నా ప్రక్క సీటులో ఒక నడి వయస్సు ఆమె కూర్చున్నది. మనిషి చదువుకున్న ఆమెలాగే ఉంది. చక్కటి దుస్తులు కూడా వేసుకుంది.
ఆమెకు జలుబు చేసినట్లుంది. పదేపదే ముక్కు చీదుతోంది. అలా చీదుతూ వచ్చిన పడిశాన్ని బస్సుకు రాసేస్తోంది.
ప్రక్క నుంచి ఇదంతా గమనిస్తున్న నాకు చాలా కోపం వచ్చింది.
పడిశాన్ని బస్సుకు రాయటమేమిటి ?
మన ప్రజలెందుకు ఇలా అశుభ్రంగా తయారయ్యారు ? అని నాకు చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది.
ఇక ఉండబట్టలేక .....
పడిశాన్ని బస్సుకు ఎందుకు రాస్తున్నారు ? మీ దుస్తులకు రాసుకోవచ్చు కదా ! ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. అని చెప్పి బస్సు దిగి వచ్చేశాను.
ఇలాంటి ప్రజలను చూస్తుంటే .... దేశం ఎప్పటికి బాగుపడుతుందో ? అని విరక్తి వస్తోంది.
ఫరవాలేదు దేశానికేం కాదు కాని మీరు బాస్ దిగే ముందని దిగిపోయారు, బస్ లో ఉండగా అని ఉంటే.... :)
ReplyDelete
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
స్టాప్ వచ్చేసరికి నేను దిగాను.
బస్ లో ఉండగా అంటే మాత్రం తప్పేముంది లెండి.