koodali

Friday, January 4, 2013

శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి సినిమా ...కొన్ని విషయాలు...


ఓం.
శ్రీ  అనంతలక్ష్మీసత్యవతీదేవి సమేత శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీర  వేంకట  సత్యనారాయణ స్వామి వారికి  నమస్కారములు. 


 శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.



పురాణేతిహాసాలలోని  వారి  చరిత్రల  ద్వారా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు. 



శ్రీ  సత్యనారాయణ స్వామి వారి  వ్రత మహాత్మ్యంలో  చెప్పే  కధల  ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

ప్రసాదం  అంటే, భగవంతుని   అనుగ్రహం.

శ్రీ సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  గురించి  సినిమా  కూడా  వచ్చింది. 


 ఈ  సినిమా  యొక్క  లింక్  ఇక్కడ  ఇస్తున్నానండి.

Sri Satyanarayana Swamy - YouTube.



 

Wednesday, January 2, 2013

చరిత్రలో ఎందరో మహానుభావులైన స్త్రీపురుషులున్నారు.

* ఓం.

*ఈమధ్య  ఒక బ్లాగ్ లోని  టపాకు  నేను  వ్రాసిన   వ్యాఖ్యలో.............

* ..జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది... అని  వ్రాసాను.

* తరువాత  ఆలోచిస్తే,   ధర్మరక్షణ  కోసం   జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  ఎందరో  మహానుభావులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో   ఉన్నారు.  అందుకని    పైవిధంగా  నేను  వ్రాయటం  తప్పని  నాకు  అనిపించింది. 



 * తెల్లవారితే  పట్టాభిషేకానికి  బదులు  వనవాసానికి  వెళ్ళవలసివచ్చినప్పుడు  సీతారాములు  ఎంతో  నిబ్బరంగా  వ్యవహరించారు. 


*
నేను  వనవాసానికి  వెళ్ళను.....  అని  రాముడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.  అయితే,   శ్రీ రాముడు  అడవులకు  వెళ్ళకపోతే  ,  కైకేయికిచ్చిన  మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  దశరధునికి  వచ్చి  ఉండేది.


* నేను  రాజ్యాన్ని దానంగా  ఇవ్వను....అని  హరిశ్చంద్రుడు  అంటే  ఎవరూ  చేయగలిగిందేమీలేదు.   అయితే, రాజ్యాన్ని
దానంగా ఇవ్వకపోతే,   విశ్వామిత్రునకు  ఇచ్చిన   మాటను  నిలబెట్టుకోలేక   మాటతప్పిన  వాడనే  చెడ్డపేరు  హరిశ్చంద్రునకు  వచ్చి  ఉండేది.

 * వాళ్ళు   ధర్మపరిరక్షణకు  ఎంతో  ప్రాధాన్యతను  ఇచ్చేవారు.


* సమాజంలో  బాధ్యతాయుతస్థానాల్లో  ఉన్నవారు  అసత్యవాదులు,  అధర్మపరులు  అయితే ,   ప్రజలు  కూడా  అసత్యం,  అధర్మం  చేయటానికి  వెనకాడరు.    అప్పుడు  సమాజమంతా  అబద్ధాలకోర్లు,  మోసగాళ్ళతో  నిండిపోయి   అస్తవ్యస్తమవుతుంది.      అధర్మం  పెరిగిపోతుంది.     సమాజంలో   ఎన్నో  నేరాలు  జరుగుతాయి.



*  అందుకే  సత్య  హరిశ్చంద్రుడు,  శ్రీరాముడు, వంటి  వారు  లోకహితం  కోరి,  ధర్మ  పరిరక్షణ  కొరకు  రాజభోగాలను   కూడా   అవలీలగా  త్యజించి , ఎన్నో  కష్టాలను  సహించారు.  వారి  భార్యలు  కూడా  ఎన్నో  కష్టాలను  భరించారు.


* రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు...  వారి  భార్యలు  ...  రాజ్యాధికారం  కోసం  తమలో  తాము  
కలహించుకోకుండా  ప్రజలకు  శాంతినిచ్చి  తాము  కష్టాలను  భరించారు.

* భారతంలో  భీష్ములవారు  రాజ్యాధికారాన్ని,  వివాహాన్ని  అవలీలగా  త్యజించి  జీవితాంతం  తాను  చేసిన  ప్రతిజ్ఞకే  కట్టుబడ్డారు.



* లోకక్షేమం  కోసం  వెన్నెముక  కావాలని   దేవతలు   అడిగితే  అవలీలగా  అర్పించారు  దధీచి  మహర్షి.


*  ఇలా    ధర్మరక్షణ  కోసం  జీవితాలలో  ఎన్నో  కష్టాలను  సహించిన  స్త్రీలు,  పురుషులు   పురాణేతిహాసాలలో  ఎందరో   ఉన్నారు. 



* పురాణేతిహాసాల  ద్వారా  వీరి  చరిత్రలను  తెలుసుకుని ,  స్వార్ధాన్ని  తగ్గించుకుని  జీవితాలను  తీర్చిదిద్దుకున్న  వారెందరో   తరువాత   కాలంలో  కూడా   ఉన్నారు.



* ఇంత  మంది  మహనీయులైన  స్త్రీలు,  పురుషులు  చరిత్రలో  ఉన్నప్పుడు ,  జీవితంలో  ఎవరినీ  ఎప్పుడూ  విసుక్కోని,  కసురుకోని,  తిట్టని,  ఒక్క  స్త్రీని  నాకూ  చూడాలనుంది...... అని  నేను  వ్రాయటం  ఎంతో  తప్పే  . * అలా  వ్రాసినందుకు  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


.................................
* ఈ  మధ్య   నేను  కురువపురం  వెళ్ళి  శ్రీపాదశ్రీవల్లభుల  వారి  దర్శనం  చేసుకు  వచ్చాను.

* ఇంతకుముందు  కూడా  ఒకసారి  కురువపురం  సందర్శన  భాగ్యం  కలిగింది.   మళ్ళీ  నాకు   కురువపురం  సందర్శన  భాగ్యం   కల్పించినందుకు  దైవానికి  అనేక  నమస్కారములు.


* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  అనేక  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  అనేక నమస్కారములు.

........................

 * ఆంగ్ల  నూతన సంవత్సర  సందర్భంగా .... ప్రపంచమంతటా  శాంతిభద్రతలు  విలసిల్లాలని  ఆకాంక్షిస్తున్నాను.



Saturday, December 29, 2012

క్షమించండి..శ్రీ దత్తాత్రేయ జయంతి..

*   శ్రీ  దత్తాత్రేయ జయంతి.. మార్గశిర  శుక్ల పౌర్ణిమ  నాడు  జరుపుకుంటారు.

*  అయితే , నేను  క్రితం  టపాలో  శ్రీ  దత్తాత్రేయ జయంతి   మార్గశిర శుక్ల చతుర్దశి  నాడు ... అని  వ్రాయటం  జరిగింది. ( కొన్ని  కారణాల  వల్ల నేను  ఇలా  భావించటం  జరిగింది.  )

*  క్రితం  టపాలో   శ్రీ  దత్తాత్రేయ జయంతి  మార్గశిర శుక్ల చతుర్దశి  నాడు....అని  నేను   వ్రాసినది  పొరపాటైతే ,  దైవం  దయచేసి  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను.   

............................

* శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.

*  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

   *  దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
              * శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .




Thursday, December 27, 2012

ఓం.....అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .



ఈ  రోజు  శ్రీ  దత్తాత్రేయ  జయంతి  సందర్భంగా....

శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.



శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

    దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
               శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .



     శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి  దివ్య  సిద్ధమంగళ  స్తోత్రము  ఎంతో  శక్తివంతమైనది.  శ్రీపాద  శ్రీవల్లభ స్వామి  వారి  గురించిన  ఎన్నో  వివరములు   మరియు  ఎంతో  శక్తివంతమైన  సిద్ధమంగళ  స్తోత్రము .....



 ఈ  లింకులో  ఉన్నాయి....1.Sripada Charitamrutam - Sripada Sri Vallabha - 1 - Webs
Siddhamangala Stotram - Sripada Sri Vallabha - 1 - Webs


        

........Sripada Sri Vallabha - 1 - Webs.

     

     Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube



  Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube. 

 

 

 


Wednesday, December 26, 2012

ఓం..


శ్రీరామరామరామేతి  రమేరామే  మనోరమే
సహస్రనామతస్తుల్యం  రామనామ  వరాననే .


సీతారాముల వార్లకు అనేక నమస్కారములు. 
 ......................

ఆంజనేయ  స్తుతి......


ఆంజనేయ  మతిపాటలాననం
కాంచనాద్రి  కమనీయ విగ్రహమ్ 

పారిజాత  తరుమూలవాసినం
భావయామి  పవమాననందనమ్ .

మనోజవం  మారుతతుల్య  వేగం
జితేంద్రియం  బుద్ధిమతాం వరి
ష్ఠమ్ 

 వాతాత్మజం  వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.


సువర్చలాదేవి ఆంజనేయస్వామి వార్లకు  అనేక నమస్కారములు.





Monday, December 24, 2012

పండుగల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.


* నిన్న,ఈ రోజు .... వైకుంఠ ఏకాదశి, ద్వాదశి  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.

* రేపు  క్రిస్మస్  సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.
................................


* శ్రీ  సీతారామ  స్తోత్రము.

అయోధ్యాపుర నేతారం మిధిలాపుర నాయికాం
రాఘవాణా మలంకారం వై దేహానా  మలంక్రియాం      1

రఘూణాం  కులదీపం చ నిమీనాం  కులదీపికాం
సూర్యవంశసముద్భూతం  సోమవంశసముద్భవాం    2

పుత్రందశరధస్యాపి  పుత్రీంజనకభూపతేః
వశిష్టానుమతాచారం శతానంద మతానుగాం            3

కౌసల్య గర్భసంభూతం  వేదగర్భోదితాం స్వయం
పుండరీక  విశాలాక్షం  స్ఫురది  దీవరేక్షణాం              4

మత్తమాతంగ గమనం మత్తసారసగామినీం
చందనార్ద్రభుజామధ్యం కుంకుమాంక భుజాంతరాం    5

చాపాలంకృత హస్తాబ్జాం పద్మాలంకృత పాణికాం
సర్వలోక విధాతారం సర్వలోక విధాయినీం                6

లోకాభిరామం శ్రీరామ మభిరామాం చ మైధిలీం
దివ్యసింహాసనారూఢం  దివ్యస్రగ్వస్త్ర భూషణాం           7

అనుక్షణం కటాక్షాభ్యాం  అన్యోన్యేక్షణ కాంక్షిణౌ
అన్యోన్య సదృశావేతౌ  త్రైలోక్య  గృహాదంపతీం             8

ఇమౌ యువాం  ప్రణమామ్యహం భజామ్యతికృతార్ధ తాం
అనయాస్తౌతియ స్తుత్యా రామం సీతాం చ భక్తితః          9

తస్యతౌ తను తాం  ప్రీతౌ సంపద స్సకలా  అపి
ఇతీదం రామచంద్రస్య జానక్యాశ్చ విశేషితః                 10

కృతం  హనుమతాం  పుణ్యం  స్తోత్రం  సద్యోవిముక్తిదం
యః పఠేత్ప్రాతరుత్ధాయ సర్వాన్ కామా నవాప్నుయాత్ 11

య ఇదం పఠతిస్తోత్రమ్  మైధిలీ  రామచంద్రయోః
శ్రీ వైకుంఠమవాప్నోతి న నరో హతకిల్బిషః                  12

* ఇతి  శ్రీమత్  హనుమద్విరచితం  సీతారామస్తోత్రమ్ సంపూర్ణ ఫలం : శ్రీ సీతారామాంజనేయుల సంరక్షణ.

* పైన  వ్రాసినవిషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు ఉన్నచో,  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

 

Friday, December 21, 2012

భక్తి ముఖ్యం.



  జీవితంలో  చిత్రమైన  అయోమయ పరిస్థితులు  ఏర్పడినప్పుడు, మానసికంగా  క్రుంగిపోయి  ఆత్మహత్యలు  వంటి  నిర్ణయాలను  తీసుకోకుండా ,  తీర్ధయాత్రలు,  దైవపూజలు,  దానధర్మాల వంటి  సత్కర్మలను  ఆచరించటం  వల్ల  పరిస్థితులు  చక్కపడే  అవకాశం  ఉంది.

అయితే  పరిస్థితి  తీవ్రతను  బట్టి ,  పుణ్యకార్యాలను  మిక్కుటంగా  చేస్తేనే  మంచి ఫలితాలు  లభిస్తాయి.

తీర్ధయాత్రలు  చేసే  శక్తి  లేకపోయినా  భక్తి  ఉంటే  చాలు .  దైవం  తానే  దర్శనమిస్తారు. ( కలలో  కావచ్చు, ఇలలో  కావచ్చు.)  భక్తి  ముఖ్యం.

భక్తి  అంటే,  పాపాలు  చేస్తూ  భగవంతునికి  పాపపుసొమ్మును  కానుకగా  సమర్పించే  నాటకీయమైన  భక్తి  కాదు.  స్వచ్చమైన  ప్రేమ  భక్తి.


భగవంతునికి  జీవులంటే  ఎంతో  ప్రేమ.  ఎన్నో  తప్పులను  చేసిన  వారికి   కూడా   మంచిగా  మారటానికి  మళ్ళీమళ్ళీ  అవకాశాలను  కల్పిస్తారు.

  ఎన్ని  అవకాశాలను  కల్పించినా  పట్టించుకోకుండా  పాపాలను  చేస్తూ  ఉంటే  అప్పుడు  లోకహితం  కొరకు,   దైవం    పాపాత్ములను   శిక్షిస్తారు.

  పాపాలు  చేసిన  వారు  కూడా   చేసిన  తప్పులు   తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారితే   దైవానుగ్రహానికి  పాత్రులే.