koodali

Monday, June 25, 2012

కొన్ని విషయములు.... వ్యాఖ్య.....మరికొన్ని విషయములు..

  అద్భుతమైన   అమరనాధ్  యాత్ర  ప్రారంభమయింది.    దైవం  దయ వల్ల కొంతకాలం  క్రిందట   మేము  అమరనాధ్  యాత్ర,  వైష్ణవీదేవి  యాత్రలు  చేసి  వచ్చాము.
..................

 
నిన్నటి  టపాలో   ఆరోగ్యం   గురించి   కొన్ని  విషయాలను    వ్రాసాను.  ఆరోగ్యమే  మహాభాగ్యం  అన్నారు  పెద్దలు.
 

అనారోగ్యం  రావటానికి  ఎన్నో  కారణాలు  ఉంటాయి.  వ్యక్తులు   పూర్వం  చేసిన  పాపాల  వల్ల  కూడా  అనారోగ్యం  వస్తుందట.  



పాపకార్యాలను  చేయటం  మాని ,    దైవప్రార్ధన,  ఇతరులకు  సహాయం  చేయటం  , వంటి  పుణ్యకార్యాలను  ఆచరిస్తూ  వైద్యసహాయం   తీసుకోవటం   వల్ల  ఆరోగ్యాన్ని  తిరిగి పొందవచ్చట.
 

అనారోగ్యం  పోవాలంటే   మందులు  వాడుతూనే, రుద్రాక్షధెరపీ,  దైవప్రార్ధన,  యోగా  వంటివి  చేస్తూ  ఆహారవిహారాల్లో  జాగ్రత్తలు  పాటిస్తే   రోగాలు  తగ్గే  అవకాశం  ఉంది.

 జాగ్రత్తలు  పాటించకపోతే  అంతగా  ఫలితం   కనిపించదు.

 

ఉదా..ఊపిరితిత్తుల  జబ్బు  ఉన్న  వ్యక్తి  బోలెడు  రుద్రాక్షమాలలు  ధరించి,  ఆపకుండా  సిగరెట్లు    పీలుస్తూ  ఉంటే  ఎన్ని  రుద్రాక్ష  మాలలు  వేసుకున్నా,  ఎంత  యోగా  చేసినా,  ఎన్ని   మందులు  వాడినా  జబ్బు  తగ్గదు  కదా  ! 

 

సిగరెట్ ను    పీల్చే వారితో   పాటు  ప్రక్కన  ఉన్నవారికి  కూడా  ఆ  పొగ  వల్ల  జబ్బులు  వస్తాయట.  



అలాగే  కొందరు  చేస్తున్న  వాతావరణ  కాలుష్యం  వల్ల     చక్కటి  జీవనసరళితో  ఎంతో  జాగ్రత్తగా  ఉండే  వారికి  కూడా   జబ్బులు  వస్తున్నాయి.   రోగాలు  తగ్గాలంటే    వాతావరణ  కాలుష్యాన్ని  పెంచే  విధానాలను  ప్రోత్సహించకూడదు.
 

మాకు  చుట్టుప్రక్కల  ఉండే  ఒక  ఆమెకు , సడన్  గా  కాన్సర్  అని  బయటపడింది.  కొన్ని  నెలలలోపే  ఆమె  మరణించింది.  కాన్సర్  అని  తెలియక  ముందు  ఆమెకు  ఆ  జబ్బు  ఉన్నట్లుగా    లక్షణాలు  ఏమీ  తెలియలేదట.  ఎంతో  ఉత్సాహంగా  తిరిగేది.  ఈ  రోజుల్లో  ఇలా  జబ్బు  ముదిరేవరకూ  తెలియటంలేదు.  



 ఇంకొక  ఆయన  ఉద్యోగరీత్యా  కుటుంబానికి  దూరంగా  ఉంటున్నారు.  ఆయన  వేళకు  సరిగ్గా   తినీతినకా  అనారోగ్యం  పాలై  మరణించారు. 



నేను  ఇలాంటి  విషాదవార్తలు  వ్రాస్తున్నానని  తప్పుగా  అనుకోవద్దండి. 

ఎందుకంటే,  ఆరోగ్యమే  మహాభాగ్యం  .  ఆరోగ్యం  ఉన్నంతవరకే  మనం  ఏమైనా  చేయగలం.  అనారోగ్యం  వస్తే    బంధువులే  సరిగ్గా  పట్టించుకోరు.   అంటే,   ఈ  రోజుల్లో  ఎవరికీ  సమయం  చాలటం  లేదు  కదా  ! 

 

అందుకని  అందరూ     ఆరోగ్యాన్ని   జాగ్రత్తగా  కాపాడుకోవాలి.   సంపాదన  అంటూ  ఒళ్ళు  హూనమయ్యేంతగా  పనిచేసి  ఆనక  అనారోగ్యం  వస్తే  ఎంత  డబ్బు  ఉన్నా    ఉపయోగం  ఉండదు  కదా !
 
..................

 
* "ఏక పత్ని "వ్యవస్థ ఎలా ఎర్పడినది?    అన్న   "  సుభద్ర కీర్తి  "  గారి  టపా  గురించి ......... నా  అభిప్రాయాలను ,    వ్యాఖ్యలను 
దయచేసి    చదవండి......

* వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట.

మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !



ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి..... .వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.



ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు......ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో....)



పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు. )


పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !



.రామాయణంలో రావణాసురుడు అతిధి ( భిక్షువు ) రూపంలో శ్రీరాముని ఇంటికి వచ్చి సీతాదేవిని ....ఆశించాడు. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు.
 


 విష్ణుదేవుని  అంశ  అయిన  శ్రీ రాముడు రావణాసురుని వంశాన్నే నాశనం చేసి , తద్వారా పరాయి స్త్రీని కోరుకోవటం అధర్మమని లోకానికి చాటి చెప్పారు....

( హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసి వచ్చిన తరువాత సీతాపహరణం గురించిన విషయాలు తెలిసిన తరువాత రాముడు రావణాసురుని సంహరించారు. )
 

సుభద్రకీర్తి గారు వ్రాసిన కధలో ..... అలా జరగటానికి వెనుక ఏవో సామాజిక కారణాలు ఉండి ఉంటాయి.


 బహుశా శ్వేతకేతు అనే వారు ఏకపత్నీవ్రతాన్ని పునరుద్ధరించి ఉంటారు.

ప్రాచీన కాలంలో కూడా కొందరు కొన్ని మూఢాచారాలను పాటించినట్లుగా తెలుస్తుంది.

ఉదా.. తమ ఇంటికి అతిధి వస్తే ఆ అతిధిని  గౌరవించి, అతిధి ఏం కోరినా ఇవ్వాలనే పద్ధతిని కొందరు పాటించేవారన్నట్లుగా తెలుస్తుంది.

ఉదా..అతిధి ఇంటి యజమాని భార్యను కోరుకుంటే కూడా ఆ కోరికను తీర్చే విధంగా పద్ధతి ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇలాంటి పద్ధతి ఖచ్చితంగా మూఢాచారమే..ఇలాంటివాటిని ఖండించాలి.

ఎంత గొప్ప స్థాయి వారైనా కూడా మూఢాచారాలను పాటిస్తే వారిది తప్పే.

అతిధిని గౌరవించాలి. అలాగని వాళ్ళు ఏం కోరితే ఆ కోరికను తీర్చాలనుకోవటం సరైన పద్తి కాదు.  

ఉదా.. శ్వేతకేతు కధను గమనిస్తే.. ఇలాంటి మూఢ పద్ధతిని నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి పద్ధతిని నిలిపివేసి శ్వేతకేతు మంచి పని చేసారు. 

అయితే, ప్రాచీన గ్రంధాలలో కూడా కొన్ని మార్పులుచేర్పులు జరిగి ఉండవచ్చని అంటారు.అలాంటి మార్పులుచేర్పులను ప్రక్షిప్తాలు అంటారట. 

శ్వేతకేతు కధలోని మూఢాచారం విషయం.. ప్రక్షిప్తమా ? కాదా ? అనేది తెలియదు. 

లోకహితం కోరి ఎన్నో ధర్మాలను ఏర్పరిచి పెద్దలు లోకానికి అందించారు. మానవులు తమ మనస్సును అదుపులో పెట్టుకోలేక పోవటం వల్ల, లేక పరిస్థితుల ప్రాబల్యం వల్ల, లేక మరేవో ఇతర కారణాల వల్ల ....... లోకంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. తద్వారా ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు.
 
 
 సనాతనధర్మం మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. మూఢనమ్మకాలను నమ్మి పాటించటం మనుషుల తప్పు.

మానవులకు అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని పొందాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి చేతనైనంతగా ప్రయత్నించాలని పెద్దలు చెప్పటం జరిగింది. మనస్సు అదుపులో ఉండాలంటే దైవకృపను పొందటం అవసరం.. దైవకృప లభించాలంటే సత్ప్రవర్తన అవసరం.


***************

14 comments:

  1. అయ్యా,
    మీరు సుదీర్ఘంగా వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రతి వ్యాఖ్యనూ అనేకచోట్ల అతికించటం వలన అసౌకర్యం కలుగుతోందని చెప్పటానికి చింతిస్తున్నాను.

    మీపధ్ధతి కారణంగా అగ్రిగేటర్ల వ్యాఖ్యలపేజీ ముంపుకు గురికావటం కారణంగా ఇతరుల వ్యాఖ్య ఏదైనా గడ్డిమేటులో సూది ఐపోతోంది.

    మీరు మీసుదీర్ఘవ్యాఖ్యలను మీబ్లాగులో టపాలుగా ఉంచటం మంచిది.

    అన్యధా భావించకండి.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఈ రోజే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటే మంచిదే కదా

      Delete
  3. .. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

    ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.


    ReplyDelete
  4. మీకు కంప్యూటర్ గురించి ఎక్కువగా తెలియటం తెలియకపోవటం ఇక్కడ ఒక సమస్య కాదండి. మీరు సుదీర్ఘంగా ఒక పలు వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రతి వ్యాఖ్యను వందచోట్ల అతికిస్తున్నారు. అగ్రిగేటర్లు తాజా వ్యాఖ్యలు అన్నీ ఒక పేజీలో చూపుతాయి. మీచర్య వలన ఆపేజీ అక్షరాలా ముంపునకు గురి అవుతోంది. ఇతరుల వ్యాఖ్యలు కనబడే అవకాశం ఉండటం లేదు. చిన్నదైనా పెద్దదైనా ఒక వ్యాఖ్యను ఒకచోటే వేయండి. టపాలకు సంబంధం లేకుండా ఇతర టపాలకు అతికించటం మంచిపని కాదు.

    ReplyDelete
  5. మీకు ధన్యవాదములండి. మీరు అన్నట్లు నేను..సుదీర్ఘంగా ఒక పలు వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రతి వ్యాఖ్యను వందచోట్ల అతికించటం.. ఎప్పుడు చేసానో నాకు అర్ధం కావటం లేదండి.

    అయితే, కొన్నిసార్లు ముఖ్యమైన విషయం అనిపించి, ఒకే వ్యాఖ్యను రెండు, మూడుచోట్ల వేసి ఉండవచ్చు. ఇక నుంచి వ్యాఖ్యలు వేస్తే, ఒక చోటే వేస్తానండి.

    ReplyDelete
    Replies
    1. అయితే నాకు ఏమనిపిస్తోందంటేనండి, ఒకే వ్యాఖ్యలో కూడా ఇంతకుముందు వేసిన వ్యాఖ్యలతో సంబంధం కలిగిన విషయాలు ఉండవచ్చు కదా..అనిపిస్తోంది.

      Delete
    2. ఇంకో విషయం ఏమిటంటేనండి, ఈ టపాలో వ్రాసిన కొన్ని విషయాలను మరికొంత స్పష్టంగా వ్రాయాలనిపించి వ్యాఖ్యల వద్ద వ్రాశాను. అంతేకానీ, ఆ విషయాలను కొత్తగా వేరే దగ్గర అతికించాలని అనుకుని వ్యాఖ్యను వ్రాయలేదు.

      Delete
  6. శ్రీరాముల వారు గొప్ప సంఘ సంస్కర్త. శ్రీరాములవారు గురువులను, అతిధులను, పెద్దవారిని ఎంతో గౌరవిస్తారు. అయితే, చెడు ప్రవర్తన కలవారిని శిక్షిస్తారు.

    రావణుడు అతిధి రూపంలో వచ్చి సీతాదేవిని మోసం చేయాలని ప్రయత్నించాడు.. అతిధి నారాయణుడితో సమానం అన్నారు కదా.. అతిధి ఎలా ప్రవర్తించినా తప్పులేదని శ్రీరాములవారు ఊరుకోలేదు. చెడ్డప్రవర్తన గల అతిధిని (రావణాసురుడిని) సంహరించారు.

    ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, శ్రీరాముల వారు చక్కని నిర్ణయాలను తీసుకున్నారు. ఎవరైనా కూడా విచక్షణతో నిర్ణయాలను తీసుకోవాలి కానీ, మూఢనమ్మకాలతో కాదు ..అనిపించింది.

    ReplyDelete
  7. ప్రాచీనకాలంలో గురువు, అతిధి..ఏం చెప్పినా శిరసావహించాలి తప్పితే, వారికి ఎదురు చెప్పకూడదన్నట్లుగా చాలామంది భయపడుతుండేవారు. అయితే, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అతిధి చెడ్దప్రవర్తన కలవాడు అయితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళుచెప్పినట్లు చేయకపోతే తప్పుకాదు.

    ఈ రోజుల్లో కూడా కొందరు గురువులమని, అతిధులమని చెప్పి మోసాలు చేస్తూ ఉన్నారు. భక్తి పేరుతో కొందరు సంస్థలను పెట్టి జనాలను మోసం చేస్తున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది. అలాంటి వారి విషయంలో అమ్మో! వారు గురువులు కదా..గురువు అంటే దైవసమానులు..అని భయపడనక్కరలేదు. అతిథి అంటే దైవంతో సమానం అన్నారు కదా..అని భయపడుతూ గురువులు, అతిధులుగా చెప్పుకునే కొందరు మోసపుమనుషులు ఏం చెపితే దాన్ని చేయనక్కరలేదు.
    ..............
    వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
    ....
    ఇంతకుముందు పైన వ్రాసిన వ్యాఖ్యను డిలిట్ చేసి, ఇక్కడ వ్యాఖ్యలుగా వేయటమైనది.

    ReplyDelete
  8. సనాతనధర్మం మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. మూఢనమ్మకాలను నమ్మి పాటించటం మనుషుల తప్పు.

    ReplyDelete
  9. నావల్ల ఎవరికైనా కలిగిన ఇబ్బందికి బాధపడుతున్నాను. నా వ్యాఖ్యలు అగ్రిగేటర్ల వ్యాఖ్యలపేజీ దగ్గర వస్తున్నాయని నేను చూడలేదు. నేను వ్యాఖ్యల వద్ద పోస్టులా పెద్దగా వ్రాయకుండా ఉండవలసింది. అయితే, నేను ప్రతి వ్యాఖ్యను వందచోట్ల అతికించటం చేయలేదండి. ఏం జరిగిందో అర్ధం కావటం లేదు.

    నేను ఏం చేస్తానంటే, వ్రాసినవి ఇంకా బాగా రావాలని మార్పులుచేర్పులు చేయాలని అనిపిస్తుంటుంది. అలా మార్పులుచేర్పులు చేయటం నాకుకూడా ఇష్టంలేదు.

    ReplyDelete
    Replies
    1. మీరు వ్యాఖ్యలు రాసే బదులు పోస్టుగా రాయొచ్చు కదా... పది మందికి చేరుతుంది...

      Delete
    2. మీకు ధన్యవాదములండి. అవునండి, పోస్టుగా వ్రాయవచ్చు.

      Delete