ఈ రోజుల్లో చాలామంది ప్రజలలో బాధ్యతారాహిత్యం పెరిగింది. తమ స్వార్ధమే తప్ప సమాజం ఏమైనా ఫర్లేదు..అనే పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటి వాళ్ళను చూస్తే, ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం గురించి కూడా కొన్నిసార్లు నిరాశగా అనిపిస్తుంది.
అవినీతి పనులు చేసైనా సరే , బాగా డబ్బు సంపాదించి, విలాసవంతంగా జీవించాలనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో పర్యావరణాన్నీ పాడుచేస్తున్నారు.
సమాజంలో దోపిడీ బాగా పెరిగింది. సహజవనరులను కొల్లగొడుతున్నారు.
సహజవనరుల డోపిడీకి వ్యతిరేకంగా చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు.
అయితే, దోపిడీదారులు ఎవరికీ భయపడకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
ఉదాహరణకు.. ఎర్రచందనం ప్రజలకు చెందవలసిన సంపద. వీటిని కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
సమాజంలో ఎన్నో రంగాలలో నైతికత తగ్గిపోయింది. కొందరు లంచాలు తీసుకుంటున్నారు. మరికొందరు డబ్బు సంపాదన కోసం కల్తీ వస్తువులు అమ్ముతున్నారు.
కొందరు చదువు పేరుతో ఎక్కువ ఫీజులు దండుకుంటున్నారు. అనారోగ్యమని తెలిసినా హానికారకపదార్ధాలతో పండ్లను మగ్గబెడుతున్నారు కొందరు.
మద్యం, అశ్లీలత.. వంటివి కూడా సమాజానికి అనర్ధదాయకం. ఇలాంటివి సమాజానికి అందిస్తున్నవారు కూడా పాపాలు చేస్తున్నవారే.
అదీఇదీ అని కాదు, ఎన్నో విషయాలలో అనైతికత ఎక్కువయింది.
చిన్నపెద్ద అనితేడా లేకుండా చాలామందిలో .. డబ్బు సంపాదన తో పాటు అధికారవ్యామోహం, పంతాలు పట్టింపులు, అహంకార మమకారాల వంటి వాటి వల్ల.. చాలా విషయాలలో సమస్యలు వస్తున్నాయి.
ప్రజలలో నైతికవిలువలు పెంపొందినప్పుడు.. అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
అన్ని రంగాలలోనూ మంచి వాళ్ళూ ఉంటారు, చెడ్ద వాళ్ళూ ఉంటారు.
అయితే, అనైతిక పనులతో సమాజానికి ద్రోహం చేస్తున్న వారు దైవం ఇచ్చే తీర్పు నుండి తప్పించుకొలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి ధన్యవాదములండి
ReplyDelete