సృష్టిలో దైవం మహాశక్తి. ఒక్క దైవశక్తే ప్రపంచంలో అందరినీ సృష్టిస్తారు. అంతేకానీ, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. విశాలమైన భూప్రపంచంలో వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనేక మతాలు పద్ధతులు ఏర్పడ్డాయి. ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధిస్తున్నారు.
అయితే, ఎవరైనా పాటించే పద్ధతులు ఇతరులకు హానికలిగించే విధంగా ఉండకూడదు.
భగవంతుని పేరుతో కూడా కొందరు ఇతరులను బాధించడానికి ప్రయత్నిస్తారు. అలా చేయటం చాలా తప్పు. జీవితంలో కష్టాలు పోవాలని దైవాన్ని ప్రార్ధిస్తాము. అలాంటప్పుడు దయామయులైన దైవం పేరు చెప్పి క్రూరమైన పనులు చేయటం ఏమిటి?
***************
సనాతనధర్మం మతం కాదంటారు కొందరు. సనాతనధర్మము ఆదర్శవంతమైన గొప్ప విధానము.
మన ప్రాచీనులు ..లోకాః సమస్తాః సుఖినో భవంతు..అని తెలియజేసారు. ఆ విధంగా ప్రపంచంలోని అందరూ బాగుండాలని కోరుకుంటాము.
పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు కలిగిఉండాలని మన పెద్దలు మనకు నేర్పించారు. పెద్దవాళ్ళు సహనాన్ని గురించి గొప్పగా నేర్పించినప్పుడు ప్రజలు సౌమ్యంగా తయారవుతారు.
సహనము,
పరమతసహనం..వంటిలక్షణాలు కలిగిఉండాలని పెద్దలు చెప్పటంలో తప్పులేదు.
వాళ్లు అలాగే చెప్పాలి కూడా. అలాకాకుండా ఒకరినొకరు చంపుకోమని చెబితే అందరూ
ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడు అందరూ బాధలు పడవలసి వస్తుంది.
అయితే, ఎవరైనా పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు మాత్రం
అందుగుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
***********
అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. అయితే, ఎవరైనా హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి.
ఎవరైనా మనపట్ల దాడులు చేస్తే మనం శాంతి అంటూ చేతులు ముడుచుకుని కూర్చోము కదా ..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము.
లోకంలోని అమాయకులు, మంచివారికొరకు..
లోకాః సమస్తాః సుఖినో భవంతు ..అనుకోవాలి కానీ,
చెడ్డవారి కొరకు కాదు.
పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు మంచివే. అయితే, ఇతరులు పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, మనల్ని మనం కాపాడుకోవటం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలాంటప్పుడు సహనం..అని నింపాదిగా కూర్చుంటే ఏం జరుగుతుందో చెప్పలేం.
మనల్ని రక్షించుకోవటానికి తెలివిగా ఏదో ఒకటి చేయాలి. దైవాన్ని ప్రార్ధిస్తూ మన వంతు ప్రయత్నం మనం తప్పక చేయాలి.
******************
హిందువులకు పరమత సహనం ఎక్కువ. రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంది. ఒక యోగి ఆత్మ కధ పుస్తకంలో ఇతరమతముల ప్రస్తావన ఉంది.
************
నా ఫ్రెండ్ ఒకామె నాకు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము గ్రంధాన్ని ఇవ్వటం జరిగింది.ఆ విధంగా నాకు శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాదుల వారి గురించి తెలిసింది. మేము కురువపురం కూడా వెళ్లి దర్శించుకున్నాము. ఆ గ్రంధంలో శాయి గురించి కొన్ని విషయములున్నాయి. ఈ విషయాల అంతరార్ధం ఏమిటో.. ఆ విషయాల గురించి దైవానికే తెలుస్తుంది.
***************
కొన్ని సంవత్సరాల క్రితం వరకు షిరిడిసాయిబాబా గురించి చాలామందికి తెలియదు. కొందరు శిరిడిసాయిబాబా గురించి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమాలో కొందరు బ్రాహ్మణులు కూడా పాత్రధారులుగా నటించారు, పాటలు వ్రాసారు, పాడారు. ఆ పాటలు ఎలా ఉన్నాయో చాలామందికి తెలుసు. ఆ సినిమాల ద్వారా ఎందరో ప్రభావితులయ్యారు. కొందరు పండితులు కూడా సాయిబాబా పూజల గురించి గొప్పగా ప్రచారం చేసారు, గ్రంధాలు కూడా వ్రాసారు.
సమాజంలో గొప్ప పేరు ఉన్నవారు చెబుతున్న విషయాలను సామాన్యప్రజలు నమ్ముతారు. వారు చెప్పిన విషయాలను పాటిస్తారు. సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు చెప్పే విషయాలను చాలామంది నమ్ముతారు. శిరిడి లోని కొందరు బ్రాహ్మణులు కూడా సాయిని అనుసరించారు.
క్రమంగా సాయి పూజలు పెరిగేసరికి..కొన్ని సందేహాలు కలిగి, సాయిబాబా పూజలు ఎందుకు చేస్తున్నారంటూ.....ఇప్పుడు సామాన్యప్రజలను తప్పు పడుతున్నారు.
కొంతకాలం క్రిందట సాయిబాబాను గురించి గొప్పగా చెప్పి సమాజంలో వ్యాపింపచేసినది హిందువులే. సామాన్యజనం ఆకర్షించబడి సాయిపూజలు ఎక్కువయ్యేసరికి, ఇప్పుడేమో సాయికి పూజలు చేయవద్దని చెప్తున్నవారు కూడా హిందువులే.
**************
జనాలు షిరిడి సాయి వెంట పడితే, ఆయన తన అభిప్రాయాలను చెప్పి ఉండవచ్చు.
సాయిబాబా హిందుదేవతలతో పాటు ఇతరమతాల దేవతలను కూడా స్మరించేవారు కాబట్టి, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో కొందరు హిందువులు .. షిర్డిసాయిని పూజించవద్దని అంటుండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.
**************
నాకు ఏమనిపిస్తుందంటే, హిందువులలో ఉన్న కొన్నివిధానాలను చాలామంది హిందువులు పాటించలేకపోతున్నారు. షిర్డిసాయిబాబా చెప్పిన విధానాలు
తేలికగా ఉంటాయి. అందువల్ల కూడా అనేకమంది సాయి విధానాల పట్ల ఆకర్షితులు అయి
ఉండవచ్చు. విధానాలు సులభంగా ఉంటే, ఆధునిక కాలంలో ప్రజలు త్వరగా
ఆకర్షితులవుతారు.
**************
ఇంకా, ఇంకొక విషయం ఏమిటంటే.. హిందువులకు
బోలెడుమంది దేవతలుండగా, బోలెడు పండుగలు ఉండగా చాలనట్లు ఇంకా, ఇతర మతాల
వారి పండుగలు కూడా ఎందుకు చేస్తారో? ఏమిటో? అందరూ ఆలోచించవలసి ఉంది.
*************
ప్రతిదానికి
మీరు ఇలా చేయకూడదు..ఇలానే చేయాలి..లేకపోతే కష్టాలు మీద పడిపోతాయంటూ
చెబుతుంటే, ఈ కలికాలంలో అవన్నీ పాటించటం అందరికి కుదరకపోవచ్చు. తేలికగా
ఆచరించే విధానాలు ఎవరైనా చెబితే అటు వెళ్ళటానికి ఇష్టపడతారు.
దైవం
అందరికీ అవసరమే. దైవం అంటే భయంతో కాకుండా, జీవితంలో కష్టసుఖాలను దైవంతో
చనువుగా, ప్రశాంతంగా, అరమరికలు లేకుండా పంచుకోవాలని ఉంటుంది. అయితే పూజలు
అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి......అనుకునేవిధంగా పరిస్థితి ఉంది.
ప్రశాంతంగా దైవపూజ చేయాలన్నా, అక్కడా అనేక ఆంక్షలు. అది అలా చేయకూడదు, ఇది
ఇలాగే చేయాలంటూ చెబుతారు. జీవితంలో నియమాలు ఎంతో అవసరం. అయితే, ఆ నియమాలు తట్టుకోలేంత ఉంటే మాత్రం పాటించటం కష్టమవుతుంది. అవన్నీ పాటించలేక వదిలేయాలనిపిస్తుంది.
ఇవన్నీ
పాటించలేక నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, మతంతో సంబంధం లేకుండా నాకు
తోచినట్లు దైవాన్ని పూజించుకుంటే ఎంత బాగుంటుంది.. అనిపిస్తుంది. పండుగ
అంటే..దైవాన్ని స్మరించుకోవటం కన్నా, తప్పులు జరగకుండా పనులు ఎలా జరుగుతాయో? అని టెన్షన్ ఎక్కువగా ఉండేది.
ఇప్పుడు అతిని చాలావరకూ తగ్గించుకుని, నాకు తోచినంతలో ప్రశాంతంగా దైవాన్ని ఆరాధించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.
*************
అనేక విషయాలను పాటించే ఆసక్తి ఉన్నవారు పాటించవచ్చు. అయితే, అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.
పాతకాలంలో
ఇన్నిరకాల విషయాలు అందరూ పాటించేవారు కాదు. కొన్ని విషయాలలో వారి
వంశాచారం ప్రకారం ..వారి పెద్దవారిని అడిగి పాటించేవారు.
కొందరు..
కోరికలు, కష్టాలు.. తీరాలంటే ఇలా చేయండి..అంటూ అనేక పద్ధతులను చెబుతారు. సోషల్ మీడియాలో ఉండాలంటే.. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, కొందరు
ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతున్నారు. వీటివల్ల కూడా హిందువులు మరింత
అయోమయంలో ఉంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమవుతాయో?
******************
హిందువులలోనే
కొందరు, మా దేవత గొప్ప అంటే.. మా దేవతే గొప్ప అంటూ.. గొడవలు పడ్డారు.
గొడవలు పడే హిందువులవల్ల హిందుమతానికి నష్టం జరిగింది. అలాంటివారు హిందువుల
బాగోగుల గురించి పాటుపడుతున్నామనటం విచిత్రం.
హిందువులు
అభివృద్ధి చెందాలంటే, కొన్ని విషయాలను సరిదిద్దుకోవాలి. హిందువులలో ఐక్యత
ఉండాలి. వైష్ణవులు, శైవులు, శాక్తేయులు..అంటూ గొడవలు పడకూడదు.
అంటరానితనం..వంటివి కూడా ఉండకూడదు. మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాలను విచక్షణతో ధర్మబద్ధంగా పాటించవచ్చు.
ఒకే
హిందూ మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను
అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది.
వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.
***********
భారతీయులలో
ఐకమత్యం లేకపోవటం వల్ల, భారతీయుల అతి సహనశీలత వల్ల విదేశీయులు ఇక్కడకొచ్చి
ఈ దేశాన్ని అనేకసంవత్సరాలు పాలించారు. ఇప్పటికీ భారతీయులలో ఐకమత్యం అంతగా
లేదు. విదేశీమతాలవాళ్ళు ఇక్కడకొచ్చి ఇక్కడి వారిని మతాలమార్పిడి చేస్తున్నా
కూడా పట్టించుకోవటం లేదు. పరిస్థితి ఏమవుతుందో ?
మన
బలహీనతలను మనం సరిదిద్దుకోకుండా.. అంతా అవతలవారివల్లే అనుకోవటం కన్నా, తమ
బలహీనతలను సరిదిద్దుకుంటే బలవంతులవుతారు. తాము బలవంతులయితే శత్రువులను
తేలికగా జయించగలరు.
************
పరమతసహనం
కొందరికి ఉంటే సరిపోదు..అందరికీ ఉండాలి. మతాల పేరుతో జరుగుతున్న దారుణాలను
గమనిస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. మనుషులు ఎందుకు ఇలా
ప్రవర్తిస్తున్నారో? ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో? దైవానికే
తెలియాలి.
***********
వేదములు, పురాణేతిహాసాలు ..ఎంతో గొప్పవి. వేదాలు, పురాణేతిహాసాల ద్వారా ఎన్నోవిషయాలను తెలుసుకోవచ్చు.
పురాణేతిహాసాల ద్వారా..జీవితంలో ఎలా ప్రవర్తించితే ఎలాంటి ఫలితాలుంటాయి. ఏది ధర్మం.. ఏది అధర్మం.. ఎలా ప్రవర్తించాలి.. ఎలా ప్రవర్తించకూడదు.. ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి..వంటి విషయాలను కూడా పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ప్రాచీనులు మనకు తెలియజేసారని నా అభిప్రాయము.
ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు. హిందువులు, తరతరాలనుంచి ఎందరినో దేవతలుగా పూజిస్తున్నారు.
హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.
ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.
మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, ఇలా హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా
పూజిస్తారో.. చెప్పలేము.
అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.
ఏ దేవతను పూజించినా.. ఉదా..అమ్మవారిని పూజించినా..శివుణ్ని పూజించినా.. విష్ణువును పూజించినా.. ఒకే దైవశక్తిగా భావించి పూజించవచ్చు.
అందరు దేవతలలో ఒకే దైవశక్తిని భావించి పూజించవచ్చు. ఒకే దైవంలో అందరు దేవతలను భావించి పూజించవచ్చు.
శ్రీరాముడు హనుమంతుని మధ్య గల ఆప్యాయత అందరికి తెలిసిందే. హనుమంతుడు శివుని అంశ కలవారు. శిశువును కంసుడు చంపడానికి పైకి విసిరేయగా, ఆ శిశువు యోగమాయగా ప్రత్యక్షమయ్యి.. కొన్ని విషయాలను పలికి అదృశ్యమవుతారు. అమ్మవారు(యోగమాయ).. శివుడు.. విష్ణువు..వీరందరూ ఒకటే. వీరు వేరువేరు ..అని మనుషులు గొడవలు పడకూడదు.
హిందువులు ఇంకాఇంకా ..కొత్త పూజావిధానాలను పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.
ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.
దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా పూజావిధానాలను పెంచుకోకుండా పూజించుకుంటే సరిపోతుంది. వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప.
ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.
పూజించటానికి ప్రాచీనులు తెలియజేసిన దేవతలు ఉన్నారు... కఠినమైన ఆచారవ్యవహారాలను పాటించి పూజలు చేయకపోయినా, దైవాన్ని నమ్మి, చక్కగా ప్రేమగా స్మరించుకోవచ్చు.
ఈ రోజుల్లో కొందరు తాము దైవాంశగలవారమని, ప్రజల కష్టాలు తీరుస్తామని మోసం చేస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారు తామే దేవుళ్ళమన్నట్లు పూజలు కూడా జరిపించుకుంటుకున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ వ్యాపారాల కొరకు కొత్తగా పూజలను పెంచుతున్నారనిపిస్తోంది.
ఎవరిని ఏ విధంగా పూజించాలి ? అనే విషయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.
సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.
**********
ప్రపంచంలో కొందరు మనుషుల ఆలోచనలు గమనిస్తే , ప్రపంచం ఎటుపోతుందో అర్ధంకావటంలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. అందువల్ల, ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దైవమే దిక్కు.
......
ఈ పోస్ట్ చాలా పెద్దగా అయ్యింది .
*************
అందరూ దైవభక్తిని కలిగి..ధర్మముగా
జీవించడానికి ప్రయత్నించాలి.