ఈ క్యాంటీన్ల గురించి వినే ఉంటారు. తమిళనాడులో అమలవుతున్న అమ్మ క్యాంటీన్లలో అతితక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారట.
ఇంకా నిత్యావసర వస్తువులనూ అందిస్తున్నారట. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇది మంచి పద్ధతే అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్న క్యాంటీన్లను ప్రారంభించాలనుకోవటం ఎంతో మంచి విషయం.
రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించటమూ మంచిదే. అయితే, వంట చేయాలంటే గ్యాస్ వంటివి ఎన్నో కావాలి.
వంటచేసుకోవాలంటే కుదరని వారికి ఇలాంటి క్యాంటీన్లు ఎంతో ప్రయోజనకరం.
మనిషికి ఆహారం ముఖ్యం. ఆకలితో అల్లాడే ప్రజలున్న సమాజంలో ఎంత టెక్నాలజీ ఉన్నా ఏం లాభం ?
అందరికీ ఆహారాన్ని అందించగలిగిన రోజున దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి.
...................
ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి.
సమాజంలో డబ్బున్న వాళ్ళలో కొందరు మరీ పిసినారివాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళు, తక్కువ ధరకు ఆహారం లభిస్తుందంటే - ఇక ఇంట్లో వండుకోవటం మానేసి అన్నా క్యాంటీన్లలోనే భోంచేస్తారేమో ?
డబ్బున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే , పేదవారికి ఆహారం సరిపోదు. ఇలాంటి క్యాంటీన్లను ప్రారంభించిన అసలు ఉద్దేశ్యం సరిగ్గా నెరవేరదు.
ఎప్పుడో తప్పనిసరి పరిస్థితిలో తప్ప డబ్బున్నవాళ్ళు ఇలాంటి క్యాంటీన్లను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. పీనాసితనాన్ని తగ్గించుకుంటే పేదవారి కడుపు నింపిన వారవుతారు.
Well said. There are so many other factors also to be considered.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి
DeleteNice
ReplyDeletenowtelugu.com
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete