koodali

Monday, October 21, 2013

ఉమ్మడి రాజధాని...........

 
 ఒక  విషయం  గురించి  తీర్పు  చెప్పే  న్యాయమూర్తి  ప్రాంతీయ  అభిమానం,  బంధుప్రీతి  ఇలాంటివి  ప్రక్కన  పెట్టి   తీర్పును  ఇవ్వవలసి  ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్  విషయంలో  తెలంగాణా .... సీమాంధ్ర  అనే  భావనలను  ప్రక్కన  పెట్టి  ఆలోచిస్తే   ఎన్నో  సందేహాలు  వస్తాయి.

...............................................


రాష్ట్రాన్ని  విభజించాలి  అని  కొందరు  అంటున్నారు.   అయితే   ఏ  ప్రాతిపదికన   విభజిస్తారో    తెలియటం  లేదు.

 ఆంధ్రప్రదేశ్  భాషాప్రయుక్త  రాష్ట్రాల  ప్రాతిపదికన  ఏర్పడింది. మరి  ఇప్పుడు   ఏ ప్రాతిపదికన  క్రొత్త  రాష్ట్రాన్ని  ఏర్పాటు  చేస్తారు  ?

 
..............................................


  సీమాంధ్రలో    మూడుప్రాంతాలు  ఉన్నాయంటున్నారు. 


ఒకవేళ  రాష్ట్రం  విభజన  జరుగుతుంది.  అనుకుంటే   భవిష్యత్తులో   మళ్ళీ  విభజన ఉద్యమాలు   రావని  ఎవరైనా   గ్యారంటీ  ఇవ్వగలరా  ? 

ప్రజల    సమస్యలను    ఎక్కడివి  అక్కడే  ఉంచి   విభజన,  సమైక్యం  అంటూ   పదేపదే  ఉద్యమాలు  చేసే  ఓపిక  ప్రజలకు  లేదు. 


 చిన్న  రాష్ట్రాల  వల్ల  దేశం  అభివృద్ధి  బాటలో  పరుగులు  తీయటం  ఖాయం...  అంటూ  జనాన్ని  నమ్మిస్తున్న  పార్టీల  వారు  ఇప్పుడే  ఆంధ్రప్రదేశ్  ను   నాలుగు  లేక  అయిదు  రాష్ట్రాలుగా  విభజించటానికి  ఒప్పుకుంటారా  ?

...................................


సీమాంధ్ర  ఏర్పడితే  మా  ప్రాంతంలోనే   రాజధానిని  ఏర్పాటు  చేయాలి ... అని  కొందరు   సీమాంధ్ర వాళ్ళు  పోటీలు  పడుతున్నారు.

(  రాజధాని  ఏర్పడితే  తమ  ప్రాంతం  అభివృద్ధి  చెందుతుందని  ఇలా  పోటీలు  పడుతున్నారు.  )

......................................

దాదాపుగా  ఒంటరి  వాళ్ళయిన  సీమాంధ్రులు.
 
ఏ  విషయంలోనూ  ఏకాభిప్రాయం  కలవని  జాతీయపార్టీలు    సీమాంధ్ర  ప్రజల  అభిప్రాయానికి  వ్యతిరేకంగా   మాత్రం   ఒక్కతాటి  మీద  నిలబడటం  బాధాకరం.

(  సి.పి.యం  వాళ్ళు  మాత్రం  మొదటి  నుంచి  భాషాప్రయుక్త  రాష్ట్ర  వాదానికే  కట్టుబడ్డారు.)


చాలా  రాజకీయ  పార్టీల  వారు  తెలంగాణా  గురించి  లేఖలు  ఇచ్చారు  కాబట్టే  విభజన  చేయవలసి  వస్తోంది  అంటున్నారు. 


 విభజన  లేఖలు  ఇచ్చిన   పార్టీలు  ఉమ్మడి  రాజధానితో  సహా    తెలంగాణా  ఇవ్వాలని  కూడా  లేఖలలో  రాశారా  ? 
 
ఏ  ప్రాతిపదిక  లేకుండా  రాష్ట్రాలను  విభజిస్తే  భవిష్యత్తులో  అడిగిన    ప్రతి  ఒక్కరికీ    రాష్ట్రాలను  విభజించి   ఇస్తారా  ?  ఇలా  ఎన్నో  ప్రశ్నలు  మొదలవుతాయి.

 ....................................

సీమాంధ్ర  వాళ్ళను    దోపిడీదారులు,  స్వార్ధపరులు     అనటం  దారుణం.

తెలంగాణాలో వెనుకబడిన  ప్రాంతాలు  ఉన్నట్లే   రాయలసీమ  ,  ఉత్తరాంధ్ర,  కోస్తాలలో  కూడా     చాలా    ప్రాంతాలు   అభివృద్ధికి    దూరంగా  వెనుకబడి  ఉన్నాయి.   


సీమాంధ్ర   ప్రజలు    చాలామంది   పేదరికం   వల్ల    ఎన్నో  బాధలు  పడుతున్నారు.  ఇలాంటి  ప్రజలను  దోపిడీదారులు ,  స్వార్ధపరులు   అనటం  ఏం  న్యాయం  ? 


 అన్ని  ప్రాంతాలకూ  చెందిన   కొందరు  పెట్టుబడిదారులు    వందలకోట్ల  సొమ్మును  పోగేస్తున్నారు. వీళ్ళను  దోపిడీదారులు  అనవచ్చు.  


అంతేకానీ   సీమాంధ్రకు  చెందిన  అందరిని  దోపిడీదారులు  అనటం    అన్యాయం.

సీమాంధ్ర  వాళ్ళు  దోచుకునే  వారు,  స్వార్ధపరులు   అయితే  హైదరాబాదులోనే   వరుసగా  ఎన్నో  కేంద్ర   ప్రభుత్వ  సంస్థలను  ఏర్పాటు  చేస్తుంటే   చూస్తూ  ఊరుకోరు  కదా  !

  సీమాంధ్రులు   స్వార్ధపరులు   అయితే   ఇతర  ప్రాంతంలో  రాజధానిని  ఏర్పాటు  చేయనిస్తారా  ? 


 సీమాంధ్రులు   తమ  ప్రాంతాలను  ఎక్కువగా   అభివృద్ధి  చేసుకోకుండా   ఉమ్మడి  రాజధాని  అయిన    హైదరాబాద్  అభివృద్ధికే  ప్రాముఖ్యత  ఇచ్చారు. 


  సీమాంధ్రులు స్వార్ధపరులు   అయితే  తమ  ప్రాంతాలు  మాత్రమే  అభివృద్ధి  చేసుకునేవారు  కదా  ! 


 అన్ని  ప్రాంతాలకు  చెందిన  తెలుగువాళ్ళు   ఉపాధికోసం  ఇతర  దేశాలకు  కూడా  వెళ్తున్నారు.


 ఒకే  భాష  మాట్లాడే  వాళ్ళు  ఉపాధికోసం  రాజధానికి  వస్తే  తప్పు  అంటున్నారు.   ఇలా  మాట్లాడే  వాళ్ళు    ఉపాధి  కోసం  ఇతర  దేశాలకు  వెళ్ళటం,  తమ  పిల్లలను  ఇతరదేశాలకు  పంపటం  మానేస్తారా  ?


27 comments:

  1. 'ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రాల'
    Good,
    mee yaasa maadi kaadu,
    mee customs (pelliki munde reception chesi aa taruvatha pelli chesukunedi ) maa aacharam kaadu
    mee systems maavi kaavu
    mee literature maadi kaadu
    mee tastes maavi kaavu
    mee vantalu maavi kaavu

    ...

    aithe ekkada common undi?

    ReplyDelete
    Replies


    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు మీ యాస, మీ భాష అంటున్నారు. నేను సీమాంధ్రకో తెలంగాణాకో చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదు. అందరు తెలుగువాళ్ళకు చెందిన వ్యక్తిగా ఈ సమస్య గురించి వ్రాస్తున్నాను.

      తెలుగు వారు తమ మధ్య సమస్యలు ఉంటే చర్చించుకోవాలి గానీ ఒకరినొకరు ద్వేషించే పరిస్థితి పోవాలన్నది నా అభిప్రాయం.

      అదే సమయంలో మన కోరికల వల్ల, మన మధ్య పంతాలు, పట్టుదలల వల్ల దేశ సమగ్రతకు హాని జరగకూడదు కదా !

      ఇక భాషాప్రయుక్త రాష్ట్రాల విషయాన్ని చూద్దాము...

      ఈ దేశంలో ఉన్న ప్రధాన భాషల ఆధారంగా భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది.

      ఒకే భాషకు చెందిన ప్రాంతాల మధ్య కూడా యాసలో తేడాలు ఉంటాయి. ఒకే భాషకు చెందిన కులాల మధ్య కూడా యాసలో , ఆచారాలలో కొద్దిగా తేడాలు ఉంటాయి.

      అలాగని యాసను బట్టి , కులాలను బట్టి కూడా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే వేల సంఖ్యలో రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. అది కుదరని పని. ఉన్నంతలో ప్రధాన భాషలను బట్టి రాష్ట్రాలను ఏర్పాటు చేసారు.

      Delete
  2. ...
    ikkada pettubadi petti
    profits teesukuni,
    mee vaallu evaranna profits lekunda pettubadi petti
    evadikanna ichchara? e social service chesaada?

    ReplyDelete
    Replies

    1. ఈ రోజుల్లో మనవాళ్ళు విదేశాలకు వెళ్ళి మరీ .... మా ప్రాంతానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని వ్యాపారం చేయమని విదేశీయులను అడుగుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు భూములను ఇస్తున్నారు.

      సాటి సీమాంధ్ర పెట్టుబడిదారులు రాజధానిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే మాత్రం దోపిడీదారులు అంటూన్నారు. ఇదెక్కడి న్యాయమండి ?

      Delete
    2. ikkada pettubadi petti
      profits teesukuni,
      ---------------------------------------
      చాలా సార్లు వింటున్నానీ మాట. యెక్కడికి తీసుకు పోతున్నారు? యే యేటి లాభాల్ని ఆ యేడు ఇంతికి తీసుకు పోతాడా యెవదయినా? రేపు మీరు అలాగే చేస్తారేమో! కానీ ఒక యేడు వచ్చిన లాభాన్ని మళ్ళీ పెట్టుబడికి ఉపయోగించుకోగలిగితేనే ఆ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ నడుస్తూ ఉంటుంది. మీరూ పెట్తుబడులు పెడితే మీకూ లాభాలు వస్తాయిగా.వాళ్ళు సోషల్ సర్వీస్ చేసారా అంటే రేపు విడిపోయాక మీరు చెస్తారా? రాష్త్రమంతటికీ రాజధాని అనుకుని చేసింది మీకు తప్పుగా అనిపిస్తే యమి చెప్పగలం. ప్రతి వ్యాపారానికీ పరిశ్రమకీ పెట్తుబడి పెట్తిన వాడికి మాత్రమే లాభం రాదు. పెరిగే ఉపాధి అవకాశాల్ని వినియోగించుకునేవాళ్ళు కూడా లాభ పడతారు. ఇవ్వాళ పెట్టుబదులు పెట్టే చొరవ లేదు, అవకాశాల్ని ఉపయోగించుకునే తెలివి లేదు కానీ - విడగొట్టి ఇస్తే చాలు రేపేదో ఉధ్ధరిస్తామనే కబుర్లు మాత్రం జాస్తి.

      Delete
    3. బయటోడు వ్యాపారం చేస్తాడు, సీమాంద్రుడు వ్యాపారం పేరుతొ భూముల, వనరుల దోపిడీ కూడా చేస్తాడు.

      Delete
  3. dda ddanakha dan....veyyandi yellakaalam kaangiresukey votu veyyandi chimpi chaapanta chesi istaaru mee raashtraanni :)

    ReplyDelete
  4. మీరు చెప్పినది నూటికి నూరు శాతం వాస్తవమే.
    పెట్టుబడులు పెట్టి అభివృధ్దికి మేమూ సహకరిస్తామంటూ, సహకరిస్తూ ముందుకు సాగుతుంటే దోపిడీ దారులు అంటున్నారు.
    యాస/భాష/ సంస్కృతి అంటున్నారు. ఎవరికి లేవు సాంస్కృతిక అంశాలు? ఉత్తరాంధ్రవారిది ప్రత్యేక యాసకాదా? ప్రకాశం వారిది ప్రత్యేక యాస కాదా? మన్యసీమను కోరుతున్నది ప్రత్యేక మన్య సంస్కృతి కాదా?

    కేవలం రాజకీయ నాయకులు ఆడే వింత చదరంలో మనం పావులుగా ఇరుక్కుని ఎదుటి రాజును, మంత్రిని, ఇతర పావులను మన శత్రువులుగా భావిస్తున్నాము. నిజానికి మనమందరమూ పావులని మనం గ్రహించేది ఎన్నటికి.
    పోనివ్వండి. ఈ రాజకీయ నాయకులు ఉన్నంతవరకూ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనదేశం మిగిలిపోతుంది. సమస్యలు తీరితే మనవైపు ప్రజలు చూడరనుకుని సమస్యలను సృష్టించేవారు ఉన్నంతవరకూ, గుడ్డిగా వారిని గెలిపిస్తున్నంతవరకూ మన మరో మరో మరో సమస్యతో సతమం కావల్సిందే. మీ
    చైతన్య కుమార్‌
    నవచైతన్య కాంపిటీషన్స్ www.menavachaitanyam.blogspot.com

    ReplyDelete
    Replies
    1. అసలు విషయాలు వదిలి ఇలా కొసరు విషయాలు పట్టుకు వేలాడితే విషయం ఎప్పుడూ అసంభద్దంగానే ఉంటుంది చైతన్య కుమార్‌, నవచైతన్య కాంపిటీషన్స్ గారు.

      Delete
  5. యే ఉద్యొగాలు దోచుకున్నారని ఇవ్వాళ యేడుస్తున్నారో ఆ ఉద్యోగాలకి సంబంధించిన జోనల్ సిస్టం మీద - దీని వల్ల చాలా ఇరకాతంగా ఉంది, దాన్ని యెత్తి పారెయ్యాలి, డాం డూం అని - విరుచుకు పడిన ఆనాటి మేధావి ఇవ్వాళ నాలిక మడత పెట్టి మాట్లాదతం వల్ల ఉద్యమ నేతగా చెలామణి అవుతున్నాడు.

    తొమ్మిదేళ్ళుగా నానా రకాలుగా ఉద్యమాలు చేసి కూడా ఉద్యమంలో ఉన్న న్యాయబధ్ధత వల్ల గాక, ఉద్యమబలం వల్ల కాక రాష్ట్రం ఇస్తే తెరాసని కాంగ్రెసులో కలుపుతాననే చవకబారు వాగుదానం వల్ల వస్తున్నది, అది గుర్తుంచుకోండి.ఇవ్వాళ దాన్ని ఆ పార్టీలోని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మరి కాంగ్రెసుకి ఇచ్చిన మాటని తప్పి చెరువుదానం కూడా పూర్తి చేస్తాడేమో చూడాలి.

    వాళ్ళు మాకు జరిగినయ్యని చెప్తున్న అన్ని అన్యాయాలకీ కారణమయిన ఆ పార్టీకే ఇలాంటి లత్తుకోరు హామీ లిచ్చి సాధించుకున్న దాని గురించి అంత విరగబడుతున్నారెందుకో తెలియట్లేదు!

    ReplyDelete
    Replies
    1. ఎదో ఒక రకంగా తెలంగాణా రాష్ట్రం వస్తుంది, తెలంగాణా వారికి సీమండ్రుల పీడ విరగడవుతుంది. అన్యాయానికి కారణం సీమండ్రులు, అంతే కాని కాంగ్రేసు ఒక్కటే కాదు.

      Delete
  6. ఈ రోజు సీమాంధ్ర ప్రతినిధులకి రాష్ట్రపతి గారు అపాయింట్మెంటు ఇచ్చాట్ట.దానితో యేదో విరగబడిపోతుందని అతిగా ఆశ పడటానికి వీల్లేదు.ఒకప్పుడు 42 స్థానాలకి 41 అచ్చుపోసి జనం ఇచ్చినప్పుడే ఇవ్వాళ సొంత రాష్ట్రంలో దిక్క్కులేని దిగంబరం స్థాయిలో నైనా చక్రం తిప్పలేని ఈ నంగి వెధవలు ఇవ్వాళ యేమి ఊడబొడుస్తారు? కాంగ్రెసు అధిష్టానం దగ్గిర కాంగ్రెసు వాళ్ళ కన్నా(విభజనని సమ్ర్ధించే వాళ్ళయినా వ్యతిరేకించే వాళ్ళయినా) కచరాకే యెక్కువ మాత చెల్లుబడి ఉన్న స్థితిలో ఇలాంటి పనుల వల్ల ఉపయోగం ఈషణ్మాత్రమయినా ఉండదు.

    ఇప్పుడున్న స్థితిలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగిన కీలకమయిన స్థానంలో భాజపా ఉంది. కానీ వాళ్ళు చిన్న రాష్ట్రాలనే తమ నినాదానికి అనుకూలంగా ఉందని సూత్రప్రాయంగా సమర్ధిస్తూ వస్తున్నారు. కానీ ఈనాడు జరుగుతున్న విభజన వారి వాదన కనుకూలంగా రాజ్యాంగం అనుమతించిన ఫెదరల్ స్పూర్తికి సంబంధించిన న్యాయమయిన వ్యవహారంలా జరగడం లేదు. రాష్ట్రాన్ని యెందుకు విడగొడుతున్న్నారనే ప్రశ్నకి కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి స్వయంగా రాష్ట్రాన్ని విదగొట్తి ఇస్తే తెరాసని కాంగ్రెసులో విలీనం చేస్తాననే వగుదానం కారణమని చెప్పడం రహస్యంగా జరగలేదుగా.అంత బహిరంగంగా కాంగ్రెసుకి రాజకీయంగా లాభం కలిగించదానికి జరుగుతున్న ఒంటెత్తు పోకడని సమ్ర్ధంచాల్సిన అవసరం భాజపా కేమిటి?. నిలువెల్ల యేమాత్రం సిగ్గుపడనంతటి అవినీతితో కుళ్ళిపోయి ప్రజాభిమానాన్ని కోల్పోయి సరయిన పధ్ధతిలో దేశం మొత్తం మీద 100 సీట్లు కూడా సాధించుకోలేకపోయినా దొడ్డిదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న వికృతమయిన కర్మకాండ మాత్రమే ననేది వాళ్ళు తెలుసుకుంటే ఆ అపాయింటుతో వాళ్ళని విభజనని అడ్దుకునేందుకు ఒప్పించగలిగితేనే రాష్ట్రం విడిపోకుండా ఉంటుంది.

    కికురె వల్ల గాని అశోకం బాబు వల్ల కానీ యే అద్భుతాలూ జరగవు. రేపటి యెన్నికల్లో ఒకప్పుడు తెరాస మరోసారి చిరంజీవీ చేసినట్టు తెదేపా వోట్లకి గండికొట్టే శిఖండి పాత్రనే అతడు నిర్వహించగలడు.జగన్ పాత్ర కూడా అంతే. సరిగ్గా ఈ సమయానికే అతన్ని బయటికి తీసుకు రావతం, కికురెని సమైక్య వాదిగా జనం ముందు నిలబెట్టటం, అశోకాన్ని ముందుకు తీసుకు రావటం వీటన్నిటినీ విడివిడి సంఘతనలుగా చూడకుండా ఉంటే వాటన్నింటి వెనకా కాంగ్రెసు వ్యూహం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది.

    భాజపా ఇంకా సూత్రప్రాయపు సుత్తికే కట్టుబడి ఉన్నందువల్ల ఆ పార్టీకి జరిగే మేలు యేదీ లేదు. 2014లో ఆ పార్టీ కేంద్రంలో జండా యెగరెయ్యాలంటే రాష్త్రం విడిపోవటం వల్ల నష్టమే యెక్కువ. యెందుకంటే విభజనని సమర్ధించి రాష్ట్రం విడిపోవటానికి కారణమయిన వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఒక్క సీటు కూడా నెగ్గలేరు. కొత్తగా యేర్పడిన తెలంగాణా రాష్ట్రంలో తెరాస, కాంగ్రెసుల మధ్యన దూరితే యెంత గిట్టుబాటవుందో తెలియదు. క్రితం సారి కూడా ఇప్పటి లాగే కొద్దిలోనే వాళ్ళకి కేంద్రంలో అధికారం చేజారిపోయింది వాళ్ళకి. అప్పుడు రాజకీయంగా ఇమేజి కూడా సరిగ్గ లేదు. ఇప్పుడు ఆ ప్రతికూలతలు లేవు. కానీ యే ఒక్క సీటునీ నిర్లక్ష్యం చెయ్యకుండా ఉండాలంటే వాళ్ళు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారానే అది వీలవుతుంది. ఒకాప్పుడు రాష్ట్రంలో వాళ్ళు యే మాత్రమయినా పట్టు సాధించగలిగారంటే అది తెదెపా సాయం వల్లనే కదా. తెదెపా తన సొంత తప్పులకి నష్టపోయినా భాజపా తెలివిగా తను మాత్రం నష్తపోకుండా నిలబడగలిగినా ఇప్పటి పరిస్థితిలో ఈ సమయానికి తగ్గట్టుగా తెలివిగా వ్యవహరించక పొతే ఆ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావత్టం అంత తేలిక కాదు. అసెంబ్లీకి పంపించేది కేవలం ముసాయిదా అనీ ఇక్కడ వోటింగు జరగదని నాకు ముందునుంచే తెలుసు. అయినా ఇక్కడ వోటింగులో వోడిద్దాం అని నమ్మబలికి సభ్యుల్ని రాజీనామలకి వ్యతిరేకంగా ఉంచడం తప్ప కికురె ఊడబొడిచిందేమిటి? కీలకమయిన వోటింగు పార్లమేంటులోనే వుంటుంది. అక్కడ విభజనని వోటింగులో వోడించతం కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని పదగొట్టం కానీ భాజపా తెదేపాలు రెండూ ఒక్కటిగా ప్రయత్నించదం వల్లనే సాధ్య పడుతుంది.

    ReplyDelete
    Replies
    1. మానసికంగా ఏనాడో విడిపోయిన తెలంగాణాను భౌగోళికంగా కలిపి ఉంచితే ఏమి లాభం, రోజు కొట్టుకు చావటం తప్పా? అలాంటప్పుడు విభజనను ఎందుకు ఆపటం?

      Delete
    2. ప్రజలెప్పుడూ విడిపోలేదు. ఇదివరకు జరిగిన ఉద్యమాలన్నీ కాంగ్రెసు వాళ్ళ వాళ్ళ్ అంతర్గత కుమ్ములాటల కోసం రెచ్చగొడితే వొచ్చినవి. ఆ కాస్త అవసరం తీరిపోగానే ప్రజలు మళ్ళె వాళ్ళకి వ్యతిరేకంగా వోటు చెయ్యటం వల్లనె ఆ పార్టీల్ని రద్దు చేసి పారేసారు. ఈ సారీ భాజపాకి నేను నష్టపోయి కాంగ్రెసుకి యెందుకు లాభం చెయ్యాలనే తెలివి పుడితే మళ్ళీ తెలంగాణా పని - ఇంతే సంగతులు చిత్తగించవలెను - అవుతుతుంది :-)

      Delete
    3. ప్రజలెప్పుడూ విడిపోలేదు.

      కాంగ్రేసు, బజాపాలు వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎదో ఒక నిర్ణయం తీసుకోని ఉండొచ్చు, పరిస్తితులు బాలేకపోతే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాకపోవచ్చు. అంత మాత్రాన తెలంగాణా సమస్యే లేదు అంటే ముంతలో తల పెట్టిన పిల్లి లాంటి పరిస్తితి.

      ఇన్నాళ్ళు అసలు సమస్యే లేదు, అంతా రాజకీయ నాయకులు సృష్టించినది అని సీమంద్రులు భావించి సమస్యను పట్టించుకోకపోవటం వల్లేనే ఈ పరిస్తితి దాపురించింది. ఇంకా అదే భావనలో ఉందాము అనుకుంటే ఎవరి ఇష్టం వారిది. ఎవ్వ్వారు బాగు పరచలేరు. సమైక్య ఉద్యమం కూడా అక్కడి రాజకీయ నాయకులే చేయిస్తున్నారు అని తెలంగాణా ప్రజలు కూడా మిలానే ఆలోచిస్తారు. చివరగా నష్టపోయేది సీమంద్ర ప్రజలే. ఎవరి కర్మకు ఎవరు భాద్యులు?

      Delete
  7. hariSbabu గారికి, Chaitanya Kumar గారికి, మరియు అజ్ఞాతలు ... వ్యాఖ్యానించినందుకు అందరికి కృతజ్ఞతలండి.

    ReplyDelete
  8. ఒకప్పుడు విదేశీయులు వ్యాపారం పేరుతో వచ్చారు. భారతీయులు తమలో తాము గొడవలు పడి దేశాన్ని విదేశీయుల చేతికి అప్పగించారు. వచ్చిన విదేశీయులు భారతదేశపు ఎంతో సంపదను తరలించుకుపోయారు.

    ఎందరో అమరవీరుల త్యాగంతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అయినా మనకు బుద్ధి రాలేదు. ఇప్పటికి మనలో మనం గొడవలు పడటాన్ని మానుకోవటం లేదు. చివరగా నష్టపోయేది ప్రజలే. ఎవరి కర్మకు ఎవరు భాద్యులు?

    ఇప్పుడు కొందరు స్వదేశీయులు కూడా దేశాన్ని కొల్లగొట్టి సంపదను తరలించుకుపోయి విదేశాల్లో దాచుకుంటున్నారు.

    అధికారంలో ఉన్నవాళ్ళకు తమ అధికారం నిలుపుకోవటానికి , ఇంకా తమ పార్టీలలోని అసంతృప్తిపరులను బుజ్జగించటానికి .... చేసే ప్రయత్నాలతోనే కాలం గడిచిపోతుంది.

    అధికారం లేని వాళ్ళకు తిరిగి అధికారంలోకి ఎలా రావాలో , ఇంకా తమ పార్టీలలోని అసంతృప్తిపరులను బుజ్జగించటానికి .... చేసే ప్రయత్నాలతోనే కాలం గడిచిపోతుంది.

    దేశంలో నిరంతరం ఎన్నికలే. అధికారం కోసం ఆరాటమే. ఇక ప్రజల సమస్యల గురించి పట్టించుకునేది ఎప్పుడు ?

    ఇప్పుడు దేశంలో పేదరికం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా చాలా సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.

    ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించటం లేదంటూ రాజకీయనాయకులను ప్రశ్నించకుండా వాళ్ళు చెప్పే మాటలు నమ్మి తమలో తాము గొడవలు పడే గొర్రెల్లాంటి ప్రజలు ఉన్నంతవరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది.

    కొందరు ప్రజలలో నోట్లకోసం ఆశపడి ఎన్నికలప్పుడు ఓట్లు వేసే వాళ్ళుంటారని అంటారు. ( ఇది ఎంతవరకు నిజమో నాకు సరిగ్గా తెలియదు. )

    కొందరు ప్రజలలో ఫ్రీ ఫ్రీ అంటూ ఎన్నికలప్పుడు ఉచితంగా ఇచ్చే వస్తువులకొరకు ఆశపడి ఓట్లు వేసే వాళ్ళుంటారని అంటుంటారు. ( ఇది ఎంతవరకు నిజమో నాకు సరిగ్గా తెలియదు. )

    ఇక మేధావులు అనబడే కొందరు ప్రజలు ఎన్నికలప్పుడు ఓటు వేయటానికి బద్ధకించి ఓటు వేయరు.

    ఇలాంటి పౌరులు ఎక్కువగా ఉన్న దేశం ఇలా కాక ఇంకెలా ఉంటుంది ?

    ReplyDelete
  9. ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చక్కగా సమానంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజల మధ్య ఇన్ని గొడవలు వచ్చేవి కాదు కదా !

    అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో ఇన్ని గొడవలు ఉండేవి కాదు కదా !

    ప్రజల సమస్యలను పరిష్కరించటమే ప్రజాప్రతినిధుల ముఖ్యమైన విధి.

    అధికారం లేని సామాజిక ఉద్యమకారులు కొందరు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు.

    ఇలాంటివారే చేయగలుగుతున్నప్పుడు అధికారం ఉన్నవారికి చిత్తశుద్ధి ఉంటే మరెంతో ప్రజాసేవ చేయగలరు కదా !

    ప్రజా ప్రతినిధులు ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఎన్నోసార్లు మాటలు తప్పారు.

    ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలప్పుడు ప్రజలకు వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించారా ?

    పరిష్కరిస్తే దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉంది ? ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంది ? ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి ?

    సమాజంలోని సమస్యలను పరిష్కరించకుండా తమ స్వార్ధపరమైన ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ప్రజలను మరింత కష్టపెడుతున్నారు.

    ఇది గ్రహించకపోతే ప్రజల ఖర్మ.

    భౌగోళికంగా విభజన , సమైక్యం సంగతులు అలా ఉంచితే,

    ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య మానసికంగా విభేదాలు సృష్టించటం అత్యంత బాధాకరం.

    ఇలాగైతే ప్రజల మధ్య ఈ విభేదాలు తరతరాలకు ఉండే అవకాశం ఉంది. ఈ పాపం ఊరికే పోతుందా ?


    ReplyDelete
    Replies
    1. >>ప్రజల మధ్య మానసికంగా విభేదాలు సృష్టించటం అత్యంత బాధాకరం.

      అసలు సమస్యలే లేవు, ప్రజల మద్య అపోహలు సృష్టించినది స్వార్థ పరులు అయిన నాయకులే అనుకునే జనాలు ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి సమస్యలు పరిష్కారం కావు. మన వల్ల తప్పులెం జరగలేదు, మనం మంచివాళ్ళం, ఎదుటి వారు స్వార్థ పరులు అని ఇలాంటి జనాలను రెచ్చగొట్టే స్వార్థ నాయకులూ కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.

      Delete
    2. అయ్యా ! మీరు చెబుతున్న సమస్యలు అన్ని ప్రాంతాలలోను ఉన్నాయి. అన్ని ప్రాంతాలూ వెనుకబడే ఉన్నాయి. ఇలా వెనుకబడటానికి కారణలు ఏమిటో అందరికి తెలుసు. ఇవన్నీ ఇంతకుముందు వ్యాఖ్యలలో కూడా చర్చించాము.

      Delete
  10. >>ఇప్పుడు ఏ ప్రాతిపదికన క్రొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు ?
    ఎదో ఒక ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలి అని ఏ చట్టాలు చెపుతున్నాయి?

    >>భవిష్యత్తులో మళ్ళీ విభజన ఉద్యమాలు రావని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ?
    ప్రజలు సంతుస్టులు అయితే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అన్ని రాష్ట్రాలలో ఇలాంటి సమస్య లేదు కదా?

    >>చిన్న రాష్ట్రాల వల్ల దేశం అభివృద్ధి బాటలో పరుగులు తీయటం ఖాయం... అంటూ జనాన్ని నమ్మిస్తున్న పార్టీల వారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ను నాలుగు లేక అయిదు రాష్ట్రాలుగా విభజించటానికి ఒప్పుకుంటారా ?

    స్వతంత్రంగా మనుగడ సాగించగల ప్రాంతం రాష్ట్రంగా ఏర్పాటు కాగలదు. ఆంధ్ర ప్రదేశ్ నాలుగయిదు ముక్కలుగా విభజిస్తే ప్రతి ముక్క స్వతంత్రంగా మనుగడ సాగించాగలితే అవి ప్రత్యెక రాష్ట్రంగా కాగల అర్హత ఉన్నవే.

    >>ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నప్పుడు కొన్ని విషయాలకు కట్టుబడాలి.
    ఉమ్మడి రాజదానికి వచ్చేవాడు ఆ ప్రాంతంలో ఉన్న చట్టాలను గౌరవించగలగి ఉండాలి. చట్టాలను అతిక్రమించే వారు హక్కుల గురించి మాట్లాడక పోవటం మంచిది.

    >>ఉమ్మడి రాజధాని బాగా అభివృద్ధి జరిగిన తరువాత రకరకాల కారణాలతో....
    బాగా అభివృద్ధి చెందినా రాజదానికి సీమండ్రులు ఏమిచ్చి వచ్చారు? ఫ్రీ గానే కదా? అలా అంటే సీమంద్రులకు వళ్ళు మండదా?

    >>ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉమ్మడి రాజధానికి ముందే ఒప్పుకోకూడదు.
    ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినది, ఉమ్మడి రాజదాని అయ్యినది కొన్ని షరతుల ఆధారంగా. ఆ షరతులను గౌరవించక పొతే రాష్ట్ర ఏర్పాటు , ఉమ్మడి రాజదాని అనేవి కూడా చెల్లవు.

    >>విభజన లేఖలు ఇచ్చిన పార్టీలు ఉమ్మడి రాజధానితో సహా తెలంగాణా ఇవ్వాలని కూడా లేఖలలో రాశారా ?
    ఇలా వాదించటం ఎందుకు పనిరాని తెలివి తేటలు చూపించటమే (క్షమించాలి). నేను అలా వాదిస్తే ఏమన్తానో చెప్పనా? విభజన లేకలు ఇచ్చిన పార్టీలు తెలంగాణా ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలి అన్నాయి, అంటే తెలంగాణాలో ఉన్నవన్నీతెలంగాణా కే చెందుతాయి అని దాని అర్థం. హైదరాబాదు లేని లేదా భద్రాచలం లేని తెలంగాణా ఏర్పాటు చెయ్యమని అవి చెప్పలేదు. అలా చెప్పిన పార్టీలకు సీమంద్ర జనాలు ఓట్లు వేసారు. అంటే రాష్ట్రం అంతా హైదరాబాదు టో కూడిన తెలంగాణకు ఒప్పుకున్నట్లే.

    >>ఏ ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాలను విభజిస్తే భవిష్యత్తులో అడిగిన ప్రతి ఒక్కరికీ రాష్ట్రాలను విభజించి ఇస్తారా ?
    ఇది వరకు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయి? భాష అని మీ సమాధానం అయితే, ఉర్దూ కు ఓకే రాష్ట్రం ఎందుకు లేదు? లంబాడి భాషకు ఎందుకు ఒక రాష్ట్రం లేదు ? హిందీ కి నాలుగైదు రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి?

    ReplyDelete
    Replies
    1. >>సీమాంధ్ర వాళ్ళను దోపిడీదారులు, స్వార్ధపరులు అనటం దారుణం.
      అది రాజకీయ పరిభాష. ఒక సమూహం ను ఉద్దేశించి మాట్లాడితే అందరిని అన్నట్లు కాదు. బ్రిటిష్ వారిని స్వతంత్ర ఉద్యమంలో తిడితే బ్రిటిష్ వారని అందరిని తిట్టినట్లు కాదు. బ్రిటిష్ వారిలో ఎందఱో వారి పార్లమెంటులో భారత స్వతంత్రం కొరకు వాదించారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణా వారిని కూడా సీమండ్రులు ఎన్నో మాటలు అన్నారు. అటువంటివి చర్చించుకోవటం పూర్తిగా అవివేకం, సమయం వృధా.

      >>హైదరాబాదులోనే వరుసగా ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు కదా !
      హైదరాబాదుకు ఉన్న సౌకర్యాల వలన మరియు హైదరాబాదు మాది అని సీమండ్రులు అనుకోవటమ వల్లనే అలా జరిగింది. హైదరాబాదు తరువాత ఏమయినా జరిగింది అంటే అది సీమంద్రలోనే. మిగిలిన తెలంగాణా జిల్లాలో జరిగింది ఏమి లేదు. మీకు ఇదివరకే ప్రభుత్వ యునివర్సితిలు, వైద్య కళాశాల లిస్టు ఇచ్చి నను, అందులో అన్యాయం మీకు స్పష్టంగా కనిపించింది. అలాంటివి మరెన్నో.

      >>సీమాంధ్రులు స్వార్ధపరులు అయితే ఇతర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయనిస్తారా ?
      ఆ ప్రశ్న కు ఎన్నో సార్లు జవాబు ఇచ్చాను, ఇంకా తెలియనట్లు మీరు నటిస్తే మీ ఇష్టం. హైదరాబాదు పై ఆశ లేకపోతె ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రమే ఏర్పాటు అయ్యేది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదు చాలా అవసరం అని మొదటి SRC స్పష్టంగా చెప్పింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కాగానే విజయవాడలో రాజధాని ఏర్పాటు చెయ్యకుండా కర్నూలు లో దేరాలలో ఏర్పాటు చేసి త్వరలో మనం హైదరాబాదు వెళ్తాం అని చెప్పిన ఎన్నో పత్రికా కథనాలు, పేపర్ క్లిప్పింగ్ లు ఎన్నో వేబ్సిట్ లలో ఉన్నవి.

      >>ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ అభివృద్ధికే ప్రాముఖ్యత ఇచ్చారు.
      హైదరాబదు లో ఉత్పత్తి అయిన రెవెన్యు కి మించి హైదరాబాదులో ఏమయినా ఖర్చు పెడితే అప్పుడు మీ వాదన కాస్త సబబుగా ఉంటుంది. ఈ మద్య వందల కోట్ల విలువైన హైదరాబాదు భూములు అమ్మి సీమంద్రలో ఖర్చు చేసారు అని నేను చెపితే కాదని మీరు ఎలా నిరూపిస్తారు? ప్రభుత్వ అధినేత, మరియు అనేక డిపార్టుమెంటుల అధినేతలు సీమంద్ర వారు అయినపుడు ఈ లెక్కలు తేల్చి శ్వేత పత్రం ఎందుకు ఇవ్వరు? ఉద్యోగుల లెక్కలు ఎందుకు అధికారికంగా ప్రకటించరు? నిధులు జమ ఖర్చులు ఎందుకు ప్రకటించరు? అలా చేసి తెలంగాణా ప్రజల అపోహలు తీర్చటానికి ఒక ప్రయత్నం చెయ్యవచ్చు కదా? ఆయా విషయాలపై శ్వేత పత్రం ఇవ్వటం కుదరదని కిరణ్ రెడ్డి స్వయంగా చెప్పాడు, ఎందుకు?

      >>ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉపాధికోసం రాజధానికి వస్తే తప్పు అంటున్నారు.
      ఎవరన్నారు? అన్ని మిరే ఉహించుకొని మీరే భాదపడటం, సరి పోయింది

      Delete
    2. >> ఎదో ఒక ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలి అని ఏ చట్టాలు చెపుతున్నాయి?

      సమాజంలో ఏ పని చేయాలన్నా విధివిధానాలు, న్యాయం, పద్ధతి, ప్రాతిపదిక...అనేవి ఉంటాయి. అలాగే క్రొత్త రాష్ట్రాలు ఏర్పడటానికీ ఉంటాయి.

      విధివిధానాలు అవసరం లేదు. ప్రజల ఆకాంక్ష ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వాదిస్తే క్రొత్త రాష్ట్రాలు కావాలని దేశంలో చాలామంది అడుగుతున్నారు. ఇలా అడిగిన ప్రజలందరికీ ఇస్తారా ?

      మన రాష్ట్రంలో కూడా సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాలు మరియు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలతో మన్యసీమ రాష్ట్రం కావాలని గిరిజనులు కోరుకుంటున్నారు. మరి మన్యసీమను కూడా ఇవ్వాలి కదా !

      >> ప్రజలు సంతుస్టులు అయితే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అన్ని రాష్ట్రాలలో ఇలాంటి సమస్య లేదు కదా?

      ప్రజలలో స్వార్ధం పెరిగి సర్దుబాటు ధోరణి తగ్గినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. చాలా రాష్ట్రాలలో ప్రత్యేక ఉద్యమాలు నడుస్తున్నాయి.

      అన్ని ప్రాంతాల ప్రజలు సంతుస్టులు అవ్వాలంటే ప్రజల మధ్య పట్టు , విడుపు, సర్దుకుపోవటం ఉండాలి. ఇరు పక్షాల ప్రజలు సర్దుకుపోవాలి.

      >> ఆంధ్ర ప్రదేశ్ నాలుగయిదు ముక్కలుగా విభజిస్తే ప్రతి ముక్క స్వతంత్రంగా మనుగడ సాగించాగలితే అవి ప్రత్యెక రాష్ట్రంగా కాగల అర్హత ఉన్నవే.

      పదేపదే ఉద్యమాలతో కాలం వెళ్ళబుచ్చటం కన్నా ఇప్పుడే చేసేస్తే పని అయిపోతుంది కదా !

      సమాజంలోని సమస్యలను పరిష్కరించే నేర్పు ఉన్న నేతలు ఉంటే విభనలతో పనేమిటి ? ఎంత పెద్ద రాష్ట్రమైనా చక్కగా పాలించగలరు.

      చిన్న రాష్ట్రం పెద్దరాష్ట్రం అని తేడా లేదు. ప్రజలకు, ప్రభుత్వానికి ...అభివృద్ధి చెందాలన్న తపన ఉంటే ఆ ప్రాంతం తప్పక అభివృద్ధి చెందుతుంది.

      చిత్తశుద్ధి లేనప్పుడు పెద్దరాష్ట్రమైనా అభివృద్ధి చెందదు. చిన్న రాష్ట్రమైనా అభివృద్ధి చెందదు.

      >> ఉమ్మడి రాజదానికి వచ్చేవాడు ఆ ప్రాంతంలో ఉన్న చట్టాలను గౌరవించగలగి ఉండాలి. చట్టాలను అతిక్రమించే వారు హక్కుల గురించి మాట్లాడక పోవటం మంచిది.

      ఉమ్మడి రాజదానికి ఒప్పుకున్నవారు కూడా పెద్దరికంతో అందరినీ కలుపుకుపోవాలి. బాధ్యతలను తీసుకోవాలి. రాజధానిని వదులుకున్న సాటివాళ్ళను కలుపుకుపోవాలి.

      >> బాగా అభివృద్ధి చెందినా రాజదానికి సీమండ్రులు ఏమిచ్చి వచ్చారు? ఫ్రీ గానే కదా? అలా అంటే సీమంద్రులకు వళ్ళు మండదా?

      తమ ప్రాంతములలో రాజధానులను త్యాగం చేసి వచ్చారు. తమ ప్రాంత అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు.

      >> ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినది, ఉమ్మడి రాజదాని అయ్యినది కొన్ని షరతుల ఆధారంగా. ఆ షరతులను గౌరవించక పొతే రాష్ట్ర ఏర్పాటు , ఉమ్మడి రాజదాని అనేవి కూడా చెల్లవు.

      మాట్లాడుకున్న షరతులలో అన్యాయం ఎంత ఉందో ఇంతకుముందు వ్యాఖ్యలలో చర్చ జరిగింది. అన్యాయపు షరతులను ఎలా పాటిస్తారు ?

      ఏమైనా సరే, ఒకసారి ఒప్పుకున్నాక వెనక్కు తగ్గకూడదు. అని అంటే , ఒకసారి ఒప్పుకున్నాక ఉమ్మడి రాజధాని నుంచి కూడా వెనక్కు వెళ్ళకూడదు.

      >> అంటే తెలంగాణాలో ఉన్నవన్నీతెలంగాణా కే చెందుతాయి అని దాని అర్థం. హైదరాబాదు లేని లేదా భద్రాచలం లేని తెలంగాణా ఏర్పాటు చెయ్యమని అవి చెప్పలేదు. అలా చెప్పిన పార్టీలకు సీమంద్ర జనాలు ఓట్లు వేసారు. అంటే రాష్ట్రం అంతా హైదరాబాదు టో కూడిన తెలంగాణకు ఒప్పుకున్నట్లే.

      తెలంగాణాలో ఉన్నవన్నీ తెలంగాణా కే చెందుతాయి.అంటున్నారు..... అయితే తెలంగాణాలో ఉమ్మడి రాజధాని కూడా ఉంది. ఉమ్మడి రాజధాని అంటే అందరిదీ అని కదా అర్ధం. దాని గురించి పార్టీలు లేఖలలో ప్రత్యేకంగా వ్రాయాలి.

      మీరు మర్చిపోయినట్లున్నారు. విభజన లేఖలు ఇచ్చిన పార్టీలు ప్రస్తుతం అధికారంలో లేవు. ( అంటే ప్రజలు విభజనను అంగీకరించక వాళ్ళను ఓడించారు కాబట్టి, )

      >> ఇది వరకు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయి? భాష అని మీ సమాధానం అయితే, ఉర్దూ కు ఓకే రాష్ట్రం ఎందుకు లేదు? లంబాడి భాషకు ఎందుకు ఒక రాష్ట్రం లేదు ? హిందీ కి నాలుగైదు రాష్ట్రాలు ఎందుకు ఉన్నాయి?

      మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 800 భాషలున్నాయి. 2000 యాసలున్నాయట. వేలాది రాష్ట్రాలను ఏర్పరచటం సాధ్యమయ్యే పని కాదు కదా ! అందుకే మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషల ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

      ఉత్తరభారతంలో చాలా భూభాగములో హింది మాట్లాడే ప్రజలు ఉన్నారు. అంత పెద్ద విస్తీర్ణము గల ప్రాంతము ఒకే రాష్ట్రంగా ఉంటే పాలనాపరంగా కష్టం కాబట్టి , ఒకటి కన్నా ఎక్కువ హిందీ రాష్ట్రాలు ఉన్నాయి.

      ఉదాహరణకు .... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 70 జిల్లాలు ఉన్నాయి. హిందీతో పాటు ఉర్దూ కూడా ఉత్తరప్రదేశ్ లో అధికార భాష.

      ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ను విభజించనవసరం లేదు.

      Delete

    3. >> తెలంగాణా జిల్లాలో అభివృద్ధి జరిగింది ఏమి లేదు.

      తెలంగాణా జిల్లాలలో సీమాంధ్ర జిల్లాల కన్నా అభివృద్ధి బాగానే ఉందని శ్రీ కృష్ణ కమిటీ వివరించారు కదా !

      >>సీమాంధ్రులు స్వార్ధపరులు అయితే ఇతర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయనిస్తారా ? >> ఆ ప్రశ్న కు ఎన్నో సార్లు జవాబు ఇచ్చాను, ఇంకా తెలియనట్లు మీరు నటిస్తే మీ ఇష్టం.

      నేనేమీ నటించటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనే ఆశతో ఏర్పాటయ్యింది. హైదరాబాదు పై ఆశ వల్ల కాదు. అప్పటి హైదరాబాదు అభివృద్ధి గురించి ఇప్పటి హైదరాబాద్ అభివృద్ధి గురించి ఇంతకుముందు వ్యాఖ్యలలో చర్చ జరిగింది.

      అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు పడిన కష్టాల గురించి , ఆ కష్టాలను తట్టుకోలేక ప్రజలు చేసిన ఉద్యమాల గురించి అందరికి తెలుసు. మీరేమో అప్పటి అభివృద్ధి చాలా గొప్పది అంటారేమిటో ?

      >> హైదరాబదు లో ఉత్పత్తి అయిన రెవెన్యు కి మించి హైదరాబాదులో ఏమయినా ఖర్చు పెడితే అప్పుడు మీ వాదన కాస్త సబబుగా ఉంటుంది. ఈ మద్య వందల కోట్ల విలువైన హైదరాబాదు భూములు అమ్మి సీమంద్రలో ఖర్చు చేసారు అని నేను చెపితే కాదని మీరు ఎలా నిరూపిస్తారు?

      తెలంగాణాలో నదుల ప్రవాహం ఉండే తీరు వల్ల ఎత్తిపోతల పధకాలు లేకపోతే నీరు పొలాలకు అందదు. అదే కోస్తాలో నీటివాలు పల్లానికి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో పొలాలకు నీరు వస్తుంది.

      నీటిప్రాజెక్ట్స్ వంటివి చాలా ఖర్చు అవుతాయి కాబట్టి , ఉమ్మడి డబ్బుతోనే నిర్మిస్తారు.

      ఎత్తిపోతల పధకాలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పటి ఎత్తిపోతల పధకాలను కేవలం తెలంగాణా జిల్లాల నుండి వచ్చిన రెవెన్యూతోనే కట్టారా ?

      హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కాబట్టి ఆ రెవెన్యూ అందరిదీ. ఉమ్మడి రాజధాని ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో అనేక ఉపాధి సంస్థలు ఏర్పడ్డాయి. వీటిపై అందరికీ హక్కులు ఉంటాయి కదా !

      ఒకే భాషకు చెందిన వాళ్ళు ఇంతలా డబ్బు లెక్కలు వేసుకోవటం ఏమీ బాగుండలేదు. అందరూ ఒకే కుటుంబసభ్యులు అనుకుంటే ఇలాంటి లెక్కల అవసరం ఉండదు.

      సమాజంలో మనుషుల మధ్య స్నేహం, బంధుత్వం, ఇచ్చిపుచ్చుకోవటాలు... వంటివి తగ్గిపోయి డబ్బు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాక సమాజం ఇలా మారిపోయింది. జీవితంలో ఎవరి అవసరాలు వాళ్ళకు ముఖ్యమే కానీ కొంత పట్టువిడుపు కూడా అవసరమే.

      ఇవన్నీ ఎంత చర్చించుకున్నా వృధాప్రయాసే. భవిష్యత్తులో కానున్నది కాకమానదు.

      Delete
    4. విభజన ప్రాముఖ్యత గురించి ఇన్ని మాటలు చెబుతున్నారు కదా !

      భవిష్యత్తులో తెలంగాణాను విభజించి మన్యసీమ రాష్ట్రం కావాలని గిరిజనులు కోరితే ఆ ప్రజల ఆకాంక్ష ప్రకారం తెలంగాణాను విభజించి మన్యసీమ రాష్ట్రానికి సంతోషంగా ఒప్పుకుంటారా ?

      Delete
  11. కె.సి.ఆర్. గారికి తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం అనీ తెలుగువాళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారనీ వార్తా పత్రికలలో చదివాను. మరి ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఎందుకు ప్రచారం చేసారో ? ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

    కె.సి.ఆర్. గారు తెలంగాణాకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు చేస్తే ఎంతో బాగుండేది.

    ReplyDelete
  12. కొంతకాలం క్రిందట వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చక్కగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు పంతాలు, పట్టింపులతో శత్రువుల్లా తయారయ్యారు.

    ఇరు ప్రాంతాల ప్రజలు ఎదురుపడితే ఏం మాట్లాడాలన్నా చెప్పలేని ఇబ్బంది . వారి మనసుల్లో అనుమానాలు, అసహనాలు .

    రాష్ట్రంలోని ప్రజల మధ్య ఇలాంటి పరిస్థితి రావటం అత్యంత బాధాకరం.

    ReplyDelete