koodali

Monday, April 4, 2016

మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి...గాలితో నడిచే వాహనం ...

 
 
మన దేశంలో ఎందరో ప్రతిభావంతులున్నారు. అయితే వారి ప్రతిభకు సరైన ప్రోత్సాహం  లభించటం లేదు. అందుకే చాలామంది  విదేశాలకు వెళ్తున్నారు.

 విజ్ఞాన శాస్త్రంలో ఈ మధ్య జరుగుతున్న ఆవిష్కరణలలో భారతీయులు  ఉండటం హర్షించదగిన విషయం.


 అయితే విదేశాలకు వెళ్లిన తరువాత కాకుండా ఇక్కడే వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుంది. 


ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి గాలితో నడిచే వాహనాన్ని కనిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.


 ఇంధన సమస్యలు ఉన్న ఈ రోజుల్లో ఇది ఎంతో గొప్ప ఆవిష్కరణ.  అయితే , వార్తలలో చెప్పటం వరకే జరిగింది కానీ, ఆ ఆవిష్కరణకు ఏమీ ప్రోత్సాహం ఉన్నట్లు లేదు. 


ఇదే విషయాన్ని  ఎవరైనా విదేశాల వాళ్లు కనిపెడితే ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు. 


ఈ మధ్య కాలంలో  భారతదేశంలో  యువత ఎన్నో కొత్త విషయాలు కనుగొంటున్నారు. అయితే మన వాళ్ళకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదు. 


టెక్నాలజీ కోసం బోలెడు ఖర్చు పెట్టి విదేశాలపై ఆధారపడటం కన్నా మన యువతను ప్రోత్సహిస్తే ఎన్నో కొత్త విషయాలను కనుగొంటారు. 


 పాత కాలంలో జగదీశ్ చంద్ర బోస్ అనే భారతీయ శాస్త్రవేత్త ఎన్నో గొప్ప విషయాలను కనుగొన్నారు. అయితే వారికీ  మనదేశంలో సరైన ప్రోత్సాహం లభించలేదనిపిస్తుంది .  


విదేశాల వాళ్ళు మన యువత యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ ....తమ దేశ అభివృద్ధి కొరకు భారతీయ ప్రతిభ అవసరం అని చెబుతున్నారు.


 మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి.




RTC Driver David Raju Invents Vehicle runs With Air in ...








Saturday, April 2, 2016

శని శింగణాపూర్...



శ్రీ శని భగవానుని దేవాలయం శని శింగణాపూర్ గురించి ఈ లింక్ వద్ద..చూడగలరు..


Shri Shaneshwar Devasthan Shanishingnapur's legend in ...





Friday, April 1, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు విద్యాసంస్థలను మరియు కొన్ని నిర్మాణాలను  ఏర్పాటు చేయటంలో సహకరిస్తోంది. నిధులను ఇస్తోంది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. 
...........................

ఝై ఘొత్తిముక్కల గారు..
రాష్ట్ర విభజన .... తరువాత..  టపా గురించి మీరు వ్రాసిన వ్యాఖ్యకు  నిన్ననే సమాధానం రాద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల వీలు కుదరలేదు. ఈ రోజు రాస్తున్నాను.

   హైదరాబాద్ తో కూడిన తెలంగాణా ఏర్పడిన తరువాత మీరు సంతోషంగా ఉండవచ్చు కదా !  హైదరాబాద్ ఆదాయం తో తెలంగాణా మిగతా భాగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

 రాజధాని కూడా లేక  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు ఇవ్వకూడదని  మీరు  అనటం దారుణం.

రాజధాని ఉన్న బీహార్ కే స్పెషల్ పాకేజ్ పేరిట  చాలా నిధులు కేటాయించారు.అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు కదా! 

రాజధాని కూడా లేక ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇస్తుంటేనే అభ్యంతరం చెబుతారేమిటి ?

ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వవచ్చు. 

  ఇవ్వలేమనుకుంటే రాజధానికి ఎక్కువ నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక పాకేజి, పన్నుల రాయితీల వంటివి ఇవ్వాలి. 

ఆంధ్రప్రదేశ్ కు డిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని కూడా బీజేపీ వారు హామీ ఇచ్చారు.

 సమైక్యాంధ్రప్రదేశ్లో ఆంధ్ర భాగం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సరైన ఆదాయం లేదు.

ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకుండా తమ పెట్టుబడులను కూడా హైదరాబాద్ వద్దే కేంద్రీకరించి తప్పు చేసారు. అందుకు తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నారు.

ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్న విషయాలే.
..................

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి బిల్లులో పెట్టలేదని, పేపర్ మీద మాత్రమే పెట్టారని బీజేపీ వారు అంటున్నారు.  

 అయితే, చట్టసభలో ..  అప్పటి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే బీజేపీ వాళ్లు 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. 

ఎన్నికలప్పుడు, తరువాత  కూడా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు .

 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ  చట్టసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలుపరచి  న్యాయం చేయవలసి ఉంది.
.................
 
హైదరాబాద్ ను  అభివృద్ధి చేసానని తాము చెప్పుకోవటమే కాని, తెలంగాణా వాళ్ళు అంతగా మెచ్చుకోవటం లేదు. హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాత్రమే పనిచేసి ఆంధ్రను నిర్లక్ష్యం చేసారని ఆంధ్ర వాళ్లు అనుకుంటున్నారు.


అందువల్ల ఒక్క అమరావతి మీదే దృష్టి నిలపటం మాని, ఆంధ్రలో విజయవాడ.. గుంటూరు, తిరుపతి.. కర్నూలు, వైజాగ్.. కాకినాడ..ఇలా ప్రజలకు  అవసరమైన విధంగా చక్కగా అభివృద్ధి చేస్తే ప్రజలు సంతోషించి మెచ్చుకుంటారు. ప్రజానాయకులుగా నిలిచిఉంటారు.
......................

మీరు వ్రాసిన వ్యాఖ్యకు సంబంధించి, హామీల గురించి మీ సందేహాలు  తీరటం కొరకు ..ఇక్కడ కొన్ని లింక్స్ కూడా ఇస్తున్నాను. 

(ఈ లింక్స్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా  ఏమైనా అభ్యంతరాలుంటే దయచేసి తెలియజేయగలరు.)

.............................

Search Results
AP eminently qualifies for Special Category Status ...

ఈ క్రింద లింక్ వద్ద విడియోలు కూడా ఉన్నాయి . ..... 


Grant Special category status to Andhra Pradesh - Change.org



Special Economic Status for AP, if not special category - The ...



Wednesday, March 30, 2016

అమరావతి నమూనా..


అమరావతి నమూనా చక్కగా ఉంది. చక్కటి ఉద్యానవనాలు కూడా ఉంటాయంటున్నారు. అంతా బాగుంది.

 కొత్తగా నిర్మించే  భవనాలలోకి గాలి, వెలుతురు  ధారాళంగా  వచ్చేలా  నిర్మించాలనుకోవటం  ఎంతో చక్కటి విషయం. 

అయితే, ఈ రోజుల్లో భవనాలలో  ఎక్కువగా ఏసీలు ఉంటున్నాయి గానీ,  వీలైనంతలో వెలుతురు..  బాగా వచ్చేటట్లు నిర్మించుకుంటే విద్యుత్ ఖర్చు చాలావరకు  తగ్గుతుంది.

అమరావతి నమూనా  చాలా  బాగుంది .  

అయితే అసెంబ్లి మరియు శాసనమండలి భవనాల పై నిర్మాణాలు  గొట్టాలను పోలి ఉన్నాయని,  వాటి డిజైన్ మార్చితే బాగుంటుందని చాలామంది ప్రజలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. 

ఆ గొట్టాల ఆకృతులు చూస్తే అణుకర్మాగారాలు కూడా గుర్తు వస్తున్నాయి.. (  తప్పులు ఎంచుతున్నామని దయచేసి భావించవద్దు. ఏదో తోచినంతలో నా అభిప్రాయం రాయాలనిపించి వ్రాసాను  అంతే.)

అయితే మరి ఈ గొట్టాల ఆకృతి ఏ ఉద్దేశంతో వేసారో, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో మనకు తెలియదు. 

  అమరావతి నిర్మాతలకు అభినందనలు. 

ఆంధ్రుల కలల  రాజధాని అమరావతి చరిత్రలో చిరకాలం  చక్కటి పేరుప్రఖ్యాతులతో నిలిచిఉండాలని ఆశిద్దాము.




Monday, March 28, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

  
రాష్ట్ర విభజన సమయంలో పార్టీలు అనేక హామీలిచ్చిన సంగతి అందరికీ తెలుసు.

తమకు జరిగిన అన్యాయం గురించి ఆంధ్ర ప్రజలు అరచి గోల చేయకపోవచ్చు. అయితే, తమకు అన్యాయం చేసే వారి విషయంలో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. 

ఉదా.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఆ తరువాత భారీగా నష్టపోవటం  గురించి అందరికీ  తెలుసు. 

 ఇప్పుడు కేంద్రం  కూడా  సరిగ్గా ఆంధ్రప్రదేశ్  ను  ఆదుకోవటం లేదనిపిస్తోంది. 

హామీల  అమలు ఆశించినంతగా లేదనిపిస్తోంది. 

రాజధాని మరియు ఇతర విషయాల కోసం భారీగా నిధులు ఇవ్వవలసి ఉంది.

 వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్నుల రాయితీల వంటివి కూడా ఇప్పటివరకూ అమలు చేయలేదు.

  బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు  సరైన న్యాయం జరగలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చటానికి లేదు.

 రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు  గణనీయంగా నిధులు ఇవ్వవలసి ఉంది.


 ఇవన్నీ ఎవరూ ఇచ్చే భిక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.

 రాష్ట్ర విభజనలో ఇప్పుడు  కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీ  ప్రమేయం కూడా ఉంది.

 విభజన జరిగిన కొత్తలో బిజేపీ పార్టీ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీలిచ్చింది.

 అయితే ఇప్పుడు... ఇతరుల  చెప్పుడు మాటలు వినో లేక మరేదైనా కారణాల వల్లో గానీ ఆ పార్టీ తీరు కొంచెం మారిందేమో ? అనిపిస్తోంది. 

 విభజన జరిగి చాలాకాలమయ్యింది. అరకొరగా ఇచ్చే నిధులతో  రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుంది ? 

 సరిపడినంత నిధులు ఇవ్వలేమని భావించినట్లయితే  అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించకుండా ఉండవలసింది.

ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని అప్పట్లో బీజేపీ వాళ్లు ప్రకటించారు. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిద్దాము.
.......................

మరో విషయం ఏమిటంటే, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండగా ఇప్పుడే అమరావతికి తొందరేమొచ్చిందని కొందరు అంటున్నారు. 

10 సంవత్సరాలూ హైదరాబాద్లోనే ఉండి  10 సంవత్సరాల తర్వాత తీరిగ్గా కళ్ళు తెరిస్తే రాజధాని అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడి పడదు కదా ! 

ఇప్పటి నుంచీ కష్టపడితేనే 10 సంవత్సరాలకు రాష్ట్రం  అంతా  అభివృద్ధి చెందుతుంది. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో చాలామంది రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషిచేయటానికి  సిద్ధపడుతుండగా ...కొద్దిమంది  మాత్రం రాజధాని ఏర్పడి అన్ని సౌకర్యాలూ ఏర్పడితేనే వస్తామనటం బాధాకరం.

 తెలంగాణాకు చెందిన ఉద్యోగులు (ఆంధ్రలో ఉన్నవాళ్ళు ) తమను తమ రాష్ట్రానికి పంపివేస్తే తమ రాష్ట్ర అభివృద్ధిలో కృషిచేసుకుంటాము  అంటున్నారట ...

ఆంధ్ర  వాళ్ళు  కూడా తమ రాష్ట్రానికి వచ్చి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాము.
..........................
 
 ఈ క్రింద విషయాలు ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తరువాత వ్రాసి ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది.

అమరావతిలో 30వేల ఎకరాలు తీసుకుని అక్కడ రాజధాని పెట్టటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, పంటలు ఎలా? అని బాధపడనక్కరలేదు. ఇంకా, కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలా పంటపొలాలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ వల్ల  సాగునీరు అంది, కొన్నివేల or  కొన్నిలక్షల ఎకరాలు సాగులోకి వస్తాయంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల వల్ల ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుందంటున్నారు. అలా చాలా ఎకరాలు సాగులోకి వస్తాయి.

అందరూ బాగుండాలి.
 
 

Saturday, March 26, 2016

స్త్రీల సమస్యల గురించి కొన్ని అభిప్రాయాలు..



ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటి?

 స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే  పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

 ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.

 ఎందరో స్త్రీలు  అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే  వేదనకు గురవుతున్నారు. 

పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో  లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు. 

ఇంకా  ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే  బాగుంటుంది.
.................................

Posted by anrd at 10:39 PM 
8 COMMENTS:

AnonymousJanuary 30, 2016 at 1:27 AM

వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే బదులు మీరు ఇంతగా బాధపడుతున్న సమస్యల గురించి మీరే పని మొదలుపెట్టొచ్చుగా. వాళ్లకి ఇబ్బందికి గురిచేస్తున్న సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు, మీబోటి పెద్దలు అడ్డం పడకుండా ఉంటే అదే పదివెలు.

Reply
Replies

anrdJanuary 30, 2016 at 11:35 AM

మేము కొన్ని సంవత్సరాల క్రిందట శనిశింగణాపూర్ వెళ్లి వచ్చాము. అక్కడ దైవదర్శనం చేసుకోవాలంటే స్త్రీలు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే మూలమూర్తి ఉన్న అరుగు పైకి మహిళలు వెళ్ళకూడదు. మూలమూర్తి ఆరుబయటే ఉంటారు కాబట్టి చక్కగా దర్శనమిస్తారు. 

పురుషులు పైన షర్ట్ లేకుండా తడి దుస్తులతో మూలమూర్తి వద్దకు వెళ్లాలనే నియమం ఉన్నట్లు గుర్తు. మరి ఈ విషయం పురుషుల పట్ల వివక్షగా భావించటం లేదు కదా ! 

అయ్యప్పస్వామి వద్దకు రజస్వల కాని ఆడపిల్లలు, బహిష్టులు ఆగిపోయిన ఆడవాళ్ళు వెళ్ళవచ్చు. కొన్ని ఆచారాలు అలా ఉంటాయి. 

శ్రీశైలంలో శివలింగాన్ని స్త్రీలు, పురుషులు అందరూ తాకవచ్చు.

ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా నియమాలు ఉంటాయి. పెద్దలు వద్దన్నదే చేయాలనే పంతం ఎందుకు ?


ఏ విషయంలో ఏ రహస్యం ఉందో తెలియదు. పెద్దవాళ్లు వద్దని చెప్పిన విషయాలే చేస్తామని పట్టుబట్టడం ఎందుకు ?


కొన్ని దేవాలయాల లోపలికి స్త్రీలు వెళ్ళవద్దు .. అని పెద్దలు చెప్పటంలో ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. మేము ఎందుకు వెళ్ళకూడదు ? అని పంతాలు పోవటం ఏమిటి ? 



anrdJanuary 30, 2016 at 12:40 PM

హాస్పిటల్లో ఆపరేషన్ ధియేటర్లోకి అందరినీ రానివ్వరు. ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి. అంతమాత్రాన వివక్ష అంటారా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ? 

కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళటానికీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇందులో వివక్ష ఏమీలేదు.



Jai GottimukkalaFebruary 1, 2016 at 12:39 PM

సమానత్వం అనే హక్కు ప్రైవేటు సంస్థలకు వర్తించదు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలలో మందిరం తాలూకా అనాదిగా పాటిస్తున్న ఆచారాలు ఉంటాయి. సదరు ఆచారాలు హేతుబద్దమా కాదా అన్న చర్చ సరికాదు. వారి గుడి కనుక వారి ఆచారాలు అందరూ పాటించాలి. కాదు కూడదు అనుకుంటే యాజమాన్యంతో చర్చించాలి కానీ రోడ్డు మీద గొడవ చేయడం అనవసరం.

మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


anrdFebruary 1, 2016 at 9:02 PM

అవునండి, మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


Reply

anrdJanuary 30, 2016 at 10:26 AM


ఈ మధ్య ఈనాడులో ఒక వార్త వచ్చింది.తెలుగురాష్ట్రాలలోని వైశ్యులలో కొందరికి భూటెల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైం లోపం ఉన్నట్లు గుర్తించారట.ఈ లోపం ఉన్నవారికి ఏదైనా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మత్తుమందు ఇస్తే తిరిగి వారు స్పృహలోకి రావడం లేదట, కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారట. 

ఈ ఎంజైం లోపం గుర్తించిన తరువాత మత్తు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైద్యులు ప్రత్యామ్యాయ మార్గాలు అనుసరిస్తున్నారట. 

దక్షిణభారతదేశానికి చెందిన వారు అమెరికాలో ఆసుపత్రికి వెళ్లినా ఇప్పుడు వారి కులం గురించి అడుగుతున్నారట. భారత్ లో వైద్యులు కూడా శస్త్రచికిత్స సమయంలో కులం గురించి అడుగుతున్నారట.

భిన్నకులాలు, మతాల సమ్మిళతమైన భారతదేశంలో జన్యు పరిశోధనకు అపారావకాశాలున్నాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ జన్యుశాస్త్రవేత్త డేవిడ్ రీచ్ అనేవారు తెలియజేశారట.

( ఇందువల్ల .. మీది ఏ కులం ? అని వైద్యులు అడిగితే కులం సరిగ్గా చెప్పాలి. అంతేకానీ వైద్యులు కులవివక్ష చూపిస్తున్నారు. కులంగిలం అంటూ ఏమీలేద్.... అంటూ ఆవేశపడకూడదు.)


Reply

anrdJanuary 30, 2016 at 10:27 AM


స్త్రీల సమస్యల పట్ల శ్రద్ధచూపుతూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారు ఎందరో ఉన్నారు. సునీతాకృష్ణన్ వంటివారు ఎంతో ధన్యజీవులు. అలాంటివారికి అండగా నిలిచి స్త్రీల సమస్యలను పరిష్కరించితే అందరూ అభినందిస్తారు.

సతీసహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా అభినందించతగినదే. 

( అయితే సతీసహగమనం ఏవో కొన్ని కారణాల వల్ల ఆచారంగా ఏర్పడి ఉంటుంది. అంతేకానీ సనాతనధర్మం సతీసహగమనాన్ని ఆచారంగా ఏర్పరచలేదు. రామాయణంలో కౌసల్య, సుమిత్ర, కైక సతీసహగమనం చేయలేదు, భారతంలో సత్యవతి, కుంతీదేవి కూడా సహగమనం చేయలేదు.)

అయితే, జోగిని వ్యవస్థ వంటివి దురాచారాలే. ఇలాంటి దురాచారాలను రూపుమాపటానికి ఎవరు ఉద్యమాలు చేసినా అభినందనీయమే. 

సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా అవి పరిష్కరించటం పైన శ్రద్ధ పెట్టకుండా ..స్త్రీలు అన్ని దేవాలయాల లోపలి వరకూ వెళ్ళి ముట్టుకుని తీరుతాం అంటూ ఉద్యమాలు చేయటమేమిటి ? దీని వెనుక ఉన్న విషయం ఏమిటి ?


Reply

anrdJanuary 30, 2016 at 12:35 PM

బహిష్టు సమయం లో స్త్రీలు నీరసంగా ఉంటారు కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. 

ఆ సమయంలో ఎక్కువ పనులు చేయకుండా మైల అంటూ కట్టడి చేసారు. ఇలాగైనా ఆ నాలుగురోజులూ స్త్రీలకు విశ్రాంతి లభిస్తుంది.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అదేపనిగా పనిచేస్తే గర్భసంచి జారే అవకాశం కూడా ఉంది. అప్పుడు శాశ్వతంగా గర్భం ధరించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. 

అయితే ఈ రోజుల్లో శానిటరీనాప్కిన్స్ వాడుతూ గెంతులు వేయవచ్చునంటూ ప్రచారం చేస్తున్నారు.( ఇది సరైనది కాదు.)

కొంతమంది స్త్రీలలో నెలసరి సమయంలో విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. 

చదువులు.. పరీక్షలు, ఉద్యోగాలు..టార్గెట్లతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం ఎలా ఉన్నా బయటకు వచ్చి కష్టపడటం స్త్రీలకు తప్పనిసరి అయ్యింది. 



Wednesday, March 23, 2016

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది . ..

 
ఈ రోజుల్లో నీటి విలువ గురించి అందరికీ తెలిసినా కూడా చాలామంది  నీటిపొదుపును పాటించటం లేదు.

  కొందరు పెద్దవాళ్ళు బట్టలు ఉతికినంత సేపు పంపును అలాగే వదిలేస్తుంటారు. పెద్ద ధారతో నీళ్లు పోతూ ఉంటాయి. 

 వాకిలి కడగటానికి కొద్దిగా నీళ్లు చాలు. అయితే చాలామంది పైపుతో బోలెడు నీళ్లు గుమ్మరించి కడిగేస్తుంటారు.

 అసలే నీటికొరత బాగా ఉన్న ఈ రోజుల్లో నీళ్ళు ఉన్నవాళ్ళు ఇలా ధారాళంగా వాడేస్తుంటే క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భనీటిమట్టం పడిపోయి  అందరికీ నీటి కొరత ఏర్పడుతుంది. 


ఈ రోజుల్లో ఇళ్లలో ప్రతి గదికి పంపులు ఉంటున్నాయి.  

చాలా మంది ఇళ్లలో పంపులు లూజ్ అయి ఒక్కొక్క బొట్టూ నీరు  పోతూ ఉంటుంది . వాటిని రిపేర్ చేయకుండా అశ్రద్ధ చేస్తారు. 

ఒక్కొక్క బొట్టు పోతున్న పంపు క్రింద బకెట్ పెడితే గంటలో బకెట్ నిండిపోతుంది. ఇలా ఎంతో నీరు వృధాగా డ్రైనేజ్లోకి పోతుంటుంది. 

 పాతకాలంలో అయితే గదిగదికీ పంపులు ఉండేవి కాదు, నీళ్లను బయటనుంచి మోసుకుని తెచ్చుకోవాలి కాబట్టి , నీళ్ళను వృధాగా పారబోసేవారు కాదు. 

వాషింగ్ మెషిన్ వల్ల నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం వాషింగ్ మెషీన్ వాడకం కొంత వరకూ తగ్గించుకుంటే మంచిది. 

కొన్ని దుస్తులు చేతితో ఉతుక్కుంటే నీరు పొదుపు అవుతుంది. 

నీటిని వృధాచేయవద్దని ఎందరు చెబుతున్నా  ఎవరూ పట్టించుకోవటం లేదు.

 డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసి ,టాంకర్లతో తరలించి రోడ్ల ప్రక్కన పెంచే మొక్కలకు పోయవచ్చు.

 అందరూ బాధ్యత వహించితేనే నీటిసమస్యలు తగ్గుతాయి. 

బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది .