koodali

Friday, July 10, 2015

రామునికి రాజ్యంపై హక్కు..

 
అయోధ్య సింహాసనానికి  వారసుడు  కౌసల్య కుమారుడు రాముడు.

ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం రాజ్యం పెద్దవాడు పరిపాలించటం ధర్మం. 

జ్యేష్ట పుత్రునికి రాజ్యంపై హక్కు ..అనేది ధర్మమని పెద్దలు చెప్పినప్పుడు రామునికి రాజ్యంపై హక్కు ఉంటుంది. 

రాముడు తనకు ధర్మబద్ధమైన  హక్కు అయిన రాజ్యాన్ని తాను తీసుకుంటే తప్పేముంది ? 
.....................
అయితే రామాయణ విషవృక్షం అనే రచనలో రచయిత్రి ఏమంటారంటే, రామునికి రాజ్యంపై హక్కే లేదనీ, దశరధుడు కైకేయిని వివాహం చేసుకునే సమయంలో కైకేయి సంతానానికి రాజ్యం ఇస్తానని  దశరధుడు చెప్పటం జరిగింది కాబట్టి , రాముడికి హక్కు  లేదని వాదించటం జరిగింది.


రాముడు తన పాదుకలను భరతునికి ఇవ్వటం తప్పనీ , అడవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా రామునికి రాజ్యాన్ని పాలించే హక్కు లేదనీ ఆమె వాదించింది.

 ఈ రచయిత్రి  అభిప్రాయం ఏమిటి ?

మగవాళ్లు భార్య ఉండగానే మరెందరినో వివాహం చేసుకుని వాళ్లందరికీ వాగ్ధానాలు చేస్తూ పోతుంటే ఆ వాగ్ధానాలన్నీ ధర్మబద్ధమే కానీ, అసలు భార్యకు కానీ, ఆమె సంతానానికీ కానీ హక్కు ఉండదు. అని రచయిత్రి చెప్పదలుచుకుంది గావున్ను. 
.........................

జ్యేష్ట పుత్రునికి రాజ్యంపై హక్కు అన్నది.. ఎప్పటి నుంచో ఉన్న ధర్మం.

  జ్యేష్ట  పుత్రునికి రాజ్యహక్కు ఇవ్వటం ధర్మమని పెద్దలు చెబుతుంటే, దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట ధర్మం ఎలా అవుతుంది? 

 అందువల్ల,  దశరధుడు కైకేయికి మాట ఇవ్వకుండా , ఇంకో వివాహం చేసుకోకుండా  సంతానం కోసం యాగం చేస్తే బాగుండేదనిపిస్తోంది.

 అయితే ఎన్నో వివాహాలు చేసుకోవటం, తద్వారా కుటుంబంలో జరిగిన సంఘటనల వల్ల లోకం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. 

లోకానికి ఎన్నో విషయాలను నేర్పించటం ..అనే కారణం వల్ల కూడా విధి వారి జీవితాలను అలా నడిపించి , వారి జీవితచరిత్రలను లోకానికి అందించి ఉండవచ్చు.

4 comments:

  1. సరదాకి ఒక ప్రయోగం చేస్తాను:

    1. జ్యేష్టపుత్రుడికి రాజ్యం కట్టపెట్టడం ధర్మం
    2. రాజు ధర్మాన్ని పాటించాలి
    3. ధర్మాన్ని ఉల్లంఘించిన రాజు పాలించే అర్హత కోల్పోతాడు
    4. దశరధుడు కైకేయి కొడుకును రాజును చేస్తానని వాగ్దానం చేసి ధర్మాన్ని ఉల్లంఘించాడు తద్వారా తన హక్కు పోగొట్టుకున్నాడు
    5. అంచేత దశరధుడు గద్దె దిగి తన తమ్ముడిని రాజు చేయాలి
    6. దశరధుడు చేసిన తప్పు దృష్ట్యా రామభరతులు ఇద్దరికీ రాజ్యంపై ఎటువంటి హక్కులు ఉండవు
    7. దసరదుడి తమ్ముడి తదనంతరం ఆయన జ్యేష్టపుత్రుడు సింహాసనం ఎక్కాలి

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      వంశాచారం ప్రకారం కౌసల్య సంతానమయిన రామునికి రాజ్యహక్కు ఉంది.

      కైకేయ సంతానానికే రాజ్యహక్కు అని వాగ్దానం చెయ్యటం ధర్మం కాదు.

      కైకేయ తండ్రికి చెప్పిన మాటే ముఖ్యమనుకుంటే, మరి కౌసల్య సంతానానికి రాజ్య హక్కు ఉన్న విషయం గురించి ఏం చెబుతారు ?
      ................

      మీరన్నట్లు, ధర్మాన్ని ఉల్లంఘించిన రాజు పాలించే అర్హత కోల్పోతాడు అంటే ,చాలామంది రాజులు అనేకసార్లు ధర్మాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది. దానికి శిక్షలు, ప్రాయశ్చిత్తాలు వంటివి ఉంటాయి గానీ, ధర్మాన్ని ఉల్లంఘించిన ప్రతిసారీ రాజు పాలించే అర్హత ఉండదు అంటే కష్టమే.

      కొత్తగా రాజ్యానికి వచ్చినవారు మాత్రం ధర్మాన్ని ఉల్లంఘించరని చెప్పలేము కదా ! ఎంతమందిని మార్చుకుంటూ పోతారు?
      ..............
      వంశాచారం ప్రకారం రామునికి రాజ్య హక్కు ఉంది. అంతేకానీ, దశరధుడు పొరపాటు చేస్తే రామునికి రాజ్యంపై ఎటువంటి హక్కులు ఉండవనటం సరైనది కాదు.
      ..............

      జరిగిన సంఘటనల వల్ల వారికి ఎంత కష్టం కలిగిందో అందరికీ తెలుసు. దశరధుల వారు ప్రాణాలనే కోల్పోవటం విషాదకరం.

      Delete
  2. ఒకప్పుడు, లోకంలో దుర్భిక్షం వచ్చే అవకాశం ఉందని పెద్దల ద్వారా తెలుసుకున్న దశరధుడు.. శనిదేవుని ప్రసన్నులను కావించి లోకానికి రాబోయే కష్టాన్ని తప్పించారని అంటారు.

    ( ఈ దశరధుడు రాముని తండ్రి అయిన దశరధుడే కావచ్చు.)

    దశరధుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ..సుఖాలను పొందారు.

    అయితే, ఒకప్పుడు దశరధుడు .. అమాయక మునిబాలుని మరణానికి కారణం కావటం ..వంటి పొరపాట్ల వలన కష్టాలను పొందారనిపిస్తుంది.

    ReplyDelete
  3. స్పెల్లింగ్ తప్పు దిద్దుబాటు..

    వశిష్టుదు, జ్యేష్టుడు..అని వ్రాయకుండా... వశిష్ఠుడు, జ్యేష్ఠుడు..అని వ్రాయవలసింది.

    ReplyDelete