koodali

Friday, September 30, 2011

భక్తి యోగము లోని కొంత భాగము.....2

ఓం.

ఓ అర్జునా ! ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి , నన్నే పరమగతిగ దలంచిన వారై అనన్యచిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను.


నా యందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.


ఓ అర్జునా ! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నా యందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తఱి అభ్యాస యోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము.
( అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము. )


ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీవసమర్ధుడవైతివేని నా సంబంధమైన కర్మల జేయుటయందాసక్తి గలవాడవు కమ్ము. అట్లు నా కొఱకు కర్మలను జేయుచున్నను గూడ నీవు మోక్షస్థితిని బడయగలవు..


(.
వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..)


2 comments:

  1. భక్తి యోగము లోని కొంత భాగము.....2 అన్నారు మొదటి భాగం ఉంటె పోస్ట్ లో లింక్ ఇవ్వండి. థాంక్స్.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మీ కామెంట్ ఇప్పుడే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీనండి. మొదటి భాగం అంటే ఇంతకు ముందు టపాలో వ్రాశానండి. మీ వ్యాఖ్య చూశాక మొదటి భాగం అని అంకె వేశానండి....

    ReplyDelete