koodali

Monday, April 4, 2016

మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి...గాలితో నడిచే వాహనం ...

 
 
మన దేశంలో ఎందరో ప్రతిభావంతులున్నారు. అయితే వారి ప్రతిభకు సరైన ప్రోత్సాహం  లభించటం లేదు. అందుకే చాలామంది  విదేశాలకు వెళ్తున్నారు.

 విజ్ఞాన శాస్త్రంలో ఈ మధ్య జరుగుతున్న ఆవిష్కరణలలో భారతీయులు  ఉండటం హర్షించదగిన విషయం.


 అయితే విదేశాలకు వెళ్లిన తరువాత కాకుండా ఇక్కడే వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుంది. 


ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి గాలితో నడిచే వాహనాన్ని కనిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.


 ఇంధన సమస్యలు ఉన్న ఈ రోజుల్లో ఇది ఎంతో గొప్ప ఆవిష్కరణ.  అయితే , వార్తలలో చెప్పటం వరకే జరిగింది కానీ, ఆ ఆవిష్కరణకు ఏమీ ప్రోత్సాహం ఉన్నట్లు లేదు. 


ఇదే విషయాన్ని  ఎవరైనా విదేశాల వాళ్లు కనిపెడితే ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు. 


ఈ మధ్య కాలంలో  భారతదేశంలో  యువత ఎన్నో కొత్త విషయాలు కనుగొంటున్నారు. అయితే మన వాళ్ళకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదు. 


టెక్నాలజీ కోసం బోలెడు ఖర్చు పెట్టి విదేశాలపై ఆధారపడటం కన్నా మన యువతను ప్రోత్సహిస్తే ఎన్నో కొత్త విషయాలను కనుగొంటారు. 


 పాత కాలంలో జగదీశ్ చంద్ర బోస్ అనే భారతీయ శాస్త్రవేత్త ఎన్నో గొప్ప విషయాలను కనుగొన్నారు. అయితే వారికీ  మనదేశంలో సరైన ప్రోత్సాహం లభించలేదనిపిస్తుంది .  


విదేశాల వాళ్ళు మన యువత యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ ....తమ దేశ అభివృద్ధి కొరకు భారతీయ ప్రతిభ అవసరం అని చెబుతున్నారు.


 మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి.




RTC Driver David Raju Invents Vehicle runs With Air in ...








No comments:

Post a Comment