koodali

Friday, August 11, 2017

దైవం మెచ్చే విధంగా జీవించటం...

  
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు పూజలు ఎక్కువగా చేస్తున్నారు. 

పూజలు చేయటం ఎంతో సంతోషించవలసిన విషయం.

 అలాగే దైవం మెచ్చే విధంగా జీవించటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది.

  దైవాన్ని పూజించేవారు చెడ్డ పనులు చేయకుండా ఆదర్శంగా జీవించటానికి ప్రయత్నించాలి.

 జీవితంలో నైతికవిలువలను పాటిస్తే సమాజంలో సమస్యలు తగ్గుతాయి. 

జీవితంలో ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి.

 ఇప్పుడు సమాజంలో  ఆధిపత్య ధోరణి, అత్యాశ, సంపాదన యావ..వంటివి ఎక్కువయ్యాయి.

తృప్తి, పొదుపు.. అనే విషయాలను అంతగా పట్టించుకోవటం లేదు.

అవినీతి, లంచగొండితనం.. ఎక్కువయ్యాయి..

వందలు, వేలకోట్లు సంపద పోగేస్తూ , డబ్బు సంపాదన కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

 ఆహారంలోనూ కల్తీ చేస్తున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు.

మత్తుపదార్ధాలను అమ్ముతున్నారు. 

ఇంకా ఎన్నో విధాలుగా డబ్బు సంపాదనా మార్గాలను ఎంచుకుంటున్నారు.

 ఎటు చూసినా డబ్బు యావ.

 సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. తృప్తిగా, ఆరోగ్యంగా, సంతోషంగా.. జీవించటం కూడా సంపదే.

 అసూయాద్వేషాలు, ఆధిపత్య ధోరణి, అహంకారం..వంటివి ఉన్నవారు ఎంత సంపద ఉన్నా సంతోషంగా జీవించలేరని పెద్దలు తెలియజేసారు. 

ధర్మబద్ధంగా జీవించటం.. దైవానికి నచ్చే, దైవం మెచ్చే గొప్ప పూజ. 

**************** 
 సహజవనరులు...గొప్ప సంపదలు. 

పర్యావరణాన్ని పాడుచేసి , సహజవనరులను కోల్పోతే  ప్రపంచం చక్కగా ఎలా ఉంటుంది? 

. అప్పుడు మనిషి అచ్చు వేసే కాగితపు డబ్బుకు ఎంత విలువుంటుంది?

 అందువల్ల పర్యావరణాన్ని కాపాడటం , సహజవనరులను తక్కువగా వినియోగించటం చేయాలి.

అవసరాలు, అభివృద్ధి అంటూ సహజవనరులను విపరీతంగా వాడేస్తున్నారు. కోరికలను తగ్గించుకోవాలి. 

ఇవన్నీ చాలామందికి సిల్లీగా, అభివృద్ధి నిరోధక మాటలుగా అనిపించవచ్చు. 

అయితే, ఇదే విధంగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, సహజవనరులను వాడేస్తూ ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. 

అలాంటి పరిస్థితి రాకుండా మేల్కొనవలసి ఉంది .     


No comments:

Post a Comment