కొందరు అధర్మపరులు ప్రపంచపు సొమ్మును దోచి పది తరాలకు సరిపడా దాచుకుంటారు.
అలా ఇతరులకు అన్యాయం చేసిన వారికి ఏం మిగులుతుంది ? శాశ్వత అపకీర్తి , ప్రజలు పెట్టే శాపాలూ తప్ప.
ఇలాంటి అధర్మపరులకు .... చచ్చిన తరువాత కూడా నరకం , నీచమైన పునర్జన్మ తప్పకపోవచ్చు.
( ఎవరైనా మరణించిన తరువాత పూర్వ జన్మలోని కుటుంబంలోనే తిరిగి జన్మిస్తారని గ్యారంటీ ఏమీ లేదు కదా ! మరి పాపాలు చేసి అయినా పది తరాలకు సరిపడా డబ్బును ఎందుకు సంపాదిస్తారో అర్ధం కాదు. )
..............................................
అవినీతిపనులు చేసే వారిని చూస్తే పాపం అనిపిస్తుంది.
ఎందుకంటే , వీళ్ళు అష్టకష్టాలు పడి ఎన్నో పాపపు పనులు చేసి డబ్బు సంపాదిస్తారు.
కానీ , ఆ పాప ఫలితాన్ని ఈ జన్మలోకానీ , వచ్చే జన్మలో కానీ అనుభవించవలసి వస్తే ఎంతో కష్టం కదా !
ఇటువంటి వారు కూడా మంచిమార్గం లోకి వచ్చి భగవంతుని కృపకు పాత్రులు అవాలని కోరుకుందాము.
...................................................
మంచి కర్మకు మంచి ఫలితము.........చెడ్డ కర్మకు చెడ్డ ఫలితము.... లభిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.
కొందరు మంచి వ్యక్తులు తమ పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితంగా వర్తమానంలో కష్టాలను అనుభవిస్తున్నా కూడా .. .. వారు ఈ జన్మలో ఆచరించే మంచిపనుల యొక్క ఫలితాలు ఎక్కడికీ పోవు . మంచి ఫలితాలనూ తప్పక పొందుతారు.
No comments:
Post a Comment