ఓం ..
Saturday, September 30, 2017
Friday, September 29, 2017
పూర్ణాలు..గారెలు..విప్పింగ్ బ్లేడ్..పులిహోర..
పూర్ణాల తయారీకి.. ఉడికించిన శనగపప్పును..బెల్లం పాకంపట్టి ఉండలా తయారుచేసేటప్పుడు కొన్నిసార్లు త్వరగా దగ్గరపడదు.
అలాంటప్పుడు పాకం గట్టిపడటానికి .. చివరిలో.. కొంచెం వేయించిన శనగపప్పును ( పుట్నాల పప్పును) మిక్సీలో పిండి కొట్టి, ఆ పొడిని పాకంలో కలిపితే వెంటనే గట్టిపడి ఉండ చేయటానికి వీలవుతుంది.
అయితే తీపి తక్కువకాకుండా, వేయించిన శనగపొడిని కొద్దిగా వేసుకోవాలి. తీపి తగ్గితే కొంచెం బెల్లం పొడి కలుపుకోవచ్చు.
సూచన.. వేయించిన శనగపప్పు పొడిని ముందే కలపకూడదు, పాకం త్వరగా రాని పరిస్థితిలో మాత్రం చివరిలో కలుపుకోవచ్చు.
**************
గారెల కు మినపప్పును నానబెట్టిన గిన్నెను ఫ్రిజ్ లో పెట్టి .. నానిన తరువాత మిక్సీలో రుబ్బితే బాగుంటాయి.
గారెలు మృదువుగా రావటానికి..పొట్టుతో ఉన్న మినపపప్పు అయితే జిగురు ఉంటుందని కొందరు పొట్టు ఉన్న పప్పు వాడతారు. రోటిలో రుబ్బుతారు. ఈ మధ్య గ్రైండర్ వాడుతున్నారు.
అయితే కొంచెం మాత్రమే పప్పు రుబ్బవలసి వచ్చినప్పుడు కొందరు గ్రైండర్ వాడరు.
గారెలు మిక్సీలో మృదువుగా రావాలంటే పొట్టుతో ఉన్నపప్పు వాడవచ్చు. పొట్టు తీయటం కష్టం అనుకున్నప్పుడు పొట్టు తీసిన పప్పు కూడా వాడవచ్చు.
పొట్టులేని పప్పును సుమారు .. రెండు లేక మూడు గంటలు నానబెట్టి మిక్సీలో ఎక్కువ నీరు పోయకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి.
అప్పుడు విప్పింగ్ బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఉన్న జార్ లో రుబ్బిన పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్ది గా నీరు పోసి తిప్పితే పిండి పొంగినట్లు అవుతుంది.
విప్పింగ్ బ్లేడ్ వల్ల పిండి మృదువుగా అవుతుంది. అలాగని మరీ ఎక్కువ నీరు పోయకూడదు.
ఈ పిండితో అప్పుడే గారెలు వేసుకోవచ్చు. లేక ఫ్రిజ్ లో పెట్టి కొంతసేపు తరువాత వేసుకోవచ్చు.
***************
గారెలకు విప్పింగ్ బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఎందుకంటే,
గారెలు మృదువుగా రావటానికి కొందరు రుబ్బిన పిండిని చేతితో తడతారు.
రుబ్బిన గారెలపిండిని చేతితో తట్టడం వలన పిండిలో గాలి బుడగలు ఏర్పడి గారెలు బోలుగా వస్తాయి.
అయితే, ఇలా చేతితో తట్టడం కన్నా, రుబ్బిన పిండిని విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లోకి మార్చి రెండు, మూడు రౌండ్లు రుబ్బితే పిండి పైకి పొంగుతుంది.
. అలాగని ఎక్కువసేపు విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లో రుబ్బనవసరం లేదు.
************
గారెల పిండిని రుబ్బేటప్పుడు, మరీ నీరు తక్కువ పోసి రుబ్బితే పిండి మరీగట్టిగా ఉండి ..గారెలు గట్టిగా ఉంటాయి. నీరు ఎక్కువపోస్తే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.
అయితే, నీరు కొంచెం ఎక్కువయినా గారెలు మృదువుగా వస్తాయి.. అలాగని నీరు మరీ ఎక్కువపోసి పిండి పలుచగా చేయకూడదు.
రుబ్బిన గారెల పిండి కొద్దిగా నీటిలో వేస్తే పిండి పైకి తేలాలి. అపుడు సరిగ్గా రుబ్బినట్లు అంటారు.
గారెలు వేగేటప్పుడు పెద్ద మంట, చిన్న మంట కాకుండా, మధ్యస్థాయి మంటపై వేగాలి.
**************
మా ఇంట్లో అదివరకు సుమీత్ మిక్సీ ఉండేది. దానికి పెద్ద సైజు స్టీల్ విప్పర్ బ్లేడ్ కూడా ఇచ్చారు..ఈ మిక్సీలో బ్లేడ్లు మార్చుకోవచ్చు. గారెలు పిండి రుబ్బిన తరువాత విప్పర్ బ్లేడ్ మార్చి మళ్ళీ కొద్దిసేపు మాత్రమే మిక్సీలో పిండి తిప్పితే పిండి బాగా పొంగేది. గారెలు చక్కగా వచ్చేవి.
ఇప్పుడు వేరే మిక్సీలలో అంత చక్కటి విప్పర్ బ్లేడు కనిపించలేదు. చిన్నవి ద్రవపదార్ధాలు విప్పింగ్ చేయటానికి ఇస్తున్నారు. ఫుడ్ ప్రాసెసర్ లో ప్లాస్టిక్ విప్పింగ్ అటాచ్మెంట్ ఉంటుంది.విడిగా హాండ్ బ్లెండర్స్ కూడా లభిస్తున్నాయి.
బజ్జీల పిండి కూడా విప్పింగ్ చేస్తే పిండి పొంగుతుంది. బజ్జీల పిండిలో కొద్దిగా వేడి నూనె కూడా వేయవచ్చు.
***************
పులిహోర తయారీకి ..కొందరు, చింతపండును చాలాసేపు నానబెడతారు. అయితే అలా నానబెట్టకుండా ..కుక్కర్లో చింతపండు కొద్దిగా నీరుపోసి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది.
ఉడికించిన చింతపండును పిండి, ఆ రసాన్ని చిల్లుల ప్లేటులో వడపోస్తే పిప్పి పైన ఉండి, రసం క్రిందకు వచ్చేస్తుంది.
ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే కానీ, రాయాలనిపించి వ్రాసాను.
ఆది పరాశక్తి కధలు .. మహిషాసుర మర్దిని అమ్మవారు ....మరియు..
మహిషాసుర మర్దిని అమ్మవారు .....
ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.
మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.
ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.
రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.
చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.
జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.
ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.
ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.
మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.
మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.
అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి.
తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.
మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .
మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !
దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.
*********************
ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.
శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.
దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.
హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.
సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు.
అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.
ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది కొంతమంది విద్యాధరులకు.
జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో రణరంగం మహా భయంకరంగా ఉంది.
ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.
ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.
కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .
రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.
నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.
నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.
అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.
శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.
దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.
రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.
విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.

ఆదిపరాశక్తి కధలు..
ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

Thursday, September 21, 2017
ఆదిపరాశక్తి కధలు...
ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు.
అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.
వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.
ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.
మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.
విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.
అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.
అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.
మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.
యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.
ఆ చూపులకు మధుకైటభులు తమనుతాము మరచిపోయారు.
ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.
పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.
అపుడు శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.
వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.
విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.
మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.
Sunday, September 17, 2017
శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం. ...
ఈ రోజుల్లో సమాజంలో పెరుగుతున్న చెడును గమనిస్తే చాలా బాధ కలుగుతుంది.
కొందరు ప్రజలు పైకి చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండటం లేదు.
భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు.
భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు?
బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు,
లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.
****************
ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.
ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.
అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు.
శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.
చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు , ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు.
అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.
ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
****************
రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి.
అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.
పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.
తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?
దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.
శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.
శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.
అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

********
ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.
***************
రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన
భక్తి కూడా ఎంతో గొప్పది, దైవం కూడా తన భక్తికి లొంగక తప్పదు.. అనే అహంకారం
ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యింది.
దైవం పట్ల ప్రేమతో కూడిన
శరణాగతి ఉంటే,
దైవం కాపాడుతారు.
దైవం కాపాడుతారు.
*******************
కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.
***************
ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.. సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.
అంతా దైవం దయ.
అంతా దైవం దయ.
Saturday, September 16, 2017
దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం. ..
కొందరు ఆచారవ్యవహారాలను పాటిస్తూ పూజలు చేస్తారు.
అయితే, ఎప్పుడైనా కష్టాలు వస్తే మాత్రం, ఏమంటారంటే, నేను ఎన్నో పూజలు చేసాను. భగవంతుడు అన్యాయం చేసాడంటూ మాట్లాడతారు.
ఇక్కడ ఒక విషయమేమిటంటే, దైవం ఎప్పుడూ, ఎవరికీ అన్యాయం చేయరు.
ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి సుఖాలు కానీ, కష్టాలు కానీ వస్తాయి.
అంతేకానీ, విధి చిన్నచూపు చూసింది, దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం.
ఇప్పుడు పూజలు, మంచిపనులు..చేస్తున్నా కష్టాలు వచ్చాయంటే అర్ధం ..గతంలో ఎప్పుడో చెడ్దపనులు చేసుంటారు. అందుకే ప్రస్తుతం కష్టాలు వచ్చాయి.
ఇప్పుడు చేస్తున్న మంచిపనులకు తగ్గ మంచి ఫలితాలు కూడా తప్పక అనుభవంలోకి వస్తాయి.
కొన్నిమంచిపనులు, కొన్ని చెడ్దపనులు చేస్తే.. కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు కలిసి లభిస్తాయి.
..............
కొందరు ప్రజలు పాపాలు చేసి తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, ఇకమీదట చెడు పనులు చేయకుండా తగిన శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ..మంచికర్మలను చేస్తూ పూజలు చేస్తుంటే..
.అప్పుడు దైవం వారి పట్ల దయచూడటం , వారు చేసిన పాపాలకు పడే శిక్షను తగ్గించే అవకాశం ఉన్నాయి.

చెడ్డపనులు చేసి , ఫలితంగా కలిగే కష్టాలను తట్టుకోలేక బాధలు పడేకంటే ముందే మనస్సును అదుపులో పెట్టుకోవటం మంచిది.
**********
సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.
Friday, September 15, 2017
మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..మరియు ..
మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.
అయితే, అపార్ట్ మెంట్ లో తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు.
ఆ పెద్దామె ఎన్నో కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు.
ఉదా.. సెక్రటరీ, శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట.
ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు.
కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.
నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను.
సెక్రటరీ గారు విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు.
విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి.
అప్పటివరకూ విపరీతంగా హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు ఆశ్చర్యం అనిపించింది.
కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో ఆ అపార్ట్ మెంట్ మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్ విషయాలు సరిగ్గా తెలియలేదు.
అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట. తరువాత ఏం జరిగిందో తెలియదు.
(ఈ సెక్రటరి గారు తమిళ బ్రాహ్మణులు.ఇది నిజంగా జరిగిన సంఘటన.)
వారు ఆలా ఎందుకు చేసారో నాకు తెలియదు.
*******************
ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..

ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.
ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.
ఆచారవ్యవహారాల్లో క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది.
ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు.
అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా!
ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు.
ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది.
**************
ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం.
ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.
దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు.
ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.
తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.
ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే, పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం.. అని గ్రహించాలి.
శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు.
అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా!
*************
దైవశక్తి ఒకటే అన్నది నిజమే. దైవం ఒక్కరే కాబట్టి అన్ని మతాలు కూడా ఒక్కటే అని, అన్ని మతాల దేవతలను సమానంగా పూజించే విశాలహృదయం అందరికి ఉండదు. కొందరు విశాలహృదయంతో ఉన్నా కూడా, విశాలహృదయం లేనివాళ్ల వల్ల అందరికీ కష్టాలు వచ్చే ప్రమాదముంది.
ఎవరి విశ్వాసాల ప్రకారం వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. అయితే, మన నమ్మకాల వల్ల ఎవరికీ నష్టం కలగకూడదు. కొందరు ఇతరులను మతాలు మార్చడానికి నయానాభయానా ప్రయత్నిస్తారు. అలా చేయటం సరైనది కాదు. దైవం ఒకరే కానీ, ఎవరి మతం వారికి ముఖ్యమే కదా..
కొన్ని హిందు గ్రంధాలలో ఇతరమతదేవతల గురించి కూడా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు. అవి చదివి మనం కూడా ఇతరమతాల దేవతలను ఆరాధించాలా ఏమిటి? అని సందేహాలు కలుగుతాయి. ఇలాంటి వాటిని చదివినప్పుడు అర్ధంకాక అయోమయంగా ఉంటుంది.అసలు అలా ఎందుకు వ్రాసారో దైవానికే తెలుస్తుంది.
గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయంటారు. ఏది ప్రక్షిప్తమో? ఏది కాదో?
***************
కొందరు, సంపద, అధికారం కొరకు మతాన్ని వాడుకుంటారు. కొందరు మతపెద్దలు కూడా మతం విషయంలో అతిగా ఆలోచిస్తూ ప్రజలలో మూఢాచారాలు వ్యాప్తి చేస్తారు. ఇలాంటి వారి వల్ల ప్రభావితం కాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభావితమైతే ప్రజలకు కష్టాలు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, అలాంటి వారి వల్ల ప్రభావితమయిన వారు కొందరు మనల్ని ఇబ్బంది పెట్టడం, దాడులు చేయటం..వంటివి చేసే అవకాశముంది. అందువల్ల, అందరూ ఒకటే.. అందరూ మంచివారే ..అనుకుంటూ నింపాదిగా బ్రతకటం కాకుండా, మన రక్షణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
Thursday, September 14, 2017
దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.....
Monday, October 4, 2010
దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.
దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.
నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ? అనిపించిందండి.
.(అలా చెప్పారు కదా ! అని దేవాలయంలో ఇంటితాళాలు, బండి తాళాలు లేక మరేదైనా మర్చిపోతే అప్పుడే తిరిగి దేవాలయానికి వెళ్ళొచ్చో? లేదో ? అనుకోనవసరం లేదు, తిరిగి దేవాలయానికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. )
తరువాత నాకు జరిగిన అనుభవాల ద్వారా నాకు అనిపించినది చెబుతాను అండి.
ఒకసారి ....... గుడికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు జరగకుండా పూజ జరగాలనే ఆలోచనలోపడి ................ ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోవటము జరిగేది. అంటే తీర్ధప్రసాదములు తీసుకుని బయటకు వచ్చాక తీరిగ్గా గుర్తు వచ్చేది.
ఏమంటే హుండీలో కానుకలు సమర్పించటము మరిచిపోవటమో, లేక తీసుకువెళ్ళిన పండ్లు సమర్పించటం మర్చిపోయి సంచీలో ఉండిపోవటమో ........ కొన్ని ఉపాలయములు చూడలేదని గుర్తు రావటము ........ ఇలాగన్నమాట..........
ఇలా గుడిలోనుంచి ఒకసారి బయటకువచ్చాక ............. మళ్ళీ తిరిగి వెళ్ళి ఉపాలయములు దర్శించుకోవటము ............... ఇలా చేసినప్పుడు చుట్టూ అక్కడివాళ్ళు నన్ను వింతగా చూస్తున్నట్లు నాకు అనిపించిందండి.
ఎందుకంటే ఇప్పుడే తీర్ధప్రసాదములు తీసుకుని వెళ్ళి మళ్ళీ ...................... అప్పుడే వస్తే ఎవరైనా కొంచెం ఆశ్చర్యముగా చూస్తారు గదండి. ( ఏమో వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు అలా అనిపించేది. )
ఇలా కొన్ని సార్లు జరిగాక నాకు ఏమని అనిపించిది అంటేనండి.......ఇలా ఎవరూ అతిగా చేయకుండా ............. అంటే ఏదోఒకటి మర్చిపోయి గుడిలోకి బయటకు తిరగటం ............. ఇలాంటివి ఆపటానికే పెద్దలు అలా చెప్పారేమోనని.
ఇలా ఒకటిరెండుసార్లు జరిగాక నాకు ఓపిక లేక భగవంతునితో దేవా ............ పూజలో జరిగే లోటుపాట్లకు క్షమించు..... నాకు శక్తి మేరకే చేయగలను . అని చెప్పేసాను..

అప్పటినుంచి ఏదయినా మర్చిపోయి ఇంటికి వచ్చేసినా భయపడటంలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ......... లోటుపాట్ల గురించి అతిగా ఆలోచించకుండా, ప్రశాంతముగా నా శక్తి కొలది ప్రవర్తించటము మంచిదని అలా ప్రయత్నిస్తున్నాను.
ఇంతగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటేనండీ ................. ఈ రోజుల్లో దేవుని గురించి తక్కువగా ............. విధి విధానముల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండే నా లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారేమోనని............ ............. ఇలా వ్రాయాలనిపించిందండి.
ఇలాంటివారు అతిగా ప్రవర్తించి మూఢత్వముగా మారకూడదని నా ఆలోచన.
పూజలో జరిగే లోటుపాట్ల వలన వచ్చే పాపం కన్నా.... అతిగా ఆఆలోచనల్లో పడి భగవంతుని భక్తికి దూరమవ్వటము మరింతపాపమని నాకు అనిపించింది అండి.
............. సాయి కూడా పూజ ఎట్టిదయినా బుద్ది ప్రధానమనితెలియజేసారట. రామకృష్ణపరమహంస వారు కూడా దైవముతోమనము చనువుగా ఉండాలి....... భయపడటమెందుకు అనిఅనేవారట.........
.అసలు పూజ చెయ్యటము దైవం కొరకే ............... మనముఅసలు లక్ష్యమునకు దూరము కారాదు. .. ...
***************
Wednesday, October 6, 2010
దైవము . మరియు ,పెద్దలు మనకోసము ఎంతగా ఆలోచిస్తారో కదా..................
పూజల యొక్క విధివిధానములను పాటించటములో నాకు వచ్చిన సమస్యలు, సందేహములను గురించి ఇంతకుముందు వ్రాశాను కదండి.
శ్రీ లలితాసహస్రనామములలో సుఖారాధ్యా అనే నామమును గురించి విన్నాక ధైర్యం వచ్చిందండి.
అలాగే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ కూడా తెలియజేసారు కదండీ ........... ఎవరయినా భక్తితో ........ కొద్దిగా జలమును గానీ, పుష్పములను గానీ, ఫలములను గానీ సమర్పించినా చాలు తాను స్వీకరిస్తానని. ....................నిజంగా భగవంతుడెంతో దయామయుడు.
పెద్దలు ఒక అత్యుత్తమ సాధకుని గురించి ఎంతగా ఆలోచిస్తారో ఒక అతి సామాన్య భక్తుని గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.
ప్రపంచములోని ప్రతి ఒక్కరూ దైవానికి దగ్గరవ్వాలని వారి తాపత్రయము.
ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో విధముగా ప్రవర్తించవలసి ఉంటుంది.
అందుకేనేమో పూజల విధివిధానముల విషయములో పెద్దలు ఒక్కోదగ్గర గట్టిగా చెబుతారు. ఒక్కోసారి పట్టు సడలిస్తారు.
పూజానియమాలను ఉన్నదున్నట్లు చెప్పటము వల్ల శక్తి ఉన్నవాళ్ళు వాటిని పాటించి ఫలితములను శీఘ్రముగా పొందుతారు. అందరికీ అంత శక్తి ఉండదు కదా.
అటువంటి వారు నిరాశపడకుండా పెద్దలు మనకు ఎన్నో ఉపాయములను ఎందరో భక్తుల కధల ద్వారా తెలియజేసారు.
ఉదా...........కొంతమందికి సంసార బాధ్యతల వల్ల ఎక్కువసేపు పెద్దపెద్ద పూజలు చెయ్యలేకపోవచ్చు. ధర్మవ్యాధుని కధ ద్వారా స్వధర్మమును ఆచరిస్తూ కూడా దైవమునకు దగ్గర అవ్వచ్చునని తెలియజేసారు.
కొంతమంది ఎన్నో పాపాలు చేసి తరువాత తప్పు తెలుసుకుని అయ్యో మనకు దైవ పూజ చేసే అర్హత ఉందోలేదో అనుకుంటారు. నిగమశర్మోపాఖ్యానము ద్వారా అలాంటివారికి కూడా దైవపరమయిన ఆశను కల్పించారు. వారు మంచి మార్గములోకి వచ్చే మార్గమును తెలియజేసారు.
ఇంకొంతమంది ఉంటారు. ఇవన్నీ విని ..................... అయితే విధివిధానములు పెద్దగా పాటించనక్కరలేదులే ........ అనేసుకునే బధ్ధకస్తులూ ఉంటారు. విధివిధానములు సరిగ్గా పాటించాలి అని కొన్ని కధల ద్వారా గట్టిగా చెప్పటము వల్ల ఇటువంటివారి బధ్ధకమును పోగొట్టవచ్చు.
మళ్ళీ ఇవన్నీ విని జనం భయపడకుండా ఈ విధమయిన గొప్ప భక్తుల కధలను తెలియజేసారు.
ఒక భక్తుడు ..భక్తిపారవశ్యములో పడి దైవమునకు పండ్లకు బదులుగా తొక్కలను నివేదించారట.................. ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఆ తొక్కలనే ఆప్యాయముగా స్వీకరించారట..........
అప్పుడు ............ ఆ భక్తుడు అయ్యో తొక్కలను సమర్పించానే అని బాధపడి మళ్ళీ పూజను విధివిధానముగా చేసి ఈ సారి జాగ్రత్తగా తొక్కలు కాకుండా పండ్లనే దైవమునకు నివేదించగా ............ ఆ భగవంతుడు స్వీకరించలేదట.
ఎందుకంటే రెండవసారి చేసిన పూజలో భక్తి శాతము తగ్గినందువల్ల. దీనిని బట్టి అన్నిటికన్నా భక్తి ప్రధానమని తెలుస్తోంది.
ఇంకా నాకు ఏమని అనిపిస్తోదంటేనండీ, ఏదైనా సరిగ్గా పాటించటమువల్లా ఉత్తమ ఫలితములను శీఘ్రముగా పొందవచ్చును. అయితే ఒకోసారి అలా పాటించటము కుదరదు కదండి.
ఉదా..........పూజ చేసేటప్పుడు షోడశోపచారములు సమర్పించే సమయములో రత్నఖచిత సిం హాసనము సమర్పించటము విషయములో పుష్పములు వేసి నమస్కరించి సరిపెట్టుకుంటారు గదా.....
అలాగే మధుపర్కములు సమర్పించే విషయములో కూడా చాలామంది అక్షతలు సమర్పించి సరిపెట్టుకుంటారు కదా...... ఇలాగే కొన్నికొన్ని ఇతరమయిన విషయములలో కూడా ఉన్నదున్నట్లు చేయటము కుదరక పోవచ్చు.
ఇలా ధర్మ సందేహములు వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించి ఏమి చేయాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తెలియకపోతే దైవంపైన భారం వేయటము ఉత్తమమయిన పధ్ధతి. ఆ తరువాత పెద్దలు చెప్పిన శ్రీ దైవాపరాధ క్షమాపణ స్తోత్రము చెప్పుకోవలెను. ........................ .......................
ఇంతవరకు వ్రాసిన దానిలో తప్పులున్నచో దయచేసిక్షమించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

Subscribe to:
Posts (Atom)