ఒకసారి నారాయణమహర్షి నారదమహర్షితో ఎన్నో విషయములను చెబుతూ , ఇలా కూడా చెప్పటం జరిగింది ...
జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ, భార్యాపుత్రులు గానీ, జ్ఞాతిమిత్రులు గానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి ....... అనీ,
ఇంకా ఎన్నో విలువైన విషయములను చెప్పటం జరిగింది.
ఇంకా, జగన్మాత గురించి చెబుతూ...........
ఆవిడ జగన్మాత కనక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా ! అని కూడా చెప్పటం జరిగింది.
ఇలా దేవతలు, పెద్దలైన మహర్షులు వంటివారు మనకు ఎన్నో విలువైన విషయములను అందించటం జరిగింది.
.....................................
పెద్దలు తెలియజేసిన విషయాలను గమనిస్తే, మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. నాకు తోచిన కొన్ని ..
పరమాత్మ పరాశక్తికి అందరూ బిడ్డలే.
పుణ్యాత్ముల గురించి దైవం ఎంతగా ఆలోచిస్తారో పాపాత్ములను గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.
పాపాలు చేస్తున్న వారిని దైవం శిక్షించటమంటే , ఆ విధంగా వారిని సక్రమమార్గంలోకి మళ్ళించి , వారికి కూడా పుణ్యాత్ముల వలెనే పరమపదమును అందించటం కొరకే.
( లోకంలో తల్లిదండ్రులు చెడుమార్గంలో వెళ్తున్న తమ పిల్లలను కొద్దిగా శిక్షించి అయినా సరే, మంచిమార్గంలోకి తీసుకువస్తారు కదా ! అలాగన్నమాట. )
.............................
ఈ రోజుల్లో చాలామంది , దైవాన్ని నమ్ముతూ కూడా , పాపపుణ్యాల గురించి తెలిసి కూడా , మనస్సును అదుపులో పెట్టుకోలేక ఎన్నోపాపాలు చేస్తున్నారు కదా !
ఇక , ఇలాంటివారికి దైవభీతి, పాపపుణ్యాల భయం లేకపోతే ఇంకా ఎన్ని పాపాలు చేస్తారో ! లోకాన్ని ఎంతగా పీడిస్తారో కదా ! అనిపిస్తుంది.
వీరు కూడా భయంతో కానీ, భక్తితో కానీ, పూజలు చేయగా చేయగా, ఎప్పటికైనా మంచిదారిలోకి వస్తారు అనిపిస్తుంది. ( కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. )
అప్పటికీ మంచి దారిలోకి రాకపోతే , దైవం తనదైన శైలి ద్వారా, వారిని సక్రమమార్గంలోకి తీసుకురావటం జరుగుతుంది.... అనిపిస్తుంది.
దైవం ఎప్పటికప్పుడు లోకంలో ధర్మమును కాపాడటం జరుగుతుంది.
................................
అచ్చు తప్పులు వంటి పొరపాట్లు లేక ఇతర పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని వేడుకుంటున్నాను.
అంతా దైవం దయ.
No comments:
Post a Comment