koodali

Sunday, October 29, 2017

మా ఇంటివద్ద ఉన్న పారిజాతం చెట్టు ..ఒక సవరణ..


మా ఇంటివద్ద ఉన్న పారిజాతం చెట్టు ..అనే టపాలో .. 

(పారిజాతం పువ్వులను చెట్టునుంచి కోయకూడదంటారు. క్రింద రాలిపడిన పువ్వులనే ఏరి పూజలో సమర్పించాలట.

 ఒక శుభ్రమైన వస్త్రాన్ని నేలమీద పరిచి వస్త్రం పైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చట.  

అలాగని, వస్త్రాన్ని పరిచి, పని ఉందని మనం లోపలికి వెళ్తే..ఆ వస్త్రం పైనుంచి పిల్లి వంటివి నడిచి వెళ్తే దోషం కావచ్చు.

కాబట్టి, నేలమీద వస్త్రాన్ని పరచి, వెంటనే లోపలికి వెళ్లిపోకుండా.. చెట్టు కొమ్మలను నిదానంగా కదిలించి వస్త్రంపై రాలిన పువ్వులను ఏరుకోవచ్చు. ..)  అని వ్రాసాను.

***************
అయితే,పారిజాతం పువ్వుల కొరకు చెట్టుకొమ్మలను కదిలించకూడదట.(అంతర్జాలం ద్వారా ఈ విషయం తెలిసింది. ) 
క్రింద రాలిన పువ్వులను మాత్రమే తీసుకోవాలట.  
**************
నాకు ఏమనిపిస్తుందంటే, 

ప్రక్క ఉన్న చెట్టు కొమ్మలపైనా, ఆకులపైనా రాలిపడిన పువ్వులను  తీసుకోవచ్చు,

(పారిజాతం చెట్టు చుట్టుప్రక్కల.. మధ్యస్థం ఎత్తులో  పెరిగే మొక్కలను పెంచితే ఆ మొక్కలపై రాలిపడే పువ్వులను తీసుకోవచ్చు.)

లేదా నేలకు కొద్దిగా ఎత్తులో వెడల్పైన బల్లపైన వస్త్రాన్ని పరచి దానిపైన రాలిపడిన పువ్వులను తీసుకోవచ్చు,

 లేక కొమ్మలకు వెడల్పుగా ఊయలవలె వస్త్రాన్ని కట్టి అందులో పడిన పువ్వులను సేకరించవచ్చు.


**************
పారిజాతం చెట్టు ఇంటివద్ద పెంచకూడదు, దేవాలయంలోనే ఉండాలని కొందరు అంటారు, కొందరేమో ఇంటివద్ద పెంచుతారు. 

ఇంటివద్ద పెంచితే మాత్రం, కొమ్మలు రోడ్డుపై పెరిగి, పువ్వులు రోడ్డుపై పడి    కాళ్ళక్రింద త్రొక్కే విధంగా కాకుండా, ముందుగానే ఆలోచించి సరైన ప్రదేశంలో నాటుకోవటం మంచిది. 
***********************************

ఈ మధ్య విన్న విషయం.. 

 పారిజాతం పువ్వులు నేలపై పడినవాటినే ఏరి దైవానికి సమర్పించాలి,  
నేలపై దుమ్ము ఉంటుందని వస్త్రం పరవటం కూడా సరైనది కాదు. నేల స్పర్శ తగలాలంటున్నారు.

 అంతగా నేల మురికిగా ఉంటుందనుకుంటే ఆవుపేడతో అలకవచ్చంటన్నారు. 

ఇలాంటప్పుడు మరికొన్ని సందేహాలు వస్తాయి.  

అయితేమరి,   చెట్టు  ఆకులపై   రాలి పడిన పువ్వులను,  పచ్చగడ్డిపై రాలిపడిన పువ్వులను .. దైవానికి సమర్పించకూడదా ? 

కేవలం నేలపై రాలిన వాటినే సమర్పించాలా ?  అనే  సందేహాలు వస్తాయి. 

******************
పారిజాత పువ్వులు క్రింద రాలి పడినప్పుడు, మట్టి పైన రాలిపడినవి మాత్రమే వాడాలి, ఆ పువ్వులకు మట్టి స్పర్శ తగలాలి అంటున్నారు కాబట్టి...

కొన్నిసార్లు గోడ ప్రక్కన  చెట్టు పెరిగినప్పుడు గోడపైన కూడా పువ్వులు రాలి పడుతుంటాయి.

పువ్వులు మట్టి పైన కాకుండా గోడపైనా, క్రింద ఉన్న రాళ్ళపైన రాలిపడితే వాటిని ఏరి, శుభ్రమైన మట్టి నేల మీద ఒకసారి ఉంచి వాడుకోవచ్చేమో ? 

 ఏమిటో  ఒక సందేహం తర్వాత ఇంకో సందేహంగా పరిస్థితి ఉంది.


No comments:

Post a Comment