koodali

Sunday, December 25, 2011

తప్పులను నేర్చుకుంటే...


కొన్ని దేవాలయాల వద్ద మైకులలో దేవతా స్తొత్రాలను వేస్తుంటారు. కొన్నిసార్లు తప్పులు ఉన్న వాటిని కూడావేస్తున్నారు. అవి విన్న వాళ్లు ఆ తప్పులను నేర్చుకుంటే మంచిదికాదు.

**********

ఉదా.. జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4

ఉదా..ఒక దేవాలయం మైకులో ఎలా వేస్తారంటే,  జయజయ దుర్గతి ..అని గాప్ ఇచ్చి, నాశినికామిని.. అని పాడుతున్నారు. ఇలా పాడితే అర్ధం మారిపోదా? మైకు నుండి విన్నవాళ్లు అలాగే నేర్చుకుని పాడే పరిస్థితి ఉంటుంది కదా..ఇలా పాడటం, పాడి మైకులో వేయటం ఏమిటో అర్ధంకాదు.
 

No comments:

Post a Comment