నాకు మూడు ,నాలుగు రోజులు కొంచెం పని ఉందండి.
అందుకని ఈ రోజు పోస్ట్ రాద్దామా ? వద్దా ? అనుకుంటుంటే.. మీ కామెంట్స్ ఇంతకుముందే చదివానండి. అందువల్ల ఈ పోస్ట్ ద్వారా నాకు తెలిసినంతలో చెప్పటానికి ప్రయత్నిస్తానండి.
కొందరు డాక్టర్స్ కు కూడా వ్యాధులు ఎందుకు తగ్గటం లేదు ? అని రాయటానికి కొన్ని కారణాలున్నాయండి.
నా దృష్టిలో దైవం.........సైన్స్ వేరు వేరు కాదండి. దైవం సృష్టించిన సృష్టిలో సైన్స్ ఒక భాగమే. కానీ కొందరు ఏమంటారంటే.....దైవం అని ఎవరూ లేరు. సైన్సే గొప్పది అని.. అది దృష్టిలో ఉంచుకొని , సైన్స్ అంత గొప్పదయితే .......... మరి మందులు వాడినా కొందరు డాక్టర్లకు జబ్బులు ఎందుకు తగ్గటంలేదు అన్న దానికి .. డాక్టర్లను ఉదాహరణగా చెప్పటం జరిగింది.
అంతేగానీ డాక్టర్లను తక్కువగా చెప్పటం నా ఉద్దేశం కాదండి. నాకు డాక్టర్లంటే చాలా గౌరవం. ఎవరికయినా రోగాలు తగ్గాలంటే మందులతో పాటూ దైవకృప కూడా ఉండాలన్నదే నా అభిప్రాయం.
మీరు ఒత్తిడి వల్ల కొందరికి జబ్బులు తగ్గవు అంటున్నారు. నిజమే కానీ చాలా జబ్బులు వచ్చేదే ఒత్తిడి పెరగటం వల్ల. మరి ఒత్తిడి తగ్గకపోతే మందులు పనిచేయవు అంటే జబ్బులు తగ్గటం కష్టమే.............
పూర్వం మన పెద్దవాళ్ళు 90 ఏళ్ళు అలా ఆరోగ్యంగా జీవించిన వారు చాలామందే ఉన్నారు. గత కొన్ని శతాబ్దాలుగా కొన్ని కారణాలవల్ల భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం తగ్గటం జరిగింది.
విదేశీయాత్రికులు ఎందరో ........... భారతదేశ సౌభాగ్యాన్ని, ఇక్కడి ప్రజల సంస్కృతిని, ఎంతో గొప్పగా ప్రశంసించారు............. అప్పటి ప్రజలు ఎంతో పుష్టిగా ,ఆజానుబాహు శరీరాన్ని కలిగి ఉండేవారట. మ్యూసియంస్ లో ఆనాటి వీరుల దుస్తులు చూస్తే ......... ఆ విషయం తెలుస్తుంది.
ఇక పురాణకాలం వాళ్ళయితే వందల సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది. అలాంటివాళ్ళం ఇలా అయిపోయాం. మన ఖర్మ.
ఇక వివేకానందులవారు , శంకరులవారు ఇలాంటి వారు తక్కువ కాలమే జీవించినా ....సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి చరిత్రలో నిలిచిపోయారు.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఎవరు ఏమన్నా దైవం.అతీతశక్తులు తప్పక ఉన్నాయి.
ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిని సాధించిన వారికి కొన్ని అతీతశక్తులు వస్తాయట. వారు వాటిని లోకోపకారం కోసం కూడా వినియోగిస్తారట.
ఈ విశ్వాన్ని సృష్టించిన దైవం కూడా తాను నిర్మించిన ధర్మాన్ని తాను అతిక్రమించటం జరగదట.
అలాగే గొప్పవారు కూడా ధర్మం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. ప్రతీదానికి తమ మహిమలను వినియోగించరు.
మీరు అన్నట్లు రామకృష్ణపరమహంస , షిరిడిసాయి బాబా ,ఏసుక్రీస్తు వీరందరూ కూడా కొన్ని బాధలు అనుభవించారు.... నిజమే , అందుకు చాలా కారణాలుంటాయి. మనకు సరిగ్గా తెలియదు.
అయితే వారు తమ శిష్యుల, భక్తుల బాధలను తాము స్వీకరించటం వల్ల ..వారు అలా బాధలను అనుభవించవలసి వచ్చిందని పెద్దలు చెబుతారు.
వీరందరూ తమ భక్తులను ఎన్నో కష్టాల నుంచీ రక్షించారు. అలా మహిమలు చూపించి ...... లోకంలో దైవం యందు నమ్మకాన్ని కలిగించారు........... ఆ విధంగా ప్రజలు ధర్మమార్గంలో జీవించటానికి కృషి చేసారు.
ఇక వీరు గొప్పవాళ్ళయ్యీ ఎందుకు బాధలు అనుభవించారు ? అంటే ప్రతి దానికి ఒక పధ్ధతి ఉంటుంది.... అధికారం, మహిమలు ఉన్నాయని వాటిని ఎడాపెడా వాడరుగదా నీతిపరులు.
ఉదా....ఒక గొప్ప జమీందారు ఉన్నారనుకోండి. వారి పిల్లలు ఏవైనా తప్పులు గానీ, అప్పులు గానీ చేసి అప్పులవారిబారి నుండి రక్షించమని వస్తే.... ఆ జమీందారు లాంటి పెద్దలు చేస్తారు ?
కొందరు పెద్దలు తమ పిల్లలు చేసిన అప్పులు, తాము తీర్చి .... ఆ పిల్లలు అనుభవించాల్సిన శిక్ష తాను అనుభవిస్తారు ..
కొన్నిసార్లు పిల్లలకు బుధ్ధి చెప్పాలనిపిస్తే వాళ్ళను శిక్షిస్తారు. ( పిల్లల పరిస్థితిని బట్టి ఏది ఎలా చేస్తే బాగుంటుందో అలా చేస్తారు. )
అంతేగానీ తాను జమీందారు కాబట్టి ... తన పిల్లలు ఏం చేసినా చెల్లుతుందని తన అధికారాన్ని అప్పుల వాళ్ళ మీద ప్రయోగిస్తే అది అన్యాయమే అవుతుంది.
అలాగే గురువులు ఆదుకొమ్మని తమను శరణు వేడే శిష్యుల, భక్తుల బాధలను .... తాము భరిస్తారు ( వ్యాధి రూపంలో గానీ, ఇతరరూపాలలోగానీ )అంతే గానీ వారికి మహిమ లేక కాదు.
షిరిడి సాయి తమ మరణానికి కొన్ని సంవత్సరాల ముందు వ్యాధికి గురయ్యి ... ఉచ్చ్వాశ, నిశ్వాసలు కూడా లేని పరిస్థితి తరువాత మూడురోజులకు ....మరల కళ్ళు తెరిచారు. అంతటి శక్తి వారికుంది.
తాత్యాకోతే పాటీలు అనే తన భక్తుని మరణాన్ని తప్పించటం కొరకు సాయి .... తాను త్యాగం చేసారని చెబుతారు.
ఇక శ్రీ మహా విష్ణువు లోకాన్ని పీడించే రాక్షసులను సంహరించే క్రమంలో ........... భృగు మహర్షి చేత శాపానికి గురయ్యారు. భృగు మహర్షి ..... విష్ణుమూర్తి భార్యా వియోగంతో బాధపడాలని శాపం ఇవ్వటం జరిగింది. ( రామావతారంలో సీతావియోగం జరగటానికి ఇదొక కారణం. )
ఆ విధంగా ప్రజల సుఖం కొరకు రాక్షసులను చంపే క్రమంలో ............. విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించి బాధలు పడవలసి వచ్చింది.
కృష్ణుడయినా.....క్రీస్తు అయినా ప్రజల సుఖం కొరకు ఆ బాధలు తాము భరించారు.
కష్టాలనుండి కాపాడమని , తమ దగ్గరకు వచ్చిన భక్తులను బాధల నుండి తప్పించటానికి .వారు .. రకరకాల పధ్ధతులను ఉపయోగిస్తారు.
ఒకోసారి తమ తపశ్శక్తిని ఉపయోగించి ..........భక్తుల పాపకర్మను నిర్మూలించి కష్టాలను పోగొడతారు. ఒకోసారి శిష్యులు,భక్తులు అనుభవించాల్సిన బాధలు ... వారి బదులు తాము అనుభవిస్తారు. ( ఆ పరిస్థితిని బట్టి ఏది, ఎలా చేస్తే ధర్మంగా ఉంటుందో అలా చేస్తారు. )
అందుకే దేవుడిని గానీ, తల్లిదండ్రులను గానీ బాధపెట్టకూడదంటే మనం తప్పులు చెయ్యకూడదు.
ఇక సత్యసాయి బాబా గురించి నాకు పెద్దగా తెలియదండి. అయితే ఈ మధ్య నెట్ లో చూస్తోంటే ఇది కనిపించింది........మీరు కూడా చూడండి.............. kirlian photography ......satya sai baabaa Archives ...........
నాకు తోచింది తొందరగా రాసానండి. ఇందులో పొరపాట్లు వస్తే దైవం క్షమించాలని కోరుకుంటున్నాను.
దైవం తనకొరకు మనుషులను సృష్టించాడు
ReplyDeleteమనుషులు తమకొరకు సైన్సును సృష్టించారు.
అసలు సైన్సు పుట్టింది ప్రకృతి రహస్యాలు తెలుసుకుని వాటిని ఉపయోగించుకున్దామని అంతకి తప్పితే సైన్సు అంటూ ఏమీ లేదు. ఇంకోవిధంగా చెప్పాలంటే సైన్సు ద్వారా పరిశోధనలు చేసేది ప్రకృతి సృష్టించిన వాటి మీదే. ప్రకృతిని అర్ధం చేసుకోటానికి సైన్సు ఒక మార్గము. ఆ ప్రకృతిలో కొన్ని భాగాల్ని కొందరికి కంట్రోల్ చేసే శక్తీ ఉండచ్చు. దానికి మనము సృష్టించిన పరిశోధన శాలే కావాలని లేదు. కొందరికి ప్రకృతే ఒక పరిశోధన శాల. అదే దైవత్వమేమో. దానిని గురించి మనకి తెలియదు కాబట్టి అది లేదు అని చెప్పటం సబబు కాదేమో.
ReplyDeleteమీరు బ్లాగ్ పైన పెట్టిన పిక్చర్ చాలా బాగుంది. ఎక్కడ తీసారు దాన్ని.
ReplyDelete$anrd గారు
ReplyDeleteచాలా చక్కగా రాసారు. మీరు ఉదాహరించిన సందర్భాలాన్నీ
వాస్తవజీవితంలో మనకు ఎక్కడోక్కడ తారసపడుతూ ఉంటాయి. అది తెలుసుకోగలిగినోరు ఉత్తములు లేకున్న 'ఉత్త'మోత్తములు :)
#దైవం,సైన్స్ వేరు కాదు........ సైన్స్ సృష్టిలో భాగమే
అందులో సందేహమే లేదు. చాలావరకు వితండవాదనలతో తొక్కబడిన వాస్తవాలు ఇప్పుడిప్పుడే మీలాంటి పెద్దలు(పిన్నలు ఆయితే జ్ఞానంలో పెద్దలు) బ్లాగుముఖంగా పంచుకోవడం ఈతరం చేసుకున్న అదృష్టం.
అమూల్యమైన విషయాలు పంచుకున్నందుకు మరోక్కసారి ధన్యవాదాలు :)
please see my blog for further discussion:
ReplyDeletehttp://shankaratnam.blogspot.com/
ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీ చెబుతున్నానండి. మేము నాలుగు రోజులు తమిళనాడులో కొన్ని దేవాలయాలు చూడటానికి వెళ్ళి ఈ రోజే వచ్చామండి..........
ReplyDeleteనిజమేనండి. దైవం మనుషులతో సహా సర్వ సృష్టిని సృష్టించారు. ........ సైన్స్ అంటేనే ..........ఖగోళం ,భూమిపై ఎన్నో రకాల జీవుల పుట్టుక, వాటి పరిణామ దశలు, లోహాలు, అంతరిక్షం ,అణువు,పరమాణువు.......... వీటిని గురించి వివరాలు తెలుసుకోవటం. ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ తో సహా .ఇవన్నీ దైవసృష్టే.
అయితే మీరన్నట్లు మనుషులు తమకోసం సైన్స్ ను సృష్టించారు. ( అంటే, మనుషులు......... భగవంతుని సృష్టిలో ఉన్న ....... మూలకాలు, లోహాలు ఇలాంటి వాటి సహాయంతోనే కొత్త వస్తువులను తయారుచేసి ఆధునిక సైన్స్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అంతే..............)
.ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీ చెబుతున్నానండి. మేము నాలుగు రోజులు తమిళనాడులో కొన్ని దేవాలయాలు చూడటానికి వెళ్ళి ఈ రోజే వచ్చామండి..........
ReplyDeleteమీరు చెప్పినట్లు ......అసలు సైన్స్ పుట్టింది ప్రకృతి రహస్యాలు తెలుసుకుని వాటిని ఉపయోగించుకుందామని. అంతకు తప్పితే సైన్స్ అంటూ ఏమీ లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే సైన్స్ ద్వారా పరిశోధనలు చేసేది ప్రకృతి సృష్టించిన వాటి మీదే.......
బ్లాగ్ పైన పిక్చర్ .......... నేచర్ పిక్చర్స్ లో ఉంటే చూసి పెట్టామండి. ఇంకా నెట్లో కూడా ఇలాంటి చక్కటి సీనరీస్ చాలా ఉన్నాయండి. ఇలాంటి ఫొటోస్ తీసినవారికి నా కృతజ్ఞతలు.
ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీ చెబుతున్నానండి. మేము నాలుగు రోజులు తమిళనాడులో కొన్ని దేవాలయాలు చూడటానికి వెళ్ళి ఈ రోజే వచ్చామండి.........
ReplyDelete.మీరు అనుకుంటున్నట్లు నాకు మరీ ఎక్కువగా విషయాలేమీ తెలియవండి. బ్లాగుల్లోనూ బయట ఎందరో ఎంతో ఎక్కువ విషయ పరిజ్ఞానం తెలిసిన వారున్నారు. ( మీరు కూడా మీ బ్లాగ్ లో ఎన్నో విషయాలు రాస్తున్నారు ) అందరితో పోల్చుకుంటే నాకు తెలిసిన విషయాలు చాలాచాలా తక్కువండి...
please see my blog for further discussion:
ReplyDeletehttp://shankaratnam.blogspot.com/2011/05/blog-post.html