* యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః ! భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః !!
వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !
చంద్రునికి స్వయంప్రకాశత్వం లేదని చంద్రుని వెన్నెలకు కారణం సూర్యరశ్మి చంద్రునిపై ప్రసరించటం అని.... పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్నాము.
పై విషయాలను గమనించితే, ఆధునిక విజ్ఞానం కంటే ముందే ప్రాచీనులకు ఈ విషయాల గురించి చక్కగా తెలుసని తెలుస్తోంది.
.....................................
ఆవుపాలను కొన్ని నెలలు నిలువ ఉండేలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దేవాలయాలలో అభిషేకాలు వంటి సందర్భాలలో కొందరు ప్రజలు ఈ ఆవుపాల పేకెట్ కొని తెచ్చి అభిషేకం చేస్తుంటారు.
అయితే ఇలా పాలను నిలువ ఉంచాలంటే కొన్ని రసాయనాలను కలుపుతారేమోనని నాకు అనుమానం. ఇలాంటి నిలువ చేసిన పాలను అభిషేకాలకు వాడటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో ?
ఉదా...ఆ మధ్య కొన్ని శివలింగముల ఆకారాలలో మార్పులు రావటాన్ని గురించిన వార్తలు వచ్చాయి కదా ! ఇలా మార్పులు రావటానికి అభిషేకాలు కూడా ఒక కారణమని అంటున్నారు.
తాజా ఆవుపాలు సరిగ్గా లభించకపోవటం వల్ల ప్రజలు ఇలా నెలలతరబడి నిలువ చేసిన పాలను వాడుతున్నారు.
సాధ్యమయినంతవరకు అభిషేకాలకు రసాయనాలు కలుపని పాలను వాడితే మంచిది. పాలతో పాయసం వంటివి చేసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే ఆరోగ్యానికి మంచిదనిపిస్తోంది.

No comments:
Post a Comment