koodali

Monday, September 6, 2010

కష్టకాలములో అండగా......

 

శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఈ విధముగా చెప్పబడినది.

సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవానియందు నమ్మకముంచినట్లు, సం సారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను........


ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల మాయాశక్తి బారి నుండి తప్పించుకొందురు.................

పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఒకప్పుడు అతడనేక కష్టములు పాలయ్యెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు.


ఒకప్పుడు అతని స్థితి చాల హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయనిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండుమాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను.


కొన్ని అడుగుల దూరమున ఒక హోటలుండెను. దాని యజమాని సగుణమేరునాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను పిలచి అక్కల్ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా ? అని అడుగుచూ పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కధ వచ్చెను. ...........


అక్కల్ కోట్ కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను.

బాధను సహించలేక నిరాశచెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. ...........


గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తి , బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు ? గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము .



సమయోచితమయిన ఈ కధను చదివి , అంబాడేకర్ చాలా ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో అతను చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును , దయాళుత్వమును చూచి అంబాడేకర్ కు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృడమయ్యెను.


అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృధ్ధి పొందెను.


జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడపెను..


ఈ కధలను చాలా మంది చదివే ఉంటారు. కాని మర్చిపోతూంటాము. కష్ట సమయములలో ఇలాంటి భక్తి కధలను గుర్తు తెచ్చుకొంటే ధైర్యముగా ఉంటుంది. . .
..

 

No comments:

Post a Comment