అనగనగా..పూర్వం ఒకానొక కాలంలో ఒక పొలం మధ్య నిలబడి ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నారట. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఆ పొలాన్ని కొన్న వ్యక్తి. రెండవ వ్యక్తి పొలాన్ని అమ్మిన వ్యక్తి.
విషయమేమిటంటే కొత్తగా పొలాన్ని కొన్న వ్యక్తి పొలాన్ని తవ్వుతుంటే నేలలో వజ్రాలు, బంగారంతో నిండిన లంకెల బిందెలు దొరికాయి. వెంటనే పరిగెత్తికెళ్ళి పొలం యొక్క పాత ఓనరును పిలుచుకు వచ్చి బిందెలను తీసుకోమన్నాడు.
లంకెల బిందెలను తీసుకోవటానికి పాత ఓనరు సమ్మతించటంలేదు. పాత ఓనర్ ఏమంటాడంటే నేను పొలాన్ని నీకు అమ్మిన తరువాత దొరికాయి కాబట్టి ఆ సంపద పొలాన్ని కొన్న నీకే చెందాలి అని అంటున్నాడు.
నేను నీ దగ్గర పొలాన్ని కొన్నాను గానీ పొలం క్రింద ఉన్న సంపదను కొనలేదు కాబట్టి ఆ సంపద పూర్వపు యజమానివైన నీకే చెందుతుందని కొత్త యజమాని వాదన.
పూర్వం ఇంతటి ధర్మాత్ములు ఉండేవారు.
......................
ఈ రోజుల్లో స్వంత లాభం కోసం ఎంతకైనా దిగజారే స్థాయి పరిస్తితులు పెరుగుతున్నాయనిపిస్తోంది.
అడ్దదార్లలో డబ్బు సంపాదిస్తున్నారు. సమాజాన్ని దోచుకుంటున్నారు. ఇతరుల కడుపు కొట్టి తాము బ్రతుకుతున్నారు.
డబ్బు కోసం, అధికారం కోసం సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు. వీరందరూ బాగుపడతారా ?
.....................
ఇలాంటి సమాజంలో న్యాయం చెప్పవలసిన పెద్దవాళ్ళకు కొన్నిసార్లు విపరీతమైన వత్తిడులు ఎదురయ్యే అవకాశముంది.
తీర్పు చెప్పే న్యాయమూర్తులకు తనవారు,పరాయివారు అనే పక్షపాతం ,బంధు ప్రీతి మొదలైనవి... ఉండకూడదు. ధర్మానికి అనుగుణంగా మాత్రమే తీర్పులను వెలువరించవలసి ఉంటుంది.
తమకు అనుగుణంగా తీర్పును ఇవ్వమని కొందరు క్లయింట్స్ బ్రతిమలాడుతారు. తమకు అనుగుణంగా తీర్పును ఇచ్చి తీరవలసిందేనని కొందరు క్లయింట్స్ బెదిరిస్తారు.
న్యాయాన్ని చెప్పే పెద్దవాళ్ళు ఒత్తిళ్ళకు, బెదిరింపులకు, బ్రతిమలాటలకు, ప్రలోభాలకు.. లొంగకుండా నిష్పక్షపాతంగా తీర్పులను ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే, తాము ఇచ్చే తీర్పుల ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది.
ఒకవేళ భవిష్యత్తులో మరిన్ని గొడవలు, ఉద్యమాలు వస్తే ముందటి తీర్పులను పరిశీలిస్తారు కాబట్టి. సమాజాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ధర్మబద్ధమైన తీర్పులను ప్రకటించినప్పుడే సమాజం సజావుగా కొనసాగుతుంది.
తమకు అనుగుణంగా తీర్పును ఇచ్చి తీరవలసిందేనని కొందరు క్లయింట్స్ బెదిరిస్తారు. >>>>
ReplyDeleteఇంతకంటే చాలా ఉన్నాయండి.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరన్నది నిజమే.
ReplyDelete