koodali

Monday, November 5, 2012

వాస్తు ...కొన్ని విషయాలు.

వాస్తు   అంటే  వాస్తు విజ్ఞానం . వాస్తుశాస్త్రం  గురించి  పెద్దలు  చెప్పిన  విషయాలలోని  నిగూఢ  విజ్ఞానం   గురించి  నాకు    తెలిసింది  చాలా  తక్కువ.  అయితే,    పైపైన   తెలిసినంతలో  రాస్తానండి. 


* వాస్తు   ప్రకారం  దైవ పూజామందిరం  ఈశాన్యము ,  తూర్పు దిక్కులలో ఉండాలంటారు.  ఈ దిక్కులలో  ఉదయాన్నే సూర్యోదయము   చక్కగా  కనిపిస్తుంది.  అలా  పూజ  చేసుకుంటే మనస్సు  ప్రశాంతంగా  ఉంటుంది .


 *    తలుపులు,  కిటికీలు    వాస్తు  ప్రకారం    పద్దతిగా   ఉండాలంటారు. ఇలా  ఉండటం  వల్ల  ఇంట్లోకి  గాలి,  వెలుతురు  ధారాళంగా  వస్తుంది. ఎలాపడితే  అలా   తలుపులు,  కిటికీలు  నిర్మించు కుంటే , గాలి,  వెలుతురూ  సరిగ్గా  ఇంట్లోకి  ప్రసరించక  ఎక్కువగా వ్యాధులు  వచ్చే  అవకాశం   ఉంది.


* పాత కాలం  ఇళ్ళకు  వెలుతురు  బాగా  రావటానికి  పై  కప్పుకు  గాజు  అద్దాలు  కూడా  అమర్చేవారు.  అలాంటి  గదులలో   లైట్స్  వేసినట్లే  వెలుతురు  ఉంటుంది.  ఇలా  గాలి ,  వెలుతురు  బాగా  వచ్చేటట్లు   ఇళ్ళు  కట్టుకోవటం  వల్ల ,  ఇంట్లో   లైట్స్,  ఫాన్స్,   వాడే   అవసరం  తగ్గుతుంది. తద్వారా  కరెంట్  ఎంతో  ఆదా  అవుతుంది.


* వాస్తు  ప్రకారం  ఉత్తరం  వైపు  తలపెట్టి  నిద్ర  పోగూడదంటారు.  ఉత్తరం  దిక్కున    అయస్కాంత  శక్తి  ఉంటుందట.  అందువల్ల    ఉత్తరం  వైపు  శిరస్సు  పెట్టి   పడుకోవటం  వల్ల  తలకు  సంబంధించిన  సమస్యలు  వస్తాయట.


 
* ఆగ్నేయం  వంట  గది  ఉండాలంటారు.  ఆగ్నేయం దిక్కున   అగ్ని  వెలిగించి  వంట  చేసుకుంటే  మంచిదంటారు. రోజూ  వంటలో  వాడుకునే  పప్పులు,  పిండి  పదార్ధాలు   వంటివి   కూడా  వంట గదిలో  నిలువ  ఉంచుకుంటాము. 



 * సూర్యుడు  తూర్పు  దిక్కున  ఉదయించి,   పడమర  దిక్కున    అస్తమించే  వరకు  ఆగ్నేయ  దిక్కున    ఎంతో కొంత  ఎండపొడ  ఉంటుంది.  ఎండ,  వెలుతురు  బాగా  వస్తే  పప్పులు  పురుగు  రాకుండా  ,  పాడవకుండా ఎక్కువకాలం  నిల్వ   ఉంటాయి. 

* పాతకాలం  ఇళ్ళలో   వంటగదికి  బయట  ఖాళీ  స్థలం  ఉండేది.  పప్పులు  వంటివి   ఎండలో  ఎండబెట్టుకోవటానికి  ,  ఇంకా  పాత్రలు  శుభ్రం  చేసుకోవటానికి  ఈ  ఖాళీ  స్థలం ఉపయోగపడేది.   


*వంట  గది  ప్రక్కన  ఇలా  ఖాళీ  స్థలం  ఉంటే ,  స్త్రీలకు  పని  చేసుకోవటానికి  సులువుగా ఉంటుంది.  ఇంట్లోని  స్త్రీలు  ఆరోగ్యంగా   ఉంటారు.ఆగ్నేయ  వంటగదికి  దక్షిణ ఆగ్నేయాన  తలుపు  ఉండటం  మంచిదేనట.


* ఆగ్నేయం  వంటగది  కుదరనప్పుడు  వాయవ్యం  పరవాలేదన్నారు.  వాయవ్యం  వాయు  స్థానం . వాయవ్యం  దిక్కున   గాలి  చక్కగా  వస్తుంది.  అందువల్ల  ఆగ్నేయదిక్కున  వంటగది  ఏర్పాటు  చేసుకోవటం  కుదరని  వారు,   వాయవ్య  దిక్కున  ఏర్పాటు చేసుకున్నా  ఫరవాలేదట.


*  అయితే, వంటగది  ఆగ్నేయం   దిక్కున  ఉంటే   మరింత  మంచిది.

*  ఈ  రోజుల్లో   ఇండిపెండెంట్   ఇళ్లలో  నివసించే  వారికన్నా,  అపార్ట్మెంట్స్ లో  ఉండే  వారి  ఇళ్ళలో  పప్పుధాన్యాలు    త్వరగా  పురుగు  వచ్చి  పాడైపోతున్నాయని   తెలిసిన  వాళ్ళు
అంటున్నారు.  అపార్ట్మెంట్  ఇళ్ళలో  వంటగదుల్లోకి  ఎండ, వెలుతురు  సరిగ్గా  రాకపోవటం  వల్ల   కూడా  ఇలా  జరుగుతోందట.  

(అయితే ,  ఇప్పుడు కూడా   కొందరు   బాల్కనిలో  పప్పు ధాన్యాలను  ఎండ పెట్టడం వల్ల  అవి  చెడిపోకుండా   బాగుంటున్నాయి..)

*  పూర్వం  అందరికీ  ఇండిపెండెంట్  ఇళ్ళే  ఉండేవి.  ఇప్పటిలా   పక్షుల  గూళ్ళ  వంటి  అపార్ట్మెంట్స్  ఉండేవి  కాదు.   అందుకని  ఇప్పటి  వాళ్ళు  వాస్తు  విషయంలో  కొన్ని  సార్లు  గందరగోళానికి  లోనవుతున్నారు. 


* అపార్ట్మెంట్స్లోని  కొన్ని  ఇళ్ళ  వారికి  కొంత  భాగం   వాస్తు  బాగుంటే ,  కొంత  భాగం  వాస్తు  ప్రకారం  నిర్మించటం  కుదరటం  లేదు.

*  ఇండిపెండెంట్  ఇళ్ళవారికి  కూడా   ప్రక్కన  భారీ  ఎత్తున  అపార్ట్మెంట్స్  ఉండి  సూర్యరశ్మి  తగలక  పోతే,   ఇండిపెండెంట్  ఇంటిలోని  వారికి   కూడా   అంతగా  ఎండా , వెలుతురు  రాదు  .  


* ఇలా  జరగటం  వాస్తు  తప్పు  కాదు. ఇలా  ఇళ్ళను  కట్టుకుంటున్న  మనుషుల  తప్పు. 


*  సూర్యరశ్మి   తగిలిన   మొక్కలు  ఏపుగా  పెరుగుతాయి.  ఎండలో  ఎండిన  పప్పుధాన్యాలు  పురుగు  పట్టకుండా   చక్కగా  ఉంటాయి. 

* మనుషులేమో    సూర్యరశ్మి  తగలకుండా   కృత్రిమ   వాతావరణంలో   జీవిస్తూ   వ్యాధులను   తెచ్చుకుంటున్నారు.


No comments:

Post a Comment