koodali

Monday, December 12, 2011

గత శుక్రవారం మేము కొందరం ........

* గత శుక్రవారం మేము కొందరం కలిసి ఒక ఊరిలోని అనఘాదేవీ సమేత దత్తాత్రేయస్వామి వారి దేవాలయానికి వెళ్ళామండి.


* దేవాలయంలో ఇతర దేవుళ్ళ ఉపాలయాలు కూడా ఉన్నాయి.

దైవ దర్శనం చేసుకున్నాము . దేవాలయంలో అన్నదానం జరుగుతుంటే మేమూ అక్కడే భోజనాలు చేశాము.

తరువాత మా ఫ్రెండ్ ఒకామె మమ్మల్ని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ అత్తగారింటికి తీసుకువెళ్ళింది.


* ఆ ఇల్లు పాతకాలం మోడల్ ఇల్లు. కానీ చాలా గదులున్నాయి. ఒక గదిలో కిటికీలు కూడా లేవు. అయినా గదంతా తెల్లగా వెలుతురుగా ఉంది.

మేము వెళ్ళినప్పుడు కరెంట్ లేకపోయినా , ఈ వెలుతురు ఎక్కడినుంచీ వస్తోందబ్బా ! అని చూస్తే పైన వెంటిలేటర్ లాంటిది కనిపించింది.


* ఆ అద్దంలోనుంచి సూర్యరశ్మి గదంతా పరుచుకుంది. మరి అద్దం తీరో ఏమో వెలుతురు వెన్నెలలా తెల్లగా ఉంది.


* ఒక గ్రిల్ పెట్టి ( రక్షణకు ) పైన అద్దం పెట్టారు. ఆ అద్దానికి అవతలి వైపు నుంచీ ఎవరైనా చూసినా కూడా గదిలోని వారు కనపడరట. అద్దం అంత మందంగా ఉంటుందట.

* ఇదంతా చూశాక పూర్వకాలం వాళ్ళు ఎంత తెలివి గల వాళ్ళో అనిపించింది.

ఈ రోజుల్లో కూడా కొత్తగా మళ్ళీ ఇలా సూర్యరశ్మి వచ్చేటట్లు ఇళ్ళు, ఆఫీసులు కట్టడం మొదలుపెడుతున్నారట.

* ఆ విధంగా విద్యుత్ ఆదా అవుతుందని. ఇంకా ఈ మధ్య ఒక వార్త వచ్చింది.

రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ వెలుగుల్లో ఉంటున్నవారికి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని కనిపెట్టారట శాస్త్రవేత్తలు.


* అలా విద్యుత్ వెలుగులోనే బతుకుతున్న వారి బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుందట.

* ఇంకా నేను ఒక దగ్గర చదివిందేమిటంటే , పూర్వం కట్టడాలను ఇప్పటిలా సిమెంట్ తో కాకుండా అందుకు బదులుగా సున్నం, బెండకాయ జిగురు, బెల్లము, ఇంకా అనేక పదార్ధాలు కలిపి ఉపయోగించేవారట.


పురాతనమైన కట్టడాలు కొన్ని ... ఇప్పటి వాటికన్నా పటిష్టంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. పురాతన దేవాలయాలు ఎన్నో ఏళ్ళయినా పటిష్టంగా ఉంటున్నాయి.


* ఆ విధంగా ప్రాచీనులు పర్యావరణానికి హాని లేకుండా పద్ధతిగా జీవించారు. మరి మనమో ! బొగ్గు నిలువల్ని విపరీతంగా తవ్వేసి విద్యుత్ గా మార్చి ........ఎంత అభివృద్ధి చెందామో ? అని మురిసిపోతున్నాము.


ప్రకృతిలో ఇలా బొగ్గు తయారవ్వాలంటే వేల సంవత్సరాల కాలం పడుతుందట. ఇక అణువిద్యుత్ గురించి అందరికీ తెలిసిందే.

* ఇంకా , అహా ! ఇప్పటివాళ్ళకెంత విజ్ఞానం తెలుసో పాతకాలం వాళ్ళకు ఏమీ తెలియదు ... పల్లెటూరి గబ్బిలాయిలు. అనుకుంటున్నారు.


డిల్లీలో కుతుబ్ మీనార్ వద్ద ఒక ఉక్కు స్తంభం ఉందట. అది ఎన్నో ఏళ్ళనుంచీ ఉందట. వానకు తడిచినా కూడా తుప్పు పట్టదట.

* అది ఏ విధమైన మెటల్ తో చేశారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియటం లేదంట.

ఇలా ఎన్నో మనకు తెలియని విషయాలున్నాయి. ఇవన్నీ చూస్తే ఇప్పటి వాళ్ళకే అన్నీ తెలుసు. పాతకాలం వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవటం భ్రమ మాత్రమే.

నేను వార్తాపత్రికలు ఎక్కువగా చదువుతాను. కానీ ఇప్పుడు సరిగ్గా చదవటానికి సమయం సరిపోవటం లేదండి.

* నిన్న ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ బాగుంది. శీర్షిక పేరు........" కొత్త బూచాళ్ళు...భద్రతకు సవాళ్ళు " ........4 వ పేజీలో ఉంది. ....వీలుకుదిరితే తప్పక చదవండి....



4 comments:

  1. మంచి విషయం చెప్పారు, అద్దం వాడటం ఇప్పుడు కుడా వాడుతున్నారు, పరిశ్రమల్లో చాలామంది వాడుతారు.. హోమ్ లో తక్కువగా అంటే చాలావరకు వాడారు..

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కొందరు తమ ఇళ్ళకు వెలుతురు కోసం గోడకు పైన పెద్దగా వెంటిలేటర్స్ పెట్టి వాటికి అద్దాలు పెడుతుంటారు. సూర్యరశ్మి కొంచెం ఎక్కువగా వస్తుంది అంతే.

    ఇంకా, ఈ ఇళ్ళకు ప్రక్కన వేరే వాళ్ళ ఇళ్ళు ఎత్తుగా వస్తే వెలుతురు తగ్గిపోతుంది.

    నేను చూసిన పాతకాలం ఇంటికి బిగించిన అద్దం వెంటిలేటర్ కు కాకుండా ....... ఆ ఇంటి పై కప్పుకే బిగించారు. అందువల్ల సూర్యరశ్మి నిట్టనిలువుగా ఇంట్లోకి వచ్చి బాగా వెలుతురుగా ఉంది. అని నాకు అనిపించిందండి.

    కొందరు పాతకాలం వాళ్ళు కొన్ని గదులకు పై అంతస్తు ఉండే విధంగా కూడా ఇల్లు కట్టుకుంటారు. కానీ, వీళ్ళకు పై అంతస్తు లేదు...

    ReplyDelete
  3. memu kooda chinnapudu atuvanti intlone undevaallamu. varsham vachinapudu aa addam meedinunchi neellu paaruthu choodadam naaku gurthu. thanks. chinna naati jnaapakaalu guruthuku thechi nanduku.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    వర్షం వచ్చినప్పుడు అద్దంపైన నీరు గురించి మీరు చెప్పినది బాగుందండి.

    ReplyDelete