దైవం సృష్టించిన ఈ ప్రపంచంలో సంపద ఏ కొద్దిమందికో సొంతం కాదు.
దైవం ఇచ్చిన తెలివితేటలను,శక్తిసామర్ధ్యాలను ఇతరులతో పంచుకోవాలి.తమ ఎదుగులతోపాటూ ఇతరుల ఎదుగుదలకోసమూ తమ ప్రతిభను ఉపయోగించాలి.
తమ అవసరాలకోసం తమకు కొంత సొమ్ము సంపాదించిన తరువాత ఇక తృప్తిచెందాలి.
ఉన్నసొమ్మంతా కొందరి వద్దే ప్రోగుబడటం , మిగిలినవారు బాధలు పడటం న్యాయం కాదు.
ఇప్పుడు చూడండి.దేశంలో కొందరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి వినోదిస్తుంటే , కొందరు తగిన సంపాదన లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు.
ఉదా..డబ్బులేక గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్లి, అక్కడ అనుభవిస్తున్న బాధలు చూస్తుంటే ఇదేనా మనం సాధించిన అభివృద్ధి ? అనిపించడం లేదా ?
మన చుట్టుప్రక్కల కొందరు తిండిలేక , వైద్యానికి డబ్బులేక నరకం అనుభవిస్తుంటే, డబ్బు ఉన్నవాళ్లు మాత్రం ..వేలు, లక్షలు, కోట్లు పోసి.. నగలు, దుస్తులు, కార్లు, ఇళ్లు..కొంటూ జీవిస్తున్నారు. ఇదేం నీతి ?
భారతీయసంస్కృతిలో పెద్దలు ఎన్నో విషయాలు తెలియజేసారు .అత్యాశ వద్దని, తృప్తిని మించిన సంపద లేదని తెలియజేసారు.
పాపాలు చేయవద్దన్నారు.పుణ్యకార్యాలు చేయమన్నారు.
పాపపు సొమ్ముతో చేసే పూజలు సత్ఫలితాలను ఇవ్వవు ..అనీ తెలియజేసారు.
అయితే, ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే...
.అన్యాయాలు చేసి డబ్బు సంపాదించి ఆ సొమ్ముతో పూజలు చేస్తూ దైవాన్ని కూడా మోసం చేయగలమని భ్రమపడుతున్నారు.
ఎవరైనా సరే, అధికమొత్తంలో సంపద కూడబెట్టడం సరైనది కాదు.
తమకు అవసరమైనంత వరకు ఉంచుకుని మిగిలినది సమాజహితానికి ఉపయోగించాలి.
ఇక, వందలకోట్లు, వేలకోట్లు కూడబెట్టేవాళ్లు తమ వద్ద కొంత సొమ్ము ప్రోగుపడిన తరువాత.. ఉన్న సొమ్ములో సమాజానికి వాటా ఇవ్వాలి.
అంతేకానీ, తరతరాలకూ సరిపడా కూడబెట్టుకుంటూ జీవించటం పాపమే అవుతుంది.
బాగా డబ్బున్నవాళ్లు తమకు ఉన్నదానిలో అతికొద్దిభాగం మాత్రం సమాజం కోసం ఉపయోగిస్తే సరిపోదు.
ఎక్కువసంపద ఉన్నవారు అందుకు తగ్గట్లుగా ఇవ్వాలి.
కొందరి వద్దే డబ్బు ప్రోగుపడటం తగ్గినప్పుడు ఎన్నో అసమానతలు గణనీయంగా తగ్గుతాయి.
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి.
ReplyDeleteసినిమాలలో మంచిని అందించే సినిమాలూ ఉంటాయి. సమాజాన్ని పెడత్రోవ పట్టించేవీ ఉంటాయి.
ఈ మధ్య వచ్చిన కొన్ని చక్కటి సందేశాత్మక సినిమాలలో శ్రీమంతుడు ఒకటి.