koodali

Wednesday, November 21, 2012

అరుదైన, చిత్రమైన మొక్క , మరియు...

ఏడాదికి  ఒకసారి  ఉగాది  రోజే   మొలకెత్తి ,  మొగ్గతొడిగి  పుష్పించే  అరుదయిన  మొక్క  గురించి  మీరు  విన్నారా  ?

ఈ  మొక్కను   ముంగారి  మొలక   (  ఉగాది  పుష్పం  ) అంటారట.

  మద్దికెర  మండలం  అగ్రహారం  గ్రామంలో  ఇలాంటి  మొక్క  వచ్చిందట.

ఏటా  ఉగాది రోజు  మొలకెత్తి  సాయంత్రం  లోగా  వాడిపోయే  మొలకను  రైతులు  పంటలపుష్పంగా  పిలుస్తారు.  కొందరు  కాలాన్ని  నిర్ణయించే  పుష్పంగా   భావిస్తారట .


గడ్డి  కూడా  మొలవని  నేలలో  ఎలాంటి  తేమ  లేకపోయినా  ఒకే  రోజులో మొలకెత్తి   రెండు  అడుగులు  పెరగడంపై  నిపుణులు  సైతం  ఆశ్చర్యానికి  గురవుతున్నారు. 



ఈ  మొక్క  పదికి  పైగా  మొగ్గలు  తొడిగితే  ఆ  ఏడు  పంటలు  బాగా  పండుతాయని  రైతుల  నమ్మకం.  

ఇలాంటి  మొక్కలు  అగ్రహారం  ప్రాంతంలో  మాత్రమే  కనిపిస్తాయట.

హైదరాబాద్ కు  చెందిన  శాస్త్రవేత్తలు  సైతం  ఈ  మొక్కను  పరిశీలించారట.  


ఒకే  రోజు  మొలక  రావటం,  మొగ్గ  తొడగటంపై  పరిశోధనలు  చేస్తున్నారట. 

 (కొన్ని  సంవత్సరాలకు  క్రితం  ఈనాడు  దినపత్రికలో  ఈ  విషయాలను  వ్రాసారండి..)
............................


  ఆధునిక  విజ్ఞానశాస్త్రపు  సూత్రాలకు  అంతుచిక్కని   రహస్యాలెన్నో  సృష్టిలో  ఉన్నాయి.  


గగుర్పాటు  కలిగించే  గొంగళి పురుగు  తపస్సమాధి  స్థితి  లాంటి  దశను  దాటాక ,  రంగురంగుల  సీతాకోకచిలుకగా  మారే  విధానం  కూడా  అద్భుతం,  ఆశ్చర్యకరం. .


 దైవసృష్టి  ఎంతో  అద్భుతమైనది,  మన  అంచనాలకు,  ఆలోచనలకూ    అంత  సులువుగా  అందనిది. 

...........................................................

ముంగారి  మొలక చిత్రాలను బ్లాగ్ లో పెట్టానండి. అయితే, అంత క్లియర్ గా కనిపించటం లేదు.

జాగ్రత్తగా గమనిస్తే, మొదటి చిత్రంలో ఒక సన్నటి మొలకకు పైన ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి.

రెండవ చిత్రంలో పెరిగి వంపు తిరిగిన సన్నటి మొక్క కనిపిస్తోంది.



12 comments:

  1. నిజమాండి..? బాగుందండి..:)

    ReplyDelete
  2. ధాత్రి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    పత్రికలో ఈ మొక్క బొమ్మ కూడా వేసారు. పెద్ద మొక్క కాదు కానీ, ఏటా ఉగాది రోజు మొలక రావటం, రెండు అడుగుల ఎత్తు పెరగటం, పుష్పించటం , మొక్క సాయంత్రంలోగా వాడిపోవటం.. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు.

    ReplyDelete
  3. నిజంగా ఆశ్చర్యమే

    ReplyDelete
  4. మొక్క శాస్త్రీయ నామము, పిక్చర్ వేస్తే ఆ రహస్యం ఏమిటో తేల్చుకుంటాం. :)

    ReplyDelete
  5. బాగుంది . ఈనాడులో ఫొటో ఇవ్వలేదా?

    ReplyDelete
  6. kastephale శర్మ గారు,SNKR గారు,మాలా కుమార్ గారు,
    మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి.

    ఈ మొక్కకు శాస్త్రీయ నామం ఉందో లేదో నాకు తెలియదండి.

    ఈ మొక్క చిత్రాలను బ్లాగ్ లో పెట్టాను.. అయితే, అంత క్లియర్ గా కనిపించటం లేదు.

    జాగ్రత్తగా గమనిస్తే, మొదటి చిత్రంలో ఒక సన్నటి మొలకకు పైన ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి.

    రెండవ చిత్రంలో పెరిగి వంపు తిరిగిన సన్నటి మొక్క కనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. మీకు అభ్యంతరం లేకపోతే లింక్ ఇవ్వండి.
      మరేంలేదు, ఇలానే దిల్‌సుక్‌నగర్ వాసులు బ్రహ్మకమలం ఏడాదికి ఒకసారే పూస్తుందని, ఇంకెన్నెన్నో వర్ణించి కోతలు కోశారు, టివి9 లాంటి ఓవరాక్షన్ మీడియాలో. యు ట్యూబులో కూడా వుంది. మా ఇంట్లో కుండీలో ఓ మొక్క వేస్తే, మేనెల్లో ఒకటి, జూలైలో మూడు, సెప్టెంబర్లో ఒక పూవు పూచింది. అప్పటినుంచి ఇలాంటి కథలు వింటే నిర్ధారించుకోవాలి, ఈనాడు లాంటి చవకబారు పత్రికల మాటలు తేలిగ్గా నమ్మేయకూడదు, అనుకున్నానండి. అంతే.

      Delete
    2. * ఈ విషయం గురించి ఎవరికైనా అనుమానంగా ఉంటే, వచ్చే ఉగాదికి ఆ ఊరు వెళ్ళి పరిశీలించవచ్చు కూడా.

      * బ్రహ్మకమలం అరుదుగా పూస్తుందని అంటారు. ఆ మాట నిజమే.

      అయితే, ఈ రోజుల్లో క్రొత్తరకం మొక్కలు వచ్చాక ఏడాదికి ఎన్నిసార్లయినా పూస్తున్నాయి .. సహజంగా బ్రహ్మకమలం అంటే తెలుపు రంగులో ఉంటుంది. ఇప్పుడు ఎన్నో రంగుల్లో బ్రహ్మకమలాలు పూస్తున్నాయట.

      * పూర్వం మామిడికాయలు వేసవిలోనే వచ్చేవి. ఇప్పుడు చలికాలం కూడా వస్తున్నాయి.

      *పూర్వీకులు స్థానికంగా లభించే ఆహారాన్నే తిన్నా కూడా, పుష్టిగా బలంగా ఉండి కొన్ని కిలోమీటర్లు సునాయాసంగా నడిచేసేవారు.

      * ఇప్పుడు మనం మనదేశంలో లభించేవే కాకుండా , దేశవిదేశాలకు చెందిన ఆహారపదార్ధాలను తీసుకుంటున్నాం. అయినా మనం పూర్వీకులంత బలంగా ఉండటం లేదు .

      *ఇలా ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చాయి .. జీవుల లక్షణాలను ఎవరికి తోచినట్లు వారు మార్చేస్తున్న ఈ రోజుల్లో , జీవులలో ప్రాచీన కాలం నాటి సహజమైన లక్షణాలు ఉండకపోవచ్చునండి .

      Delete
  7. ఇదండి ఆ మొలక, పేరు Urginea Indica.

    http://udumulasudhakarreddy.blogspot.com/2009/05/mungari-molaka-wild-bulb-weather.html

    ఇదీ బ్రహ్మకమలం లాంటి అపోహనే. :)
    http://www.hindu.com/2007/04/14/stories/2007041407800200.htm

    ReplyDelete
  8. మీరు చక్కటి వివరాలు సేకరించారండి.

    దేశంలోని కొందరు సౌరమానం ప్రకారం ఉగాది జరుపుకుంటారు. తెలుగువాళ్ళు చాంద్రమానం ప్రకారం ఉగాది పండుగను జరుపుకుంటారు.

    బహుశా ఇక్కడ ఈ మొక్క తెలుగువారి ఉగాది అప్పుడు కనిపిస్తుందని అలా పేరు పెట్టి ఉంటారు.

    మే నెలలో మే ఫ్లవర్స్ పూస్తాయి. వేసవికాలంలో మల్లెలు, మామిడి కాయల సీజన్, నైట్ క్వీన్ పువ్వులు రాత్రి మాత్రమే పూస్తాయి. ఇలా పండ్లకు, పుష్పాలకు కొన్ని లక్షణాలున్నాయి.

    ఉదయం వికసించి, సాయంత్రానికి వాడిపోయే పువ్వులలో కూడా మొగ్గలు రావటానికి, మొగ్గ పువ్వులుగా మారటానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

    ఈ కొత్తరకం మొక్కలో మాత్రం ఒక్కరోజులోనే మొలక వచ్చి, పెరిగి, పుష్పించి, సాయంత్రానికి మొక్క వాడిపోవటం అనే ప్రక్రియ చాలా ఆశ్చర్యంగా ఉంది.

    ReplyDelete
  9. /ఈ కొత్తరకం మొక్కలో మాత్రం ఒక్కరోజులోనే మొలక వచ్చి, పెరిగి, పుష్పించి, సాయంత్రానికి మొక్క వాడిపోవటం /

    అపోహలు పనిగట్టుకుని ప్రచారం చేస్తే సృష్టికర్త హర్షించడు. మళ్ళీ మనిషిగా పుట్టి సృష్టి మీద పుకార్లు లేపే అవకాశం లేకుండా చేయగలడు. :)) :P

    ఆ మొక్క ఎదగడానికి 8వారాలు తీసుకుంటుంది. ఉగాది రోజుల్లో పూస్తుంది, ఆరోజే పూస్తుందని కాదు అక్కయ్య. http://www.sciencedirect.com/science/article/pii/S0176161786802012

    ReplyDelete
  10. * మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి. నేను అపోహలు ప్రచారం చేయటం లేదు..
    * ఒకే రోజులో మొలక రావడం, మొగ్గ తొడగడం చూసి , ఆశ్చర్యపడి ఇక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని వార్తాపత్రికలో రాసారు. అదే నేను బ్లాగ్ లో రాసాను.
    * అంతర్జాలంలో చదివిన విషయాలను మీరు రాసారు. అంతేకానీ , మీరు ప్రత్యక్షంగా ఆ మొక్కను చూడలేదు కదండి. నేనూ ఆ మొక్కను ప్రత్యక్షంగా చూడలేదు.
    * అందుకని ఏది నిజమో ఏది కాదో మనకు సరిగ్గా తెలియదు. బహుశా ఈ జాతి మొక్కలలో బేధాలు ఉంటాయేమో ?

    ReplyDelete