koodali

Friday, September 24, 2010

కొంతమంది టెన్షన్ గా ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టుకోమని అంటుంటారు. నాకయితే దానికిబదులు దైవనామ స్మరణ మంచిదనిపిస్తుంది.

...... ఆ తరువాత నుండి నాకు వీలు కుదిరినప్పుడల్లా దైవనామ స్మరణ చేస్తున్నానండి. అయితే ప్రారంభములో యధాప్రకారం కొన్ని సందేహములు వచ్చాయండి.


అసలు ఏ దేవుని నామము అన్న దగ్గరనుంచి .....నెమ్మదిగా అనుకోవాలా ? లేక త్వరత్వరగానా అన్న వరకూ .........అయితే కష్టం లేకుండా సుఖంగా ఎలా స్మరించుకోవాలి ? ఇలాంటి విషయములన్నీ ఎవరి వీలునుబట్టి కాలక్రమేణా వారికే తెలుస్తుందండి.


భోజనం చేసేటప్పుడు, టి.వి. చూసేటప్పుడు , ప్రయాణములు చేసేటప్పుడు కూడా నామస్మరణకు మంచి అవకాశం కుదురుతుంది.


కొంతమంది టెన్షన్ గా ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టుకోమని అంటుంటారు. నాకయితే దానికిబదులు దైవనామ స్మరణ మంచిదనిపిస్తుంది.

ఒక్కొక్క నామము ఒక్కొక్క మందు బిళ్ళలాగ పనిచేస్తూ ఎప్పటికయినా మన పురాతన పాపకర్మలన్నీ నశిస్తాయి మరియు క్రొత్తగా మనము పాపకర్మలు చేయకుండా ఆ నామములు అడ్డుకుంటాయి.


నా కయితే నామస్మరణ శ్రధ్ధగా చేసినప్పుడు నా తెలివితేటలకు మించిన ఆలోచనలు రావటాన్ని గమనించాను. బ్లాగ్ లో దైవానికి సంబంధించిన విషయములు వ్రాసినప్పుడు ఆ ఆలోచనలు ఇలా వచ్చినవే.


మొదట్లో రకరకముల నామములు మార్చానండి. అయితే శ్రీ మాత్రే నమః, ఓం నమఃశివాయః, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాటి నామములు చెయ్యాలంటే కొన్ని నియమములు పాటించాలేమోనని నాకు అనిపించిందండి. { నియమములు పాటించాలో అవసరం లేదో నాకు తెలియదండి }


అలా పాటించటం నావల్ల అవుతుందో లేదో ..... ఎందుకులే అనుకుని ప్రస్తుతం ఓంకారం లేకుండా సాయిసాయి అనుకుంటున్నాను.


పూజలో శుచిగా ఉన్నప్పుడు మాత్రము ఏ దేవునివైనా నామములు అనుకోవచ్చు. ....... శుచి మరియు అశుచి ......... ఇలా అన్ని సమయములలోను సాయినామమునకు ఎటువంటి పట్టింపులు లేవు కదా ....అని ఇలా చేస్తున్నాను.
అన్ని వేళలా శుచిగా ఉండటం ఎలా కుదురుతుంది ?


ఏ దేవుని పేరు అయినా అంతా పరమాత్మయే కదండి.................



నాకు అయితే ఏమని అనిపిస్తుందంటేనండి ,... కలియుగమున దైవనామస్మరణం అవసరమని పెద్దలే తెలిపారు కాబట్టి, ....... ఎవరైనా ఎటువంటి సమయములోనైనా ,ఏ దేవుని నామమునైనా నిరభ్యంతరముగా స్మరించుకోవచ్చు అని.



సమస్యలు వచ్చినప్పుడు దైవ నామస్మరణ వల్లా ఎంతో ధైర్యముగా అండగా అనిపిస్తోంది. కలియుగమున దైవనామస్మరణ తరుణోపాయమని పెద్దలు కూడా తెలిపారు కదండీ...


నాకు దైవ నామస్మరణం పధ్ధతిప్రకారం ఎలా చెయ్యాలో తెలియదండి. నేను చేస్తున్న పధ్ధతి నాకు ఇప్పటికి బాగానే ఉంది.

వ్రాసినదానిలో తప్పులుంటే దయచేసి క్షమించండి.

10 comments:

  1. బాగున్నదండి మీ పద్ధతి.
    విమర్శకి అనడం లేదు, తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నాను. టీవీచూస్తున్నప్పుడు నామస్మరణ ఎలా చేస్తారు?

    ReplyDelete
  2. చాలా బాగుంది మీ పద్ధతి. "కలౌ నామ స్మరణాన్ముక్తిః| "

    ఏ దైవ నామ స్మరణ అయినా చేసుకోవచ్చు. దానికి ఏనియమాలు పాఠించ నవసరంలేదు. మనసుకు గుర్తుకు వచ్చినప్పుడల్లా నామస్మరణ చేయవచ్చు. అది ఓ అలవాటుగా మార్చుకోవాలంటే ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయకూడదు అంటే కుదరదు. బాత్రూంలో కూడా మనసుతో జపించవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చా చేయ కూడదా? అన్న సందేహం వస్తే పెదవులతో కాక మనసుతో జపించడం ఎల్లప్పుడూ మంచిదే అంటారు.

    ReplyDelete
  3. మీకు మనసు లయమైతే ఏనామమైనా ఒకటే . శుభమ్ అలాగే చేయండి .

    ReplyDelete
  4. చదివినందుకు మీకు కృతజ్ఞతలండి. టి.వి చూస్తూ దైవనామస్మరణ అంటే ........... ఇక్కడ ఒక్కవిషయం అండి..........ఉదా.........ఎప్పుడైనా మన మనస్సు బాగోనప్పుడు దేవుని పూజ చేస్తూ అలవాటయిన సహస్రనామములను అంటూ ఉంటాము. కానీ మనస్సు మాత్రం వేరే సమస్య గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా రెండు పనులు చేస్తున్నాము కదా.

    ఇక ఆడవాళ్ళు ఉదయం పూట ఒక ప్రక్క వంట, ఒక ప్రక్క ఇంట్లో అందరికి అన్నీ చూస్తూ ఒక రకంగా అష్టావధానమే చేస్తుంటారు.

    అలాగే మగవాళ్ళు కొందరు ఒకోసారి భోజనం చేస్తూ, ఫోన్ లో బిజీగా మాట్లాడుతూ ఉండటం చూస్తూంటాము.

    ఇలాగే ఏదీ అసాధ్యం కాదండి.

    అయితే టి.వి. చూస్తూ దైవనామస్మరణ వల్ల శ్రధ్ధ అంతగా ఉండచ్చు, ఉండకపోవచ్చు. కానీ పూజ, దైవనామస్మరణ పూర్తిగా మానివేయటం కన్నా అసలంటూ చేయటం వల్ల ఎంతోకొంత పుణ్యం వస్తుంది కదండి.

    నెమ్మదిగా దాని యందు శ్రధ్ధ పెరగటానికి కారణమవుతుంది. సాధన చేయగా,చేయగా అదే అలవాటవుతుంది.

    సాధనలో ఒక స్థాయికి వెళ్ళిన వారికి తమ పనులు తాము చేసుకుంటూనే , మనస్సుతో, శ్వాసతో దైవనామస్మరణం చేయటం అలవాటవుతుందట.

    ఇక జనమేజయ మహారాజు లాంటివారికి సంసారములో స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నా మనస్సు మాత్రం దైవం యందు ఉంటుందట.. .

    ReplyDelete
  5. .చదివినందుకు మీకు నా కృతజ్ఞతలండి. నా సందేహము తీర్చినందుకు కూడా మీకు నా కృతజ్ఞతలండి. ఎప్పుడైనా ఏ దేవుని నామమునయినా స్మరించుకోవచ్చు అన్న విషయం నాకు చాలా ఆనందముగా ఉన్నదండి.

    నిజమే మామూలుగా బిడ్డలు శుభ్రముగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు తమ చంటిపిల్లలు క్రిందపడి దెబ్బతగిలించుకుంటే ఎత్తుకోవటానికి వారు శుభ్రముగా ఉన్నారా, లేదా ? అని చూడరు కదా.. బిడ్డల యందు ప్రేమతో వెంటనే దగ్గరకు తీసుకుంటారు. ఆ పరమాత్మ { జగన్మాతాపితరులు } కూడా బిడ్డలమైన మనలను అలాగే అక్కున చేర్చుకుంటారు. . ..

    ReplyDelete
  6. చదివినందుకు మీకు నా కృతజ్ఞతలండి. ఏ దేవుని నామమయినా ఆ పరమాత్మ ఒకటే కదండి. శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు నా కృతజ్ఞతలండి.. మీకు మరియు అందరికి ఆ భగవంతుడు శుభమును కలిగించాలని కోరుకుంటున్నానండి.

    ReplyDelete
  7. చాలా విలువైన విషయాలు చెప్పేరు. ఈ సందర్భంలొ నాకు తెలిసిన విషయాలు చెప్పే ప్రయత్నం చెస్తాను. నేను ఈ విషయంలో విద్యార్ధినే అని సవినయంగా మనవి చీసుకుంటున్నాను.

    అజప జపం : జపం కాని జపం
    మొదట మంత్ర ఉచ్చరణ మనస్సుతో సాధన చెయ్యలి.పైన చెప్పినట్లు సర్వ కాల సర్వవస్థలయందు (TV చూస్తూనే కాదు, నిద్ర పొతున్నపుడు కూడా) సాధన చెయ్యలి. సో హం సాధన ఉచ్చాస నిఛ్వాసాలతో చెయ్యడమ ఒక పద్ధతి.

    సాధన చెయ్యగా చెయ్యగా, మంత్రం, చాల సార్లు విన్న తియ్యటి పాటలాగ దానంతట అదే వినిపించడం మోదలు పెడుతుంది.

    మరికొంత సాధన తరువాత కేవలం consciousness ఉంటుంది (అట) . ఈ స్థాయిలో మంత్రం మీద కొంత మనస్సు లగ్నమయ్యి ఉంటుంది

    సాధన పరిణితి చెందుతున్నపుడు, మంత్రం సర్వ వ్యాపితంగా కనిపిస్తుంది,వినిపిస్తుంది.

    ఈ విషయం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఈ పుస్తకాలు/Reference చూడచ్చు : 1. Hamsa Yoga - The Elixir of Self RealizationSoham-Sadhana(http://www.scribd.com/doc/9509290/Hamsa-Yoga-The-Elixir-of-Self-RealizationSoham-Sadhana)

    2.Hamsa Upanishad(http://www.scribd.com/doc/8496197/Hamsa-Upanishad)

    3.Short Introduction (http://www.swamij.com/mantra-japa-ajapa.htm)

    ReplyDelete
  8. చదివి మీ అభిప్రాయములు తెలిపినందుకు నా కృతజ్ఞతలండి. అజపజపం గురించి మరియు ఆ సాధన గురించిన పుస్తకముల వివరములను తెలిపినందుకు కూడ కృతజ్ఞతలండి. ... .నిద్రపోతున్నప్పుడు కూడా సాధన చెయ్యటమనే స్థాయికి రావాలంటే ఎంత ఎక్కువ సాధన చెయ్యాలో అని ఆశ్చర్యమనిపించిందండి. అలాంటి గొప్ప వాళ్ళకి నా వందనములు. నేను రోజులో కొద్ది కాలం చెయ్యటానికే అదేదో గొప్ప విషయంగా భావించేస్తుంటాను...

    ReplyDelete
  9. నామ స్మరణకి, జపానికి ఒకే ఒక తేడా ఉంది. నిరంతరం ఇష్ట నామాన్ని లోలోపల మననం చేసకోవటం స్మరణం ! అలా కాకుండా నామానికి ముందు ప్రణవాన్ని చేర్చి, ( ప్రణవాలు అయిదు- ౧, ఓం,౨, హ్రీం,౩,క్లీం, ౪,శ్రీం, ౫ హ్లీం ) లెక్క ప్రకారం ఇష్ట నామాన్ని మననం చేయడం జపం. నామ స్మరణ వల్ల మానసిక ధైర్యం , ప్రవర్తనలో మార్పు, సాత్విక గుణ వృధ్ధి కలుగుతాయి. కోరికలు ఏవైనా తీరుతే అవి మానసికంగా ధైర్యంతో ఆ పనిని చేయడం వల్లనే జరుగుతుంది. అంటే కార్య నిర్వహణలో ఋజుమార్గం తెలిసి, అర్థం చేసుకొని దానిని నిర్వర్తించడం జరుగుతుంది. ఇక జపానికి ఉండే లాభాలు కోకొల్లలు. జపాన్ని లెక్కె ప్రకారం చేయాలి. ఆ లెక్క జపమాలతో చేయవచ్చు. ౧౦౮పూసలు గల మాలతో చేయాలి. మాలని కూడ అభీష్టాన్ని అనుసరించి ఎంచుకోవాలి ! తులసి మాలని ఎన్నుకొంటే కలిగేది వైరాగ్యమే ! అలాగే రకరకాల కోరికల సిధ్ధికి రకరకాల మాలలు ఎంచుకోవాలి. అన్నిటికి పనికి వచ్చే మాల అక్షరమాల మాత్రమే ! అక్షర మాల అంటే తెలుగు వర్ణమాలలో ఉండే ౫౪ అక్షరాలని మాలగా వాడుకోవడమే ! ఉదాహరణాకి ,‘ఓం సాయిరాం’ అన్న మంత్రం ఉందనుకోండి. ఆ మంత్రాన్ని అక్షరమాలతో జపించాలంటే ఇలా చేయాలి ! ‘ అం ఓం సాయిరాం; ఆం ఓం సాయిరాం ; ఇం ఓం సాయిరాం, ~~~~ సం ఓం సాయిరామ్, హం ఓం సాయిరాం, క్షం ఓం సాయిరాం ఇత్యాది !! ఆ విధంగా ౫౪ సార్లు అవగానే, మాలని రివర్సు చేయాలి. అంటే క్షం ఓం సాయిరాం; సం ఓం సాయిరాం; ~~~ ఇం ఓం సాయిరాం; ఆం ఓం సాయిరాం ; అం ఓం సాయిరాం ఇత్యాది ! మీరు ఈ మంత్రాన్ని చాల సేఫ్ గా జపించ వచ్చు, అలా చేస్తే మీ ఇష్ట దైవం మీరు అడగ నవసరం లేకుండానే మీ కోరికలు తీరుస్తాడు ! ఇది అనుభవంతో చెప్తున్న సత్యం ! మీకు శుభం కలుగు గాక ! ~~~ ఎ. శ్రీధర్ ( క్షీర గంగ బ్లాగరు )

    ReplyDelete
  10. చదివి మీ అభిప్రాయములను తెలియచేసినందుకు కృతజ్ఞతలండి. అక్షరమాలతో జపం చేయటం గురించి ఇంతకు ముందు నాకు తెలియదండి. అక్షరమాలతో సాయి జపం చేసే విధానము చెప్పినందుకు మీకు కృతజ్ఞతలండి. మీరు మరియు అందరూ మీ బ్లాగుల్లో కూడా తెలియజేస్తున్న వివరములు అందరికి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నానండి. శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలండి. మీకు మరియు అందరికి ఆ భగవంతుడు శుభమును కలుగజేయాలని నేను కూడా కోరుకుంటున్నానండి... . ..

    ReplyDelete