(.ఇంతకు ముందటి శీర్షికను మార్చి కొత్త శీర్షికను పెట్టానండి. )
నాకు దిన పత్రికలు , వారపత్రికలు, పుస్తకాలు ఇలాంటివి చదవటం బాగా ఇష్టం.... సమయముంటే అందులోని అడ్వర్ టైజ్ మెంట్స్ కూడా వదలకుండా చదువుతాను.
ఇంతకుముందు మేము వారపత్రికలు తెప్పించుకొనేవాళ్ళం. అందులో మంచి విజ్ఞానదాయకమైన ఆర్టికల్స్, మంచి కధలు ఉంటాయి కదా !
వాటితో పాటూ కొన్ని కధలూ........ వాటికి అసభ్యకరమైన బొమ్మలతో ఉంటాయి.
కొంతకాలం క్రిందట పత్రికల్లో ఇలాంటి బొమ్మలు వేసేవారు కాదు. ఒకరిని చూసి ఒకరు ఇలా మొదలుపెట్టారు.
ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ ఈ పుస్తకాలు చూస్తున్నప్పుడు, మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది... పత్రికల వాళ్ళు ఇలాంటి బొమ్మలు వెయ్యకపోతే బాగుండు అనిపిస్తుంది.
కొన్నిసార్లు పత్రిక రాగానే ఆ బొమ్మలున్న పేజీలు కత్తిరించి పారవెయ్యటం కూడా జరిగింది. ( పిల్లల వాటిని చూడకుండా ఉండాలని. ) కానీ.............. అలాంటి బొమ్మలు ఎక్కువయ్యి కత్తిరించటం మొదలుపెడితే ఇక పుస్తకమన్నది మిగిలేటట్లు కనిపించలా.....
ఇలాంటి పరిస్థితిలో నేను .ఒకసారి పత్రికా ఆఫీసుకి ఫోన్ చేసాను. ఆఫీసులో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసారు. నేను మా ప్రాబ్లం చెప్పాను.
మేము మీ పత్రిక 15 సంవత్సరాలనుంచీ కొంటున్నాము.మొదట మీ పత్రిక బాగుండేది. ............. ఇప్పుడు మీరు పత్రికలో వేసే బొమ్మలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి............... ఇంట్లో పిల్లలు చూస్తే బాగుండదు. దయచేసి అలాంటివి ప్రచురించవద్దు. అని.
వారు ఏమన్నారంటే ... అలాగేనండి...మీరు చెప్పిన విషయం పై వాళ్ళకు చెబుతాను అన్నారు.(సామాన్య ఉద్యోగులు అంతకంటే ఏమనగలరు లెండి ?)
ఈ దేశంలో నా లాంటి సామాన్యుల గోడు వినిపించుకునేదెవరు ?
ఆ తరువాత కూడా పత్రికలో బొమ్మలు అలాగే వచ్చాయి. ( అలా రాకపోతేనే ఆశ్చర్య పడాలి .)
ఇక చేసేదేమీ లేక మేము పత్రిక కొనటం మానేసాము.
వెనకటికి ఒక ముసలామె ఊరు వాళ్ళ మీద కోపమొచ్చి నేను, నా కోడి లేకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తాను అని తన కోడిని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయిందట.
అలా నేను కొననంత మాత్రాన ఆ పత్రికకు ఏమిటి నష్టం ? ప్రజలు చాలా మంది కొంటూనే ఉన్నారు గదా !
అయినా జరిగిన దానికి నాకేమీ బాధ లేదు. నా పరిధిలో నాకు చేతనయినది చేసానన్న తృప్తి నాకుంది.
ఈ పత్రికల వాళ్ళకు ఇలాంటివి వెయ్యకూడదని తెలియదంటారా ? తెలుసు , కానీ వాళ్ళ పత్రికల సర్క్యులేషన్ పెంచుకోవటానికి అలా వేస్తుంటారు.
అలా వార పత్రికలు తెప్పించుకోవటం మానేసాం కదా !
ఇప్పుడు దిన పత్రిక వాళ్ళు కూడా ..... పిల్లలు చూడకూడని అసభ్యకరమైన సినిమా బొమ్మలు అవీ వేస్తున్నారు. అవి కూడా మానేద్దామన్నంత కోపం వస్తోంది కానీ .. అన్నిటినీ మానేసి ఎక్కడికని చస్తాం. వార్తలు తెలియాలి కదా !
మరీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోతే కష్టమని తప్పనిసరి పరిస్థితిలో కొంటున్నాము.... మన చుట్టూ అవే ఉన్నప్పుడు టి.విలూ, నెట్లూ, ఇలా ఎన్నని మానేయగలం.
ఇలా సమాజాన్ని చెడగొడుతున్న వారి పాపం ఎప్పటికయినా పండకుండా పోతుందా............ .అని తిట్టుకుంటూ పత్రికలూ కొంటున్నాము, టి.వి ప్రోగ్రామ్స్ , సినిమాలు, ( కొన్ని ) చూస్తున్నాము... అంతకంటే సామాన్యులం ఏం చేయగలం ?
మాకు తెలిసిన వాళ్ళు కొందరు కేబుల్ కనెక్షన్ తీయించేసారు.... పిల్లలు పాడయిపోతున్నారని. మేము ఇంకా అంత త్యాగం చెయ్యలేకపోతున్నాము.
***********
ఇంకొక విషయం ఏమిటంటేనండి,
కొన్ని దేవాలయాలపైన శృంగారచిత్రాలు ఉన్నాయి.ఇలా వేయటానికి కారణాలు మనకు తెలియవు.
కొందరు ఏమంటారంటే, పాతకాలంలో నవవధూవరులకు శృంగారం గురించి తెలియజేయటం కొరకు కొన్ని దేవాలయాల గోడలపై శృంగారపరమైన చిత్రాలు వేసారని కొందరు అంటారు. ఇది కొంతవరకూ నిజమే కావచ్చు.
అయితే, కొన్ని అసభ్యకరమైన శృంగార చిత్రాలను గమనిస్తే, ఇలాంటి చిత్రాలు ఎందుకు ఉన్నాయో? అనే సందేహాలు కలుగుతాయి.
ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వాళ్ళలో కొందరు, కొందరు స్వార్ధపరులు, మతాన్ని వ్యతిరేకించే కొందరు..ఆధునిక కాలంలోనూ ఉంటారు, ప్రాచీనకాలంలోనూ ఉంటారు.
ఇలాంటి వారి వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇలాంటి వారి వల్లే అసభ్యంగా ఉండే చిత్రాలు కూడా కొన్ని దేవాలయాల గోడలపై ప్రవేశపెట్టబడి ఉండవచ్చు.
అంతేకానీ అసభ్యకరమైన సంస్కృతిని హిందూ సంస్కృతి సమర్ధించదు. మూఢనమ్మకాలను కూడా వ్యతిరేకించాలి.
(ఈ విషయం పోస్టులో తరువాత ప్రవేశపెట్టబడింది. )

బాగా వ్రాసారు
ReplyDeleteఇలాంటి బొమ్మలు అని అన్నారు గానీ ఎలాంటి బొమ్మలో అని చెప్పడానికి మీరు కూడా నాలుగు అర్ధ నగ్న ఫోటోలు పెట్టలేదు :))
వారం రోజుల క్రితం ఒక బ్లాగ్ లో అర్ధ నగ్న ఫోటోలు పెట్టి పోస్ట్ రాసారు , ఇలాంటి పోస్ట్ ని నలుగురిలో చదవలేము :(
కృతజ్ఞతలండి.
ReplyDeleteనేను అంత దూరం ఆలోచించలేదండి. శీర్షిక ఊరికే తోచినట్లు అలా పెట్టానంతే...
చాలా మంచి పని చేసారు.మీరు చేసిన ఇంకొక మంచిపని ఇక్కడ రాయటం.చేయాల్సిన మరొక మంచిపని ఒకటి) ఆ పత్రికేదో వివరాలు ఇవ్వటం.రెండు) ఆ పత్రిక యజమాని/సంపాదకుడు వీళ్లకి తీరిగ్గా ఒక ఉత్తరం రాసి-మీరు ఎన్నాళ్ల నుంచి చందాదారులుగా ఉన్నారు,ఎందువల్ల చందా రద్దుచేసుకున్నారు పత్రికలో మీరు గమనించిన అభ్యంతరకరమైన మార్పులు,వాటివల్ల మీకు కలిగిన చిరాకు...ఇలా తీరిగ్గా ఒక ఉత్తరం వీలుంటే రిజిస్టర్ పోస్టులో పంపండి.ఫోను అంటే యే గొట్టంగాడో తీయచ్చు.ఇది అలా కాదు,మీకు సమాధానం వస్తుంది చచ్చినట్టు
ReplyDeleteకృతజ్ఞతలండి.
ReplyDeleteఒకటే అరో తప్పితే ఇప్పుడు చాలా పత్రికలు ఇలాగే ఉన్నాయండి. ఫోన్ చెయ్యటం కన్నా మీరన్నట్లు ఉత్తరం రాయటమే మంచి పద్దతి. అయితే వీళ్ళందరికి ఇలా చేయకూడదని తెలుసు. తెలిసీ తప్పు చేస్తున్న వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేయగలరు ?
చాలా స్వచ్చంద సంస్థల వాళ్ళు టి.వి ప్రోగ్రాంస్ లో, సినిమాల్లో వచ్చే కొన్ని అసభ్యకరమైన దృశ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. దేనికైనా ప్రజా చైతన్యం బాగా పెరిగినప్పుడు మాత్రమే మంచి ఫలితం ఉంటుందని అనిపిస్తుంది.