చేరగలిగాము. 
 
 
కారు  ఆగిపోయినప్పుడు  గుర్తొచ్చిన  అందరు  దేవుళ్ళనూ  ప్రార్ధించాము.  పేరు  ఏదైనా  అందరు  దేవుళ్ళు  ఒకటే   . 

   గ్రంధాలను  ఎప్పుడూ  పట్టుకెళ్ళటానికి  కుదరదు  కదా!   దైవాన్ని  మనసులో   స్మరించుకున్నా  చాలు .

 
అంతా  దైవం  దయ. 



 

7 comments:

  1. నమ్మకం ముఖ్యం సేనికయినా. అదే మిమ్మల్ని ఆదుకుంది, అదే దైవమంటే. దైవం మానుషరూపేణ.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం.

    ReplyDelete
  3. నేను తప్పులు చేసినప్పుడు దైవం నాకు శిక్షలు వేయటం కూడా గమనించానండి.

    అందుకే మన పాపపుణ్యాలను బట్టి కూడా జీవితం నడుస్తుంది.

    కాబట్టి సత్ప్రవర్తనతో నడుచుకోవటానికి అందరూ ప్రయత్నించాలి . అని నాకు అనిపిస్తుంది.

    ReplyDelete
  4. నమ్మిన భక్తులను ఎప్పుడూ ఆ భగవంతుడు కాపాడతాడని మరోసారి నిరూపించాడు..
    GOD IS GREAT

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం....GOD IS GREAT

    ReplyDelete
  6. నమ్మిన భక్తులను ఎప్పుడూ కాపాడడమే ఆ దేవుని పని .............
    FAITH AND TRUST IN GOD MOVES US FORWARD.

    ReplyDelete
  7. సీతగారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం.

    ReplyDelete