మనకు చాలా భక్తి ఉందనుకుంటుంటాము. పరీక్షా సమయాలలో ఆ భక్తి యొక్క బండారం బయటపడుతుంది. ఉదా....మోక్షాన్ని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మోక్షం వస్తుందంటే ఎంతమంది సిధ్ధంగా ఉంటారు ? ఖచ్చితంగా కొందరు జారిపోతారు. ఇది ఒక విచిత్రమైన ఆలోచనే.
కానీ ఇక్కడ నేను చదివిన ఒక కధ చెప్పాలి...............
అనగనగా ఒక ఊరిలో ఒక గుడి ఉండేది. ఆ గుడికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అందరూ కొంచెం సేపు పురాణకాలక్షేపం చేసి ,ఆ తరువాత దేవుని ప్రార్ధించేవారట. భగవాన్ ! మాకు మోక్షమును ప్రసాదించు. మాకు నీవు తప్ప మరేమీ అక్కరలేదు .ఇలా.........[ అప్పటి మన శక్తి మేరకు మాత్రమే భగవంతుని ప్రార్ధించటం మంచిదేమో అనిపిస్తుంది }
ఇదంతా చూసి ఒకరోజు .... ఒక కొంటెకుర్రాడు దేవుని విగ్రహం వెనుక దాక్కుని భక్తులతో ఈ విధంగా పలికాడట......దేవునిలా.......భక్తులారా !మీ భక్తికి మెచ్చితిని. మీకందరికీ ఉత్తమలోకములను ప్రసాదించవలెనని నా కోరిక. ఉన్నవారు ఉన్నట్లుగా నాతో స్వర్గానికి రండి . అని.......
వెంటనే అక్కడి భక్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ,ఇదేమిటి ,భగవంతుడు అసలు ఇంత త్వరగా అనుగ్రహించటం , అయినా ఇప్పటికిప్పుడు అంటే ఎలా.?.......... మనకు చేయవలసిన పనులు బోలెడు మిగిలే ఉన్నాయి కదా...........కుటుంబం ఏమయిపోవాలి ? ఇలా అనుకుంటూ నెమ్మదిగా అంతా జారుకున్నారట. అక్కడే ఉంటే ఎక్కడ దేవుడు తీసుకుపోతాడోనని...
.ఇక్కడ నేను ఆ భక్తులను తప్పుపట్టడం లేదు. ఒకవేళ నేనే గనక అక్కడ ఉండిఉంటే ,......, నేనుకూడా అలాగే వెళ్ళిపోవటం జరిగేదేమో. నాకు దేవుడంటే ఎంతో, ఎంతో ఇష్టం. అయినాకూడా.....నా భక్తి కూడా అంత పరిపక్వత కాలేదు మరి. ఇలా చెప్పటానికి నేను ఎంతో సిగ్గు పడుతున్నాను.
నాకు కూడా ఇహలోక భాందవ్యాలు , వానియందు వ్యామోహం ఇంకా పోలేదు. అయినా అందరూ ఇలా ఉండరు లెండి. చరిత్రలో భగవంతుని కొరకు సర్వస్వం అర్పించిన భక్తశిఖామణులు మహానుభావులు ఎందరో ఉన్నారు.
ఆఖరికి జంతువులు కూడా భగవంతుని కొరకు తమ ప్రాణాలను కూడా అర్పించాయి. ఉదా..,శ్రీకాళహస్తికి సంబంధించిన కధ మనకు తెలిసిందే.
అందుకని ఎవ్వరం మనమేదో గొప్ప భక్తులం అనుకోరాదేమో.
అసలు నూతిలో కప్ప అదే గొప్ప ప్రపంచం.....అందులోనే గొప్ప సుఖం ఉందని భ్రమించినట్లు. ఈ లోకంలోని వ్యామోహంలో పడిపోయిన మనకు మోక్షానందం గురించి తెలియదు.
నిష్కామముతో మన స్వధర్మాన్ని ఆచరిస్తే , వారిని జీవన్ముక్తులు అంటారని పెద్దలు తెలియజేసారు. ఉదా.... శుకయోగి, జనకమహారాజు ఇలాంటివారు.....
స్థితప్రజ్ఞులు మంచిజరిగినా ,చెడు జరిగినా అంతా భగవంతుని దయగా భావించి స్థితప్రజ్ఞతతో ప్రశాంతముగా ఉంటారు. ఆ దైవానికన్నా మన మంచిచెడ్డలు ఎవరికి తెలుస్తాయి అని వారు భావిస్తారు. ఇలాంటివారు ఎప్పుడో, ఎక్కడో నూటికో, కోటికో అరుదుగా ఉంటారు.
మనము ఏవిధముగా జీవిస్తే ఆ భగవంతుని ప్రేమకు పాత్రులమవుతామో ,ఆ విధముగా ప్రవర్తించే బుధ్ధిని, శక్తిని ప్రసాదించమని ఆ పరమాత్మను ప్రార్ధించాలి.
మోక్షాన్ని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మోక్షం వస్తుందంటే ఎంతమంది సిధ్ధంగా ఉంటారు ? ఖచ్చితంగా కొందరు జారిపోతారు
ReplyDelete--------
చక్కటి కధ బాగుంది.
కృతజ్ఞతలండి. ఈ కధ కొంతకాలం క్రితం చదివానండి. నాకు కూడా బాగా నచ్చింది. మనలో ఎక్కువ మంది కోరికలకోసం భగవంతుని ప్రార్దిస్తాము కానీ, వాటితోపాటు భగవంతుని కొరకు కూడా పూజించేవారు తక్కువగా ఉంటారు. .. ..
ReplyDeleteha ha ha :))) gud .nice post.
ReplyDeleteanrd గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
ReplyDeleteహారం
జీవితాలు మారవు మార్చుకోలేము అజ్ఞాన మేధస్సుతో జీవిస్తున్నామని గ్రహించలేము -
ReplyDeleteఎలా జీవించాలి ఎందుకు జీవిస్తున్నాము ఉన్నవారికి మనకు మేధస్సు వ్యత్యాసమేనా -
విజ్ఞానంగా ఎదిగేందుకు అవకాశం ఎలా వస్తుంది మేధస్సును ఎలా మెరుగు పరచాలి -
ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి ఎలా వివేకవంతునిగా ఒడిదుడుకులను అధిగమించాలి -
మారలేని జీవితాలకు విశ్వ భావాల ధ్యానం ఓ సన్మార్గమేనని నా విజ్ఞాన విశ్వ భావన -
Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read for Universal knowledge and spiritual information
Thanks
Nagaraju
మీ అభిప్రాయములు చెప్పినందుకు కృతజ్ఞతలండి. ఇంకో సంగతి అండి.నేను 10 వ తారీఖున కామెంట్స్ చూసిన తరువాత ఇంకా ఎవరూ వ్రాయరులే అని భావించి మళ్ళీ 11, 12 తేదీలలో చూడలేదండి. తిరిగి ఈ రోజే చూశాను. మీకు జవాబు ఇవ్వటము ఆలస్యము అయినందుకు దయచేసి క్షమించండి.
ReplyDeleteమీ అభిప్రాయములు చెప్పినందుకు కృతజ్ఞతలండి. ఇంకో సంగతి అండి.నేను 10 వ తారీఖున కామెంట్స్ చూసిన తరువాత ఇంకా ఎవరూ వ్రాయరులే అని భావించి మళ్ళీ 11, 12 తేదీలలో చూడలేదండి. తిరిగి ఈ రోజే చూశాను. మీకు జవాబు ఇవ్వటము ఆలస్యము అయినందుకు దయచేసి క్షమించండి.
ReplyDeleteమీరు చెప్పినట్లు విఘ్నాధిపతి అందరికి మంచిబధ్ధిని, కార్యసిధ్ధిని ప్రసాదించాలని తప్పక ప్రార్దించాలి. ఆయన తప్పక కరుణిస్తారు. హారంలో నా వ్యాసాన్ని కూడా ప్రచురించినందుకు మీకు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి...
మీ అభిప్రాయములు చెప్పినందుకు కృతజ్ఞతలండి. ఇంకో సంగతి అండి.నేను 10 వ తారీఖున కామెంట్స్ చూసిన తరువాత ఇంకా ఎవరూ వ్రాయరులే అని భావించి మళ్ళీ 11, 12 తేదీలలో చూడలేదండి. తిరిగి ఈ రోజే చూశాను. మీకు జవాబు ఇవ్వటము ఆలస్యము అయినందుకు దయచేసి క్షమించండి.
ReplyDeleteమీరు బ్లాగ్ లో వ్రాసినట్లు నిజంగా ధ్యానం ఎంతో ఉత్తమమైన పధ్ధతి అట. నేను కూడా కొద్దిగా ధ్యానం చేస్తాను కానీ నా ధ్యాస ఇతరమైన ఆలోచనల పైకి పోతూంటుంది. నాకు అంత ఏకాగ్రత కుదరటంలేదండి. ఎవరైనా సాధన చెయ్యగా,చెయ్యగా తప్పక దైవం దయ వల్ల ఏకాగ్రత సాధించవచ్చునట.