koodali

Tuesday, October 29, 2013

సామాన్యుల కన్నా మేధావులనబడే వారి వల్లే ......

ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
..................................

  కొంతమంది  ఇళ్ళు  ఎలా  కడతారంటే,  వారి  మొదటి  అంతస్తు  నీళ్ళు  బయటకు  పోవాలంటే  పైపులు  నిర్మించరు.

  మొదటి  అంతస్తు  బాల్కనీ  కడిగిన  నీరు  అంతెత్తు  నుంచి  సరాసరి  రోడ్డు  మీదకు  పడుతుంటుంది.  

రోడ్డు  మీద  వెళ్ళే  మనుషుల  మీద  కూడా  ఆ   మురికి  నీరు  పడుతుంది. అలా  చిందకుండా  పైనుంచి  పైపులు  ఏర్పాటుచేయాలనే  కామన్ సెన్స్  కూడా  చాలా  మందికి  ఉండదు.

ఇవన్నీ  గమనించే  మన  పూర్వీకులు  ప్రతి  చిన్నవిషయాన్ని  జాగ్రత్తగా  గమనించి  పద్ధతులను  ఏర్పరిచారు.  అందుకే  పూర్వం  ప్రపంచములో   ఇంత    మురికి   ఉండేది  కాదు.

...................................

  సామాన్యులు  వల్ల  జరుగుతున్న   మురికిని   చూసి  కొందరు  మేధావులు  ఏమంటారంటే  ,  ఎక్కువగా  చదువుకోని  సామాన్యుల  వల్లే  ప్రపంచం  మురికిగా  అయిపోతోంది.  అంటుంటారు.


అయితే,  నాకు  ఏమనిపిస్తుందంటే,  సామాన్యులు  చేసే  మురికిని   శుభ్రం  చేస్తే  పోతుంది.  ఆధునిక  విజ్ఞానం  వల్ల  జరుగుతున్న  పర్యావరణ  కాలుష్యం  ఏవిధంగా  పోతుంది?  


మేధావులు  అనబడే  వారు  కనుగొన్న  ప్లాస్టిక్  వంటి  వాటివల్ల  కూడా   ప్రపంచము   పొల్యూట్  అయిపోతోంది.  


ఆధునిక  విజ్ఞానం  అందించిన  కొన్ని  ఆవిష్కరణల  వల్ల  ప్రపంచములో  జీవరాసుల  ఉనికికే  ప్రమాదం  జరిగేంతగా  పొల్యూషన్  పెరుగుతోంది.  


ప్లాస్టిక్,   ఎలెక్ట్రానిక్  వ్యర్ధాలు,  అణు  వ్యర్ధాలు,  వాతావరణం  లోకి  విడుదలయ్యే  విషపూరిత  వాయువులు,  రసాయనాల  వల్ల  ప్రపంచానికి  ఎంతో  నష్టం  జరుగుతోంది. 


ఇవన్నీ  గమనిస్తే ,   సామాన్యుల  కన్నా  ఆధునిక  చదువులు  చదువుకున్న  వారి  వల్లే  ప్రపంచం  ఎక్కువ  మురికి  అవుతోంది ,  ప్రపంచానికి  ఎక్కువ  హాని  జరుగుతోంది...... అని  చెప్పక  తప్పదు. 


అందుకే,   పర్యావరణానికి  హానిని  కలిగించే  ఆవిష్కరణలను  ప్రపంచానికి  అందించవద్దు  మహా ప్రభో  ....అని  వేడుకుంటున్నాము





4 comments:

  1. యదార్ధ వాదీ లోక....

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, మీరన్నట్లు,

      ..యదార్ధ వాదీ లోక విరోధీ అనే సామెత చాలా వరకూ యదార్ధమే.

      Delete
  2. అన్నయ్య, మీరు అన్నది బాగున్నది

    కాని
    ఈ బద్దకపు ప్రంపంచానికి, జనాలకి అవే కావలి
    అమెరికా వాదు వడేవన్నీ కావాలి మన జనాలకి

    ReplyDelete

  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరన్నట్లు, జనాలకు బద్ధకం ఎక్కువయ్యింది.

    కొందరు చిత్రమయిన జనాలయితే శారీరిక శ్రమ కోసం జిమ్ములకు వెళ్తారు కానీ , సొంతపనులు కూడా స్వయంగా చేసుకోరు.

    ReplyDelete