కృష్ణా పుష్కరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రభుత్వం వారు చాలా చర్యలను చేపట్టారు.
విజయవాడలో చూస్తే .. ఎక్కడికక్కడ డస్ట్ బిన్లను ఏర్పాటు చేసారు. సిబ్బంది ఎక్కడికక్కడ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తడబ్బాలలోనే చెత్తను వేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.
ఘాట్లో కూడా ఎందరో వాలంటీర్లు , పోలీసు వారు భక్తులకు సహాయం చేస్తున్నారు.
పిల్లలు, పెద్దవాళ్ళకు టాగ్స్ వేయటం అనేది ఎంతో చక్కటి ఆలోచన.
అన్నదానం కూడా జరుగుతోంది.
అయితే, నేను ఒక దగ్గర గమనించిన విషయం ఏమిటంటే.. కొంతమంది పొంగలిని మొత్తం తినకుండా చెత్త బుట్టలో పడేసారు.
ఆహారాన్ని వృధా చేయకూడదని తెలిసి కూడా ప్రజలు ఇలా వృధాగా పారవేయటం బాధాకారం. ఎక్కువ తినలేమనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి.
పుష్కరాలకు లక్షలాది భక్తులు వచ్చినా కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఎందరో సిబ్బంది చక్కగా కృషిచేసారు.
...........................
తిరుమలలో కూడా రోజూ ఎందరో భక్తులు వచ్చినా కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.
తిరుమల చూస్తే భారతదేశం అంతా తిరుమలలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.
భారతదేశం అంతటా తిరుమలను ఆదర్శంగా తీసుకుని చర్యలు చేపడితే బాగుంటుంది.
తిరుమలలో ప్రతి రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అన్నదానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అక్కడ తక్కువ ధరకే ఆహారం లభించే జనతా క్యాంటీన్లు వంటివి కూడా ఉన్నాయి.
...............................
దేశం అంతటా పేదవారికి తక్కువ ధరకు ఆహారం లభించే క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, మొక్కలు ఎక్కువగా నాటి పెంచటం, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవటం..వంటి చక్కటి కార్యక్రమాలు మరింతగా జరిగేలా అందరూ కృషి చేయాలి.
ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు.. చిత్తశుద్ధితో కృషి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శ దేశం అవుతుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

No comments:
Post a Comment