నేను ఇంతకుముందు ఒకోసారి చాలా చాదస్తముగా ప్రవర్తించటం జరిగేదండి.
ఉదా..ఒకోసారి మా ఇంట్లోని వాళ్ళని ప్రొద్దున్నే గుడికి వెళ్తే మంచిదని చెప్పి తీసుకువెళ్ళటం జరిగేది. నా అభిప్రాయమేమిటంటేనండీ గుడికి సాయంత్రం వెళ్తే అప్పటికి ఏదోఒకటి తినటం జరుగుతుంది కదా అని ................
.ఇక్కడ ఏమి జరిగేది అంటేనండి ఉదయం ,పిల్లల స్కూల్ కు సమయము మించిపోతుండేది. గుడిలో ఒకోసారి అభిషేకం తరువాత అలంకరణ చేసే సమయములలో దేవుని ముందు తెర వేసి ఉంటుంది. ఒకోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు దర్శనం ఆలస్యమవుతుంది.
ఇలాంటప్పుడు పిల్లలు స్కూల్ టైం అయిపోతోందని కంగారు పడతారు. వాళ్ళ అభిప్రాయం సరి అయినదే. గుడికి వెళ్ళటం వల్ల ఆలస్యమయిందని చెబితే టీచర్ ఊరుకోరుగదా !
ఏదిఏమైనా నేను వాళ్ళను వదలక ఇంకొంచెము సేపట్లో దర్శనం అయిపోతుందిలే అని సర్దిచెబుతాను. నాకు మనస్సులో అయ్యో స్కూల్ సమయం మించిపోతోదని కంగారుగానే ఉంటుంది.కానీ దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏమిజరుగుతుందో అని శంక. ఇలా నేను ఇంట్లో వాళ్ళను చాలా సతాయించాను పాపం.
ఇప్పుడు కొద్దికొద్దిగా అలాచేయటం మానివేసి నాకు ఎంత వీలయితే అంతే చేస్తున్నాను. వాళ్ళకి ఇప్పటికి దేవుడంటే భక్తి ఎక్కువే ఉంది. నేను గనక ఇలా చాదస్తముగా కంటిన్యూ చేస్తే వాళ్ళు నాస్తికులవుతారేమోనని ఒక భయం వచ్చింది.
ఇంకా నాకు ఏమని అనిపించిందంటేనండీ ,నాలో కోపము, చిరాకు, నెగెటివ్ ఆలోచనలు ఇలా ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. ముందు ఇలాంటివి భగవంతునికి అస్సలు నచ్చవు. ఇలాంటివాటి విషయములో నా మనస్సును అదుపులో ఉంచుకోవటం నాకు చేతకాక పూజవిధివిధానాల పేరిట ఇంట్లో వాళ్ళని సతాయించటం ఏమి న్యాయం అని అనిపించింది.
ఇలా విధివిధానాల వెంపర్లాటలో పడి భగవంతుని యందు ధ్యాస, ప్రేమ, భక్తి కి దూరమవుతున్నానేమో అని కూడా సందేహమొచ్చిందండి.
అందుకే పూజలో లోటుపాట్లకు దైవాన్ని క్షమించమని కోరుకుంటూ ...భగవంతుని యందు ప్రేమ భక్తికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిదని అనిపిస్తోదండి.
ఇప్పుడు స్కూల్ కు వెళ్ళే తొందరలో గుడికి వెళ్ళటం లేదు. వెళ్ళినా ఒకవేళ దర్శనం కాకపోతే అసంతౄప్తి చెందక బయటనుంచి నమస్కరించి వచ్చేయటం మంచిపద్దతి అని అనిపిస్తోంది.
భోజనం చేసినా గుడికి ప్రశాంతముగా సాయంకాలం వెళ్ళటం మంచిదని అనిపిస్తోదండి..
దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.

చాలావరకూ అన్ని జీవితాల్లోనూ జరిగే/జరిగిన సంగతులు మీరు చక్కగా చెప్పగలిగారు. థాంక్స్.
ReplyDeleteమీరు ధర్మాన్ని గూర్చి ఆలోచించేప్పుడు కాస్త అన్నివిషయాలు చూడండి. విద్యార్థి చదువుకోవాలి ,శ్రామికుడు పనిచేయాలి అలాగే ఎవరి ధర్మాన్ని వాళ్ళు సరిగ్గా సమయానుసారంగా నిర్వహించాలి . అందుకే కర్తవ్య నిర్వహణ కూడా దైవసేవతో సమానమన మన పెద్దలు చెప్పారు . ఇలా వాళ్ల కర్తవ్యాలను అడ్డుకోవడం వలన పరమాత్మ ఆగ్రహానికి గురికావలసి వస్తుంది .అది మానసిక కల్లోలంగా మనకు అనుభూతమవుతుంది .
ReplyDeleteకాబట్టి ఎప్పటి పని అప్పుడు మాత్రమే ,ఎవరు ్ చేయాల్సిన పని వారు ్ చేసేందుకు మనం సహకరించాలి .
మీకు కూడా ధన్యవాదములండి .
ReplyDeleteమీకు నా ధన్యవాదములండి. మీరు చెప్పినది నిజమేనండి. నాకు కూడా అలా అనిపించి కొద్ది కాలం క్రితం నుంచి నన్నునేను మార్చుకుంటూ వస్తున్నాను..
ReplyDelete