koodali

Thursday, July 31, 2014

చరిత్ర కాలాన్ని నిర్ణయించటంలో........

  
నేటి  పంచాంగకర్తలు,   ఆధునిక  పరికరాల  సహాయం  లేకుండానే  నక్షత్రాలు,  గ్రహాల  స్థితిగతులను  బట్టి,   జ్యోతిష  విజ్ఞానం  ఆధారంగా  లెక్కలుగట్టి ...రాబోయే  గ్రహణాల  గురించి   పంచాంగాలలో  సంవత్సరానికి  ముందే  వివరంగా  చెప్పగలుగుతున్నారు  .  వారు  చెబుతున్న  సమయానికే  గ్రహణాలు  సంభవిస్తున్నాయి.
 
 తిధులు,  నక్షత్రాలు,  గ్రహాలు  ఉన్న  స్థితి  ఆధారంగా    రామాయణ  కాలంలో   జరిగిన  సంఘటనల  యొక్క  వివరాలను  వాల్మీకి  మహర్షి   చక్కగా  పొందుపరిచారంటున్నారు. 

ఆ  వివరాల  ఆధారంగా    ఇప్పటి  వాళ్ళు  రామాయణం   జరిగిన  కాలాన్ని  అంచనా  వేయగలుగుతున్నారు.  

 ఇవన్నీ  గమనిస్తే  ప్రాచీనులు  అందించిన  జ్యోతిషం  ఆధారంగా  చరిత్రకాలాన్ని  కూడా  తెలుసుకోవచ్చని  చక్కగా  తెలుస్తోంది.

........................

ఒకసారి  విక్రమాదిత్యుడు  ధ్యానము చేయగా   అయోధ్యా నగరం  యొక్క  పురాతన  కట్టడాలు   కళ్ళముందు  గోచరించగా  ఆ  ప్రకారం  వారు  ఆ కట్టడాలను ..నిర్మించారని అంటారు.

చరిత్ర   గురించి  తెలుసుకోవాలంటే   ఇలాంటి  అద్భుత  విషయాల  గురించి  కూడా  తెలుసుకోవాలి.

దురదృష్టమేమిటంటే,   కొందరు  ఆధునికులు   ఇలాంటి  విషయాలను  నమ్మము . అంటారు. తమకు  తెలిసిన  కొద్ది  విషయాలే   విజ్ఞానం  తప్ప,....  తమకు  తెలియని  విషయాలు   విజ్ఞానమే  కాదంటారు.

ఆధునికులకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత .... తెలియని  విజ్ఞానం  మరెంతో  ఉంది . అని    గ్రహిస్తే  బాగుంటుంది.


( ఈ విక్రమాదిత్యుని  విషయం  ఓం చానల్  వారు  ప్రసారం  చేసిన  అయోధ్య గురించిన  విశేషాల ద్వారా తెలుసుకున్నది.) 
.................

ఆ మధ్య,  నాసా  వాళ్ళు   తాము  తీసిన   రామసేతు  చిత్రాలను  విడుదల  చేసారు.

ఈ  మధ్యనే   ఇంకో  వార్త  వచ్చింది.  ప్రాచీన  కాలంలో  సముద్రంలో మునిగిపోయిన  ద్వారకా  నగర  ఆనవాళ్ళను  గుర్తించామని  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రకటించారు.

కొన్ని  లింక్స్..

NASA Images Find 1,750,000 Year Old Man-Made Bridge


Dwaraka - A LOST CITY RECOVERED - ISKCON Desire Tree


................................

సింధు  నాగరికత  శిధిలాలలో  రధాలు,  గుర్రాలు  మొదలైన  వాటి  ఆనవాళ్ళు  లభించనంత  మాత్రాన  ..రామాయణం, భారతం  వంటివి  సింధు  నాగరికతకు  తరువాతే  జరిగాయి ... అని  ఆధునిక  చరిత్రకారులు  భావించటం  సరికాదనిపిస్తుంది.
.......................

 కొన్ని సింధు లోయ ముద్రలు స్వస్తిక్ గుర్తు కలిగి ఉన్నాయి.  హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ప్రాచీన హరప్పా సంస్కృతికి ముందు కూడా ఉన్నాయి.  శివలింగాన్ని పోలిన కొన్ని గుర్తులు కూడా హరప్పా శిథిలాల్లో కనిపించాయి.వీరి చిహ్నాలలో ముఖ్యమైనది పద్మాసనం లో కూర్చున్న ఒక బొమ్మ, మరియు దాని చుట్టూ ఉన్న వివిధ జంతువులు. శివుడి రూపమైన పశుపతి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. 


 ఈ  పేరాలోని  సింధు  నాగరికతకు  సంబంధించిన  విషయాలు అంతర్జాలం  నుండి  సేకరించినవి... ) 
..........................

చరిత్ర  గురించి  చరిత్రకారులలో  ఎన్నో  బేధాభిప్రాయాలున్నాయి.  చరిత్ర  గురించి  తెలుసుకోవటానికి   ఆధునిక  సైన్స్ ద్వారా  కూడా ప్రయత్నం  చేస్తున్నారు.  

కార్బన్  డేటింగ్   విధానంలో   కొన్నిసార్లు  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉందట.   
..................................

అనేక  కారణాల  వల్ల    చరిత్రను  విశ్లేషించటంలో  పొరపాట్లు  వచ్చే  అవకాశం  ఉంది.

ఇప్పటి  2014  సంవత్సరంలో  కూడా  ప్రపంచంలోని  కొన్ని  తెగలవారికి  ఆధునిక  విజ్ఞానం  గురించి  తెలియదు.  

ఉదా...  10 Tribes That Avoided Modern Civilization..
( The Surma People, Peruvian Tribe .... )  


పట్టణాలకు  కొద్ది  దూరంలో  ఉండే   అడవుల్లో  నివసించే  కొన్ని  ఆటవిక  తెగల  వారికి  కూడా  ఆధునికపరికరాలైన  ఫ్రిజ్,  వాషింగ్ మెషీన్ , కంప్యూటర్..వంటి  వాటి   వాడకం  గురించి  తెలియకపోవచ్చు. 

ఇప్పటికీ    కొందరు   మట్టితో  కట్టుకున్న  ఇళ్ళలో  నివసిస్తూ ...  చెక్కతో  చేసిన  వస్తువులు,  మట్టితో  చేసిన  వస్తువులు  మాత్రమే  వాడుతున్నారు. 


భవిష్యత్తులో  కొన్ని  వేల   లేక  లక్షల    సంవత్సరాల  తరువాత  చరిత్రకారులు   భూమిపై  పరిశోధనలు  చేస్తే...?


ఉదా..   ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ ,  కంప్యూటర్.. వంటి వాడకం   తెలీని   ప్రాంతములో  త్రవ్వకాలు  జరిపితే.....

...  ఆ  శిధిలాలలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్, కంప్యూటర్..  వంటివి  కాకుండా  చెక్కతో  చేసిన  వస్తువులు, మట్టితో  చేసిన  వస్తువులు  లభించాయనుకోండి,   వాటి  ఆధారంగా   2014  సంవత్సరములో   ప్రపంచంలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ , కంప్యూటర్.. లేవని  చరిత్రకారులు  నిర్ణయించకూడదు కదా  !
...................................

గత కొద్ది  కాలం నుంచి ,  విదేశాల్లో  ఎందరో  భారతీయులు  నివసిస్తున్నారు.  వారిలో  హిందువులూ  ఉంటారు . వారి వద్ద  వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  ఉంటాయి.

 భవిష్యత్తులో  కొన్ని  వేల , లక్షల   సంవత్సరాల  తరువాత   అక్కడ   భూమిలో  త్రవ్వకాలు  జరిపితే  ?  అక్కడ 
వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  దొరికాయనుకోండి.

    20 , 21 వ శతాబ్ద  మధ్య కాలంలో   పశ్చిమ దేశాల్లో   హిందూ నాగరికత   వెల్లివిరిసింది . .. అని భవిష్యత్  చరిత్రకారులు భావిస్తే ...అది  కొంత వరకు  మాత్రమే  నిజం . 

....................

కొంతకాలం  క్రిందట  మనదేశంలో  జరిగిన  విదేశీదండయాత్రలలో  ఎన్నో  దేవాలయాలు ,  పురాతన  కట్టడాలు    ధ్వంసం చేయబడ్డాయి. 

 విదేశీ  దండయాత్రలలో  నాశనం  అయిన  ఎన్నో  దేవాలయాలను  అహల్యాబాయ్  హోల్కర్  అనే  ఆమె  పునర్నిర్మింపజేశారంటారు.  

  ఇలా,  కట్టడాల పునర్నిర్మాణం  అంటే ,  ప్రాచీన  కట్టడాలలోని  రాళ్ళు..  + ఆధునిక  వస్తువులు  కూడా  కలిపి  పునర్నిర్మాణం  జరుగుతుంది. 


ఇలాంటి  కట్టడాల  ప్రాచీనతను  గుర్తించవలసివచ్చినప్పుడు   కట్టడము  యొక్క   కాల  నిర్ణయంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.
............................ 

  ఇలా  అనేక  కారణాల  వల్ల  చరిత్రలో  కాలాన్ని  నిర్ణయించటంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.

  చరిత్రకు సంబంధించి  కాలాన్ని  నిర్ణయించటంలో    ప్రాచీనులు  తెలియజేసిట్లు  జ్యోతిష  శాస్త్రాన్ని  కూడా  ఆధారంగా  తీసుకుంటే  చక్కటి ఫలితాలు  వచ్చే  అవకాశం  ఉంది.



ఆధునికులకు అంతుబట్టని రహస్యాలెన్నో..కొన్ని విషయములు...

 
ఒక  యోగి  ఆత్మ కధ  గ్రంధములో  సైన్స్  గురించి  కూడా   అద్భుతమైన    విషయములు  ఉన్నాయి. 

   ప్రపంచవ్యాప్తంగా  ఎందరో  ఈ  గ్రంధాన్ని  మెచ్చుకున్నారు.

  శ్రీశ్రీ స్వామి శివానంద  గారు .. శ్రీశ్రీ పరమహంస  యోగానంద  గారిని  ఎంతగానో  మెచ్చుకున్న  సంగతి  గ్రంధములో  ఉన్నది.
.........................

ప్రాచీన  విజ్ఞానం  ఎంతో  గొప్పది.  ఆధునికులకు  అంతుబట్టని  రహస్యాలెన్నో  ప్రాచీనులకు  తెలుసు.  

 మనుషులు  ఆహారాన్ని  సరిగ్గా  తీసుకోకుంటే   ఎక్కువకాలం 
ఆరోగ్యంగా  జీవించలేరని  ఆధునిక  సైన్స్  చెబుతుంది.

అయితే,   ఆహారాన్ని   తీసుకోకుండా   దైవ  ధ్యానంలో  ఉంటూ  తపస్సు  చేసిన  కొందరు  మహర్షుల  కధలు  మనకు  తెలుసు.  


ఈ  రోజుల్లో  కూడా   ...ఉత్తర భారతదేశానికి  చెందిన  ఒక దైవ  భక్తుడు   ఎంతో  కాలంగా  సరిగ్గా  ఆహారాన్ని  తీసుకోకపోయినా  చక్కగా 
ఆరోగ్యంగా  జీవిస్తున్నారని  వార్తలలో  వచ్చింది. 

  పరిశోధకులు  ఆ   వ్యక్తిని  ఒక  గదిలో  ఉంచి ,  బయటనుంచి  అతనికి  ఎటువంటి  ఆహారమూ  అందకుండా  గట్టిగా  కట్టుదిట్టం  చేసి,  ఆహారాన్ని  తీసుకోకున్నా  ఆ  వ్యక్తి  ఎలా  ఆరోగ్యంగా  ఉంటున్నాడో  ?  అని  ఎన్నో  పరీక్షలు  చేసారు.  అయినా  పరిశోధకులకు  
 విషయం ఏమీ  అంటుబట్టలేదు. 


.. ఆహారాన్ని  తీసుకోకపోయినా  చక్కగా  జీవించటం  సాధ్యమే  అనే విషయం   గురించి  ఒక  యోగి  ఆత్మ కధ  గ్రంధములో   వివరములు  ఉన్నాయి. 


ఇలాంటి  ఎన్నో  విషయముల  గురించి  ప్రాచీనులకు  తెలుసు.


Friday, July 25, 2014

వింటే వినండి .. .........

 
చరిత్ర   పేరుతో  కొందరు  పురాణేతిహాసాలలోని  పాత్రలను  కించపరిచేటట్లు  వ్రాస్తున్నారు.  ఇది   ఎంతో  బాధాకరం. 

ఒక్క  విషయం  ఏమిటంటే  పూర్వీకులు  ఇప్పటివాళ్ళకన్నా  విజ్ఞానవంతులు. తమ  మహిమలతో  ఎన్నో  అద్భుతాలు  చేయగలిగినవారు.  


 ప్రాచీనుల  విజ్ఞానానికి  ఉదాహరణలుగా  ఇప్పుడు  కూడా  ఎన్నో   విషయాలు  ఆధునిక  విజ్ఞానానికి  అంతుబట్టని  రహస్యాలుగా  మిగిలిఉన్నాయి.
..............................

ఒక విషయం  చెప్పాలనుకుంటున్నాను....నాకు  చరిత్ర  గురించి  కొద్దిగా  తెలుసు.   ఎలాగంటే, నేను   అన్నామలై  యూనివర్సిటీ  ద్వారా  M.A.  చదివాను. దైవం  దయ  వల్ల  పాసయ్యాను.  


 ఇండియా  చరిత్ర,  తమిళనాడు  చరిత్ర,  యూరోప్  చరిత్ర,   అమెరికా  చరిత్ర,  ..ఏదో  బట్టీపట్టీ  చదివి ,   దైవం  దయ  వల్ల  పాసయ్యాను.

అన్నీ  కలిపి  బట్టీపట్టి  చదివేసరికి  ఇప్పుడు  ఏదీ  సరిగ్గా  గుర్తు  లేదు.


 నాకు ,  బట్టీపట్టి    చదివిన  విషయాల  కన్నా,  వార్తాపత్రికలో  ఒక్కసారి  చదివిన  విషయాలు  ఎక్కువకాలం  గుర్తుంటాయి. 

న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు  చిన్నప్పట్నించి చాలా ఇష్టం. అందువల్ల ప్రపంచ చరిత్ర గురించి నాకు కొంత తెలుసు. న్యూస్ పేపర్ చదవటం అంటే ఉన్న ఇష్టంతో   న్యూస్ పేపర్లను   ఆసక్తిగా చదవటం వల్ల  ఒక్కసారే  చదివినా  కూడా .. గుర్తుంటాయి. పీజీ డిగ్రీ  కొరకు చదవటం  అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల,  అలా  చదివిన విషయాలు అంతగా గుర్తు ఉండవు .

.................................


ఒక విషయం  చెప్పాలనుకుంటున్నాను. నేను  చిన్నతనంలో  నాస్తికురాలైన  ఒక  టీచర్  మాటలను  విని ,   దేవుడు  లేడని వాదించటం,  దైవ   ప్రసాదాలను  తిరస్కరించటం,  పురాణేతిహాసాలను  ఎగతాళి  చేయటం,   దైవచిత్రాలను  కాలిక్రింద  తొక్కటం కూడా చేసాను. 

అప్పుడు  నేను బాగా  చదివే  స్టూడెంటును.   ఫస్ట్  మార్కులతో   ఎన్నో బహుమతులను  తెచ్చుకున్న  నేను   క్రమంగా  చదువులో  వెనుకబడిపోయాను.

తరువాత   మళ్ళీ  బుద్ధి  వచ్చి    భక్తితో  ఉండటం   మొదలుపెట్టాను.

 కొంతకాలం  క్రిందట  నాకు   కష్టాలు  వచ్చాయి. (కష్టాలంటే,  నా  చేతిలో  లేని  విషయాల  గురించి  అనవసరంగా  ఎక్కువగా  ఆలోచించి  నాకు నేను  తెచ్చుకున్న  కష్టాలు.  )


 ఎంతో  మానసిక  వేదనను  అనుభవించాను.  ఆ  బాధ  ఎలా  ఉంటుందంటే,    మనసును  మెలిపెట్టేసి,   ఈ బాధ  శత్రువుకు  కూడా  వద్దు  బాబోయ్  ! అనుకునేంతగా  అనిపిస్తుంది.

 నాకు  జీవితంలో  అన్నీ  ఉన్నాయి.  మాకు  తెలిసిన  వాళ్ళు  నాది  ఎంతో  అదృష్టమైన  జీవితం  అంటారు.  ఎప్పుడూ  సరైన  దారిలో  నడిపించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

అయితే,  దైవాన్ని  నిందించటం  వల్ల  దైవానికి  కోపం  వచ్చి  మనలను  శిక్షించటం  జరగదు.... దైవం  దయామయులు. దారి  తప్పే  బిడ్దలను  సరైన  దారికి  తీసుకురావటానికి   కొద్దిగా  కష్టాన్ని  కలిగిస్తారు. అదీ  బిడ్ద  మంచికోసమే.   



గొప్పశక్తి  గల  వ్యక్తుల  వద్ద  ఉంటే  మనకు  ఎంతో  ప్రయోజనం  కలుగుతుంది  కదా  ! ఇక  సృష్టిలో  అన్నింటికన్నా  గొప్పశక్తి  అయిన  దైవానికి  దగ్గరయ్యే  వ్యక్తులకు  ఎంతో  మంచి  జరుగుతుంది .



 దైవం  లేరని  చెప్పే  నాస్తికుల  వల్ల  ఎందరో  వ్యక్తులు   దైవానికి  దూరమవుతారు.   అందుకే  దైవాన్ని  నిందించే  వాళ్ళకు  పాపం  తగులుతుంది.


పురాణేతిహాసాల  గురించి  చర్చ  జరగవచ్చు.  అయితే  పురాణేతిహాసాలను  వక్రీకరించటం  తప్పు.  ఇలా  చేయటం  వల్ల  సమాజానికి  కూడా  మంచిదికాదు.
...............................

దైవం  గురించి,  పురాణేతిహాసాలలోని  పాత్రలను  చెడ్దగా  చూపించటానికి   ప్రయత్నించటం  వల్ల  మొదట  సంబరంగానే  ఉండొచ్చు. తరువాత  వాటి  ఫలితాలను  తట్టుకోవటం  మాత్రం  ఎంతో  కష్టంగా  ఉంటుంది. 



 నా  స్వానుభవంతో  చెబుతున్నాను.  దైవనింద,  పురాణేతిహాసాలను   వక్రీకరించి  చెప్పటం..వంటి  చెడ్డ  పనులను  చేయవద్దు.  

వింటే  వినండి .. లేకపోతే  ఎవరి  కర్మకు  వారే  బాధ్యులు.

.............................

కొన్ని   విషయాలపై  నా  అభిప్రాయాలు...   


పరస్త్రీని  తల్లిలా  చూడమని  పెద్దలు  చెప్పిన  సంస్కృతి  మనది.    అయితే  తమ  ఇష్టాలకు  అనుకూలంగా  ధర్మాలను  మార్చి  చెప్పుకునే  స్త్రీలు, పురుషులు  ఆ  కాలంలోనూ  , ఈ  కాలంలోనూ  ఉంటారు.  శర్మిష్ఠ  తనకు  అనుకూలంగా  ఉండేటట్లు  యయాతితో  మాట్లాడి  ఉండవచ్చు. 
...............................

పరాశరుడు ఒక మునే కానీ దైవం  కాకపోవచ్చు.  అయితే  వారికి  అద్భుతమైన  మహిమలు  చేసే  శక్తులు  ఉన్నాయి. జన్మించిన  సంతానం  వెనువెంటనే  పెరిగి పెద్దయ్యే  విధంగా  వరాలను  ఇచ్చే గొప్ప   శక్తులున్న  వారు  పరాశరులు. అప్సరసలను  చూసినా  తొణకని  వ్యక్తి  పరాశరుడు. 



భారత  కధ  ముందే  ఒక  ప్రణాళిక  ప్రకారం  జరపబడిందని  గ్రంధాల  ద్వారా  తెలుస్తోంది. లోక  హితం  కోసం  దైవం  ఈ  కధలను ,  అందులోని  పాత్రధారులను  నడిపించారు. ఈ  పాత్రల  ద్వారా  లోకులు   ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

.................................


సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే , కర్ణుని  పాత్ర  శూద్రుల   ఇంట పెరగటం ,  తదనంతరం జరిగిన సంఘటనల  వల్ల  దుర్యోధనుడు   మిత్రుడవటం,  దుర్యోధనుని  పట్ల కృతజ్ఞతతో  కర్ణుడు జీవితాంతమూ  స్నేహధర్మానికి  బంధితుడు  కావటం  జరిగింది.



 సహజపద్ధతిలో  జన్మించిన  పిల్లలకు పుట్టుకతో   సహజ  కవచ కుండలాలు  ఉండవు  కదా  !
 
 ఇక  వ్యాసుని  విషయం  వేరు.   వారు  పుట్టిన  వెంటనే  తపస్సు  చేసుకోవటానికి  వెళ్ళిపోయారు.   వారి  పాత్రకు  తగ్గట్లు  వారి  పాత్రకు  రూపకల్పన  జరిగింది.
.....................


కుంతి  మరియు  సత్యవతి  విషయంలో   కన్యాత్వం  చెడకుండా  సంతానాన్ని  ప్రసాదించటం  జరిగిందనే    గ్రంధాలలో  ఉంది.

 కన్యాత్వం  చెడకుండా  సంతానాన్ని  ప్రసాదించటం  అంటేనే    సహజప్రక్రియ  కాదని  తెలుస్తూనే  ఉంది.  
..................................


  ఇతరుల  విషయాల  పట్ల   అనుమానాలు  కలగటమే  జనం  పని. ఇందులో  ఆశ్చర్యం  ఏమీలేదు. సామాన్య  ప్రజలకు  దుర్వాసుని  శాపం  మొదలైన  విషయాలు  తెలియవు  కదా  ! అందుకే  కుంతీదేవిని   అనుమానించి  ఉంటారు  . 
.............................


సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుందని  అంటున్నారు.  ఇలా  తేడాలు  కనిపిస్తున్నాయని  అంటేనే , గ్రంధాలలో   ఆధునికులు  మార్పులుచేర్పులు  చేసి  ఉండవచ్చని 
అర్ధమవుతోంది  కదా  !

 ఏవి  ప్రాచీనులు    అందించిన   విషయాలో?  ఏవి  ఆధునికులు  చొప్పించిన  విషయాలో ?   ఎలా  తెలుస్తుంది  ?  


సమాజానికి  చెడును  కలిగించే  విషయాలను  పవిత్ర  గ్రంధాల  ద్వారా  ప్రాచీనులు  అందించరు  కదా  ! అందువల్ల  గ్రంధాలలో  చెడు  సంగతులు  ఏమైనా  ఉంటే ... అవి  ఆధునికులు  చేసిన  మార్పులుచేర్పులే  అయ్యుంటాయి. 

 ఇప్పుడు  చూస్తున్నాము  కదా  !  ప్రాచీన  గ్రంధాల  గురించి   ఎవరికి  తోచినట్లు  వారు  ఊహించి  వ్రాసేస్తున్నారు.  ఇక  ఇంతకుముందు  ఎన్ని  మార్పులుచేర్పులు  జరిగాయో  ?
.................................


 హస్తినాపురం  నేటి  ఉత్తరప్రదేశ్  వద్ద  ఉందని  అంటారు.


పాండవులది  హస్తినాపురం  అయితే ... పాండవులు  విదేశీయులు ..వాళ్ళది   టెబెట్  ప్రాంతమని అనటమేమిటో ?




ఆధునిక చరిత్రకారులు చెబుతున్న కొన్ని విషయాలను గమనించితే....



మానవులు  లిపిని  కనిపెట్టటానికి  ముందు  కాలాన్ని  చరిత్రకు  ముందు  కాలం  అని ,  లిపిని  కనిపెట్టిన  తరువాతి  కాలాన్ని  చారిత్రిక  యుగమనీ  ఆధునిక  చరిత్రకారులు....వర్గీకరించారు.  



  ( సింధు  నాగరికతకు  ముందు  కాలంలో  ప్రపంచంలో  లిపి  అనేది  లేదని  ఆధునిక  చరిత్రకారుల  అభిప్రాయం. 


ఇండస్ స్క్రిప్ట్  (  సింధు  లిపి  ) అర్ధం  చేసుకోవాలని  ఎంతో  ప్రయత్నించినా , ఇప్పటికి  వరకు  ఎవరూ  అర్ధం  చేసుకోలేకపోయారు.  )
 

వేదవ్యాసుడు  మహాభారతాన్ని  గ్రంధస్థం  చేయటానికి  పూనుకున్నప్పుడు    గణపతిని  సాయమడిగారనీ  కొన్ని  షరతులతో  గణపతి  ఒప్పుకున్నారనీ   అంటారు. 




 వినాయకుడు  మహాభారతాన్ని  వ్రాయటం  చిత్రాలలో  కూడా  ఉంటుంది.  వ్రాయటం   అంటే   లిపి  ఉన్నదనే  అర్ధం  కదా  !  
( లిపి  ఎప్పుడూ   ఉంది.)


భారతకాలానికి  ముందే  రామాయణకాలంలో   సేతువు  నిర్మించటానికి  రాళ్ళను  సముద్రంలో  వేస్తుంటే  అవి  మునిగిపోతుంటే    ...కొన్ని  రాళ్ళపై  రామనామాన్ని  లిఖించగా  అవి  మునగకుండా  నీటిపై  తేలాయనీ  అంటారు. 



 రాళ్ళపై  రామనామాన్ని  లిఖించటం   అంటే  అప్పటి  వాళ్ళకు   లిపి  తెలుసనే   అర్ధం  కదా  ! 
 ........................

ఇక  ఇనుము  గురించి  ప్రాచీనులకు  తెలియదని  ఆధునిక  చరిత్రకారులు  అంటారు.  


శ్రీ  దేవీ భాగవతములో  మణిద్వీప  వర్ణనలో  ఇనుము  గురించిన  ప్రస్తావన    ఉన్నది.

..ఒక  మహా  ప్రాకారం.  (  కోటగోడ  ). అది  అయోధాతు  నిర్మితం. ఇనుముతో  ధాతు శిలలతో ధృఢంగా  నిర్మించిన  ప్రాకారం.  దాని  ఎత్తు  సప్త  యోజనాలు...


.. నానావిధ  శస్త్రప్రహారణాలు  ధరించి  నానావిధ  యుద్ధ విశారదులైన  రక్షకభటులు ఆ  ప్రాకారం  మీద  అంతటా  కావలి  తిరుగుతుంతారు. విధినిర్వహణలో  ఆనందిస్తుంటారు...
......................


  ( అయః  ప్రాకారం  అంటే  ఇనుముతో  చెయ్యబడ్డది  అని  అర్ధమట.)


అయః  అంటే  ఇనుము  కాదు  ..  కంచు,  ఇత్తడి, రాగి  ...  అని  కొందరి  అభిప్రాయం. 


 అయితే,  మణిద్వీప వర్ణన లో  అయః  ప్రాకారము తో  పాటు  కంచు, ఇత్తడి , రాగి.. ప్రాకారముల  గురించి  కూడా  వర్ణించారు. 

 అలాంటప్పుడు   అయః   అంటే    కంచు,  ఇత్తడి, రాగి..   కాదనే    కదా !

.....................

   గ్రహాలకు   సంబంధించిన  లోహలలో   ఇనుము  కూడా  ఉందని   అంటారు.
శనిదేవునికి  సంబంధించిన  లోహము  ఇనుము  అని  అనుకుంటున్నాను. 
  ( నాకు  తెలిసినంతలో.. ) .

 ఇవన్నీ  గమనిస్తే  ,  ఇనుము  గురించి   మనవాళ్లకు   ఎప్పుడో  తెలుసని  తెలుస్తోంది.

.........................



చరిత్ర  గురించి  ఆధునిక   చరిత్రకారుల  మధ్య  అనేక  భేదాభిప్రాయములు  ఉన్నవి.

   క్రీస్తుకు  పూర్వం   1600  లేక  1000  సంవత్సరాల  సమీప  కాలం  మాత్రమే  రామాయణము, భారతము  జరిగిన  కాలము ....  అని  కొందరి  అభిప్రాయం .

 కానీ,  మన్వంతరముల  లెక్క  ప్రకారం  గమనిస్తే,    క్రీస్తు  పూర్వం  2000  సంవత్సరాలకు  పూర్వమే  రామాయణము, భారతము  జరిగిన  కాలము ....  అని  ఎక్కువమంది  అభిప్రాయం.

...............................

  శ్రీ పాద శ్రీ వల్లభ  సంపూర్ణ చరితామృతము  గ్రంధము  ద్వారా  ఎన్నో  విషయములను  తెలుసుకోవచ్చు.
 ..........................

ఈ  మధ్యనే  రామసేతు  గురించి,  సముద్రంలో  మునిగిన  ద్వారకా  నగర  శిధిలాలను  గుర్తించామని  ఆధునికులు  చెబుతున్నారు  కదా  !
.............................


పై  విషయాలను  గమనించితే  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.
..................................

ఇక్కడ  కొన్ని  లింక్స్  ఇస్తున్నాను.  

Timeline of MAHABHARATA 3139 B.C | तमसो मा ...


Astronomical Proof of the Mahabharata War and Shri ...


Wednesday, July 23, 2014

ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం..మరియు. . శబ్దశక్తి..

 
ఈ  రోజుల్లో  కొందరు  భారతీయులు  మన   ప్రాచీనసంస్కృతిని  గురించి  ,  ప్రాచీనుల  గురించి  తేలికగా  మాట్లాడుతున్నారు.


  ఈ  మధ్య  ఒకరు  ఏమన్నారంటే,  మాయలు,  మంత్రాలను   తేలికగా  కొట్టిపడేస్తూ ,  ఆధునిక  సైన్సే  విజ్ఞానం  అన్నట్లు  మాట్లాడుతున్నారు.   చిత్రమేమిటంటే,  ఇలా  మాట్లాడేవాళ్ళు  కూడా   తమ  కోరికలు  తీరటం  కోసం  మంత్రాలతో  పూజలు  చేయించుకుంటారు. 



 మంత్రాలకు  చింతకాయలు  రాల్తాయా  ?   అని  కొందరు  అంటుంటారు.  ఇలా  అనటం    అవివేకం.  మంత్రాలు  కూడా  సైన్సులో  భాగమే.  అయితే  అది  ప్రాచీనులకు  తెలిసిన  అద్భుతమైన  సైన్స్. 



ప్రాచీనులు  ఎంతో  దైవభక్తితో  తపశ్శక్తితో  తెలుసుకున్న  మంత్రాలను  లోకానికి  అందించారు. బీజాక్షరాలతో  కూడిన  మంత్రమనే  శబ్దశక్తికి  ఎంతో  శక్తి   ఉంటుంది. 



 శబ్దానికి  ఎంతో  శక్తి  ఉంది. పశుపక్ష్యాదులు  గ్రహించగలిగే   కొన్ని  శబ్దాలను   మానవులు  గ్రహించలేరు. ఈ  విషయాలను   ఆధునికులు  కూడా  గుర్తించారు.

   ఉదా..అల్ట్రాసౌండ్ స్కానింగ్  గురించి  మనకు  తెలుసు.  ఈ  శబ్దశక్తితో (అల్ట్రాసౌండ్ ) ఆధునిక  కాలంలో   ఎన్నో  పనులను  చేస్తున్నారు  కదా  !

...........


కొంతకాలం  క్రిందట  విదేశీపాలకులు  ఈ  దేశాన్ని  దోచి  ఇక్కడి  సంపదతో  పాటు  ఎంతో  విలువైన  విజ్ఞాన గ్రంధాలను  కూడా  తమతో  తీసుకెళ్ళారట. ఆ  గ్రంధాలలోని  విషయాల  గురించి  బాగా  తెలిసిన  కొందరు  పండితులను  కూడా  తమ  దేశాలకు  తీసుకెళ్ళారట. 



ఏమో  ఎవరికి  తెలుసు  ?   అలా  తీసుకువెళ్ళబడిన  పండితుల  సంతానం  విదేశాలలో  వృద్ధి  చెంది  అక్కడి  జనజీవనస్రవంతిలో  కలిసిపోయారేమో  ?  ఇప్పటికీ  వారి  వద్ద  మనదేశపు  ప్రాచీనవిజ్ఞానం  భద్రపరచబడి  ఉందేమో  ?



మన  ప్రాచీన  గ్రంధాలలోని  గొప్పదనం   విదేశీయులకు  తెలుసు   కాబట్టి    ఎందరో   విదేశీయులు   మనదేశపు  గ్రంధాలలోని  విషయపరిజ్ఞానాన్ని   తెలుసుకోవటానికి   సంస్కృతాన్ని  నేర్చుకున్నారట.
 



 మన  దురదృష్టం   ఏమిటంటే ,  మన  దేశీయులలో  కొందరు  మాత్రం   మన  ప్రాచీన  విషయాలను  ఎగతాళి  చేస్తున్నారు.


  
తరతరాల  తరబడి  పరాయి  దేశ పాలనలో  ఉండటం  వల్లనో  లేక  మరేదైనా  కారణం  వల్లో  కానీ  చాలామంది  భారతీయుల్లో  బానిసత్వపు  ఆలోచనాధోరణి   అలాగే  ఉంది. 



  మనకు  ఏమీ  తెలియదు....  మన  పూర్వీకులకు  ఏమీ  తెలియదు..విదేశీయులకే  అన్నీ  తెలుసు...ఇలాంటి  బానిసత్వపు  ఆలోచనల  నుండి   బైటపడినప్పుడు   ఈ  దేశం  ఎంతో  అభివృద్ధిచెందుతుంది.
...................

మన  ప్రాచీన  విజ్ఞానం  గురించిన  అద్భుతమైన  విషయాల  గురించి    కొద్దిగానైనా   తెలుసుకోవాలంటే,  దయచేసి  ఈ  క్రింద   ఇవ్వబడిన  లింక్    చదవండి..


ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం... ... 

భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..
ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS..









Monday, July 21, 2014

సరోగసి .....................


ఈ రోజుల్లో  సరోగసి  గురించి ,  సరోగసి  మదర్స్  గురించి,   అద్దె  గర్భాల  గురించి  వార్తలను  వింటున్నాము  . 

పురాణేతిహాసాల్లో  ఇలాంటి  వాటిని  పోలిన  సంఘటనలు  ఉన్నాయి.   


ఉదా..శ్రీ  కృష్ణుని  సోదరుడైన  బలరాముని   విషయంలో  చూస్తే...

..దేవకీ దేవికి  సప్తమ  గర్భంగా  ఆదిశేషుని  అంశం  ప్రవేశించింది. అయిదవ  నెల  నిండగానే  యోగమాయ  తన  యోగశక్తితో  ఈ గర్భాన్ని  సంకర్షణ  చేసి  రోహిణీదేవి  గర్భంలో  ప్రవేశపెట్టింది . 


..దేవకీదేవికి  గర్భస్రావమయ్యిందని   వార్త  నగరమంతటా  వ్యాపించింది....

..తరువాత  కొన్ని  నెలలకు  రోహిణీదేవి  బలరాముని  ప్రసవించింది.

బలరామునికి 
సంకర్షణుడు   అనే  పేరు  కూడా  ఉన్నదంటారు.

సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)

 పై   విషయాలను   గమనిస్తే  ,మనకు  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.









Friday, July 18, 2014

ఓం...భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది ........


ఓం.జగన్మాతాపితరులకు  నమస్కారములు.

నీటిపై తేలియాడుతూ రామాయణ ప్రవచనం.....

కొంతకాలం  క్రిందట.......శ్రీశైల  మహాక్షేత్రంలోని  శివాజీ  స్ఫూర్తి  కేంద్రం  వద్దనున్న  సూర్యబలిజ  నిత్యాన్నదాన  సత్రంలో  విజయనగరం  జిల్లాకు  చెందిన  సత్యజ్ఞానానంద  దశాశ్రమ  పీఠాధిపతి  శ్రీ  యోగానంద  మహాభారతి  స్వామి  జలస్థంభన  విద్యను  ప్రదర్శించారట.



మత్శ్యాసనంలో  నీటిపై  తేలియాడుతూ  రామాయణ  మహాకావ్యాన్ని  సుమారు  గంటకు  పైగా  ఉపన్యసించారట....గంటసేపు  నీటిపై  తేలియాడటం  ఎంతో   ఆశ్చర్యకరమైన   విషయం. 



 ఇలాంటివి    చూస్తుంటే    భారతీయ  విద్యలు  ఎంత  గొప్పవో  కదా  !  అని  ఆశ్చర్యంగా  అనిపిస్తుంది.  ఇంతటి  గొప్ప  విద్యలను  మనం  ఎంత  నిర్లక్ష్యం  చేస్తున్నామో  అని  బాధా  కలుగుతుంది.

.......................

ఇంకా  ఏమనిపిస్తుందంటే... ఈ నాటి విజ్ఞానం ఎక్కువగా భౌతిక పద్ధతి మీద ఆధారపడింది. పూర్వీకుల విజ్ఞానం భౌతికశాస్త్రాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళింది అనిపిస్తుంది.
......................

కొన్ని సంఘటనలు చూస్తుంటే శారీరిక బలం కన్నా మానసిక బలం గొప్పదేమో అనిపిస్తుంది.

 ఉదాహరణకు.. .ఒక వ్యక్తి లారీనో లేక బస్సునో తాడుతో    కట్టి ఆ తాడును పళ్ళ మధ్య పట్టి ఉంచి లారీని కొంత దూరం లాగాడట. ఇంకొక  వ్యక్తి  తన  తల  వెంట్రుకలతో  లారీని   కొంత దూరం లాగాడట. 



ఆధునిక  సైన్స్ సూత్రాల   ప్రకారం   మనిషి  పళ్ళకు, వెంట్రుకల   లారీనో  , బస్సునో  లాగే  శక్తి  ఉండదు. అలా  లాగటానికి  ప్రయత్నిస్తే  వెంట్రుకలు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి.   మరి  లాగేవాళ్లు  ఎలా  లాగుతున్నారు? 



సాధారణ  వ్యక్తులే  తమ  బలమైన  సంకల్పశక్తితో  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేయగలుగుతున్నప్పుడు ,  ప్రాచీన  మహర్షులు   ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యం  చేయగలిగేవారనటంలో   ఎటువంటి  సందేహమూ  లేదు.

.................


పూర్వీకులు తమ తపశ్శక్తిని పెంచుకుని ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసారా ? 


అంటే భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది కదా ! అదే తపస్సు ద్వారా పొందే ఆధ్యాత్మిక దైవశక్తి కావచ్చు....
.............................

ఆధునిక  విజ్ఞానం  భౌతిక శక్తి మీదే  ఎక్కువగా  ఆధారపడింది.  ఉదా..ఇప్పటి  వాళ్లు  దూరంగా  జరిగే  విషయాల  గురించి  తెలుసుకోవాలంటే  టీవీలు,  ఫోన్లు ,  శాటిలైట్  సిస్టం  .. వంటి  భౌతిక  పరికరాలు  కావాలి .

అయితే ,  భక్తితో తపశ్శక్తితో దూరశ్రవణం, దూరదృష్టి..మొదలగు సిద్ధులను సాధించిన మహనీయులకు టీవీలు, ఫోన్లు వంటి భౌతిక సాధనాలతో పని లేదు.

వారు తమ మనోశక్తితోనే దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలరు. ఇలాంటి శక్తులు కలిగిన మహనీయుల గురించి ...ఒక యోగి ఆత్మ కధ. ...గ్రంధములో   ఎన్నో   వివరములున్నాయి.

................................


భౌతిక శక్తి మీదే  ఎక్కువగా  ఆధారపడింది. కాబట్టి,   ఆధునిక విజ్ఞానంలో  సైడ్  ఎఫెక్ట్స్  ఎక్కువ  ..ప్రాచీన  విజ్ఞానంలో  సైడ్  ఎఫెక్ట్స్  తక్కువ  అనిపిస్తుంది.

ఆధునిక  శాస్త్రవేత్తలకు    శరీరం  గురించి  మాత్రమే   కొంతవరకు    తెలుసు. మనస్సు  గురించి  తెలిసింది  చాలా  తక్కువ.




Wednesday, July 16, 2014

బొడ్దుత్రాడును భద్రపరిచే ఆచారం...


కొంతకాలం  క్రిందట   ఏం  చేసేవారంటే,  పిల్లలు  పుట్టినప్పుడు  వచ్చే  బొడ్డు త్రాడును  ( ఎండిన  తరువాత )  రాగిరేకులో  పెట్టి   దానిని  పిల్లల  భుజానికి  తాయెత్తులా  కడితే  పిల్లలకు  మంచి  జరుగుతుందనే  వారు.


  ( ఈ  విషయాన్ని  మా  పెద్దవాళ్ళు  చెబితే  తెలిసింది. )


  ఈ  రోజుల్లో   స్టెమ్ సెల్స్  కోసం  బొడ్దుత్రాడుకు  ప్రాముఖ్యతను  ఇవ్వటం  చూస్తుంటే ..  పాతకాలపు  ఆచారం  గుర్తుకొస్తోంది. 

స్టెమ్ సెల్సు  అనేవి  బిడ్ద  పుట్టినప్పుడు  బొడ్దుత్రాడు  నుండి    ఎక్కువగా   సేకరించవచ్చట.   ఈ  స్టెమ్సెల్స్  వల్ల  చాలా  ఉపయోగాలున్నాయట. 


ఉదా..ఎవరికైనా  భవిష్యత్తులో  ఏదైనా  అనారోగ్యం  కలిగితే  వారు  దాచుకున్న  బొడ్దుత్రాడునుండి  స్టెమ్ సెల్సు  తీసి  వ్యాధిని  నయం  చేయటానికి  అవకాశం  ఉందట.  


అవయవదానం  కష్టంగా  ఉన్న  ఈ  రోజుల్లో   ఈ  స్టెం సెల్సు  నుంచి    కిడ్నీ  వంటి  శరీరభాగాలను  వృద్ధి  చేయవచ్చు  అంటున్నారు. 

 ( వ్యక్తి  యొక్క  సొంత  స్టెంసెల్స్ నుంచి  వృద్ది  అయిన  కిడ్నీని  వ్యక్తి  శరీరం  తిరస్కరించదు  కదా !  ) 


డెంటల్  రంగంలో  చూస్తే  కొత్తపళ్ళను  వృద్ధి  చేయవచ్చు  అంటున్నారు.
ఇలా  ఎన్నో  ప్రయోగాలు  జరుగుతున్నాయి.


ఇవన్నీ  గమనించి ,  విదేశాల్లో  చాలామంది  తల్లితండ్రులు  తమ  పిల్లలు  పుట్టినప్పుడు ..  లభించే  బొడ్డుత్రాడు   రక్తాన్ని   భద్రపరుస్తున్నారట. అక్కడ  వీటిని  భద్రపరచటానికి   ప్రత్యేకమైన  బ్యాంకులు  ఉన్నాయట . 


ఇవన్నీ  చూస్తుంటే  ఏమనిపిస్తుందంటే , ఈ  మూలకణముల  యొక్క  ప్రాముఖ్యత  గురించి  మన  పూర్వీకులకు  తెలిసి ..  బొడ్దుత్రాడును   రాగిరేకులో  మడిచి  పిల్లల  భుజానికి  రక్షరేకుగా  కట్టమనే  ఆచారంగా  ఏర్పరిచారేమో..అనిపిస్తోంది.  
.................................

ఆధునికులు  చెప్పే మూలకణములు  (  స్టెం  సెల్స్ )  గురించి   ప్రాచీనులకు   తెలుసునని  అనిపిస్తోంది.  ఉదా..... స్టెంసెల్స్ అనబడే   మూలకణముల  ద్వారా   కొత్త  సృష్టిని సృష్టించవచ్చు  అని  నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
 విష్ణుమూర్తి  బొడ్డు నుండి  పద్మం  ద్వారా  బ్రహ్మ జన్మించి   సృష్టిని  చేస్తారు   అంటే.. 

బొడ్డుత్రాడు  నుండీ  వచ్చే  బ్రహ్మ  సృష్టిని  సృష్టిస్తారు. ... బొడ్డుత్రాడు  నుండి  లభించే   మూలకణముల  ద్వారా  కొత్త  సృష్టిని  చేయవచ్చు..  అనే  పోలిక  కనిపిస్తోంది    కదా ! 


ఇలా   ఎంతో   విజ్ఞానం  ప్రాచీన  గ్రంధాలలో  ఉన్నదనిపిస్తోంది.



Monday, July 14, 2014

తండ్రి అయిన నిమి శరీరం నుంచి పుట్టిన మిధి ( జనకుడు ) ...



ఇదొక  చిత్రమైన  కధ.   ఒక  యజ్ఞం  చేయించే  విషయంలో  వశిష్టునికి  నిమికి  మధ్య  భేదాభిప్రాయం  వచ్చింది.   ఇక్ష్వాకు  వంశసంభూతుడైన  నిమిమహారాజును  ,   శరీరం  రాలిపోయి  విదేహుడివి  అవుదువు గాక  - అని  శపించాడు  వశిష్టుడు .  (  వశిష్టుడు  నిమిని    శపించటానికి  అనేక  కారణాలున్నాయి  .  ఆవి  ఇప్పుడు  వ్రాయటం  లేదు.  )



శాపఫలితంగా  నిమి  మహారాజు  శరీరంలో  నెమ్మదినెమ్మదిగా  మార్పు  రావటం  మొదలవగా  అది  గమనించిన  ఋత్విజులు  , దానికి  కావలసిన  వేదమంత్రాలతో గంధమాల్యాదివిలేపనాలతో  ఒకవైపు  నిమి   శరీరాన్ని  రక్షిస్తూ ,  మరొకవైపు  త్వరత్వరగా  యజ్ఞాన్ని  ముగించారు.



తరువాత  నిమి  శరీరం  రాలిపోయి  ఆత్మ  మిగిలింది. ...  నిమి  ఆత్మ  జగన్మాతను  ప్రార్ధించి  వరాలను  పొందింది. (ఉదా.. ప్రాణికోటికి   రెప్పపాటు  కలగటం  వంటి  వరం.  అయితే ,   దేవతలు  మాత్రం  అనిమిషులు...)



అటు  తరువాత  మహర్షులు  సమాలోచనలు  జరిపి,  నిమికి  పుత్రుడు  కలగాలని  సంకల్పించి  నిమి  శరీరాన్ని  చేరువలో  ఉంచి  మంత్రపూర్వకంగా  అరణిని  మధించారు. మధిస్తూ  ఉండగా  పుత్రుడు  ఆవిర్భవించాడు.  సర్వలక్షణ  సంపన్నుడై  ముమ్మూర్తులా  తండ్రిలాగా  ఉన్నాడు. అరణిని  మధిస్తుండగా  జన్మించాడు  కనక  కొందరు  మిధి  అన్నారు.  జనకుడి ( తండ్రి ) శరీరం  నుంచి  పుట్టాడు  కనక  కొందరు  జనకుడు  అన్నారు.



విదేహుడైన  (  దేహం  లేని )  నిమియే  ఇలా  ఆవిర్భవించాడు  కనక  ఇంకొందరు   విదేహుడన్నారు.  ఇతని  వంశంలో ఇటుపైని  జన్మించే  రాజులందరూ విదేహులని  వ్యవహరింపబడతారన్నారు. వీరి  రాజధాని  మిధిలా  నగరం.  సీతాదేవి  పుట్టింటివారు  జనకవంశజులే. 


 ( నిమి  గురించిన  వివరములు  శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధము  నుంచి  తెలుసుకున్నవి.)

పై  కధద్వారా .. మరణించిన  వ్యక్తి  శరీరం  నుంచి  సంతానం  కలిగే అద్భుతమైన  విషయాన్ని  మనం  తెలుసుకోవచ్చు.  ప్రాచీనకాలంలో  ఇలాంటి  అద్భుతమైన  ప్రక్రియలు  జరిగేవని  తెలుస్తోంది.  అప్పటివారు  ఎంతో  గొప్ప  విజ్ఞానం  తెలిసినవారని  మనం  తెలుసుకోవచ్చు.



అప్పటివారి  విజ్ఞానం  ఇప్పటి  ఆధునిక  విజ్ఞానంలా   కేవలం   భౌతికశక్తితో    కూడిన  విజ్ఞానం  కాకపోవచ్చు.  అది  మానసిక  శక్తితో  కూడిన  అద్భుతమైన  శక్తి.

........................................


ఆధునిక  శాస్త్రవేత్తలు ,  ఎన్నోవేల  సంవత్సరాల  క్రిందట   మరణించిన  మామత్  శరీరం  నుంచి   డిఎన్ఏ  ను   సేకరించి   కొత్త  మామత్ ను  సృష్టించటానికి  పరిశోధనలు  చేస్తున్నారట.  ఎప్పుడో  మరణించిన  డైనొసార్   అవశేషాల  నుంచి  సేకరించిన  కణాలతో  కొత్త  డైనోసార్ ను  సృష్టిస్తామంటున్నారు.

ఇవన్నీ  గమనిస్తే  ఏం  తెలుస్తోందంటే,   మరణించిన  శరీరాల  నుంచి  తిరిగి  సంతానాన్ని  పొందటం  అనేది    అసంభవం  కాదు  అని  తెలుస్తోంది  కదా  !



ఆ  మధ్య  ఒక  విదేశీ  స్త్రీ  మరణించబోయే  తన  భర్త   నుంచి   స్పెర్మ్ ను  సేకరించి  శీతలీకరణ  పద్ధతిలో  నిల్వ  చేసి  , భర్త మరణానంతరం   టెస్ట్ ట్యూబ్   పద్ధతి  సహాయంతో,  భర్త  వీర్యం   ద్వారా    చక్కటి  బిడ్డను  కన్నట్లు  వార్తల   ద్వారా  తెలుసుకున్నాం.


కొంతకాలం  క్రిందట 
ఆధునిక  శాస్త్రవేత్తలు  , క్లోనింగ్  ద్వారా  అలైంగిక  పద్ధతిలో  సంతానాన్ని  ఉత్పత్తి  చేసారు.
.......................................

భారతంలో  చెప్పబడిన   వ్యుషితాశ్వుని  యొక్క  విషయం  ద్వారా   కూడా  మరణించిన  శరీరం  నుంచి  సంతానాన్ని  పొందటం  అనేది  సాధ్యమే  అని  తెలుసుకోవచ్చు. 


 నిమి  వారసులకు  విదేహులనే  పేరు  రావటానికి  కారణాలున్నాయి.  అలాగే  వ్యుషితాశ్వుని  సంతానానికి  సాల్వులు,  మద్రులు  అనే  పేర్లు  రావటానికి  కూడా  బలమైన  కారణాలు  ఉండే  ఉంటాయి. సాల్వులు,  మద్రులు  అనే  పదాలకు  సంస్కృత  అర్ధాలను  తెలుసుకుంటే   వారికి  ఆ  పేర్లు  రావటంలో  గల  కారణాలను  కొంతవరకూ  ఊహించవచ్చనిపిస్తోంది.  అంతేకానీ,  వ్యుషితాశ్వుని  సంతానాని  కంటే  ముందే  సాల్వులు,  మద్రులు  ఉన్నారనేది  నిజం  కాదు...



( ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ..అని రెండు  అవకాశాలు  ఉన్నాయి  కాబట్టి  ఎనిమిదో రోజున  జరిగిన ప్రక్రియ  ద్వారా  కొందరు  , పద్నాలుగో రోజున .... కొందరు  సంతానం  కలిగారేమో  ?)


ప్రాచీనులు  ఇప్పటి  వాళ్ళకన్నా  ఎంతో  విజ్ఞానవంతులు  అనే  విషయంలో  ఎటువంటి  సందేహమూ  లేదు. వారి  విజ్ఞానం  గురించి  సరిగ్గా    తెలియని  ఇప్పటివాళ్ళం   ప్రతి  విషయంలోనూ  ప్రాచీనులను  అపార్ధం  చేసుకోవటం   సరి  కాదు.

......................................

ప్రాచీన  గ్రంధాలలో  చెప్పబడిన  ఎన్నో  విషయాలు    నిజమేనని   ఆధునిక  పరిశోధనల  ద్వారా  నిరూపించబడ్డాయి. 


ఉదా..  ఎక్కడో  దూరంగా  జరుగుతున్న   భారతయుద్ధాన్ని  గురించి   సంజయుడు  ధృతరాష్ట్రునికి తెలియజేసిన  విషయాన్ని  చదివినప్పుడు    ..  ఇదెలా  సాధ్యం  ? అని  అనుకున్నారు  కొందరు.

 మరి  ఈ  రోజుల్లో   ఇంట్లో  కూర్చొనే  ఎక్కడో  జరుగుతున్న  విషయాలను  టీవీల  ద్వారా  చూస్తూన్నాము  కదా  !


అయితే  ఇక్కడొక  విషయం  ఏమిటంటే,  ప్రాచీనులది  అద్భుతమైన  మానసికశక్తితో ( ఉదా..భగవత్ ధ్యానం,  తపస్సు  మొదలగు  వాటి  ద్వారా...)   తెలుసుకున్న  విజ్ఞానమయితే,  ఆధునికులది  భౌతికమైన  శక్తితో  తెలుసుకున్న  విజ్ఞానం.  రెండింటికి  చాలా  తేడా  ఉన్నది.


.............................................

ఆధునికులు  చెప్పే మూలకణములు  (  స్టెం  సెల్స్ )  గురించి  కూడా ప్రాచీనులకు   తెలుసునని  అనిపిస్తోంది.


 విష్ణుమూర్తి  బొడ్డు నుండి  పద్మం  ద్వారా  బ్రహ్మ జన్మించి   సృష్టిని  చేస్తారు   అంటే.. 

బొడ్డుత్రాడు  నుండీ  వచ్చే  బ్రహ్మ  సృష్టిని  సృష్టిస్తారు. ... బొడ్డుత్రాడు  నుండి  లభించే   మూలకణముల  ద్వారా  కొత్త  సృష్టిని  చేయవచ్చు..  అనే  పోలిక  కనిపిస్తోంది    కదా ! 


  ఇలా   ఎంతో   విజ్ఞానం  ప్రాచీన  గ్రంధాలలో  ఉన్నదనిపిస్తోంది.  

.............................

వ్రాసిన  విషయాలలో    ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Thursday, July 10, 2014

కాశీ , ప్రయాగ.. దర్శించుకుని వచ్చాము..అంతా దైవం దయ.. రెండవ భాగము....


ప్రయాగవద్ద  గంగా  యమున అంతర్వాహిని సరస్వతి  నదులు   కలిసి   త్రివేణీసంగమముగా  పిలుస్తారు.  పడవలో  వెళ్ళి  స్నానం  చేశాము.

 ఇంకా  ప్రయాగలోని  కొన్ని  దేవాలయాలను   దర్శించుకున్నాము.  ప్రయాగలో    అమ్మవారి  శక్తిపీఠం  కూడా  ఉంది.  హనుమాన్  దేవాలయం,  లలితాదేవి  దేవాలయం,  ఇంకా  మరికొన్ని  దేవాలయాలను, అమ్మవారి   శక్తిపీఠాన్ని   దర్శించుకున్నాము.

..................................


  మేము  కాశీలో  విశ్వనాధుని విశాలాక్షీదేవిని అన్నపూర్ణాదేవిని గంగాదేవిని డుంఢి గణపతిని సాక్షి  గణపతిని సుబ్రహ్మణ్యస్వామిని అమ్మవారిని కాలబైరవుని ..ఇంకా  మరికొందరిని  దర్శించుకున్నాము.   దుర్గాదేవినిస్వామిని  కూడా  దర్శించుకున్నాము.  గవ్వలమ్మను ( కౌడీబాయ్ ) దర్శించుకున్నాము.
.............................................


కాశీ  యాత్ర  గురించి,  అక్కడి  విశేషాల  గురించి  ఎందరో  ఎన్నో  విశేషాలను  మనకు  అందించారు.  నేను , సరసభారతి  ఉయ్యూరు  వారి   బ్లాగులో  వ్రాసిన  కాశీ  యాత్ర  గురించి  చదివాను. అందులో  వారు  ఎన్నో  విశేషాలను వివరంగా   అందించారు. 



కాశీలో  కౌడీబాయ్  దేవాలయం  ఉంది  ఈ  గుడి  గురించి  మాత్రం  సరసభారతి  వారి  బ్లాగ్  ద్వారా  నాకు  తెలిసింది.  ఈ  గుడికి  వెళ్ళి , అక్కడ  కొన్ని  గవ్వలు  కొని  పూజారికి  ఇస్తే ,  గవ్వలను  అమ్మవారికి  సమర్పించి  ... గవ్వలు  నీకు  కాశీ  ఫలం  నాకు ... అన్నట్లు  అనిపిస్తారు. కాశీ వెళ్లినవాళ్ళు  ఈ  గుడిని  తప్పక  దర్శించుకోవాలట.  అప్పుడు  కాశీఫలం  దక్కుతుందని  అంటున్నారు. 



ఇంతకుముందే  కాశీకి   వెళ్ళి  కౌడీ  అమ్మవారి  గుడికి  వెళ్ళని  వాళ్ళు  ఎవరైనా  ఉంటే,  కొత్త  సంశయాన్ని  కలిగించానని  నన్ను  తిట్టుకోవద్దు.   భవిష్యత్తులో  కాశీ  వెళ్ళబోయే  వారికి  ఉపయోగపడుతుందని  ఈ  విషయాన్ని  తెలియజేసాను  అంతేనండి.  

..................................


కాశీలో  విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి విశాలాక్షీదేవి ...మొదలగు  వారి  దర్శనాలను  చక్కగా  చేసుకున్నాము.  కాశీఅన్నపూర్ణ  అన్నక్షేత్ర ట్రస్ట్  వారు  అందించిన  అన్నపూర్ణాదేవి  భోజనాన్ని  తృప్తిగా  ఆరగించాము.
....................................

కాశీలో  దుర్గాదేవి  దేవాలయం  కూడా   ఉంది.  మేము  తులసీమానసమందిరం  వద్ద  ఉన్న  దుర్గా దేవి  ఆలయాన్ని  దర్శించుకున్నాము.

 శ్రీ  దేవీ  భాగవతములో  సుదర్శనుడనే  అయోధ్య  రాజును  గురించి   కధ  ఉంది.  సుదర్శనుడు  అమ్మవారి  భక్తుడు.  అతని  భక్తికి  మెచ్చి  అమ్మవారు  ప్రత్యక్షమౌతుంది.  ఆ  సందర్భంగా  సుదర్శనుడికి  ఇంకా  అతని  మామగారైన  సుబాహువుకి  కూడా  అమ్మవారు  వరములను  అనుగ్రహిస్తుంది. 

అంతకుముందు  సుబాహువు  అమ్మవారిని  ప్రార్ధిస్తూ.....  తల్లీ  ! కాశీ  పట్టణం  ఉన్నంతకాలమూ  నీ  రక్షణ  ఉండాలి. నువ్వు  కాపురం  ఉండాలి....అంటూ  ప్రార్ధిస్తారు...

సుబాహుడి  అభ్యర్ధనకు  జగన్మాత  సరే  అంది.  భూమండలం  ఉన్నంతవరకూ  ముక్తిపట్టణం  కాశీలో  తాను  స్థిరనివాసం  ఉంటానంది..

....................................
 కొంతకాలం  క్రిందట  అమరనాధ్ ,  వైష్ణవీదేవి  యాత్రలను ,  ఇప్పుడు  కాశీ,  ప్రయాగ  యాత్రలను  చేసిరావటం  తలుచుకుంటే  ఎంతో  ఆశ్చర్యంగా, ఆనందంగా  ఉంది.

అంతా  దైవం  దయ .


Tuesday, July 8, 2014

కాశీ , ప్రయాగ.. దర్శించుకుని వచ్చాము..అంతా దైవం దయ..

ఓం

కాశీ  , ప్రయాగ.. వెళ్ళి   వచ్చాము.

ప్రయాగలో   స్నానం ,  దైవ  దర్శనం  చక్కగా  జరిగాయి.  


కాశీలో   గంగా  స్నానం  దైవ  దర్శనం ...  చక్కగా  జరిగాయి.

 అంతా  దైవం  దయ.