koodali

Wednesday, September 2, 2015

ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది..............



మానవులకు అనేక కోణాలనుంచి ఆలోచించే శక్తి ఉండటం ఒక రకంగా వరం.........ఒక రకంగా శాపం కూడా.... 


అంటే మన ఆలోచనల ద్వారా మనము జీవితాన్ని బాగూ చేసుకోవచ్చు....అలాగే పాడూ చేసుకోవచ్చు.


ఉదా.........మహాభారతంలో................. ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు. వారు పాచికలాటలో రాజ్యాన్ని పోగొట్టుకోవటం .. మనకు తెలిసిన విషయాలే కదా !


ఆ సంఘటన ద్వారా ఎంత గొప్పవారైనా సరే.......... చిన్న పొరపాటు చేసినా కష్టాలను అనుభవించే అవకాశం ఉంది .... కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది.



దీని ద్వారా ఒక వ్యక్తి ఎలా ఆలోచించవచ్చంటే.......


ధర్మరాజంతటి వారే ఒక చిన్న సంఘటన వల్ల అన్ని కష్టాలు అనుభవించినప్పుడు , మనం జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని .ఆలోచిస్తారు . ( ఇలా ఆలోచించి ఆ కధవల్ల జీవితాన్ని సరి దిద్దుకుంటారు కొందరు. )


మరి కొందరేమో.... ధర్మరాజంతటి వారే జూదం ఆడటం జరిగింది కాబట్టి సామాన్యవ్యక్తిని నేను ఆడితే తప్పేమీ లేదు అని ఆలోచిస్తారు. .............  (ఇలా ఆలోచించి తన  వ్యసనాన్ని   సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తారు.  ఇలా ఆలోచిస్తూ తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు.)



ఇలా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లో ప్రతిఒక్కరూ ........ అవకాశవాదంతో 
 ధర్మాన్ని  తమకు అనుకూలంగా మార్చి చెప్పుకుంటే ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు ?


ఆలోచన అన్ని వైపులా పదునున్న కత్తిలాంటిది. అది వాడుకునేవాళ్ళను బట్టి ఉంటుంది.కత్తితో కూరగాయలూ తరుగుకోవచ్చు........ఇతరుల తలకాయలూ నరకవచ్చు.


అందుకని నాకు ఏమనిపిస్తుందంటే, ఎవరి కర్మ ప్రకారం వారి ఆలోచనలు ఉంటాయి.


బాగుపడేరాత ఉన్నవాళ్ళను ఎవరూ చెడగొట్టలేరు. చెడిపోయేవారిని ఎవరూ బాగుచేయలేరు.

ఒకోసారి కొన్ని సంకటపరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. భగవంతుని మేధాశక్తి అపరిమితం ......... మన ఊహకు కూడా అందదు. మానవుల మేధాశక్తి పరిమితం.



అందుకే సంకటపరిస్థితి వచ్చినప్పుడు మనకు చేతనయినంతలో ప్రయత్నించి ఇక మనలను సరి అయిన దారిలో నడిపించమని ఆ దైవాన్ని కోరటమే మనం చేయగలిగింది.

.....................................


ధృతరాష్ట్రునికి    పాచికలాటకు  పాండవులను  పిలవటం  అంతగా  ఇష్టం  లేకపోయినా,  పుత్రప్రేమను  అణచుకోలేక  ఒప్పుకున్నాడు. అందుకు  తగ్గ  మూల్యాన్ని  చెల్లించారు.

ధర్మరాజుకు  పాచికలాట  ఆడటం  ఇష్టం  లేదు. అయితే,  పెదతండ్రి  అయిన  ధృతరాష్ట్రుని  ఆహ్వానం  మేరకు  ,  ఆయన  ఆహ్వానాన్ని  తిరస్కరించకూడదని వచ్చి,  పాచికలాట  ఆడటం  జరిగింది.

 ఈ  విషయాలు  ఈ  లింక్  ద్వారా  చదువవచ్చు..... మహా భారతము

(తెలుగు )


Mahabharata - Wikipedia, the free encyclopedia

 


2 comments: