ఈ రోజుల్లో కొందరు మన సంస్కృతి అంటూ చెప్పడమే తప్ప, ఆచరణలో ఎంతవరకూ పాటిస్తున్నారు?
పాపపు పనులు చేయకూడదు, అత్యాశ ఉండకూడదు ..ఇలా ఎన్నో చక్కటి విషయాలను పెద్దలు తెలియజేసారు.
ఇంద్రుడంతటి గొప్పవారైనా పొరపాట్లు చేస్తే , కష్టాలను అనుభవించినట్లు పురాణేతిహాసాల ద్వారా తెలుసుకోవచ్చు.
తపస్సు చేసి వరాలను పొందినవాడు, పండితుడు అయిన రావణుడు మనస్సును అదుపులో ఉంచుకోలేక చేసిన పాపపుపనుల వల్ల సంతానంతో సహా నాశనమయ్యాడు.
********
జీవులు మరణించిన తరువాత గతంలో సంపాదించిన సొమ్ము వెంటరాదు, చేసిన ధర్మమే వెంట వస్తుంది.
తన స్వార్ధం కోసం అడ్డమైన పనులూ చేసి ఎంతో సొమ్ము కూడబెడతారు.
..... ఇలాంటి వాళ్ళు మరణించిన తరువాత గతంలో చేసిన పాపాల వల్ల కొంత నరకాన్ని అనుభవించి , కర్మశేషంతో ఎక్కడో తిరిగి జన్మను పొందుతారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తారు.
ఇవన్నీ తెలిసినా మనుషులు పాపాలు చేస్తూనే ఉన్నారు.
ఈ రోజులలో పాపాలు చేయనివారు, పాపాలు చేయకూడదనుకునేవారు ఎంతమంది?
**************
ఈ రోజుల్లో చాలామంది ప్రజలలో మంత్రాలు, పూజలు .. వంటి వాటి పైన ఆసక్తి పెరిగింది. వీటి గురించి అనేక సందేహాలను అడుగుతున్నారు.
మంచిదే కానీ, దైవకృపకు పాత్రులవ్వాలంటే ..వీటిని ఎలా ఆచరించాలనే విషయాల గురించి తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, ధర్మమార్గంలో జీవించటానికి కూడా ప్రయత్నించాలి.
మరి, ధర్మమార్గంలో జీవించాలని ఎంత మంది ప్రయత్నిస్తున్నారు?
*************

పాపపు పనులు మానివేయాలనుకుంటూ కూడా మనస్సును అదుపులో ఉంచుకునే శక్తి లేనప్పుడు, పూజలు చేయగాచేయగా ధర్మమార్గంలోకి రాగలరు.
అంతేకానీ, పాపాలుచేస్తూనే ప్రాయశ్చితపూజల ద్వారా పాపాలు తొలగించుకోవచ్చనుకుంటే మాత్రం అది దురాశే అవుతుంది.

ReplyDeleteకొన్ని పుస్తకాలలో స్తోత్రాలు వంటి వాటిలో కొన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయి. .
కొందరు దివ్యమైన మంత్రాలను కూడా సెల్ ఫోన్లలో రింగ్ టోన్లగా వాడటం, మంత్రాలను తప్పుగా పలకటం వంటివి చేస్తున్నారు..
సరిగ్గా తెలిసితెలియనప్పుడు చేసే పూజల విషయంలో కూడా ఎన్నో పొరపాట్లు జరిగే అవకాశముంది.
అయితే , ధర్మమార్గాన జీవించేవారు పూజలో కొన్ని పొరపాట్లు చేసినా దైవం ఏమీ అనుకోరు.
ధర్మమార్గాన జీవించటం దైవానికి ఎంతో ప్రీతికరమైన విషయం.
ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే ,
తెలిసీతెలియకుండా కొన్నిమంత్రాలు, కొన్ని పూజలు జోలికి వెళ్లేకంటే ధర్మబద్ధంగా జీవిస్తూ దైవకృపను పొందవచ్చు కదా ! అనిపిస్తుంది.