koodali

Wednesday, December 21, 2011

పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా బాక్టీరియా వాటిని తట్టుకుని బలపడటం జరగలేదు. ..........


కొంతకాలంక్రిందట చాలామంది ఏమైనా అనారోగ్యం వస్తే ఆయుర్వేద మందులే వాడేవారు.

ఎలాంటి జబ్బు కైనా ప్రకృతిలోనే రోగనివారణ చేసే ఔషధాలు ఉంటాయట.

రోజుల్లో ఎవరికైనా అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే వాము, కొద్దిగా ఉప్పు కలిపి తినటం జరిగేది.

వాముకు మనమేమీ సూచనలు ఇవ్వనవసరంలేకుండానే అదే లోపలికి వెళ్ళి దానికదే పనిచేసి రోగాన్ని తగ్గించేది.


రోజుల్లో కొన్ని మందులు లోపలికి వెళ్ళి ఎలా పనిచేయాలో సూచనలు ఇచ్చి పనిచేయించే విధంగా నాటి వైద్యరంగం ఉంది.

పూర్వం ఏమో .... వాము అనేకాదు చాలావరకూ మందులు వాటంతట అవే పనిచేసి రోగాలను తగ్గించేవి.

అంటే వాటికి అలా జబ్బులను తగ్గించే గుణం ఉందన్నమాట. జబ్బుకు తగ్గ మందును వాడుకుంటే చాలు ... రోగాలు నయమయేవి.

నాటి వారికి అలా జబ్బుకు మందు సరిగ్గా పనిచేస్తుందో పూర్తిగా తెలియదు కదా !

ఇప్పుడు మనం ప్రాచీన విజ్ఞానాన్ని నిర్లక్షం చేయటం వల్ల విజ్ఞానం చాలా వరకూ మనకు తెలియకుండా పోయింది.
.....................

ప్పుడేమో యాంటిబయాటిక్స్ విపరీతంగా వాడకూడదు అంటున్నారు.

అతిగా యాంటిబయాటిక్స్ వాడితే రోగకారక క్రిములు యాంటిబయాటిక్స్ ను తట్టుకునే శక్తిని సంపాదించి మరింత మొండిగా తయారవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కదా !


* ప్రకృతిసిద్ధంగా లభించే పదార్ధాలకూ ..... మానవులు తయారుచేసే పదార్ధాలకు తేడా ఇలాగే ఉంటుంది మరి.

మనమందరమూ ఎన్నో తరాలనుంచి పసుపు, వేప, వంటివి వాడుతున్నాము.

పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా
రోగకారక బాక్టీరియా వాటిని తట్టుకుని బలపడే శక్తిని పొందలేదు.

మానవులు కనిపెట్టిన యాంటిబయాటిక్స్ విషయంలో బాక్టీరియా కొద్దిగా గెలుపును సాధించే దిశగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది.

పాత రోగాలకు మందులు కనుగొంటుంటే కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.

వీటన్నింటికీ కారణం ప్రకృతికి దూరమవుతున్న నాటి జీవనవిధానమేనేమో అనిపిస్తుంది. .
..................

* ఆధునికులు కొందరు ఏమంటారంటే వేడి, వాతం లాంటివేమీ లేవు అంతా ట్రాష్ అంటారు.

ఆవకాయ పచ్చడి వరసగా కొన్ని రోజులు తినిచూస్తే వేడి చేయటం నిజమో కాదో తెలుస్తుంది.

జున్ను కొంచెం ఎక్కువ మోతాదులో ఒక వారం రోజులు తిని చూడండి. కాళ్ళు. కీళ్ళు, నడుము పట్టేసి వాతం అనేది ఉందో లేదో తెలుస్తుంది.


పూర్వులు చెప్పిన ప్రతి విషయాన్ని చాదస్తం, మూఢనమ్మకం అనటం రోజుల్లో ఒక ఫేషన్ అయిపోయింది.

పెద్దలు చెప్పిన విషయాలను సరిగ్గా పరిశీలించకుండానే వ్యతిరేకించటం కూడా ఆధునిక మూఢత్వం అని చెప్పుకోవచ్చు. ( పరిశీలించినా మనకు తెలియకపోవచ్చు కూడా ).

..................
నాటి శాస్త్రవేత్తలు కనుగొన్న చాలా విషయాల్లో ... కొన్ని విషయాలు తప్పు అని
కొంతకాలం తరువాత తెలుస్తోంది.


వాళ్ళు ఒక్కోసారి ఒక్కోరకంగా చెబుతుంటారు.

ఉదా.. నూనె అస్సలు వాడకూడదు . వాడితే కొలెస్ట్రాల్ బాగా పెరిగి పోయి చాలా ప్రమాదం అని కనుగొన్నాం. అంటారు.

అయ్యబాబోయ్ ! అని చెప్పి మనం నూనె డబ్బాలు నున్నగా తోమి బోర్లించిన తరువాత ...మళ్ళీ ఏమంటారంటే ....


అబ్బే, నూనె బొత్తిగా మానేస్తే మోకాలి చిప్పలు అరిగిపోయి జనాలకు ఇక నడవలేని పరిస్థితి వచ్చినా రావచ్చు. చర్మం ఎండిపోనూవచ్చు. అని మళ్ళీ పరిశోధనల్లో తేలింది అంటారు. .

అంతేకాక ముందుముందు ఇంకా ఏం కొత్తగా కనుగొంటామో కూడా .... ఇప్పుడే చెప్పలేం అంటారు.

ఇక ఏం చెయ్యాలో ? ఏం చెయ్యకూడదో ? తెలియక సామాన్యజనాలము అయోమయంలో పడిపోతాము .

ఇలాంటివన్నీ చూశాక నాకు ఏమనిపించిందంటే ... మన పూర్వులు తరతరాల నుంచి మనకు అందించిన ఆహారపు అలవాట్లను పాటించటం మంచిది అనిపించింది.

అయితే పూర్వం వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేవారు . కాబట్టి ఎక్కువగా ? నూనె పదార్ధాలు తిన్నా కూడా వారికి చక్కగా అరిగిపోయేది.

ఇప్పటివాళ్ళలా ఎండిపోయికాకుండా, వారి శరీరం మిసమిసలాడుతూ ఉండేది.

మరి మనకు పెద్దగా శారీరిక శ్రమ లేదు కదా !
ఎక్కువగా నూనె పదార్ధాలు తింటే ఏమవుతుందో ?

అందుకని మధ్యేమార్గంగా మనము ఎవరికి తగ్గట్టుగా వారు నూనె పదార్ధాలు వాడుకుంటే మంచిది. .
.......................

పసుపు , వేప వంటివి కూడా ఎంతలో వాడుకోవాలో అంతలోనే వాడుకోవాలి. ఏదైనా అతి పనికిరాదు కదా !

* ఈనాడు మనం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక మందులు, వాతావరణ కాలుష్యం వల్ల .కూడా పసుపు, వేప వంటి వాటిల్లో కూడా వాటి సహజగుణాలు క్షీణించే ప్రమాదముంది.

.............,
* ఇవన్నీ గమనిస్తే , మనిషి ప్రకృతితో పోటీపడటం, ప్రకృతిని సవాల్ చేయటం ....... వంటి చేష్టలు మాని ప్రకృతితో సామరస్యంగా సహజీవనం చేస్తేనే మనిషితో సహా అన్ని జీవులకు మనుగడ ఉంటుంది.
............

రోజుల్లో వైద్యరంగంలో రకరకాల చిత్రమైన పద్ధతులు వస్తున్నాయి.

పూర్వం చరకుడు, శుశ్రుతుడు వంటి వారి కాలంలోనే శస్త్రచికిత్సలు జరిగినట్లు పెద్దలు గ్రంధాలలో తెలియజేసారు.


పూర్వం ఎన్నో పెద్దపెద్ద యుద్ధాలు జరిగాయి. యుద్ధాలలో గాయపడిన వారికి గొప్ప వైద్యవిధానాల ద్వారా నయం చేసినట్లుగా కూడా గ్రంధాలలో చెప్పబడింది.


పూర్వులకు తెలిసినట్లే .... మనకు కూడా రోగానికి మందో సరిగ్గా తెలిసేవరకూ చిత్రమైన ఆధునిక వైద్యవిధానాలూ , తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో తిప్పలు తప్పవు.


కాన్సర్ జబ్బుకు కూడా ప్రకృతిలో మంచి మందు ఉండే ఉంటుంది. మందును ఎవరైనా తెలుసుకుంటే బాగుండు. .

* అయితే అసలు జబ్బులూ రాకుండానే మంచి జీవన విధానం , పొల్యూషన్ లేని వాతావరణం ఏర్పరుచుకుంటే మరీ మంచిది. ...

 

5 comments:

  1. నేను పాలు బదులు కాఫీ లో "కాఫీ మేట్" అనేది వాడతాను (లాక్టోజ్ పడక) . పది పదిహేనేళ్ళ క్రిందట అమెరికాలో కొబ్బరి మంచిది కాదు అని నిర్ధారించారు. ఈ "కాఫీ మేట్" లో దాన్ని వాడతారు కాబట్టీ అది మంచిది కాదు కాబట్టే అది లేకుండా "కాఫీ మేట్" తయారు చేసి దాని ధర పెంచారు. ఇప్పుడు మళ్ళా కొబ్బరి చాలా మంచిది అనటం మూలంగా అది వేసి మళ్ళా ధర పెంచారు. మందుల్లో కూడా ఇదే తంతు. కొంతకాలం మంచివి అమాంతం చేడువి అయిపోతాయి.

    ReplyDelete
  2. "....పెద్దలు చెప్పిన విషయాలను సరిగ్గా పరిశీలించకుండానే వ్యతిరేకించటం ఆధునిక మూఢత్వం అని చెప్పుకోవచ్చు. పరిశీలించినా మనకు తెలియకపోవచ్చు కూడా...."

    Well Said.

    ReplyDelete
  3. నిజమే. కరెక్ట్‌గ చెప్పారు.

    సిటీ వాతావరణం మాత్రమే తెలిసిన నేను ప్రకృతిని దగ్గరగా చూశాక మళ్ళీ ఆ కాలుష్యంలో ఇమడలేకపోయాను. మనం అభివృద్ధి పేరుతో చెయ్యకూడనివి, హాని కలిగించేవి ఎన్నో చేస్తున్నామని అర్థమైంది.

    నిజమే.. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది. వాటిని ఉపయోగించుకోలేకపోవడం మనం చేస్తున్న మొదటి తప్పైతే, వాటిని కాపాడుకోవలిసిందిపోయి నాశనం చేస్తుండడం మనం చేస్తున్న రెండో తప్పు.

    nice post...

    ReplyDelete
  4. వ్యాఖ్యానించినందుకు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలండి.

    పూర్వం ఆయుర్వేద వైద్యులు రోగి యొక్క ముఖం పరీక్షగా చూసే రోగం గురించి ఖచ్చితంగా చెప్పగలిగేవారు.

    హోమియో వైద్యులు కూడా రోగిని ఎన్నో విషయాలను అడిగి మందులు ఇచ్చేవారు.

    ఇప్పుడు ఆయుర్వేద, హోమియో వైద్యులు కూడా కొందరు సమయం లేదంటూ రోగిని సరిగ్గా పరీక్షించకుండానే టెస్టులు వ్రాసేసి మందులు ఇస్తున్నారు.

    ఇలా అయితే ప్రాచీన వైద్య నిర్ధారణా విధానాలు ముందు తరాల వైద్యులకు తెలియకుండా అంతరించిపోయే ప్రమాదముంది.

    అందుకని రోగిని నిదానంగా వివరాలు అడిగి పరీక్షించిన తరువాతే టెస్టులు వ్రాసి పంపితే బాగుంటుంది.

    ఇంకో విషయం ఏమంటే , టపా ఇలా వ్రాయటం ఎవరినీ నొప్పించాలని కాదు. కొన్ని పరిశోధనలు ప్రపంచానికి అందించే ముందే దాని పర్యవసానాలు గురించి బాగా ఆలోచిస్తే బాగుంటుంది.

    ప్రపంచానికి అందించిన తరువాత పరిస్థితి చెయ్యిదాటి పోయి ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎదురవుతుంది. ఉదా... ప్రజల ఆరోగ్యం, ప్లాస్టిక్ వంటివికనుగొనటం, అణుశక్తి వంటి వాటి విషయంలో కూడా ఇలా జరుగుతుంది.

    ఈ ప్రపంచం దైవ సృష్టి. ఈ ప్రపంచం మనకు అద్దె ఇల్లు లాంటిది. ప్రపంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు మనకు లేదు కదా!

    ప్రపంచం మానవులది మాత్రమే కాదు . ఇతర జీవులది కూడా కదా !

    శాస్త్రవేత్తలు లోకానికి ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలను కూడా అందించారు. అందుకు మనము వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.


    అయితే పరిశోధనల్లో పొరపాట్లు రావటం ఎవరికైనా సహజమే లెండి.

    పొరపాట్లు రాకూడదని దైవాన్ని కోరుకుందాము. .

    ReplyDelete