దైవం, ఈ భూలోకంలో మానవులను , వారి ఆహారానికి అవసరమైన మొక్కలనూ సృష్టించారు.
మొక్కలను సృష్టించటానికి ముందే , సూర్యుడిని, గాలినీ, నీటినీ , సృష్టించారు.
ఇలా ఒక పద్ధతి ప్రకారం అన్నీ సృష్టించబడ్డాయి.
ఇదంతా చూస్తేనే తెలుస్తోంది. అనంతమైన గొప్ప ఆలోచనా శక్తి గల మహాశక్తి వల్లనే , అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని.
ఇక దైవాన్ని ఎవరు సృష్టించారు ? అంటే ... మనకు తెలియని రహస్యాలు ఎన్నో సృష్టిలో ఉంటాయి.
వాటి గురించి మనకు తెలియనంత మాత్రాన అన్నీ అబద్ధాలు అనటం అవివేకం.
దైవం పచ్చటి ప్రకృతిని, పసిడిపంటలనూ, , పైరగాలినీ, రసభరిత ఫలాలనూ, సుగంధ పుష్పాలనూ .... ఇలా ఎన్నింటినో సృష్టించి మనకు ఇచ్చారు.
ఇంకా, మహా అగ్నిపర్వతాలనూ, మంచుపర్వతాలనూ, మహా సముద్రాలనూ కూడా సృష్టించారు.
సునామీలనూ, సుడిగాలులనూ, సుడిగుండాలనూ కూడా సృష్టించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ సౌకర్యాలు అమర్చి ఇచ్చినా ...
తామంటే కొద్దిగా భయభక్తులు ఉండటానికి అప్పుడప్పుడు పిల్లల పట్ల..... కోపాన్ని, గాంభీర్యాన్నీ , ప్రదర్శిస్తారు. అది పిల్లల మంచికోసమే.
వారు తప్పుదారి పట్టకుండా ఉండటానికి అలా చేస్తారు అంతే. .
అలాగే జీవులకు అన్నీ అమర్చి ఇచ్చిన దైవం భూకంపాలు, సునామీలను ఎందుకు సృష్టించారు అంటే ,
మానవులు మరీ అహంకరించకుండా భయభక్తులతో ఉండటానికి ,
లోకంలో ధర్మం క్షీణించినప్పుడు ,జీవులను హెచ్చరించటానికి ,
ఇంకా,
భూమిపై జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సమపాళ్ళలో ఉండటానికి, ..... ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.
జంతువులకు భూకంపాలు వంటి వాటిని గ్రహించే శక్తి ఉందట.
పూర్వం ప్రజలు జంతువుల ప్రవర్తన ఆధారంగా తామూ భూకంపాలు రావటాన్ని కొద్దిగా ముందే తెలుసుకుని జాగ్రత్త తీసుకునేవారట.
కొందరు , ఈ సునామీలూ, భూకంపాలను తప్పించుకోవటానికి మహిమలు తెలిస్తే బాగుండు అనుకుంటారు.
ఇక్కడ ఒక్క విషయం.
భూకంపాలు, సునామీలూ వచ్చినప్పుడు కూడా కొందరు ఏ హానీ లేకుండా బయటపడతారు.
ఒక పెద్ద ప్రమాదంలో అందరూ చనిపోగా ఒక పసిబిడ్డ చిన్న దెబ్బ తగలకుండా బయటపడిన వార్త ఆ మధ్య చదివాను.
ఈ మధ్యనే కాకినాడలో అపార్ట్ మెంట్ క్రుంగిపోయిన సంఘటనలో అందరూ సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతమే.
ఇదంతా వారివారి పూర్వసుకృతంపై ఆధారపడి ఉంటుంది. . కాలం కలిసివస్తే ఎంత గొప్ప ప్రమాదం నుంచి అయినా బయటపడతారని తెలుస్తోంది కదా !
లోకంలో ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటేనే కొందరు మానవులు విశ్వంలో తామే గొప్ప అంటున్నారు.
ఇక ఏ భయమూ లేకపోతే మనుష్యులు మరీ అహంకరించే అవకాశం ఉంది.,
మనం తెలుసుకోవలసింది ఏమంటే, ఇవన్నీ పరీక్షలు.
ఈ పరీక్షలకు తట్టుకుని ఈ లోకంలో సత్ప్రవర్తనతో జీవించిన వారికి బాధలు లేని ఉత్తమలోకాలకు వెళ్ళటానికి అర్హత లభిస్తుంది.
అందుకే, ఈ భూకంపాలు వంటి వాటికి భయపడకుండా , సత్ప్రవర్తనతో జీవితాన్ని సాగించటానికి ప్రయత్నించాలి .
అదే మనం చేయవలసింది......
Anuradha garu,
ReplyDeletejust wanted to share this video with you.
In this video, chinna jeeyar swamiji says, god and nature are perfect and natural calamities are typically human made.
https://www.facebook.com/photo.php?v=678126475535983&set=vb.164402590259318&type=2&theater
regards
vamsi
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఇప్పుడే మీ వ్యాఖ్యను చూసాను. పాత టపాలను చూస్తుంటే మీ వ్యాఖ్య కనిపించింది.
ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.