koodali

Monday, February 19, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు....


జరిగిన విషయాలలో   ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి.
 ఇప్పుడు చాలామంది ఏపి ప్రజలు విభజన వల్ల అన్యాయం జరిగిందని అంటున్నారు. . .


విభజన తరువాత ఎంతమంది  ఏపీ వాళ్ళు  ఏపీలో పెట్టుబడులు పెట్టారు ? రాష్ట్ర విభజన తరువాత ఎంతమంది ఏపీ వాళ్లు ఏపీలో పరిశ్రమలు గానీ అభివృద్ధికి  కానీ ముందుకు వచ్చారు ? 


సుమారు 10 సంవత్సరాల కాలం తెలంగాణావాళ్ళు విడిపోతామని ఉద్యమాలు చేస్తుంటే,   అప్పుడు కూడా  ఏపీలో అభివృద్ధి గురించి  పట్టించుకోకుండా,  హైదరాబాదులో పెట్టుబడులు పెట్టుకుంటూ  ఉన్నారు.  అప్పుడు  దూరదృష్టి  లేకుండా .... ఇప్పుడు తీరిగ్గా విచారించి ఏం లాభం.

భవిష్యత్తులో  హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందేమోనని కొందరు  ఏపీ వాళ్ళు  అనుకుంటున్నారేమో  ? విభజన సమయంలోనే హైదరాబాద్  దేశానికి రెండో రాజధానిగా  ఒప్పుకున్న  పరిస్థితి లేదు. 


  ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు తెలంగాణాలో పెట్టుబడులను పెట్టినా కూడా ..ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు  పెట్టి అభివృద్ధిలో పాల్గొనాలి. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది తమ  అభివృద్ధి  వరకే ఆలోచిస్తారు.  తాము ఎక్కడుంటే  అదే  తమ ప్రాంతం అనుకుంటారు. ఎక్కడుంటే అదే మన ప్రాంతం అని మనం  అనుకుంటే   సరిపోదు... అవతలివారు కూడా  మనల్ని  తమవారేనని  అనుకోవాలి కదా!


 హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రదేశ్ విపరీతంగా  నష్టపోయింది. రాజధాని  అని  ఏపీ ప్రజలు చాలామంది   హైదరాబాద్లో పెట్టుబడులు  పెట్టారు.


 అప్పట్లో  హైదరాబాద్ లో కాకుండా,  ఆంధ్రప్రదేశ్ లోనే రాజధాని ఏర్పాటు అయినట్లయితే ,  ఆంధ్రప్రదేశ్ వారి పెట్టుబడులు హైదరాబాద్ లో ఉండేవి కాదు.

బోలెడు కాలం గడిచిపోయింది. ఇప్పుడు అంతా మొదటినుంచీ  పని  అన్నట్లుంది.  ఇప్పటికైనా  హైదరాబాద్లో ఉన్న ఏపీ  వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టి ఇక్కడి అభివృద్ధికి ముందుకురావాలి. 


ఎంతకూ కేంద్రప్రభుత్వాన్నో మరెవరినో ఆడిపోసుకోవటం కాకుండా  ఎవరి రాష్ట్రాన్ని వారు  అభివృద్ధి చేసుకోవటం అవసరం.


************

ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  

Hyderabad Andhras key to AP development....

************

Amaravati: NITI Aayog has a sure-fire solution for state’s problem of funds: Let 40 per cent of people in Hyderabad who are of Andhra origin, shift to AP. The taxes they are paying to Telangana state would then go to Andhra. As NITI Aayog vice-chairman Dr Rajiv Kumar made the suggestion in lighter vein to Chief Minister N Chandrababu Naidu here on Thursday but in fact it held the key since Telangana is rich because of tax revenue mainly from Hyderabad.

“NITI Aayog will help you out but it is not a bad idea if Andhra origin people shift to AP,” he said, while assuring Chandrababu Naidu that his institution would help the state in every possible way.....

************

 ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలివితేటలు, కష్టపడే తత్వమూ  బాగా ఉన్నాయి. అయితే, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన అంతగా ఉండదు. ఆ ఒక్క విషయంలో కొంత ముందుకు వస్తే ఇక ఏపీ అభివృద్ధి  విషయంలో ముందుకు  వెళ్తుంది.


రాష్ట్ర విభజన సమస్యలు...



రాష్ట్ర విభజన జరిగి చాలాకాలమయింది. అయినా ఆంధ్రప్రదేశ్ కు కొంచెం, కొంచెం ఇవ్వటం  తప్ప , అవసరమయినన్ని  నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది.. వెనుకబడ్డ  ఉత్తరాంధ్రా, రాయలసీమకు  ప్రత్యేక ప్యాకేజీ  అతి కొద్దిగా ఇచ్చారు.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు  ఎంత ఇచ్చారు ?   విశాఖ రైల్వే జోన్  సంగతి  అలాగే ఉంది. దుగరాజపట్నం లేక మరేదైనా పోర్ట్  అభివృద్ధి చేయాలి. 


   వెనుకపడిన జిల్లాలకు  బుందేల్ ఖండ్ లాంటి ప్యాకేజ్ ఇస్తామని కొద్దిపాటి నిధులతో సరిపెడతామంటున్నారు. రహదారుల కోసం నిధులను అన్ని రాష్ట్రాలకూ ఇస్తారు.  ఏపీకి కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటారు. అంతేకానీ, ఇవ్వవలసినవి సరిగ్గా ఇంకా ఇవ్వలేదు.


  ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నారు.  కేంద్రం వద్ద నిధులు లేనప్పుడు  , గుజరాత్లో  వేలకోట్లతో బుల్లెట్ ట్రైన్ కు నిధులు ఎలా వస్తాయి?   దేశంలో  కొన్ని చోట్ల రైల్వే గేట్లే సరిగ్గా లేనప్పుడు  బుల్లెట్ ట్రైన్ అవసరమేముంది?


ప్రకటించిన  విద్యాసంస్థలు  చాలినన్ని నిధులు  అందక  నత్తనడకన సాగుతున్నాయి.  విభజన తరువాత ఆస్తుల పంపకాల  విషయంలోనూ అన్యాయమే జరిగినట్లు తెలుస్తోంది.  ఎన్నో సమస్యలు ఎక్కడివి అక్కడ ఉండగా  విభజన హామీలు  అమలుచేసేశామని కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ  చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. 


రాష్ట్రానికి న్యాయం చేయనప్పుడు విభజించటం ఎందుకు  చేసారు ? విభజన   తరువాత ఇచ్చే నిధులను  కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవ్వ వలసిందే. అంతేకానీ, మేము కాబట్టి నిధులు ఇస్తున్నాం  అని  అంటారేమిటో? 


కేంద్రానికి ఏపీ అంటే పెట్రోల్, సహజవాయువు గుర్తొస్తుంది. అక్కడ ..  ఎప్పుడు సహజవాయువులు లీక్ అవుతాయో ? అనే  భయంతో  ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకుతున్నారు.

.....................

అసలు రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగింది.   ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా  విభజన చేసారు. విభజన సమయంలో  ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని  జాతీయపార్టీలు చెప్పాయి. తరువాత కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన  తరువాత  హోదా ఇవ్వటానికి కుదరదు అన్నారు. 


విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వవలసే ఉంటుంది. 

అయితే, ఏపీకి హోదా ఇస్తే, మాకూ ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు   అడగటం జరిగింది. .  హోదా గురించి దేశంలో  గొడవలు మొదలయ్యి , అడిగిన అందరికీ హోదా ఇస్తే,   రాష్ట్రానికి  ఎక్కువ  లాభముండదు. ..ఎలాగూ హోదాతో సమానమైన ప్యాకేజ్ ఇస్తామన్నారు  కదా !  అనుకుంటూ  మొత్తానికి  కారణాలు ఏమైనా ,  ప్యాకేజ్ కు  ఒప్పుకోవటం జరిగింది. 

ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఇవ్వకూడదని  కొత్తగా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  అయితే,  ప్రత్యేక హోదాను కొన్ని రాష్ట్రాల వారికి పొడిగించారని వార్తలు వచ్చాయి. 


  ఇతరులకు పొడిగించినా, పొడిగించకపోయినా,  ఆంధ్రప్రదేశ్కు  ప్రత్యేక హోదా అనేది..   విభజన సమయంలో ఇచ్చిన పాత హామీనే కాబట్టి  , కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వము ..అనే విషయం ఆంధ్ర ప్రదేశ్ కు  వర్తించదు.

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. అని తెలిసినా కూడా ప్యాకేజీ సరిగ్గా ఇస్తే చాలులే... అనుకుని  ఆంధ్ర ప్రజలు ఊరుకున్నారు. 


ఇప్పుడు ప్యాకేజీ కూడా సరిగ్గా ఇవ్వకుండా  సరిపెట్టాలని చూడటం అన్యాయం.  ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వనప్పుడు  తిరిగి  ప్రత్యేక హోదా  విషయం చర్చకు వస్తుంది. . ప్యాకేజ్  చట్టబద్ధత కూడా చేయలేదు.

......................
     బలవంతపు  విభజన వల్ల కలిగిన  నష్టాన్ని పూడ్చటం కొరకు ఇచ్చే నిధులను కేంద్ర  ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటుంది. ఏపీ వాళ్ళు పదేపదే అడగవలసి రావటం  ప్రజలకు  అవమానకరమైన విషయం.

 ప్రజల సమస్యలు  తీర్చడం కోసం రాజకీయపార్టీలు పాటుపడాలి. అయితే,  పార్టీలు తాము ఇచ్చిన హామీల అమలును  సరిగ్గా అమలుచేయకుండా తాత్సారం చేస్తూ  ...ఉద్యమాలు చేయవలసి రావటం ద్వారా  ప్రజలు కష్టపడే పరిస్థితి తేవటం సరైనది కాదు. 


ఇప్పుడు  రాష్ట్రంలో  రాస్తారోకోలు, బందులు  మొదలుపెడితే  రాష్ట్రం వెనుకబడిపోతుంది,  మిగతా రాష్ట్రాలు ముందుకువెళ్తాయి.


విద్యార్ధులు చదువులతోనే కష్టపడుతున్నారు. ఇంకా ఉద్యమాలు చేసే బాధ్యత కూడా  విద్యార్ధులపై వేయడం  కాకుండా,  రాజకీయనాయకులే తాము ఇచ్చిన హామీలు అమలుచేయాలి. 

బందుల ద్వారా జనజీవనం స్థంభించటం, ప్రజలు కష్టపడటం  కాకుండా  ... రోజులో కొద్దిసేపు ర్యాలీలు చేయటం  వంటి ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేయవచ్చు.

 తెలంగాణా ఉద్యమంలో జరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో   యువత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ఎవరో చేసిన తప్పులకు యువత ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి ?

....................
   ఆర్ధికవ్యవస్థతో ప్రయోగాల వల్ల బ్యాంకుల ముందు సామాన్యప్రజలు క్యూలలో నిలబడటం జరుగుతోంది కానీ ,  వేలకోట్లు దోచి వేస్తున్న బడా  వారిపైన  , విదేశాలకు నల్లడబ్బును తరలిస్తున్నవారిపైన   కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

జీఎస్టీ వల్ల లాభాలు  వచ్చే ఎలా ఉన్నా..జీఎస్టీ తరువాత  కొందరు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచటం వల్ల ప్రజలలో గందరగోళం నెలకొంది. 


 ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలను బీజేపీ గమనించకపోతే ఆ పార్టీకే నష్టం.  కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాకుండా జాతీయస్థాయిలో ఇంకో కూటమి  రావాలని ప్రజలు  కోరుకున్నా  ఆశ్చర్యం ఏమీ లేదు.

***************
 విభజన జరిగిన కొత్తలో బీజేపీ వాళ్లు ఏపీ పట్ల సానుభూతితోనే ఉన్నారు. తరువాత కొంతకాలానికి వారిలో మార్పు కనిపించింది.

  రాష్ట్రానికి చెందిన బీజేపీ వాళ్ళు  ఎవరైనా  ..ఇక్కడి  ప్రజల అభిప్రాయాలను  సరిగ్గా అర్ధం చేసుకోకుండా  , కేంద్రానికి సరైన  సమాచారం ఇవ్వటం లేదనిపిస్తుంది. 


ఏపీ పట్ల కేంద్రం వారి వైఖరి మార్పు కనిపించడంలో  కేంద్రం  వాళ్ల రాజకీయాలు   కూడా  కారణం అయి యుండవచ్చు. ఏదైతేనేం ఏపీ ప్రజలను  చిన్నచూపు చూస్తున్నారు.


 ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తామూ  హోదా గురించి  అడగొచ్చని  కొందరు ఇతర రాష్ట్రాల వాళ్ళు  ఎదురుచూస్తున్నారు.


***************
 అయినా రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఇద్దరు గవర్నర్లను నియమించాలి గానీ ,  ఒకే గవర్నర్ ఏమిటి ? ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలి.

*************

ఇప్పుడు  కొందరు రాష్ట్ర బీజేపీ  వాళ్ళు  మరీ  విడ్డూరంగా  మాట్లాడుతున్నారు.  రాజధాని కోసం బోలెడు డబ్బు  ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అంత డబ్బు  కేంద్రప్రభుత్వం ఎందుకివ్వాలి ?  అంటూ  మాట్లాడుతున్నారు.


  కేంద్రం ఏపీకీ చాలా ఇచ్చింది .. ఇంకా ఇవ్వడానికేమీ లేదు...  ప్రాజెక్టులు ఇప్పుడే కట్టక్కర్లేదు.. పదేళ్లు సమయం ఉంది..అంటూ మాట్లాడుతున్నారు..

  రాజధాని లేదు కాబట్టి , ఢిల్లీ వంటి రాజధాని కట్టిస్తాము..  అని ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు?

ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన కాంగ్రెస్ పట్ల  ప్రజలకు  ఎంత  వ్యతిరేకత ఉందో, ఇప్పుడు బిజేపీ పట్ల కూడా  ప్రజలలో వ్యతిరేకత  ఉన్నాకూడా...  రాష్ట్ర బిజేపీ వాళ్లు అంతా బాగుందంటూ కేంద్రాన్ని వెనకేసుకు వస్తున్నారు. 

ఇప్పుడు బిజేపీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత  గురించి  ఆ పార్టీ వాళ్ళకు ఎందుకు అర్ధం కావటంలేదో ?  ఆశ్చర్యంగా ఉంది.


*******************
 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడ విశాఖ రైల్వేజోన్ విషయంలో ఇతర రాష్ట్రాలను సంప్రదించాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఆంధ్రకు ఇస్తే ఇతరరాష్ట్రాలు అడుగుతారన్నారు.  దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువలేదా?

 అయినా  ఏపీ ప్రజలు   విభజన చేయమని అడగలేదు.  అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలెందుకు కష్టాలు పడాలి ?  నిధులు పొందటానికి ఏపీ వాళ్లు పదేళ్ళు ఎందుకు ఆగాలి? 




నదీ జలాల విషయాలు..



కొన్ని  నదులు ఎక్కడో  పుట్టి  ..  ప్రవహించి.. సముద్రంలో కలుస్తాయి. ఇలా జరగటం ప్రకృతిలో  సహజమైన విషయం.   ప్రజలు నీటిని పొదుపుగా  వాడుకోవాలి.  ఉన్న నీటిని అందరూ పంచుకుని వాడుకోవాలి .  


ఎగువ రాష్ట్రాలైనా, దిగువ రాష్ట్రాలయినా ప్రజలందరికీ నీరు అవసరమే. అయితే,   కొందరు ఎగువ ప్రాంతాల వాళ్ళు  ..తమకు బోలెడు నీరు కావాలంటూ   దిగువకు  సరిగ్గా  వదలకుండా   ఆపటం ప్రకృతికి వ్యతిరేకం. ...నీరు  క్రిందకు వదలం ...అనే హక్కు ఎవరికీ లేదు.


రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి   ఆంధ్ర.. తెలంగాణా  రెండు రాష్ట్రాలకూ విడిగా కేటాయింపులు జరగాలంటున్నారు. మరి `భవిష్యత్తులో మహారాష్ట్ర విభజన జరిగితే ...అప్పుడు ఆ రెండు రాష్ట్రాలకూ వేరువేరుగా కేటాయింపులు జరిపితే దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి ? 


ఇప్పుడు కూడా  ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాళ్లు ఇబ్బడిముబ్బడిగా నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. వాళ్ళకు దిగువ రాష్ట్రమైన తెలంగాణా  వాళ్ళు ఏపీ  వాళ్లను ఆడిపొసుకోవటం తప్ప ,  ఎగువ రాష్ట్రాలను ఏమనలేక   వారితో  స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.


భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వాళ్లు మరిన్ని ప్రాజెక్టులు కట్టి   క్రిందికి చుక్క నీరు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటో ?

నీటి విషయంలో గొడవలు తగ్గాలంటే న్యాయబద్ధంగా ఎవరికి రావలసిన వాటాను వారికి కేటాయించే పెద్దమనుషులుండాలి. ఇందులో ఎవరి వాదన వారిదే  అన్నట్లు  ఉండే గొడవలు తప్ప చేయగలిగిందేమీ లేదు. రాజకీయాలు కూడా ఉంటే అసలే చెప్పనక్కర లేదు.



 సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకుని వాడుకోవచ్చు కానీ, అందువల్ల మిగిలిన ఉప్పువల్ల వాతావరకాలుష్యం వంటి సమస్యలు ఉంటాయి. నీటిని పొదుపుగా వాడుకుంటూ , న్యాయబద్ధంగా ఎవరి వాటా వారు  వాడుకుంటే సమస్యలు రావు.  

********

  ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఎన్నో సహజవనరులున్నా కూడా, రాష్ట్రాన్ని సరిగ్గా అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు.. తెలివితేటలు ఉండికూడా ఎప్పుడూ ఇతరరప్రాంతాలకు, ఇతరదేశాలకు వలసలు పోతుంటారు. మాకు సహాయం చేయండి..అంటూ ప్రతిచిన్నవిషయానికి కేంద్రాన్ని అడుగుతుంటారు.

ఏపి వాళ్ళు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం కాకుండా, వారి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. వారి సమస్యలు వారు పరిష్కరించుకోవాలి. వనరులు, దేవాలయాల విషయాలు, అన్నిప్రాంతాల సమస్యలు తమకుతాము పరిష్కరించుకోవాలి.
 
 ఎవరేది చెబితే అది నమ్మటం కాకుండా, ప్రజలు విచక్షణతో ఉండాలి.
ఇతరరాష్ట్రాలతో కలిసి ఉండే నదీజలాల వంటివి అలా ఉంచితే, తమరాష్ట్రంలోని సమస్యలు తామే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి.


ఏపీ వారి పట్ల ఇప్పటికీ కొందరి ద్వేషభావం...


  ఇప్పటికీ కొందరు తెలంగాణా వాళ్ళ మాటల్లో ఏపీ ప్రజల పట్ల ద్వేషభావం ఉన్నదని తెలుస్తోంది  కాబట్టి  ఇవన్నీ  వ్రాయటం జరిగింది.. అయితే,  ఏపీ పట్ల సానుభూతి చూపిస్తున్న  ప్రొఫెసర్ కె.  నాగేశ్వర్ గారు  వంటి తెలంగాణా వాళ్ళూ ఉన్నారు.

  విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ నష్టపోయి   ఉన్నా కూడా  ఇప్పటికీ కొందరు తెలంగాణా  వాళ్ల మాటలలో ఏపీ ప్రజలంటే  ద్వేషభావం  ఉంటోంది. ఇలా  ద్వేషభావం ఉండటం  అత్యంత బాధాకరం.

ఏపీ వాళ్లు దోపిడీదార్లయితే  సీమాంధ్ర  ఇలా వెనుకబడి ఉండేది కాదు. కొందరు పెట్టుబడిదారులు సమాజ  సంపదను  దోచుకున్న మాట విషయం వాస్తవమే.  అయితే,  సమాజసంపదను దోచుకున్న వారిలో  అన్ని  ప్రాంతాల  వాళ్లూ ఉన్నారు. తెలంగాణా  వాళ్ళు  కూడా  ఉంటారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రాంతం దోచుకునుంటే ... విభజన  జరిగిన వెంటనే తెలంగాణా సంపన్న రాష్ట్రం గా ఎలా మిగిలింది ?  ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రంగా ఎలా మిగిలింది ?


******************

కొందరు  తెలంగాణా వాళ్లు ఏమంటారంటే, ఏపీ వాళ్లు మా ఉద్యోగాలను దోచుకున్నారు, మా నీటిని దోచుకున్నారు.. అన్నారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు వస్తున్నాయి. ఒకే భాష వారిలో కూడా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు  వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రావడంలో ఆశ్చర్యం లేదు.

   ఆంధ్ర వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి.. అని కొందరు తెలంగాణా  వాళ్ళు అన్నారు.  మరి ఎందరో  తెలంగాణా వాళ్ళు  ఉద్యోగాల  కోసం  ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు కదా!  వీళ్ళ వల్ల  అక్కడి స్థానికుల  ఉద్యోగాలు తగ్గుతాయి కదా!


ఇంకో విషయం ఏమిటంటే,  నదులు అందుబాటులో   ఉండే ప్రాంతాలను నదీ పరీవాహక ప్రాంతాలంటారు.

అయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలేమిటంటే, కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయంటే,  నదులు ప్రవహిస్తున్నా కూడా నీరు భూమికి  తేలికగా  అందనంత దూరంలో ఉంటుంది.  అంటే , భౌగోళిక పరిస్థితి వల్ల   నదుల నీరు  వాడుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు అవసరమవుతాయి.

ఉదా..తెలంగాణాలో  నదులు ఉన్నా కూడా,  భౌగోళిక పరిస్థితి వల్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టడం తప్పనిసరి.  ఇలాంటి ప్రాంతాలు పేరుకి  నదీపరీవాహకప్రాంతాలే కానీ,  నీరు అందుబాటులోకి రావాలంటే చాలా ఖర్చవుతుంది..


 ఏపీలోని  కృష్ణా, గోదావరి  ప్రాంతాలలో ఎక్కువ భాగం  పల్లంగా ఉంటాయి కాబట్టి , అక్కడ నీరు అందివ్వాలంటే    పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి   బోలెడు  ఎత్తిపోతల పధకాలు కట్టనవసరం లేదు.

అందువల్ల,   నీరు సులభంగా ప్రవహించే ఆంధ్రప్రదేశ్లోని  కృష్ణా, గోదావరి ప్రాంతాల లో    కొంతవరకు    వ్యవసాయం  అభివృద్ధి చెంది ఉండవచ్చు.  అంతేకానీ, తెలంగాణాను చిన్నచూపు చూశారనుకోవటం సరైనది కాదు.


ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టాలంటే వేలకోట్ల డబ్బు అవసరమవుతుంది.  సమైఖ్య రాష్ట్రంలో  తెలంగాణా ప్రాంతంలో     నిర్మించిన   ఎత్తిపోతల పధకాలన్నీ  కేవలం   తెలంగాణా జిల్లాల  నుంచి వచ్చిన ఆదాయం తోనే కట్టారా?
......................

ఇంకో  విషయం ఏమిటంటే ,    రాజధాని కాబట్టి హైదరాబాద్ కు  అందరూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో  మిగతా ప్రాంతాలలో ఎక్కువగా అభివృద్ధి జరగలేదు.. వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా  అభివృద్ధి కాలేదు ..ఏపీ  వాళ్లు కూడా తమ పెట్టుబడులను హైదరాబాద్ చుట్టుప్రక్కలే పెట్టారు.


కేంద్ర సంస్థలు ఎక్కువగా హైదరాబాద్   చుట్టూనే  ఏర్పాటు చేసారు.ఈ కారణాలతో  ఎక్కువమంది  హైదరాబాద్ కు  రావటం జరిగింది. ఎక్కడికక్కడ ఉపాధి ఏర్పాటు చేసి ఉంటే హైదరాబాద్   వెళ్ళవలసిన అవసరమేముండేది ?


సీమాంధ్రులు  విశాలాంధ్ర కోసం  తమ ప్రాంతములో రాజధానిని  త్యాగం చేశారు.  . విభజన తరువాత   తమ ప్రాంత అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు.
 

****************
తెలంగాణా జిల్లాలలో సీమాంధ్ర జిల్లాల కన్నా అభివృద్ధి బాగానే ఉందని శ్రీ కృష్ణ కమిటీ వివరించారు కదా !

ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని  కొందరు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  ఏ ప్రాంతంలోనూ  సరైన అభివృద్ధి  జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా  భారతదేశంలో  జరగవలసినంత అభివృద్ధి జరగలేదు.  ఈ దుస్థితికి పాలకులు  మరియు ప్రజలు కూడా  కారణం.

***************

కొందరు ఏమంటారంటే , నాగార్జునసాగర్ విషయంలో ఆంధ్రవాళ్ళు అన్యాయం చేసారంటారు. ఏమిటి ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం?

ఆంధ్ర.. తెలంగాణా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర...ప్రాంతాలకు నీరు అవసరం కదా! 


ఆ రోజుల్లో .. ఉమ్మడి మద్రాసు రాష్ట్రము  కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. ....( అక్కడ కావేరి నది ఉన్నా కూడా .. ఆ నీరు చాలటం లేదని ,  ఎక్కడో  ఉన్న కృష్ణానీటి కోసం వారి ప్రయత్నం..)

 ఇలాంటి పరిస్థితిలో.. నదుల పరీవాహక ప్రాంతాల వాళ్ళయిన ఆంధ్రవాళ్ళు.. తమ నీటిని నదులకు  దూరంగా ఉన్న ప్రాంతాలకు  తరలించుకుపోతుంటే  అడ్డుకుని,  నాగార్జునసాగర్  ఏర్పాటుకు ఎంతో శ్రమించారు. ఇందులో  ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? 

***********

కె.సి.ఆర్. గారికి తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం అనీ తెలుగువాళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారనీ వార్తా పత్రికలలో చదివాను. మరి ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఎందుకు ప్రచారం చేసారో ? ఆశ్చర్యంగా అనిపిస్తోంది......

కె.సి.ఆర్. గారు తెలంగాణాకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు చేస్తే ఎంతో బాగుండేది.

  రాష్ట్ర విభజన కోరకుండా ఉమ్మడిరాష్ట్రం లో  కొత్తపార్టీ పెట్టి గెలిచి ఉంటే... సమైఖ్య రాష్ట్రంలో  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం లభించి ఉండేది కదా !

అలా చేసి ఉంటే  , రాష్ట్రాన్ని విభజించిన వారిలో ఒకరిగా చరిత్రలో ఉండటం కన్నా, రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాలనూ  అభివృద్ధి చేసిన  వారిగా చరిత్రలో  ఉండే అవకాశం ఉండేది కదా ! 

 **************
ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  
Hyderabad Andhras key to AP development....





Friday, February 16, 2018

పోలవరం ప్రాజెక్ట్ ...



ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. నీరు  ఉంటే సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధాచేయకూడదు. 


చెక్ డ్యాములు, ఇళ్ళ వద్ద , పొలాల వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టే  విధానాల  ద్వారా వర్షపునీటిని ఒడిసిపట్టి  నిలువ చేసే విధానాల గురించి రాష్ట్రప్రభుత్వం విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది. ప్రజలు  వీటిపై మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం  ఉంది.  

నీటి వసతి అతి తక్కువగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతంలో చెక్ డ్యాములు..వంటి   పద్ధతుల ద్వారా   గణనీయంగా  నీటిని పెంచుకుని పంటలను పండిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

కొందరు  తెలుగువాళ్లు రాజస్థాన్ వెళ్ళి  ఈ పద్ధతులను అక్కడి వారికి నేర్పిస్తున్నారట. ఇక్కడి తెలుగువాళ్లు కూడా    ఆ విధానాలను అవలంబించి లాభం పొందవచ్చు. 

  పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్దది.  పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి అయే వ్యయం పూర్తిగా తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికి 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారట. 

నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి పరిహారం,  పునరావాసం వంటి వాటికే 40 వేల కోట్లు ఖర్చవుతాయంటున్నారు. 

 నిర్వాసితుల  పరిహారం, పునరావాసం..వంటివి కూడా ప్రాజెక్టు వ్యయంలో భాగమే కదా! 

మొత్తం అన్నీ కలిపి సుమారు 50 వేల కోట్ల పై వరకూ ఖర్చవుతుందని అంటున్నారు.  మరి  ఇంత డబ్బు  కేంద్రం ఎప్పుడో ఇస్తారో ?  

 ప్రాజెక్ట్  డిజైన్ కొంత మార్చాలని  కొన్ని రాష్ట్రాలు చెబుతున్న    అభ్యంతరాలు ఉండనే ఉన్నాయి.  ఈ విషయాలతో  ప్రాజెక్ట్ సంగతి ఏమవుతుందో తెలియదు. 

 ఇవన్నీ తేలే లోపు  రాజస్థాన్ తరహా నీటి విధానాలను  ఆంధ్రప్రదేశ్లో కూడా  అమలు చేస్తే బాగుంటుంది. 

భారీ ప్రాజెక్టుల వల్ల భూకంపాలు, మరియు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే,   ఈ విషయాలను   పెద్దగా  పట్టించుకోకుండా భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. 

***************


ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పోలవరం ప్రాజెక్ట్  విషయంలో భద్రాచలంలో శ్రీ  సీతారాములవారి దేవాలయం  ముంపుకు  గురి అవుతుందేమోనని కొందరు సందేహిస్తున్నారు.

 కొందరు  దేవాలయప్రాంతానికి   ఎటువంటి ప్రమాదమూ ఉండదంటున్నారు.

 ఏదిఏమైనా  సీతారాములవారి దేవాలయం ఉన్న ప్రాంతానికి ఎటువంటి  ముప్పు లేకుండా  జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

***********************

 పోలవరం ఒకే భారీ ప్రాజెక్టు గా  కాకుండా  విస్తీర్ణం తగ్గించుకోవటం ,   ప్రాజెక్ట్  ఎత్తు కొంత తగ్గించటం   (సుమారు 5  లేక 10 అడుగులు వరకు..)  లేక  రెండు  మధ్యతరహా ప్రాజెక్టు లుగా   కట్టుకుంటే  ఇబ్బందులు  తగ్గుతాయేమో?

 కొన్ని దేశాల్లో అండర్  గ్రౌండ్ డ్యామ్స్  కూడా కడుతున్నారట. 

  భారీ ప్రాజెక్టుల కన్నా చిన్న, మధ్యతరగతి  ప్రాజెక్టులు మేలు. ఒక పెద్ద భారీ  ప్రాజెక్టు బదులు  రెండు మధ్యతరగతి  ప్రాజెక్టులు నిర్మించుకోవటం సురక్షితం. 

**********
 రాజధానికి 3 వేల కోట్లు ఇచ్చి  ... అమ్మో ! ఇప్పటికే చాలా ఇచ్చేసాం...పోలవరం కట్టడానికి కాలపరిమితి   లేదు...10 ఏళ్ల వరకూ కూడా  కట్టుకోవచ్చు..అంటున్న వాళ్ళు పోలవరానికి 40 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారో ? 

పోలవరం  ప్రాజెక్ట్ పరిస్థితి ఏమవుతుందో ... తెలియని  పరిస్థితిలో  అయోమయంలో ఉండేకన్నా,    డిజైన్  కొంత మార్చి   2019 కల్లా  పోలవరం పూర్తిచేయవచ్చనిపిస్తోంది. 

ఎడారిలో జలసిరులు గురించి  ... ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు...

ఎడారిలో జలసిరులు | Special Report on Rajasthan Water Crisis ...




Monday, February 12, 2018

ఓం..స్త్రీలు గుమ్మడికాయ కొడితే....



రాబోయే శివరాత్రి సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.


....................................
క్రింద వ్రాసిన విషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి ఇక్కడ పోస్ట్ చేసాను.
 marikonni vishayaalu..

స్త్రీలు గుమ్మడికాయ  కొడితే వంశనాశనం అవుతుందట.మగవాళ్లే కొట్టాలట. 
 నిజమే కావచ్చు. కుదిరినవాళ్లు చక్కగా పాటించగలరు.  వంశనాశనం అనిచెపితే ఎవరైనా భయపడతారు.
 
 ఉన్న విషయాన్ని చెప్పటం మంచిదే. చెపితే కుదిరినవాళ్లు  పాటించగలరు.  విషయాలు అనేకం అయినప్పుడు, అన్నింటిని పాటించలేని పరిస్థితి కూడా ఉంటుంది.  అలాంటప్పుడు ఏం చేయగలం ?
.............................................
ఇంతకుముందు గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదని ఎవరోచెబితే, దానిగురించి  వ్రాసాను.
 
 గుమ్మడికాయ రోజు వంటలో వాడము కాబట్టి ఫరవాలేదు కాని, కొబ్బరికాయ ఎక్కువే వాడతాము కదా. కొబ్బరికాయ కూడా స్త్రీలు కొట్టకూడదని ఎవరో చెప్పారు.
 
 గుమ్మడికాయను కొట్టకూడదన్నారు. మగవాళ్లు కొడితే స్త్రీలు ముక్కలుగా కోయవచ్చని  అంటున్నారు.
అయితే, 
 వంటకు గుమ్మడికాయను కొట్టడానికి,  ప్రతిసారి ఇంట్లో మగవాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు.  అప్పటికి దానిని వండటం వాయిదా వేసి పక్కన పెట్టేస్తారు.
 
కొందరు మగవాళ్లు ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటారు. కొందరు  తరచు ఊర్లు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో, ఎవర్ని అడగాలో.. తెలియదు.
 
కొందరు మగవారు ఇలాంటి విషయాలు నమ్మకపోవచ్చు, అలాంటప్పుడు కుటుంబంలో గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది.
 
ఇలాంటప్పుడు, గుమ్మడికాయ కొట్టడానికి మెషిన్ ఉంటే బాగుండనిపిస్తుంది. మెషిన్ కొడుతుంది కాబట్టి, స్త్రీలకు దోషం ఉండదు.

 
నేను నెట్లో మిషన్ల కోసం  వెతికాను.   అలాంటి మెషిన్లు పెద్దవి ఉన్నాయి. 25 వేలు ధర ఉంది. అలాకాకుండా ఇంట్లో వాడుకోవటానికి చిన్న మిషన్లు తక్కువధరలో వస్తే బాగుంటుంది.
 
ఒకటి కొంతతక్కువ ధరలో ఉంది కాని, వాళ్లు ఇప్పుడు తయారు చేస్తున్నారో లేదో తెలియదు.
కూరగాయలు అమ్మే షాపుల వద్ద ఇలాంటి మెషిన్ పెట్టవచ్చు.
............................................. 
చలిదేశాలవాళ్లు.. గుమ్మడిని బాగా వాడతారు. ఇప్పుడు గుమ్మడికాయలను వాటికవేముక్కలు చేసే మిషన్లు కనిపెట్టారు.
 
 మార్కెట్లో ఆవకాయకు ముక్కలు కొట్టినట్లు, గుమ్మడికాయలను కొట్టడానికి ఎవరైనా ఉండాలి.
 
గుమ్మడికాయలు అమ్మేవారిని, గుమ్మడికాయను కొట్టి ఇమ్మని అడగవచ్చు. (వాళ్ళు స్త్రీలు కాకుండా పురుషులయితే..)
 ..........................................
  కొబ్బరి,గుమ్మడి పుష్టికరమైనవి. సందేహాలతో  వాడకం తగ్గిస్తే, హిందువులు బలమైన ఆహారానికి దూరం అవ్వవలసి వస్తుందని ఇంతకుముందు రాసాను.
 
అయితే, తీపిగుమ్మడికాయ వేడి, వాతం అని,  చాలామందికి అంతగా పడదు. అలాంటప్పుడు, ఎక్కువగా తినకుండా అప్పుడప్పుడు తినటం మంచిది.
 
కేరళ, కర్ణాటక వాళ్ళు బూడిదగుమ్మడితో కొబ్బరివేసి కూటుకూర చేస్తారట.బూడిదగుమ్మడిలో ప్రత్యేకమైన లక్షణాలున్నాయని,అది చాలాబలవర్ధకమైనదని,అందువల్ల రోజూ కాకుండా అప్పుడప్పుడు తినాలట.
 
ఆయుర్వేదం బాగా తెలిసినవారిని అడిగి వాడుకోవచ్చు.
................................................
చెడ్దపనులు చేసినవాళ్లకు  కష్టాలురావటం,  వంశనాశనం వంటివి జరిగే పరిస్థితి రావచ్చు ... అని అందరికి తెలిసిన విషయమే అయినా, చాలామంది భయపడకుండా పాపాలు చేస్తున్నారు. 
 
దైవభక్తులం అని చెప్పుకునేవాళ్లు కూడా కొందరు పాపాలు చేస్తున్నారు. 
...................................... 
రావణాసురుడు చేసిన  పనుల వల్ల అతనితోపాటు అతని కుమారులు కూడా చనిపోయారు.

 అయితే, కొందరు పెద్దవాళ్లు చెడ్దవాళ్లు అయినాకూడా, వాళ్ల పిల్లలు మంచివాళ్లు ఉంటారు. మరి, పెద్దవాళ్లు చేసిన పాపాలకు పిల్లలు శిక్ష అనుభవించాలా? అనే ప్రశ్న వస్తుంది.

 పిల్లలు పెద్దవాళ్లతో పాటు పాపపు పనులు చేయకపోతే, వాళ్లకు మంచి జరిగే అవకాశముంది. 
ప్రహ్లాదుని తండ్రి దైవాన్ని వదలమని ఎంత కష్టపెట్టినా, ప్రహ్లాదుడు దైవాన్ని వదల్లేదు.  ప్రహ్లాదుడు రక్షించబడ్దాడు.
........................................
 ఎవరైనా, గుమ్మడికాయ..వంటి విషయాలతో సరిపెట్టటం కాకుండా, జీవితంలో పాపాలు చేయకుండా ఉండటానికి కూడా  ప్రయత్నించాలి.

గుమ్మడికాయలు మగవాళ్లు కోయటం..వంటివి  పాటించి, ఇవి పాటిస్తేచాలు ఇక కష్టాలురావని, పాపాలు చేస్తూ ఉంటే కష్టాలు వచ్చే అవకాశముంది. 

కష్టాలు రాకూడదంటే పాపాలు చేయటం ఆపాలి, కనీసం అందుకు గట్టిగా ప్రయత్నించాలి.

 

Saturday, February 10, 2018

ఓం ..శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..


శ్రీ శనిదేవునికి వారి అర్ధాంగికి వందనములు. 


శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు.
...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు . దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు.

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.

దశరధుల వారు చేసిన శనిదేవుని స్తోత్రమును చదివినా, విన్నా మంచిదని పెద్దలు తెలియజేసారు.